మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.


------------------------------------------------
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు
------------------------------------------------పాపభీతి లేకుంటే మనిషిలో నైతిక విలువలుండవా!? 

Reactions:

Post a Comment

 1. నాస్తికులకు మానవతా వులువలు ఉందదని ఎక్కడుందీ,భక్తి ఉంటే దేవుని భయం ఉంటుంది, కానీ భక్తులంతా గొప్పవారూ కాదు, మానవత్వానికి మనిషి పుట్టుకా,ఆతని కుటుంబ చరిత్రా,పరిసరాలూ కొంత దోహదపడతాయని నా నమ్మకం.

  ReplyDelete
  Replies
  1. మనిషి పుట్టుక ఏ విధంగా ప్రభావితం చూపుతుంది?

   Delete
 2. నీటికి మతానికి బీరకాయపీచు సంబంధం కూడా లేదు

  ReplyDelete
 3. పెరిగిన వాతావరణం మరు పుట్టిన వాతావరణం చుట్టూ ఉన్న స్నేహతులు మనిసి యొక నైతిక విలువులు ఆదార పది ఉంటాయి మరి యు పూర్వ జన్మ సుక్రతం కూడా ఉంటుది బగవతే గీత లో చేపినతులు మనిషి కర్మ అనుసిరిచి అః జీవి కర్మకు సబదిచిన కళేబరం లో ప్రవేస్తుడి

  ReplyDelete
  Replies
  1. పుట్టిన వాతావరణం అంటే వివరణ ఇవ్వగలరా?

   Delete
  2. Very simple, my dear Watson! అలగా వెధవలకు పుట్టిన పిల్లలు పరమ దుర్మార్గులు అవుతారు!

   Delete
  3. >>అలగా వెధవలకు పుట్టిన పిల్లలు పరమ దుర్మార్గులు అవుతారు!

   Let me rephrase this

   అలగా వెధవలకు పుట్టిన పిల్లలు పరమ దుర్మార్గులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది!

   Delete
  4. అలగా వెధవలకు పుట్టిన బిడ్డలు పరమ దుర్మార్గులు అవుతారు అనేది తప్పు. కొంతవరకు గ్రీన్‌స్టార్ గారు చెప్పినట్లు అయ్యే అవకాశం ఉంది. గొప్ప వాళ్ల బిడ్డలు కూడా పండితపుత్ర అన్నట్లు .... తయారయ్యే అవకాశం ఉంది.

   Delete
  5. నేను వ్యంగ్యంగానే రాసాను. "నైతిక విలువలు" కొందరి సొత్తు అనుకోవడం పొరబాటని చెప్పడమే నా ఉద్దేశ్యం.

   Delete
 4. భయమో భక్తో ఉండాలన్నారండీ. భయము అంటే చట్టభయం, శిక్ష పడుతుందని. భక్తి అంటే ఇలా చెయ్యకూడదు అన్న విశ్వాసం అదే ధర్మం. రెండూ లేకపోతే మనిషి కి ........తేడా లేదు.

  ReplyDelete
 5. శర్మ గారు చెప్పినట్టు చట్టం శిక్షిస్తుందన్న భయం వుంటే చాలు. ఇతర భయాలు అవసరం లేదు.

  పలు రకాల ధర్మాలు పాటించబడే మన దేశంలో పాప భీతి వల్ల మంచి కన్నా చెడే జరగడానికి ఎక్కువ అవకాశముంది. ఎలాగో చూద్దాం.

  పందికూర లేదా గొడ్డుకూర తినడం పాపమని ధర్మ గ్రంధంలో రాసి వుందనుకుందాం. ఆ ధర్మాన్ని నమ్మే పాపభీతి గలవాడికి అవి తినే వారిపట్ల వ్యతిరేకత కలుగుతుంది. వారు పాపిష్టులుగా కనపడతారు. ఒకవేళ ఆ పని పొరుగింటివాడే చేస్తున్నాడనుకుందాం. అప్పుడు అతని మనస్సులో సంఘర్షణ మొదలవుతుంది. ఒకవైపు దేవునిపై పాపభీతి. మరొక వైపు దైవవాక్కుకు విరుద్ధంగా జరుగుతున్న పాప కార్యం(అతని దృష్టిలో). ఈ రకమైన సంఘర్షణ హింసగా పరిణామం చెందడానికి ఎక్కువ కాలం పట్టదు.

  ReplyDelete
 6. ఆర్యా,
  *మానవులు సుఖంగా జీవించాలంటే సన్మార్గంలో నడవాలి,కొందరు మాత్రమే సన్మార్గంలో నడిస్తే అలా నడవని దుర్మారుల వల్ల సన్మార్గులు బాధలు పడే అవకాశం ఉంది కదా!కాబట్టి మొత్తం మానవసమాజం సన్మార్గంలో సంచరించడానికి ఏదో ఒక రూపంలో దండనభయం చాలా అవసరం.మానవుడు క్షేమంగా జీవించటానికి పనికివచ్చే ప్రతి విషయాన్నీ సమగ్రంగా పరిశీలించిన సనాతన ధర్మం ఈ భయం అనే విషయాన్ని గురించి కూడా విస్తృతంగా చెప్పింది.

  *మానవుడు నీతిగా ఉండటానికి అతని పైన నాలుగు ప్రభావాలు ఉండాలి,ఉంటాయి. 1.తల్లిదండ్రులు2.గ్రామ పెద్ద 3.రాజు చేసే శాసనం 4.మతాధికారి చెప్పే నీతిబోధ - వీటిలో మొదటి ఇద్దరూ రాజుగారి యొక్క శాసనాల్ని గానీ మతపెద్ద యొక్క తీర్మానాలని గానీ అమలు చెయ్యటమే తప్ప స్వతంత్రించి శాసనాలు గానీ తీర్మానాలు గానీ చేసే అధికారం లేనివాళ్ళు.

  *రాజుగారి శాసనాలు చాలామటుకు ఒక నేరం జరిగాక ఇతరుల సాక్ష్యాల మీద ఆధారపడి ఇచ్చే తీర్పుల సమాహారం కాబట్టి సాక్ష్యాలు బలహీనంగా ఉంటే నేరస్థుడు శిక్ష తప్పించుకునే అవకాశం ఉంటుంది.ఒకవేళ శిక్ష పడినా తర్వాత కాలంలో శిక్ష పట్ల భయం ఉన్నవారు చెయ్యకుండా ఉండటం మాత్రమే జరుగుతుంది!శిక్షనుంచి తప్పించుకోగలను అనుకున్నవాడు, శిక్షాభయం లేనివాడు మళ్ళీ మళ్ళీ అదే నేరం చేస్తూనే ఉంటాడు.

  *మతాధికారి దేవుని పేరిట చెప్పేది మాత్రం కొంత భిన్నంగాపని చేస్తుంది! మొదట దేవుణ్ణి నమ్మి తర్వాత ఈ పని దేవుడికి ఇష్తం లేదు,ఈ పని చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయం అతన్ని అసలు నేరం చెయ్యకుండా ఆపగలుగుతుంది.సనాతన ధర్మం ఈ దైవభీతిని కూడా భయరహితస్థితికి మానవుణ్ణి చేర్చడానికే ప్రతిపాదించింది!భయరహితస్థితిని చేరదమే మోక్షం - అందుకు జ్ఞానమే సాధనం

  *మతం అనగానే దైవపూజావిధానం మాత్రమే అనే అపోహ చాలామందిలో ఉంటుంది.కానీ అది నిజం కాదు - 1.దైవభావన,2.నైతికబోధ,3.కర్మకాందలు,4.శిక్షాస్మృతి,5.ఋషిపరంపర అనే అయిదు భాగాలు ఉంటాయి.నాస్తికులు దైవభావనని వదలివేసినా నైతికబోధన మాత్రం వారికీ సామాన్యమే కదా!సనాతన ధర్మం మాత్రం నైతికత విషయంలో ఇహలోకపు సౌభాగ్యాన్ని మాత్రమే పట్టించుకున్నది."శ్రేయము","ప్రేఅయము" - రెండింటిని గురించి చర్చించి శ్రేయమునే పాటించహ్మని చెప్తుంది.
  స్వస్తి!

  ReplyDelete
 7. కొందలరావు గారికి,
  మీరు ఒకప్పుడు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు.ప్రస్తుతం రేఖామాత్రంగా చెప్తూ ఒక పోష్టు వేశాను.మీరు ఇక్కద కొంతమేరకు సనాతన ధర్మం గురించి తెలుసుకోవచ్చును.అసలు భాగవతం చదవాలంటే ఇక్కద వీలు కుదురుతుంది.టీకా,తాత్పర్యం,భావం అన్నీ తెలుసుకోవచ్చు.
  భవదీయుడు
  హరి.S.బాబు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు హరి గారు. మీ పోస్టు తప్పక చదువుతాను.

   Delete

 8. యముండు లేక పోతే ఎనుబోతు అంత నిమ్మళం గా నిల్చొని ఉండే దా :)

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మాతా జిలేబీ, మహిష నిమ్మళము సంగతి పశుగ్రాస యోధానుయోధ లాలూను అడగవలె.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top