------------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

 . తెలంగాణ ప్రయోజనాలు ఏం ఆశిస్తున్నారు?
. కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

హైదరాబాద్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియామీర్జా నియామకం వెనుక ఆంతర్యం ఏమిటో, ప్రజల ప్రయోజనాలు ఏం ఆశించి ఆమెను ఎంపిక చేశారో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టతనివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. ఎవరినైనా బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించాలనుకున్నప్పుడు తెలంగాణకు ఏ విధంగా ఉపయోగపడతారన్నదే ప్రధానమైన విషయమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమితాబ్‌ను గుజరాత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టడం వల్ల ప్రచారంలో ఆ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవలి కాలంలో తరచుగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్న అంశాల నేపథ్యంలో.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియామీర్జా ఏ మేరకు సూటవుతారనే తమ పార్టీ శాసనసభపక్ష నేత కె.లక్ష్మణ్‌ మాట్లాడారన్నారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడానికి నిబంధనలు ఏమున్నాయని తాను ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే, 48 గంటలు గడిచినా సమాధానం లేదన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితేనే వాగ్దానాలపై స్పష్టత వస్తుందని ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వల్ల ఉచిత విద్యుత్‌ అమలవుతున్నట్టు కనిపించడం లేదని అన్నారు. ఖరీఫ్‌ ప్రారంభమై నెల గడిచినా, రుణమాఫీపై స్పష్టత లేదని, ఇప్పటికి జరిగిన మూడు రైతు ఆత్మహత్యలూ మెదక్‌ జిల్లాలోనే జరిగాయని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటును గందరగోళంలోకి నెట్టారని, కొంతమందికి మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కౌన్సెలింగ్‌లో ఆలస్యం కారణంగా భవిష్యత్తులో విద్యార్థులు నష్టపోయే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రేషన్‌కార్డులను ఇచ్చిన తర్వాతే బోగస్‌ కార్డుల ఏరివేత చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మాసాయిపేట ఘటనల్లాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం, రైల్వేశాఖపై ఉందన్నారు. కాపలా లేని లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద కాపలా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా అవసరమని,  దీనికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
(from andhrajyothy daily)
-----------------------------------------------------------------------------------

భారతీయురాలినే అని పదే పదే చెప్పుకోవలసి రావడం బాధంగా ఉంది : సానియా మీర్జా అవేదన


హైదరాబాద్, జూలై 25 : తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడార్‌గా తన నియామకంపై రేగిన వివాదంలో చెప్పడానికి ఏమీ లేదని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పష్టం చేశారు. తాను వివాదాల జోలికి పోదల్చుకోలేదని ఆమె వెల్లడించారు. తాను ఎప్పటికీ భారతీయురాలినేనని ఇంతకు ముందే చెప్పిన సానియా... ఈ వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తనపై వస్తున్న వివాదాలపై సానియా మీర్జా కన్నీటి పర్యంతమయ్యారు. బ్రాండ్ అంబాసిడార్‌పై అనవసర వివాదం రేగుతోందని ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీరు మన్నీరయ్యారు. వివాహం అయిన తర్వాత కూడా తనకు మెడల్స్ వచ్చాయని, జీవితాంతం భారత్‌లోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. నా మూలాలను ప్రశ్నించేవారిని వదిలిపెట్టనని, భారతీయురాలినని చెప్పకోవడం గర్వంగా ఉందని సానియా అన్నారు.ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు ఇక ఇంటర్ మార్కులే ఆధారం.
ప్రతీసారీ ఎందుకిలా నా జాతీయత గురించి ప్రశ్నిస్తున్నారో అర్ధం కావడంలేదని సానియా ఆవేదన వ్యక్తం చేశారు. మనం పురుషాధిక్య ప్రపంచంలో జీవిస్తున్నాం గనుక ఈ ప్రశ్నలు వేస్తున్నారనుకోవాలా అని ఆమె అన్నారు. ఏది ఏమైనా ఇలా చెప్పుకోవలసి రావడం బాధగా ఉందని సానియా వ్యాఖ్యానించారు.
(from andhrajyothy daily)

సానియా మీర్జా వ్యవహారం పై ఎందుకు వివాదం రేగుతోంది? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?

*Republished
Reactions:

Post a Comment

 1. ఒకప్పుడు సచిన్ బూస్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవారు. అలా ఉన్నప్పుడు బూస్ట్‌ని వాడమని I mean తాగమని చెప్పేవారు. అలాగే షారుక్ ఖాన్ మలేసియన్ విమానాల్లో ప్రయాణించమని చెప్పేవారు.

  మరి రాస్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏమిటి? రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవారు ఏమని ప్రచారం చేస్తారు లేదా చెయ్యాలి? ప్రజలందరినీ వచ్చి తెలంగాణాలోకి వచ్చి నివసించమని ప్రచారంచేస్తారా? మరి కేసేఆర్ అనే ఇంకొక బ్రాండ్ అంబాసిడర్ సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ప్రచారంచేస్తున్నారుకదా. దాని సంగతి ఏమిటి?

  పెట్టుబడిదారులని తెలంగాణాలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తారా? వ్యాపారేతర రంగాల్లో ఉన్నవారు పెట్టుబడులుపెట్టండహో అంటే పారిశ్రామిక వేత్తలు పరిగెత్తుకుంటూ వస్తారా?

  వ్యాపారికి (ఉదా:- టూరిజం) అంబాసిడర్లు ఉండటంలో అర్ధముందిగానీ, రాష్ట్రాలకి (, పార్లమెంటుకి, కరెన్సీకి, దేశాలకి ) అంబాసిడర్లు ఎందుకు?

  ReplyDelete
  Replies
  1. Yes. I second Iconoclast. ప్రభుత్వాలకి ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు. ఇది కేవలం సానియా ద్వారా ముస్లిమ్ లని కాకాకొట్టే ప్రయత్నంలా కనిపిస్తోంది.

   Delete
  2. డా. లక్ష్మణ్ అక్కరలేని లొల్లి చేసి ప్రకాష్ జవదేకర్ మొట్టికాయలు తిన్నారు. ఇప్పుడు తగుదునమ్మా అని ప్రభాకర్ గారు బయలుదేరారు.

   నరేంద్ర మోడీ ప్రభుత్వం అమితాభ్ బచ్చన్ గుజరాత్ బ్రాండ్ అంబాసడర్ పెట్టినప్పుడు ఏమేమి ప్రయోజనాలు వచ్చాయో అవే వస్తాయి.

   తెలంగాణా కోసం మీరేమి పొడిచారో భాజపా నాయకులు చెబితే బాగుంటుంది. పక్క రాష్ట్రంలో (రాజ్యసభకు గెలిచింది కర్నాటక నుంచయినా) ఆంద్ర కోసం ఎంతో సేవ చేస్తున్న వెంకయ్య నాయుడిని చూసయినా నేర్చుకోండి.

   Delete
 2. నా తెలంగాణ కోటి రతనాల వీణ" మరియు "కమ్మని నా తెలంగాణా తొమ్మిది జిల్లాలేనా? బహులాంధ్ర కు తెలంగాణా పర్యాయ పదం కాదా?" అన్న దాశరధి సమైక్యవాది అయిన పి వి నరశిం హా రావు గార్లమీద గౌరవం ప్రేమ పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ ఆదాయం అడిగెతే అది తెలనగాణాలో భాగం అంటారు విబజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ కేంద్రాల విద్యుత్ (52%) మాత్రం కావాలి కాని అదే విభజన చట్టం చెప్పిన గవర్నర్ అధికారాలు, ఉమ్మడి విద్య, పొలవరం విషయాలు కె సి ఆర్ అన్యాయంగా తోస్తాయి. తాజా సానియ మిర్జా వివాదం కూడా అంతే. ఆయనకి కు నచ్చితే నంది లేకుంతే పంది అన్న చందంగా వుంది.ఇపుడు సానియ మిర్జా తన జాతీయత గురించి ఎలాగైతే బాధపడుతోందో అలాగే తెలంగాణలోని కొంతమంది తెలుగు వారు తమ జాతీయత/రాష్ట్రీయత గురించి బాధ పడుతున్నారు.


  ReplyDelete
  Replies
  1. పి.వి. సమైక్యవాది కాదు. అతను సమైక్యవాదులకి రుచించని ముల్కీ నిబంధనలని అమలు చెయ్యడం వల్లే జై ఆంధ్ర ఉద్యమం పుట్టి అతని పదవి పోయింది.

   Delete
  2. 1969 తెలంగాణా ఉద్యమం తరువాత ముల్కి నిభందన అమలు తెలంగాణా వాదులకు అనుకూలమే గాని, ఆయన ఉద్దేశ్యం ప్రత్యేక ఉద్యమాన్ని చల్లార్చటమే అన్నది గమనిచాలి. ప్రత్యెక తెలంగాణా ఉద్యమంలోను మరియు తరువాతి జై ఆంధ్ర వుద్యమ సమయాల్లో సమైక్యానికి అనుకూలంగా శ్రీ. పి వీ గారి పత్రికా స్టేటెమెంట్లను పరిశిలించండి.

   Delete
  3. ఇక్కడ ముస్లింస్ సపోర్ట్ కొరకు సానియా మీర్జా పై ప్రేమ కురిపించగలరు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సపోర్ట్ కొరకు జగన్ మీదా అతనేమైనా అంటరానివాడా? అంటూ ప్రేమ కురిపించగలరు. కానీ సోదరులైన ఆంధ్రా ప్రజలమీదా, అందునా తెలంగాణాలో స్థిరపడదామనుకుంటున్న ప్రజలపై మాత్రం వారిని ఇబ్బందులు ఎలా పెట్టాల్నా అని ఎంత లోతుగానైనా ఆలోచించగలరు. బ్రాండ్ అంబాసిడర్లవల్ల ప్రజా ధనం దుర్వినియోగం కావడం తప్ప ప్రయోజనం లేదు. అది గుజరాత్ అయినా తెలంగాణా అయినా ప్రభుత్వాలకు బ్రాండ్ అంబాసిడర్ల అవసరం లేదనేది నా అభిప్రాయం.

   Delete
  4. నాకు తెలిసినంతవరకూ పీ.వీ ప్రత్యేకవాది కాదు ప్రవీణ్.

   Delete
  5. పదవిని కాపాడుకోవడానికి తెలంగాణావాదం, సమైక్యవాదం అనేవాటిని ద్వితీయాంశాలుగా చూడాల్సి వచ్చేది. పి.వి. తన మంత్రి వర్గాన్ని విస్తరించి 8 మంది ఆంధ్రులకి మంత్రి పదవులు ఇచ్చినా కేవలం ముల్కీ నిబంధనలు కారణంగా జై ఆంధ్ర ఉద్యమకారులు పి.వి.ని పదవి నుంచి దింపేశిన మాట నిజం కాదా?

   Delete
  6. మీరు చెప్పేది పీ.వీ సమైక్యవాది కాదు అని చెప్పడానికి ఎలా ప్రాతిపదికో అర్ధం కావడం లేదు.

   Delete
 3. "బ్రాండ్ అంబాసిడర్లవల్ల ప్రజా ధనం దుర్వినియోగం కావడం తప్ప ప్రయోజనం లేదు."

  ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం ఏదైనా దాని ఉద్దేశం ప్రజలకు మేలు చేయటం కావాలి కాని ప్రజలను తనకేశి ఆకర్హించుకోవటం కాకూడదు కదా. ఒక ప్రభుత్వం సరిగా పనిచేస్తుంటే అది తగిన గుర్తింపును ప్రజల్లో ఎలాగూ పొందగలదు. కించిన్యూనే న్యూనం. అంతే.

  ReplyDelete
 4. గుజరాత్‌కి అమితాభ్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకొని మొడీ మెరుగైన ఫలితాలు సాధించాడు. అలాగే అంతర్జాతీయ క్రీడాకారిణిగా గ్లామర్ కలిగిన సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకొని టూరిజంలో మెరుగైన ఫలితాలు సాధిద్దామని తెలంగాణా ప్రభుత్వం అనుకుంటే అందులో తప్పేమిటి? ప్రమాణ స్వీకారానికి పాతిక కోట్లు కర్చు పెట్టడం కన్నా ప్రయోజనాలను ఆశించి కోటి పెట్టుబడిగా పెడితే తప్పేమిటి?

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ చారి గారు, ప్రమాణ స్వీకారానికి పాతికకోట్లు పెట్టినా, గుజరాత్ లో అమితాబ్ ని పెట్టినా , ఇక్కడ సానియా మీర్జాని పెట్టినా ప్రజాధనం దుర్వినియోగపరచడానికే. తప్పు ఏమిటంటే ప్రజాధనం రాజకీయ కుత్సిత క్రీడలకు అప్పనంగా ఉపయోగించడమే. ఈ తప్పు ఎక్కడ జరిగినా తప్పే. పైగా ఆర్ధికంగా ఇబ్బందులో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అదేమంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికని బాబు ఎండ్ అక్కడి భజనపరులు సెలవిచ్చారు. తప్ప తప్పులు చేయడంలో పోలికలు పొంతనలు అనవసరం కదా?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top