మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు - పల్లా కొండల రావు
అంశం : రోడ్డు ప్రమాదాలు
----------------------------------------


రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు టీ.వీలలో పత్రికలలో చెప్పే కొన్ని కారణాలు వింటుంటే నవ్వు వస్తుంటుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే నేతలు కొన్ని విషయాలు మాట్లాడి ఆ తరువాత వారి వారి పనులలో బిజీ అయిపోతుంటారు. అసలు రోడ్డు ప్రమాదాలకు కారణాలేమిటి? వీటిని నివారించే మార్గాలు ఏమిటి? ప్రపంచం లో ఏ దేశంలో వీటిపట్ల మంచి నిర్వహణ జాగ్రత్తలు పాటిస్తున్నారు? రోడ్డు ప్రమాదాలు నివారణకు మీ సూచనలేమిటి? 
*Re-published
Reactions:

Post a Comment

 1. ప్రమాదాలకి చాలావరకు మితి మీరిన వేగమే కారణం. అలాగే మన దేశంలో చాలామంది రోడ్డు నియమాలు పాటించరు.
  ప్రమాదాలు నివారించడంతోపాటు, గాయపడినవారికి త్వరగా వైద్యం అందచేయగలిగితే చాలా ప్రాణాలు కాపాడవచ్చును. అందుకోసం 108 అంబులన్సులా, 108 హెలీకాప్టర్ ఉంటే బాగుంటుంది. ఈ టపా చదవండి.
  https://bonagiri.wordpress.com/2012/12/22/108-%E0%B0%B9%E0%B1%86%E0%B0%B2%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D/


  ReplyDelete
  Replies
  1. బోనగిరి గారు, పోస్టు బాగుంది. మంచి ఆలోచన. ఆ రోజులు వస్తాయి. కానీ చాలా సమయం పడుతుంది. మన పాలకులలో అత్యధికులు ఇంత లోతుగా ఆలోచించగలిగినవారు వస్తే ఇదేమీ అసాధ్యం కాదు. చాలా చాలా అవసరమైన అంశం. దీనితో పాటు అసలు ప్రమాదాలకు కారణాలను గుర్తించి వాటిని నివారించే చర్యలు చేపట్టాలి. ప్రజలలో రోడ్డు ప్రమాదాలపై డ్రైంగ్ సెన్స్ పై చైతన్యం పెంచేలా అవగాహన కార్యక్రమాలు పెంచాలి.

   Delete
 2. కొండలరావు గారూ,

  మంచి ప్రశ్న వేశారు. నా అభిప్రాయంలో మనదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలకు మితిమీరిన వేగాన్ని మించి మరెన్నో కారణాలున్నాయి. ఇదే విషయంపై ఇంతకుముందు నేను రాసిన టపా ఇక్కడ చూడవచ్చు.
  http://kotiratanalu.blogspot.in/2013/10/blog-post_30.html

  అన్నింటికన్నా అతిముఖ్యమైన కారణం మన డ్రైవర్లకు డ్రైవింగుపై సరైన అవగాహన లేకపోవడం, డ్రైవింగ్ రావడమంటే కేవలం బండిని నడపగలగడం అన్న భ్రమలో ఉండడం. మన డ్రైవింగ్ టెస్టుల్లో కూడా లైసెన్సు కోసం వాహనాన్ని నడపగలడా లేదా అనే చూస్తారు తప్ప ఆభ్యర్థికి సేఫ్ డ్రవింగుకు సంబంధించి ఉన్న అవగాహనపై పరీక్ష ఉండదు.

  మన డ్రైవర్లు చేసే కొన్ని భయంకర తప్పులు:
  1) హైవేలపై, ఔటర్ రింగ్-రోడ్డుపై అడ్డంగా లారీలూ, ట్రాక్ట్రర్లూ నిలపడం, ఆపిన వాహనాలకు బ్లింకర్లు వేయకపోవడం. (ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ ఇవే)
  2) ట్రాక్టర్లూ, లారీలకు సిగ్నల్సు లేకపోవడం, ఉన్నా పనిచేయకపోవడం, చేసినా వాడకపోవడం.


  ReplyDelete
 3. 3) ట్రాక్టర్లూ, లారీలూ హైవేపై అడ్డంగా అర్ధరాత్రుల్లు కూడా సిగ్నల్సు వాడకుండా యూ-టర్ను చేయడం ( నిన్నటి ప్రమాదం, యర్రమ్నాయుడు ప్రమాదం)
  4) రోడ్డును ఊరి జనం తమ వివిధ అవసారాలకు ( మొక్కజొన్న కుప్పలు, వరి లాంటివి ఎండపెట్టడం, వాటిని కుప్పలుగా రోడ్డుపక్కన పోయడం (శొభానాగిరెడ్డి ప్రమాదం)
  5) హైవేలు ఊర్ల మధ్యనుండి పోవడం వలన చిన్నపిల్లలు రోడ్డూపైన ఆడుకోవడం, రోడ్డుకు అడ్డంగా పరిగెత్తడం.
  6) వాహనం సామ్ర్ధ్యాన్ని చూసి డ్రైవరు ఇది సేఫ్ అని భ్రమపడి డొక్కురోడ్డుపై, ఊర్లమధ్యనుండి పోయే రక్షణలేని రోడ్లపై కూడా వేగంగా నడపడం (వోల్వో ప్రమాదం)
  7) రోడ్డు బాగుంది కదా అని ఔటర్ రింగురోడ్డుపై డొక్కు డీసీఎం నడిపేవారు కూడా రెచ్చిపోయి వేగం పెంచడం
  8) టృఅక్కులపై జంతువులను ట్రాన్స్పోర్టు చేయడం (ఔటర్ రింగురోడ్డుపై నేను చూసిన ప్రమాదం - డొక్కు డీసీఎంపై 6 గౌడి బర్రెలు తీసుకెల్తుండగా బోల్తా)

  ReplyDelete
 4. 9) వాహనాలపై లోడు వాహనం పరిధి దాటి బయటికి వచ్చేట్లు లోడ్ చేయడం (ట్రక్కులపై బయటికి వచ్చే గడ్డి, టూ వీలర్పై అడ్డంగా పైపులు లాంటివి పట్టుకుని తీసుకెల్లడం). ఇది వేరే దేశంలో చేస్తే లైసెన్సు గుంజుకుని జైళ్ళో పెడతారు.
  10) వేగంగా పోవాల్సిన హైవేలపై ఎద్దుల బండ్లను కూడా నడపడం.
  11) గొర్రెలూ, పశువుల కాపర్లు తమ మందలను రోడ్డుపైనుండే తీసుకెళ్ళడం
  12) హైవేలకు రక్షణలేకపోవడం వల్ల జంతువులూ, కుక్కలూ రోడ్డుపైకి రావడం.
  13) రోడ్లు బాగాలేకపోవడం, సడన్ టర్నింగులూ, గోతులూ
  14) డ్రైవర్లు నిద్రలేకుండా, ఒకోసారి తాగి నడపడం
  15) కండీషను బాగాలేని వాహనాలను చెక్ చేసి పర్మిట్ రద్దు చేసే వ్యవస్థ లేకపోవడం

  ReplyDelete
 5. డ్రైవింగు లైసెన్స్ టెస్టులో వాహనాన్ని నడిపే టెస్టుతోపాటు థీరీ టెస్టు కూడా ఉంటే కొంతవరకూ డ్రైవర్లలో అవగాహన పెరగొచ్చు. మిగతావి సరైన రూల్సు నిర్ణయించి, రూల్సు పాటించని వారిపై ఫైను వేయడంద్వారా పెంచాలి.

  ReplyDelete
  Replies
  1. విశ్వరూప్ గారు మీరు వ్రాసిన కారణాలన్నీ బాగున్నాయి. మీ పోస్టు చూశాను. అవినీతి పై మీ అభిప్రాయమూ మెచ్చుకోతగ్గది. సూచనలు అందించినందుకు ధన్యవాదములు.

   Delete
 6. నిర్లక్ష్యం,మద్యం.

  ReplyDelete
  Replies
  1. ఖమ్మంలో అందరూ చూస్తుండగానే, పోలీస్ స్టేషన్ ముందే మొన్నొకడు మద్య సేవించి బైక్ ను కారుకు గుద్దాడు. కారు వాళ్లది తప్పులేదు. అందులో ఫేమిలీతో ఎక్కడో గుడినుండి వస్తున్నారు. కానీ బైక్ వాడికి కొందరు మద్దతిచ్చి కారు వాడిదే తప్పని కూడబలికి గోల చేశారు. కారు అతని దగ్గర 8 వేలు వసూలు చేశారు. పోలీసోళ్లు చోద్యం చూస్తున్నారు. ఆ యాక్సిడెంటుని ఓ కానిస్టేబుల్ కళ్లారా చూశాడు కూడా. ఎవడిది తప్పు అని చూడడం లేదు. రోడ్లపై గేదెలు , మేకలు , చిన్న పిల్లలను యదేచ్చగా వదులుతున్నారు. అది స్వేచ్చ అనుకుంటున్నారే తప్ప సెన్స్‌లెస్ అనుకోవడం లేదు. ఇలాంటి నిర్లక్ష్యాలు చాలా వున్నాయి. వీటన్నింటిపై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేషి ప్రజా రవాణాను కట్టుదిట్టం చేయాలి. శర్మగారు స్పందనకు ధన్యవాదములు.

   Delete
 7. జానకీరాం సీటు బెల్టు పెట్టుకోలేదని పైగా 140 వేగంతో నడిపించారని వార్తలు వచ్చాయి. ఇదే నిజమయితే చాలా దారుణం.

  ReplyDelete
  Replies
  1. వార్తలలో ఆ మాట వచ్చింది నిజమే జై గారు. అసలు కారణం రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ రాంగ్ రూటులో రావడం. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే గాయాలతో బ్రతికేవాడేమో(?) గానీ ప్రమాదం జరిగేదే కదా? ఇక్కడ అసలు కారణం వదిలేస్తే ఎలా?

   Delete
  2. ట్రాక్టర్ గురించి విన్నాను కానీ ఎక్కడా వివరాలు లేవు. అతన్ని అరెస్ట్ చేసినట్టు ఎక్కడా విన్నట్టు లేదు.

   రాంగ్ సైడులో వాహనాలు నడపడం పూర్తిగా తప్పు కానీ ఎందరో అలా చేస్తుంటారు. ఈ విషయం గుర్తుంచుకొనే బండి నడిపితే మనకు క్షేమం.

   Delete
  3. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని టీ.వీ 9 లో విన్నాను. మీరన్నట్లు మన జాగ్రత్తలో మనం ఉండడమూ ముఖ్యమే. జనానికి రోడ్ సెన్స్ నేర్పడమూ ముఖ్యమే.

   Delete
 8. ప్రమాదానికి కారణం ఇద్దరి మధ్య సయోధ్య లేకపోవడం, ఇక tractor లాంటి జంట బండ్లు highway మీద నడపడం, వాటికి permissions ఉండ కూడదు!
  ఇక చాలా ప్రమాదాలకు కారణం వేగం అంటారు కానీ నిజానికి కారణం మనలోని విచక్షణా భావం, uturn లేదా crossing దగ్గరకు వస్తున్నా వేగం నియంత్రించం, ఆ క్షణంలో ఆ signal దాటేద్దాం అనే ప్రయత్నం.
  ఇక నిజానికి రహదారి నియమాలు చాలా తప్పుగా అర్ధం చేసుకున్నాం
  ఎరుపు - వాహనం ముందుకు కదలకూడదు
  పసుపు - వాహనం నిర్దేశిత గీత దాటకపోతే ఆపెయ్యాలి
  పచ్చ - వాహనం ముందుకు సాగవచ్చు
  కానీ మనం పసుపు ఉన్న పచ్చ ఉన్నా వాహనం నడపదానికే ప్రయత్నిస్తాం, ఎందుకంటే పసుపు అంటే నెమ్మదిగా వెళ్ళడం అని ప్రజలకు అభిప్రాయం ఉండటం, కానీ పసుపు అంటే ఆ నియంత్రణ కూడలి వద్ద ఈ దారిలో వాహనాలు వేరే దారిలో వాహనాలకు అడ్డు పడకుండా ఉండేందుకు ఉంచే సమయం!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top