మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.


యదార్ధవాది లోకవిరోధి అనేది ఓ నానుడి. నిజం మాట్లాడేవారు లేదా ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు లోకానికి అంటే ప్రజలకు విరోధులుగా మారతారని దీని అర్ధం. అయితే లోకానికి మిత్రులుగా ఉన్నవారు, జనం మెచ్చిన వారు యదార్ధవాదులు కారా? అనే సందేహం రాక మానదు. మన తెలుగు బ్లాగులలో కూడా ఈ మధ్య ఓ గుంపు ఓ రకమైన ఉన్మాదంతో ప్రత్యేకంగా గొంతు నొక్కే కార్యక్రమాలే పెట్టుకున్నట్లు కొన్ని అవాంచనీయ ధోరణులు కనబడుతున్నాయి. 'యదార్ధవాది - లోక విరోధి' అనే నానుడిని ఏ సందర్భంలో వాడాలి? ఇందులో ఎంతమేరకు వాస్తవం ఉన్నది?
" యధార్ధవాది లోకవిరోధి "అనే నానుడితో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు?
Reactions:

Post a Comment

 1. మారీచుడు సీతాపహరణోద్యోగం ప్రమాదకరమని రావణుడికి చెప్పి చూసి ప్రయోజనం లేకపోవటంతో ఇలా అంటాడు అతడితో:

  సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః।
  అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ॥ ౩-౩౭-౨

  ఈ శ్లోకం‌భావం ఏమిటంటే, "ఓ రాజా, నిత్యం ఇచ్చకాలు మాట్లాడుతూ ఆనందం కలిగించే వాళ్ళు సులువుగానే దొరుకుతారు. మేలు కలిగించే మాటను, అది అప్రియంగా అనిపించినా సరే, మంచి కోరి చెప్పక తప్పదని భావించి చెప్పే వాళ్ళూ దుర్లభం, అలా ఒక వేళ ఎవడన్నా చెప్పినా వినేవాడూ అంతే దుర్లభంగా ఉంటారు." అని.

  అంటే, యధార్థం - అనగా మంచయ్యేది, చెడయ్యేది ఉన్నది ఉన్నట్లుగా- చెప్పే వాడి మాటలు లోకంలో జనం చెవులకూ వెగటుగానే ఉంటాయని మారీచుడు విసుక్కుంటున్నాడు. అది నిజం కాబట్టే, మీ రన్న సామెత పుట్టింది లోకంలో.

  ReplyDelete
 2. నానుడి అనేది ప్రజలనుంచి వచ్చేదే కాని ఎవరూ తీరి కూచుని వ్రాసేది కాదు. ప్రజలనుంచి వచ్చే మాట ఎప్పుడూ కూడా నిజంగానే ఉంటుంది. యదార్ధవాది అంటే ఎవరు? ఉన్న పరిస్థితులను చూసి, అర్ధం చేసుకుని బేరీజు వేసి, విశ్లేషించి మాట్లాదగాలవారికి లోకం ఇచ్చే బిరుదు అది. కాకపొతే అటువంటి యదార్ధవాది చుట్టూ ఉన్నవాళ్ళకు ఆ మనిషి విస్లేషణ్ అర్ధం కాకపొతే, చేసుకోలేని వారి ముందు తన అభిప్రాయం ఆ యదార్ధవాది వెల్లడిస్తే, ఆ మనిషి చుట్టూ ఉన్నవాళ్ళ అజ్ఞానం వాళ్ళ వాళ్లకు విరోధి అవుతాడు. కొన్నాళ్ళకు తెలుస్తుంది ఆతను చెప్పినది నిజమని.ఏ దేశంలో యదార్ధవాదులు ఉంటారో, ఆ యదార్ధవాదుల మాటలు అర్ధంచేసుకునేవారు ఎక్కువగా ఉండి, అటువంటి యదార్ధవాదులు లోకవిరోధులు కారో, అటువంటి దేశాలు బాగుంటాయి.

  ReplyDelete
  Replies
  1. మీరన్నది అక్షరసత్యం శివరామప్రసాదు గారు అండ్ శ్యామలీయం గారు. ప్రసాద్ గారన్నట్లు "కొన్నాళ్ళకు తెలుస్తుంది అతను చెప్పినది నిజమని" అన్నది కూడా కరక్టే; కాకపోతే ఆ మాట ఒప్పుకోవడానికి అతని చుట్టూ ఉన్నవాళ్ళకు అహం అడ్డొస్తుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top