మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు. • మన పల్లెల్లో పిచ్చుకలు కనిపించడం లేదు. 
 • ఒకప్పుడు పొలాల్లోనూ ఇళ్లలోనూ ఈ చిట్టి పక్షులు కలకల లాడుతూ సందడి చేస్తూ మనసుకు ఆహ్లాదం కలిగించేవి. 
 • ఇప్పుడు ఎప్పుడో ఓ సారి తప్ప కనపడడం లేదు. 


Reactions:

Post a Comment

 1. మొబైలు టవర్ల నుంచి వచ్చే హానికారక వుద్గారాలు అమాయకమయిన పిచ్చుకల పాలిటి శాపాలుగా మారినా ఆ హాని మనకి కాదుగా అని నిష్పూచీగా వున్న మనుషి ఈ భూమి మీద నుండి అంతరించిపోయే ప్రమాదం తనకీ యెదురవబోతున్నదని తెలుసుకోలేని అజ్ఞానంలో వున్నాడు!మగవాళ్ల వీర్యకణాల్లో సంతానాన్ని పుట్టించే సత్వం రానురానూ తగ్గిపోతున్నదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఆ తగ్గుదల "0" స్థాయికి పడిపోతే చావులే తప్ప పుట్టుకలు లేక ఒక యాభైయేళ్ళలో మానవజాతి సమస్తం తుడిచిపెట్టుకు పోవటం ఖాయం!ఈ పరిస్థితికి పారిశ్రామిక వ్యర్ధాలూ కరగని గంధక ధూళీ మట్టిలోకీ, నీటిలోకీ, గాలిలోకీ ఇంకిపోవడం వల్ల జీవ రసాయనిక సమతౌల్యం దెబ్బతినడం ఒక కారణం కాగా అందరి కష్టాన్నీ ఒక్కచోట చేర్చి అందరూ కలిసి పంచుకోవడం అనే ఆర్ధికసూత్రంలో వుండే ప్రశాంతతని కాకుండా అందరి దగ్గిరా వున్నది తనకే కావాలని కోరుకుంటూ అందరూ ఒక్కదానికే పోటీపడే జీవనవిధానం వల్ల మనస్సు మీద పడే వొత్తిడులు మరో కారణం. ఒకనాడు డైనోసార్లు మనిషిలాగే ఈ భూమినంతా ఆవాసం చేసుకుని చెలరేగిపోయి హఠాత్తుగా అదృశ్యమయి పోయాయి. కారణాలు ఇతమిధ్ధమని ఇప్పటికీ నిర్ధారించలేకపోతున్నారు, కానీ మనిషి మాత్రం తెలివి తేటలు యెక్కువై నశించిపోయాడనే సాక్ష్యాన్ని వొదిలే వెళ్తాడు? అప్పుడు అణుధూళిలో కూడా క్షేమంగా బతకగల్గిన బొద్దింకలూ చీమలూ మనిషి గురించి "ఈ పెనుమంటి దిబ్బపై వసియించి రొకనాడు మానవుల్!పాపము శేముషీ విభవ పారగులై అందరు మడిసి చచ్చిరి!!" అని జాలిగా కరుణ గీతికలు పాడుకుంటాయి కాబోలు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం

  ReplyDelete
 2. >మొబైలు టవర్ల నుంచి వచ్చే హానికారక వుద్గారాలు....

  ఈ విషయం ఇప్పటికీ నిర్థారణ కాలేదండీ. కొన్ని కొన్ని రిపోర్టులు అలా చెబుతున్నా అది నిజం కాదన్న వాదనా బలంగానే ఉంది.

  రాబందులు ఎందుకు అంతరించాయి చాలా వరకు? రసాయనాల అవశేషాలు ఉన్న పశుకళేబరాల కారణంగా. అలాగే పిచ్చుకలు తినే తృణధాన్యాలవంటివి రసాయనాలతో విషపూరితం అవుతున్నాయి. వాటితో మానవుల ఆరోగ్యాలకే ముప్పు అని గోలగా ఉంటే, చిన్న చిన్న పక్షిజాతులకు ప్రమాదం ఉండదా మరి? అల్ప్లజీవులు పాపం. వాటివల్లనే అంతరిస్తున్నా ఆశ్యర్యం లేదు.

  ReplyDelete
  Replies
  1. మొబైల్ రేడియేషన్ పై భిన్నవాదనలున్నమాట వాస్తవం.

   Delete
  2. వును,ఇదివరలో ధాన్యం రాగానే ఇంట్లో కంకులు వేలాడగట్టే వాళ్ళు దూలాలకి, పిచ్చుకల కోసమే!ఇప్పుడలా కట్టటమూ తగ్గింది, కట్టినా మనుషుల్నే చంపగలిగిన విషాలకి అవి ఆగలేవు,కరెక్టే!

   Delete
 3. మొబైల్ టవర్లు లేకముందు నుండే అవి మన ప్రాంతాలలో కనపడటం లేదు... మెట్రో నగరాలైన ముంబై, కొలకతాలలో ఈ పిచ్చికలు విరివిగా కనపడుతున్నాయి... కాబట్టి సెల్ తవర్లతో సంబంధం లేదు.... దీని మీద ఒకప్పుడు "ఈనాడు"లో ఒక కధనం వచ్చింది... దాని ప్రకారం మన ప్రాంతాలలో ఉన్న పొలాలలో వాడుతున్న రసాయన మందులే కారణం కావచ్చును... ఆ మందుల ద్వారా చచ్చిపోయిన పురుగుల్ని తిని ఈ పిట్టలు కూడా చనిపోతున్నాయి... ఇక్కడ సేఫ్ జోన్ కాదు కాబట్టి ఇక్కడి నుండి అవి మరో సేఫ్ జోన్ లోనికి వలస వెళ్లిపోయుంటాయి

  ReplyDelete
  Replies
  1. రాధాకృష్ణగారూ, నేను చెప్పినదీ ఈ‌ పాయింటే కదా!

   Delete
 4. ప్రశ్న:
  ఈ దరిద్రం మన ఆంధ్రాలోనేనా లేకపోతే దేశం అంతా ఇలాగే ఉందా?

  ReplyDelete
  Replies
  1. సిమెంటుతో ఇళ్ళు కట్టడం మొదలు పెట్టిన ప్రతి చోటా ఇంతే పెంకుటిళ్ళకి కూడా కలప దూలాలు వాడే వాళ్ళు.వాటి మధ్యన సందు చేసుకుని ఇళ్ళలోనే గూళ్ళు కట్టుకుని వుండేవి.లేదంటే మనుషులకి దగ్గిరగా మనగలిగే వీలు వుండేది ఇంటిలో ఒక చెట్టు వుంటే అది పిచ్చుకల అవాసంగా వుంటుంది కదా. చెట్టు యొక్క అవసరం తెలిస్ కూడా ఆధునిక గృహాలు అనబడే వాటి నిర్మాణంలో చెట్టు వుండటం లేదు!మరి పిచ్చుకలు యెక్కడ వుంటాయి?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top