మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు
------------------------------------------------

విగ్రహం!     ఆగ్రహం!!    నిగ్రహం!!!
  


దేవుడి దగ్గరనుండి చోటా నేతలదాకా విగ్రహాలపై ఏనాటినుండో భిన్నాభిప్రాయాలున్నాయి. విగ్రహారాధనపై మతపరమైన తాత్వికులలోనే పరస్పర విరుద్ధ వాదనలున్నాయి.

ఇక నేతల విషయంలో అయితే వ్యక్తిపూజను బట్టి కొన్ని, జాతి స్పూర్తికోసం కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. టేంక్ బండ్ పై ఎన్.టీ.ఆర్ ఆలోచనమేరకు నిర్మించిన విగ్రహాలపైనా ఆగ్రహాలు చూస్తున్నాము. విగ్రహాలపై కవులూ తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

గల్లీ గల్లీలో అల్లరి చిల్లరిగా విగ్రహావిష్కరణలు  ఓవైపైతే , పటేల్ కు అమాంతం అత్యంత భారీ విగ్రహాన్ని ఇటీవల నరేంద్రమోడీ ఆలోచన మేరకు గుజరాత్‌లో నెలకొల్పారు.

విగ్రహాల వల్ల నిగ్రహాలు కోల్పోయి ఆగ్రహాలు ఆవేశకావేశాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రతకడానికి చోటులేకున్నా విగ్రహాలకు, సమాధులకూ చోటుకోసం కోసం అనేక గొడవలు జరుగుతున్నాయి. బ్రతికున్నవాడి గురించి పట్టించుకోనివారు చనిపోయిన వారి గౌరవాలకోసం పోట్లాటలు పెట్టుకుంటున్న సందర్భాలూ మనం చూస్తూనే ఉన్నాము.

మహనీయులనుకున్న వారి విగ్రహాలును కొన్ని సందర్భాలలో అవమానించడమూ వార్తలుగా ప్రపంచవ్యాప్తంగా సంఘటనలను చూస్తున్నాము.

ఓ వ్యక్తిని గౌరవించాలంటే విగ్రహం అవసరమా? విగ్రహాలు లేకుండా స్పూర్తిని నింపలేమా? అసలు విగ్రహాలు ఏర్పాటు దేనికోసం? విగ్రహాల ఏర్పాటు ఉండాలంటే ప్రాతిపదిక ఎలా ఉండాలి?


ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాలను పంచుకోవాలని విజ్ఞప్తి.

*Republished

Reactions:

Post a Comment

 1. మన రాష్ట్రంలో వి.వి.గిరికి విగ్రహాలు లేవు కానీ ముఠా నాయకుడైన రాజశేఖరరెడ్డికి ఊరూరా విగ్రహాలు ఉన్నాయి. ఇది ఒక పేరదాక్స్ కాదా?

  ReplyDelete
 2. Ee vishayam pai saahitya abhimani blog lo siva ram prasad Kappaganthu garu chakkani vyasam rasaru. Chalaa kalam kritame. Link ela copy cheyalo naku teliyadu Kabatti kevalam vishayam prastavinchanu.

  ReplyDelete
 3. (విగ్రహాలతో సహా) స్మారక చిహ్నాలు పెట్టడానికి సాధారణంగా రెండు కారణాలు ఉంటాయి. మొదటిది ఆ ప్రదేశానికి ఆ వ్యక్తికి ఉన్న అనుబంధం (ఉ. ఇరువరికీ సంబదించిన ఒక ఘటన). ఇలా గుంటూరులో జిన్నా రాకను పురస్కరించి ఆయన పేరుతొ టవరు, హైదరాబాదులో రోనాల్డ్ రాస్ పరిశోధన చేసిన స్థలంలో విగ్రహం లాంటివి వెలిసాయి.

  The memorial celebrates the link between the place & the individual. ఆ అనుబంధం పరిస్తితులతో చెరిగిపోదు. తూర్పు జర్మనీలో మార్క్స్ విగ్రహాలు & ఆయన పేరు మీది రోడ్లు వగైరాలు ఇటీవల మార్చేసినా ఆయన పుట్టిన పశ్చిమ జర్మనీ ట్రియెర్ చుట్టుపక్కల ఇంకా ఎన్నో కార్ల్-మార్క్స్-స్ట్రాసెలు అలాగే ఉన్నాయి.

  రెండవ తరహా స్మారకాలకు ఏ ప్రాతిపదిక లేదా పద్దతి ఉన్నట్టు లేదు. వీటిలో కొన్ని ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు (ఉ. పార్టీలు) పెట్టినవి. తమ నాయకులను లేదా సిద్దాంతకర్తలను గౌరవించడానికో లేదా ఏదో ముఖ్యమయిన సంఘటన స్మరించడానికో పెడతారు. ఇవి వారి సొంత ఖర్చుతో వారి సొంత భూమిలో పెట్టాలని మాత్రమె నియంత్రణ చేయోచ్చు. అంతకు మించి ఎవరికీ అధికారం లేదు.

  ప్రభుత్వం ప్రజాధనంతో ఏర్పరిచే స్మారక చిహ్నాలకు ప్రాతిపదిక అడిగే హక్కు ఆ రాష్ట్ర ప్రజలకు తప్పక ఉంటుంది. ప్రాతిపదిక ఏమిటన్న విషయంలో ప్రజల అంగీకారం ఉండాలి. అలాగే వ్యక్తుల ఎంపిక ప్రాతిపదికను స్త్రిక్తుగా అమలు చేస్తూ జరగాలి.

  ReplyDelete
 4. రెండు వివిధ చర్చలు మీరు ఏకం చేసారు
  ఒకటి హిందూ మార్గదర్శిని లో ఒకటి, రెండవది అభిమానం!
  ఒకప్పుడు కేవలం దేవుడిని మాత్రమే ఆరాధించే వాళ్ళం తరువాత వ్యక్తీ పూజ మొదలయ్యి దేవాలయాలలో రాజుల ప్రతిమలు చేరాయి, అది ఇంకా హెచ్చు మీరి అభిమానం పేరుతొ స్వ విగ్రహాలు ప్రతిష్టించారు(ఇంకా చెప్పాలి అంటే ప్రతిష్టించుకొని ఆనందిస్తున్నారు) కానీ ప్రతీసారి విగ్రహాలు చరిత్రను ప్రజలకు చెప్పడానికి ఉపయోగ పడేవి.
  ఇక్కడ జరిగిన ఒక తప్పిదం చరిత్రలో అందరికీ సమ ప్రాధాన్యం లభించలేదు, దానికితోడు ఒక వర్గం పేరును ఉపయోగించుకుని పైకి వచ్చిన వాళ్ళు చాలా పెరిగిపోయారు!
  ఇప్పుడు అది మార్చడానికి Modi ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, కానీ కొంత వరకూ ప్రభుత్వం నిధులు వెచ్చించడం నాకు బాధగా ఉంది!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top