Name:Srikanth Chari
E-Mail:deleted
Subject:తక్షణ విద్యుత్ అవసరాలు అధిగమించడానికి తెలంగాణా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది?
Message:
తెలంగాణా రాష్ట్రంలో ఇప్పుడు తీవ్రమైన విద్యుత్ లోటు నెలకొని వుంది. నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. పరిశ్రమలకు రెండురోజుల పవర్ హాలిడే ఇవ్వబడింది. హైదరాబాదుతో సహా రాష్త్రమంతటా తీవ్రమైన కరెంటు కోతలు అమలు జరపబడుతున్నాయి.

గత సంవత్సరం ఇదే రోజుకు తెలంగాణలో 126 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా, అప్పటి ప్రభుత్వం 129 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగలిగింది. కాని వర్షాభావం వల్ల కావచ్చు, అధిక ఉష్ణోగ్రతలవల్ల కావచ్చు, పరిశ్రమలు పెరగడం వల్ల కావచ్చు, రుణమాఫీ కారణంగా రైతులు సాగుబడి పెంచడం వల్ల కావచ్చు రాష్త్రంలో దింఆందు 166 మిలియన్ యూనిట్లకు పెరిగింది. కాని తెలంగాణా ప్రభుత్వం కేవలం 145 మిలియన్ యూనిట్లు మాత్రమే అందించ గలుగుతోంది.

రాష్త్రంలో 6000 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవసరం ఉండగా, గత ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలతో కొత్త పవర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేయకపోవడం వల్ల కేవలం 4000 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడుతోంది. తగ్గిన రెండువేల మెగావాట్లు కొందామన్నా సదరన్ గ్రిడ్‌లో లభించడం లేదు. ఉత్తర భారత గ్రిడ్‌లో లభిస్తున్నప్పటికీ అది తెచ్చుకునే అవకాశం లేదు. గ్రిడ్‌లను అనుదంధానించే కేంద్రప్రభుత్వ ప్రణాళిక ఎప్పుడో మొదలు పెట్టినప్పటికీ ఇంకా నత్తనడకనే సాగుతూ ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశం కనపడటం లేదు. తెలంగాణా బొగ్గు ఉపయోగించుకుంటూ, తెలంగాణాలో స్థాపించిన NTPC సామర్థ్యం 2600 మెగావాట్లు కాగా అందులో ఇతర రాష్ట్రాలకు పోగా కేవలం 300ల మెగావాట్లు మాత్రమే తెలంగాణాకు చెందుతోంది.

ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 6000 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం కోసం BHELతో ఒప్పందం కుదుర్చు కున్నది. అలాగే ప్రైవేటు సెక్టర్ నుండి టాటాలు, ఇతరులు కూడా ఉత్పత్తి కేంద్రాలను స్థాపించడానికి ముందుకు వస్తున్నారు. అన్నీ కలుపుకుని వచ్చే మూడేళ్ళలో తెలంగాణా కరెంటు ఉత్పత్తి సామర్థ్యం 18000 మెగావాట్లు ఉంటుందని ఒక అంచనా.

ఇవన్నీ ఒక ఎత్తైయితే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ సహాయ నిరాకరణ మరొక ఎత్తు. కృష్ణపట్నం ప్రాజెక్టు పూర్తి అయినా ఇంకా ఉత్పత్తి ప్రారంభించడం లేదు. ఏవో సాకులు చెపుతూ ఇతర థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిలిపివేస్తున్నారు. తాజాగా శ్రీశైలంలో జలవిద్యుత్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు వారలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తక్షణ విద్యుత్ అవసరాలు అధిగమించడానికి తెలంగాణా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది?
Reactions:

Post a Comment

  1. గృహావసరాలకూ, వ్యవసాయావసరాలకూ, పారిశ్రామికమైన అవసరాలకూ కూడా సౌరవిద్యుత్తును వినియోగించాలి సాధ్యమైనంతగా. గృహావసరాలవారికు సబ్సిడీలు, వ్యవసాయదారులకూ సబ్సిడీలతో పాటు ఋణాలూ ఇవ్వాలి ఈ దిశగా సాగేందుకు. పరిశ్రమలవారు సౌరవిద్యుత్తును ఏర్పాటు చేసుకుందుకు ప్రోత్సహించాలి అవసరం ఐతే కొంత పన్నుల రాయితీ ఇచ్చి ఐనా సరే. ఈ చర్యలు మొత్తంలోటును పూడ్చలేకపోవచ్చును కాని గణనీయమైన మార్పు తేగలవు పరిస్థితిలో.

    ReplyDelete
  2. Srikanth Chari

    mee raashtram kosam vraasaaru, abhinandinchaali anipinchhindi.

    ee madhya yekkuvagaa telanganaa vaallu AP lo CBN ni vimarsinchadam chikaakugaa untondi. vaddu ani tarimesaka vaalla gola meekendukandee.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top