మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు :  Marxist-Leninist 
అంశం : రిజర్వేషన్లు
----------------------------------------

Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:రిజర్వేషన్ అనేది జనం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే పోటీ పడేలా చేస్తుందా? 
Message:
దిసంబర్ 21న నేను హైదరాబాద్‌లో idontwantdowry.com వారు నిర్వహించిన స్వయంవరం కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ అగ్రకులాల అమ్మాయిలలో ఎక్కువ మంది తమకి ఏ ఉద్యోగం ఉన్నవాడైనా ఫర్వాలేదని చెపితే దళితుల అమ్మాయిలలో ఎక్కువ మంది తమకి ప్రభుత్వ లేదా IT ఉద్యోగం ఉన్నవాళ్ళే కావాలన్నారు. రిజర్వేషన్ అనేది జనం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే పోటీ పడేలా చేస్తుందని దీన్ని బట్టి అర్థమవ్వడం లేదా?

అగ్రకులాలవాళ్ళకి రిజర్వేషన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏ ఉద్యోగం ఇచ్చినా తీసుకుంటారు. అగ్రకులాలవాళ్ళలో వ్యాపారం చేసుకుని బతికేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దళితుల విషయం అలా కాదు. ఒక దళితుణ్ణి B.A. చదివిస్తే అతను తనకి ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఏదీ వద్దంటాడు, అలాగే B.A. చదివిన దళితుని కూతురు తాను ప్రభుత్వ ఉద్యోగిని తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోను అంటుంది. కొంత మంది దళితులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, మిగితా దళితుల్ని ఊరి చివర గుడిసెల్లో ఉంచితే, దాని వల్ల కుల వ్యవస్థ మాయమవ్వడం జరగదు. ఆడ పిల్లకి ఉద్యోగం ఉన్నా, లేకపోయినా ఆమెని ఉద్యోగస్తునికి ఇచ్చే పెళ్ళి చెయ్యాల్సి వస్తుందనీ, ఆమెకి ఉద్యోగస్తుడు దొరక్కపోతే తమకి సమస్య అవుతుందనీ, ఆడ పిల్ల పుట్టకముందే అబార్షన్ చెయ్యించుకునేవాళ్ళు కూడా ఉంటారు. రిజర్వేషన్ లాంటి పైపై సంస్కరణల వల్ల కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలలో ఏమాత్రం మార్పు రాదు.
Reactions:

Post a Comment

 1. @Praveen

  Do you have a better solution? If so, can you explain?

  ReplyDelete
 2. నేనేమీ వాళ్ళని కూలీ పని చేసుకునేవాళ్ళని పెళ్ళి చేసుకోమని సలహా ఇవ్వలేదు. పదో తరగతి చదివి బంగారం వ్యాపారం చేసుకునే కోమటోడైనా B.A. చదివి ఇళ్ళలో పని మనిషిగా చేసే ఆమెని పెళ్ళి చేసుకోడు. సమాజాన్ని నడిపించేది డబ్బే కానీ చదువు కాదు. చదువు అనేది కేవలం ఒక ఉపరితలాంశం అయినప్పుడు తమ అమ్మాయిని ఒక చదువుకున్నవానికి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే ఇచ్చి పెళ్ళి చేస్తాం అనుకోవడం వల్ల వాళ్ళకి వచ్చేదేమిటో నాకు అర్థం కాదు.

  ReplyDelete
 3. Shrinking pie theory. Today reservations are used to restrict downtrodden groups to poor paying low status public sector. This frees up the high value upwardly mobile jobs to the dominant upper castes.

  ReplyDelete
 4. బతకడానికి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు. వ్యాపారం చేసుకునైనా బతకొచ్చు. ఈ విషయం తెలిస్తే పిల్లలు చదవరేమోనని అనుమానంతో "చదవకపోతే అడుక్కుతింటావు, రిక్షా తొక్కుతావు" అని బెదిరిస్తూ ఉంటారు. పిల్లలు చిన్నప్పుడే ఆ అబద్దాలు నమ్మెయ్యడం వల్ల పెద్దైన తరువాత కూడా అదే అభిప్రాయం కలిగి ఉంటారు.

  ReplyDelete
  Replies
  1. ఉద్యోగం చేసుకుని బ్రతికేదానికీ, వ్యాపారం చేసుకుని బ్రతికేదానికీ తేడా లేదా? అందులోనూ ప్రభుత్వ ఉద్యోగానికీ, ప్రైవేటు ఉద్యోగానికీ తేడా లేదా? మీ ఉద్దేశంలో ఉద్యోగమైనా-వ్యాపారమైనా ఒకటే అనా? వివరణ ఇవ్వగలరా ప్రవీణ్?

   Delete
  2. మా శ్రీకాకుళం పట్టణంలోని బట్టల షాప్‌లూ, బంగారం షాప్‌లూ ఎక్కువగా కోమటోళ్ళవే. వ్యాపారం అంత లాభదాయకం కాబట్టే వీళ్ళు ఇంకా తమ కులవృత్తిని వదులుకోలేదు. ఆకడ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రం వేర్వేరు కులాల నుంచి వచ్చినవాళ్ళు. అక్కడ ప్రైవేత్ ఉద్యోగుల సంఖ్య తక్కువే. ఆ ప్రైవేత్ ఉద్యోగాలు 1985లో పైడిభీమవరం దగ్గర industrial estate ఏర్పాటు చెయ్యడం వల్ల వచ్చినవి.

   Delete
 5. మాది కూడా రిజర్వేషన్ ఉన్న కులమే. ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ప్రభుత్వ ఉద్యోగులకి జీతం ఇస్తుంది కానీ currencyని inflate చేసి కాదు. ఈ విషయం మా కులంవాళ్ళకి తెలియదు కనుకనే మా కులంవాళ్ళందరూ బతకడానికి ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే మార్గం అనుకుంటున్నారు. మా తాతల ఊరిలో ఒకప్పుడు కాపులకీ చదువు రాదు, తెలగాలకీ చదువు రాదు. అప్పట్లో బ్రాహ్మణులు, వైశ్యులు, కరణాలు మాత్రమే చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నా దాని వల్ల వాళ్ళకి సామాజిక జ్ఞానం మాత్రం పెరగడం లేదు.

  ReplyDelete
  Replies
  1. మిష్టర్‌ మార్క్సిస్టు లెనినిష్టు గారు,
   రిజర్వేషన్లు ఉన్నా వారైనా లేక లేని వారైనా ప్రతి ఒక్కరూ తమ జీవితాలు సుఖమయంగా, వెడ్డించిన విస్తరీ లా ఉండాలని పై వర్గాల్లో తాము చేరాలని పరుగు పందెం లో పాల్గున్న వారిలా పరిగెడుతున్నారు. ఇందులో ఎవరి ఆగ మంటారు. ఆ వెనుక భాగం లో ఉన్నారు కాబట్టి వారిని మాత్రం ఆగ మంటారా ? మరి వారాగితే మెయిన్‌ స్ట్రీం లో వారెప్పుడు కల వాలి? లేక కల వ కుండానే ఉండి పొమ్మన్నారా? ఇక్కడ ఉన్న రిజర్వేషన్‌ జనాభాలో ఒక్క శాతానికి కూడా అవిదొకటం లేదు. మిగతా 99 శాతమంది ఏం చేస్తున్నారు. మీరు చెప్పిన గతి లేని ఉధ్యొగాలే గా చేస్తున్నది? కొంతమందికి అవీ లేకా,పెట్టు బడి దారులో లేక ఉధ్యోగ కల్పన చేసే వారో తమ కులం వాల్లు కాదు గనుక తమకు అవకాశాలు లేక భిక్షాటనో లేక అగౌరవమైన పనులో చేకుంటున్నారు.'' మాదీ రిజర్వేషన్‌ కులమే నని ఒక పక్క చెప్పుకుంటూ ఇంకో పక్క మా వాల్లంత దొరల స్థానం లో ఉన్నారని అంటున్నారు. అది మీ వ్యక్తిగతం. వాస్తవ పరిస్తితులను పరిశీలించి, విశ్లేషించి మీ అభి ప్రాయం చెపితే బాగుంటింది గదా. ఏదో ఆధర్శ వంతంగా పేక మేడలు కడితే ఎవరికి ప్రయోజనం ఉండదు గా? అల్లంటపుడు ఇలా ప్రశ్నలు లేవ నెత్తడమెందుకక్‌? మీది కేవలం వ్యక్తిగత ఆదర్శవాదం. మీరు చెప్పేది చూస్తే రిజర్వేషన్‌ ఉన్న వారంతా తాము కొరుకున్న ఉధ్యోగాలు పొందుతున్నట్లు మిగతా వారు ఏదో కూలి అయినా దొరికితే చాలన్నట్లున్నారని ఉన్నది. ఇది కేవల పాక్షిక సత్యం. ఇండియన్‌ పరిపాలనా వ్య్వవస్తలో పై నుండి కింది స్తాయి ఉధ్యోగాల్లో ఎవరెవరి ఎంత భాగమో ముందు తెలుసుకోవాడానికి ప్రయత్నించండి. దానికి ఆశ్రిత జనం ఆ ఉధ్యోగాళ్లొ ఊంతూణ్ణAARo టేళూశ్టూండీ.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top