----------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

ఇష్టమైతేనే సమగ్ర సర్వేకు సమాచారం, ప్రజలను బలవంతంపెట్టి వివరాలు అడగవద్దు, సర్వేకు ఆంక్షలతో అనుమతి ఇచ్చిన హైకోర్టు


హైదరాబాద్, ఆగష్టు 14 : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వేకు గురువారం నాడు హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది. వివరాల కోసం ప్రజలపై ఒత్తిడి తేవద్దని స్పష్టం చేసింది. ఎవరైనా అభ్యంతరం చెబితే వదిలివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంక్ అకౌంట్లు, వ్యక్తిగత వివరాలకోసం పట్టుపట్టవదని కోర్టు సూచించింది.

సమగ్ర సర్వేపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. సర్వే తప్పనిసరికాదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. సమగ్ర సర్వే స్వచ్చంధంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితంలోకి చొరబడడంలేదని, సంక్షేమ పథకాల అమలు కోసమే సర్వే చేస్తున్నట్లు ఆయన కోర్టుకు వెల్లడించారు.

ఈనెల 19న తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వేను వ్యతిరేకిస్తూ సీతాలక్ష్మి అనే న్యాయవాడి కోర్టును ఆశ్రయించారు. ఇది చట్ట వ్యతిరేకమని, దీనికి చట్టబద్ధత లేదని, ఇటువంటి సర్వేను కేంద్రప్రభుత్వం మాత్రమే చేయాలని, ఎవరు పడితే వారు చేయకూడదనే కోణంలో వారు పిటిషన్ వేశారు. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్లు, వాహనాలు, కులం, ఏ ప్రాంతం నుంచి ఎప్పుడు వచ్చారు, తదితర విషయాలు సర్వే ఫార్మాట్‌లో ఉన్నాయని, ఈ రకంగా వ్యక్తుల వివరాల్లోకి చొరబడడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం ప్రజా శ్రేయస్సుకోసం, సంక్షేమపథకాల అమలు కోసమే సర్వే నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అంతేతప్ప ప్రజలపై ఒత్తిడి తీసుకురాబోమని, ఇది తప్పనిసరికాదని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి కాదని అంటోంది కాబట్టి ప్రజలకు ఇష్టమైతేనే ఎన్యూమరేటర్స్‌కు వివరాలు ఇవ్వాలని, లేదంటే ఇవ్వాల్సిన పనిలేదని చెప్పారు. ప్రజలు సహకరిస్తేనే వివరాలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. వివరాలు చెప్పనివాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించవు. దాని వల్ల తెలంగాణ ప్రభుత్వానికే డబ్బులు మిగులుతాయి.

  ReplyDelete
  Replies
  1. వివరాలు చెప్పని వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయవద్దని కోర్టు చెప్పిందా? తెలంగాణా ప్రభుత్వం చెప్పిందా? మీరు చెపుతున్నారా ప్రవీణ్?

   Delete
  2. ప్రభుత్వం ఏ వివరం అడిగినా పౌరుడు చెప్పి తీరాల్సిందేనా? ప్రభుత్వం అంటే అంత పవర్‌ఫుల్‌గా ఉండాల్నా ప్రవీణ్ గారు?

   Delete
  3. మీరు చెప్పే సమాధానాన్ని ఇంగ్లిష్‌లో heresy (వితండవాదం) అంటారు. ఒక వ్యక్తికి తన వ్యక్తిగత వివరాలు చెప్పడం ఇష్టం లేకపోతే దాని పరిణామాలకి అతనే బాధ్యుడు. అతన్ని బలవంతం చెయ్యాల్సిన అవసరం ఎవరికీ లేదు. పేదవాళ్ళ కోసం పెట్టిన సంక్షేమ పథకాలని పేదవాళ్ళో, కాదో తెలియనివాళ్ళకి వర్తింపచెయ్యాలని కోర్త్ ఎలా చెపుతుంది? వ్యక్తిగత వివరాలని బలవంతంగా సేకరించొద్దు అని చెప్పడం వరకే కోర్త్ బాధ్యత. తమకి సంక్షేమ పథకాలు వర్తించవని తెలిసినవాళ్ళు తమ వివరాలు ఎలాగూ చెప్పరు. దాని వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు.

   Delete
  4. నాకు తెలుగు వచ్చు ప్రవీణ్ గారు. ఇంగ్లీషు నేర్చుకుందామనుకుంటున్నాను. ఈ లోగా తెలుగులోనే చెప్పవచ్చు మీరు.

   కోర్టు చెప్పినదాని ప్రకారం ఓ పేదవాడు సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పకపోతే అతనికి సంక్షేమ పథకాలు వర్తింప జేయరా? అలా అని తెలంగాణా ప్రభుత్వం చెపుతుందా? దీనికి నాకు మీ సమాధానం కావాలి?

   ఎందుకంటే నేనడిగిన ప్రశ్న ఉద్దేశం కూడా కోర్టు చెప్పిన ప్రకారం ఇష్టమున్నవారే సర్వేకు సహకరిస్తే పేదవాళ్లు కూడా సర్వేకు సహకరించకపోతే ప్రభుత్వ ఆశించిన ప్రయోజనం పొందలేదు గదా?

   Delete
  5. బోగస్ రేషన్ కార్ద్‌లు చూపించి, పేదవాళ్ళ కోసం పెట్టిన ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. రేషన్ కార్ద్ మీద తన వ్యక్తిగత వివరాలు ఉన్నాయి కనుక తన రేషన్ కార్ద్ చూపించను అని ఒక పేదవాడు అంటే అతనికి ఎవరూ సహాయం చెయ్యలేరు. రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి కనుక రేషన్ కార్ద్ చూపించనివానికి ఆరోగ్యశ్రీ లాంటివి వర్తించవు అని రూల్ పెట్టినా కోర్త్‌లు అభ్యంతరం చెప్పలేవు. ప్రభుత్వ విధానాల్లో కోర్త్‌లు కలగచేసుకోలేవు అని తెలంగాణా బిల్ సమయంలోనే సుప్రీమ్ కోర్త్ చెప్పింది కదా.

   తమకి అవసరమైనది వద్దని ఎవరంటారు. సంక్షేమ పథకాలు తమకి వర్తించవని తెలిసినవాళ్ళు ఈ సర్వేకి అభ్యంతరం చెపితే దాని గురించి సీరియస్‌గా ఆలోచించాలా?

   Delete
  6. వ్యక్తిగత వివరాలంటే బేంక్ ఎకౌంట్ - జబ్బులు వంటివి అని. రేషన్ కార్డు- ఆధార్ కార్డు - ఆస్థుల వివరాలు చెప్పాల్సిందే. నిజంగా బోగస్ కార్డులు ఏరివేసి , నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తే తెలంగాణా ప్రభుత్వం దేశంలోనే రికార్డుని నెలకొల్పుతుంది. అయితే ఏమీ చేయకముందే మనం వ్యాఖ్యానించలేము పాజిటి లేదా నెగెటివ్ గా. ఈ సర్వేకు ప్రజలు ఎలా సహకరించాలి? ప్రభుత్వమేమి చేయాలనేదానిలో మరింత క్లారిటీగా కోర్టు చెప్పి ఉంటే బాగుంటుంది. చూద్దాం తుది తీరుపు వెలువరించేలొగా ఏమి చెప్తారో. సర్వేలో ఆర్ధికపరమైన అంశాలని తప్పనిసరిగానూ ఇతర వ్యక్తిగత అంశాలను ఆప్షనల్‌గానూ ఉంచితే బాగుంటుంది.

   Delete
  7. బ్యాంక్ అకౌంత్ నంబర్ తెలిసినంతమాత్రాన అవతలివాడు డబ్బు డ్రా చెయ్యలేడు. Cash withdrawal is allowed in "by self only" mode as per the Reserve Bank's mandate.

   Delete
  8. మరి దేనికి బేంక్ ఎకౌంట్ నంబర్ అడుగుతున్నారు ప్రభుత్వం వారు?

   Delete
  9. మరి దేనికి బేంక్ ఎకౌంట్ నంబర్ అడుగుతున్నారు ప్రభుత్వం వారు?

   బహుశ భవిష్యత్తులో నేరుగా నగదు బదిలీ చేయడానికి ఉపయోగించడానికి అయ్యుండొచ్చు. నాకు తెలిసి అకౌంట్ నంబరు ఇవ్వడం వల్ల జరిగే హాని ఏమీ లేదు. పాస్వర్డ్ లు, ఎ టి ఎం పిన్ లు, బ్యాంకు బాలన్సులు అడిగితేనే అభ్యంతర కరం. బ్యాంకులు కూడా అకౌంట్ హోల్దరుకు తప్ప ఇతరులకు బ్యాలన్సు వివరాలు చెప్పవు. అందుకే కోర్టు అడగొద్దని చెప్పలేదు. స్వచ్చందంగా ఇస్తేనే వివరాలు సేకరించమని మాత్రమె చెప్పింది.

   Delete
  10. ఇలా అడిగే బదులు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పథకాలకోసమ ప్రభుత్వమే ఓ ఎకౌంట్ ఇస్తే బాగుంటుంది. వ్యక్తిగత ఖాతాకు దానికీ సంబంధం ఉండకుండా ఉండాలి. దేశవ్యాపితంగా ఇది అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలనీ ఈ ఖాతా ద్వారానే సమీక్షించవచ్చు.

   Delete
 2. With the ruling of High Court wind is taken out of the sails of TRS govt ! Now the so called survey is only a waste of time and public money. The intentions are questionable; Court has seen thr' the direty game and scuttled it.

  ReplyDelete
 3. కోర్టు కొన్ని వ్యక్తిగత విషయాలు మాత్రమే స్వచ్చందంగా సేకరించమని చెప్పింది. మొత్తం సర్వే వద్దని చెప్పలేదు. అయినప్పటికీ సర్వే వల్ల ఎన్నో కలిగే ఉపయోగాలు తక్కువేమీ కాదు.

  1. ప్రజల గురించి అనేక వివరాలతో కూడిన సమగ్రమైన డేటాబేస్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది.
  2. అది ప్రణాళికా రచనకు, బడ్జెట్ రూపకల్పనలో వాస్తవిక అంచనాలు వేయడానికి ఎంతగానో పనికి వస్తుంది.
  3. సంక్షేమ పథకాల్లో అర్హత లేని లబ్దిదారులను ఎరివయడానికి పనికొస్తుంది.
  4. ప్రభుత్వ పథకాల్లో లబ్ది పొందడం కోసం పౌరులు సంప్రదించినపుడు, డేటాబేస్ తో వెరిఫై చేయబడతారు. అందులో లేకపోతే సరియైన సాక్ష్యాలు చూపి నమోదు చేసుకోవలసి వుంటుంది. ఆ తలకాయ నొప్పికన్నా సర్వేలో పాల్గొనడమే ఉత్తమం కాబట్టి భవిష్యత్తులో కనీసం కుళాయి కనెక్షను తీసుకోవాలనుకునే వారు కూడా సర్వేలో తప్పక పాల్గొంటారు.
  5. ఎం ఆర్ వో దగ్గరి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఒకటే సమాచారం వుంటుంది. దాని వల్ల పరిపాలనా సామర్థ్యం పెరుగుతుంది. ఈ సమాచార శక్తిని సరిగా ఉపయోగించుకుని రెడ్ టేపిజాన్ని తగ్గించ వచ్చు. సమాచారం లేదనే వంకతో పనులు ఎగ్గొట్టడం తగ్గుతుంది.
  6. సామాజిక వర్గాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని, ఇక ముందు జరగాల్సిన అభివృద్ధులను కచ్చితంగా లెక్క వేయవచ్చు. అందుకోసం వెచ్చించాల్సిన నిధులను సరిగా ప్లాన్ చేయవచ్చు.

  పైవన్నీ వదిలేసినా కేవలం తెల్ల రేషన్ కార్డులను ఏరివేయ గలిగినా... సర్వే కోసం పెట్టిన కర్చు, శ్రమలకు ఫలితం దక్కినట్టే.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది బాగుంది. సర్వేలో తప్పనిసరిగా అందరూ పాల్గొనాలి. కొన్ని ప్రశ్నలకు తప్పనిసరిగానూ - కొన్నింటికి ఆప్షనల్‌గానూ సమాధానాలు చెప్పేలా నిబంధనలు ఉండాలి. 19 వ తేదీన ఒక్కరోజులోనే సర్వే చేయడమనే నిబంధన కాకుండా కనీసం నాలుగు సార్లు అవకాశం ఇవ్వాలి. కానీ సర్వే ఎందుకు చేస్తున్నామో, దానివల్ల ఏమి మేలు జరుగుతుందో ప్రజలకి భయాందోళనలు లేకుండా ప్రచారం జరగాలి. ఇది మనకోసం మన భవిష్యత్తుకోసం చేయాల్సిన ఓ ముఖ్యమైన పని అనేలా నమ్మకం కలిగించేలా ఉండాలి. ప్రస్తుతమైతే ప్రజలలో ఆ క్లారిటీ లేదు. 1956 నిబంధన లాగానే కే.సీ.ఆర్ ప్రభుత్వం కార్డులు కుదించడానికీ, సంక్షేమ పథకలాను కుదించడానికీ ఓ ఎత్తుగడగా చేస్తున్నారేమోననే అభద్రత అనుమానం ఎక్కువగా ఉన్నది. అయితే ఆ అభద్రతను అనుమానాలను నివృత్తి చేస్తూ సర్వేని సమగ్రంగా నిష్పక్షపాతంగా పట్టుదలతో పూర్తి చేయాలి. ఒక్క రోజు నిబంధ్న తీసేయాలి. దీనిని నిరంతర ప్రాసెస్ గా చేయాలి. గ్రామ సభల ద్వారా ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం బహిరంగంగా జరపాలి. ప్రజలందరి సంక్షంలో ఎవడికి ఏ లబ్ధి వస్తుందో ఓఅపెన్ గా రిపోర్ట్ ఇస్తే అక్రమార్కుల భరతం పట్టవచ్చు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి ప్రజలవద్దకు పాలన అంటూ ఇంతకంటే ఆర్భాటంగా ప్రకటించినా అమలులో అసహ్యకరమైన లోపాలతో ఆ కాన్సెప్ట్ అంటేనే నవ్వుకునేలా తయారయినదానినీ చూశాము. జనరల్గా పాలకవర్గాలు తిరిగి తాము అధికారాంలోకి వచ్చేందుకు ప్రజలను ఓటర్లుగా చూసేందుకు , వారిలో చైతన్యం రాకుండా ఎప్పటికీ గొర్రెల్లా ఉండాలనే ఆలోచిస్తాయి. ఇప్పటిదాకా చరిత్రలో అత్యధికం ఇలాగే జరిగింది కనుక ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వమూ అదే చేస్తుందనుకోవడంలో తప్పు లేదు. అదే చేస్తుంది అని చెప్పాల్సిన అవసరమూ లేదు. చూద్దాం ఈ ప్రయత్నం వల్ల ప్రజలకేమి జరుగబోతున్నదో!?

   Delete
  2. కొండలరావు గారు,

   ఒకరోజులో సర్వే అనేది చాలా కీలకమైన అంశం. ఇదివరలో ఎన్నో సర్వేలు చేసినా డుప్లికేట్లను నివారించలేక పోయాయి. ఈ సారి కూడా జంట నగరాలు ఒకసారి, మిగతా రాష్ట్రమంతా ఒక సారి సర్వే జరిపే విషయంలో ప్రభుత్వంలో అనేక చర్చలు జరిగాయి. కాని చివరకు ఒకే రోజు జరపాలని నిర్ణయానికి వచ్చారు. లేక పొతే డుప్లి-కేటుగాల్లు రెండు చోట్లా ప్రత్యక్షమై అసలు ఉద్దేశానికే తూట్లు పొడిచే అవకాశం వుంది. కాబట్టి ఒకరోజు సర్వేనే సమంజసమైనది.

   ఆ రోజు సర్వేలో పాల్గొన్న వారికి ఎన్యూమరేషన్ సాఫీగా జరిగిపోతుంది. అంతమాత్రాన దాన్లో మిస్సయిన వారికి అవకాశం అసలే ఉండదని కాదు. కాని ఆఫీసు చుట్టూ తిరిగి డాక్యుమెంట్లు పెట్టి కొంత కష్టపడ వలసి వస్తుంది. కాని అలాంటి అవకాశాన్ని ముందే చెపితే అది అలుసుగా తీసుకొని ఎక్కువమంది నాగా వేసే అవకాశముంది. అందుకనే ప్రభుత్వం అది ముందే చెప్పదు, ఆరోజు హాజరు కమ్మనే చెపుతుంది. ఒకరోజు సమగ్ర సర్వే జరిగిన తర్వాత అందులో పాల్గొనని కుటుంబాల ఎన్యూమరేషన్ బాధ్యత వారి మీదనే వుంటుంది తప్ప ప్రభుత్వం మీద కాదు. ఒకరోజు సర్వే అనేది విప్లవాత్మకమైన ఆలోచన. ఆధార కార్డుల్లో కూడా డూప్లికేట్లు తయారు చేయగలుతున్న ప్రభుద్ధులకు - వాటి నివారణకు ఇంతకన్నా మంచి పధ్ధతి - పొదుపైన పధ్ధతి - నాకైతే తోచలేదు.

   నాకు తెలిసి తెలంగాణా ప్రజలు చైతన్యవంతంగానే వున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సెలవు మంజూరు చేసింది. ప్రైవేటు సంస్థలు కూడా సెలవు ఇస్తున్నాయి. సాఫ్ట్ వేర్ సంస్థలు ఇంటినుంచి పని, లేదా సెలవు ఇస్తున్నాయి. గ్రామ గ్రామాన ఇప్పటికే విస్తృత ప్రచారం జరిగింది. ఫేస్బుక్, తెలంగాణా చానెళ్ళు కూడా ప్రచారం పై తమ పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది. గందరగోళ పడుతున్నది, ప్రజలని గందరగోళ పెడుతునది కేవలం కొన్ని సీమంధ్ర చానెళ్ళు, కొన్ని ప్రతిపక్షాలు మాత్రమే. వాటి ఎజెండా సర్వే విఫలం కావడం, అందుకోసం అవి శక్తివంచన లేకుండా కృషి చేస్తాయనడంలో సందేహం లేదు.

   Delete
  3. మీరన్న పద్ధతిలో సర్వే జరిగితే ప్రజలకు మేలే జరుగుతుంది కనుక, ఒక రోజు సర్వేలో ఏదైనా కారణాలతో పాల్గొనని వారికి తిరిగి అవకాశం ఇచ్చే విధంగా చర్యలు ఉంటే మంచిదే. అలా తెలంగాణా ప్రజలకు మంచి జరిగితే అది సీమాంధ్ర వారికి కూడా ఆదర్శమే అవుతుంది.

   Delete
  4. ఆ రోజు సర్వేలో పాల్గొన్న వారికి ఎన్యూమరేషన్ సాఫీగా జరిగిపోతుంది. అంతమాత్రాన దాన్లో మిస్సయిన వారికి అవకాశం అసలే ఉండదని కాదు. కాని ఆఫీసు చుట్టూ తిరిగి డాక్యుమెంట్లు పెట్టి కొంత కష్టపడ వలసి వస్తుంది. కాని అలాంటి అవకాశాన్ని ముందే చెపితే అది అలుసుగా తీసుకొని ఎక్కువమంది నాగా వేసే అవకాశముంది. అందుకనే ప్రభుత్వం అది ముందే చెప్పదు,
   >>
   నిజమే!సర్వే ఒక్కరోజే అని అన్నా అంతటితో ముగుస్తుందని నేనూ అనుకోవదం లేదు.హెల్మెట్ల విషయమే తీసుకోండి. మన రక్షన కోసం అది అవసరమని మనకూ తెలుసు.కానీ దాన్ని కంపల్సరీ చేసి ఫైన్లు వేస్తుంటే గానీ మనం దాన్ని శ్రధ్ధగా ఫాలో అవడం లేదు.ఇదీ అంతే.

   Delete
 4. సర్వేలు డేటాబేసు తయారీకు కీలకం. డేటా ఎంత బాగుంటే నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు అంత పెరుగుతుంది.

  ReplyDelete
  Replies
  1. అవునవును. "డేటా ఎంత బాగుంటే నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు అంత పెరుగుతుంది." ఈ పాయింటును ఈయనెవరో చాల చాక్కగా చెప్పారు ఈ వీడియో లో.

   http://teluguone.com/news/content/video-on-kcr-government-household-survey-39-37290.html#.U--WXvmSySo

   Delete
  2. నాకు ఆయనెవరో తెలీదు. ఇది తెలంగాణా వారిని కించపరిచే విధంగా సీమాంద్రులే చిత్రీకరించారు అని నా స్నేహితులు కొంత మంది వ్యాఖ్యానించారు. ఈ వీడియో తాలూకు పూర్వాపరాలు , వివరాలు ఇంకా బయటకు రాలేదు.

   Delete
  3. నేను వీడియో చూడలేదు. అయితే నాకు రెండు అనుమానాలు/ప్రశ్నలు ఉన్నాయి ఎవరయినా తీర్చగలరొ లోదో:

   1. ఆంధ్రోల్లు వెళ్ళగొట్టాలంటే 4 పేజీల ప్రశ్నలు అవసరమా?
   2. కులం, ఇంటి కప్పు, బర్రెల సంఖ్యా లాంటి విషయాలు తెలుసుకుంటే ఆంధ్రోల్లు ఎవరో తెలుస్తుందా?

   Delete
  4. జై గారు,

   కులం ఫలానా + ఇంటి కప్పు ఫలానా + బర్రెలు ఇన్ని = ఆంధ్రా
   కులం ఫలానా + ఇంటి కప్పు ఫలానా + బర్రెలు ఇన్ని = తెలంగాణా

   ఇలాంటి ఫార్ములా ఏదో తెదేపా వారి వద్ద ఉందనుకుంటా. అందుకనే ఆ అనామక వీడియోను తెగ ప్రచారం చేస్తున్నారు!

   Delete
 5. ఈ సర్వే కేవలం ఆంధ్ర వాళ్ళని వెల్లగోత్తదానికే అని ఎంత క్లియర్ గా చెప్తున్నారో ఈయాన
  https://www.youtube.com/watch?v=SQEjeGHTd6M#t=84

  తెలంగాణా రాజముద్ర సాక్షి గా , ఈయన అందరి ముందు అంత పబ్లిక్ గా , ఆఫ్ ది రికార్డు అని క్లియర్ గా చెప్తున్నాడు .
  ఈ సర్వే ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్స్ ని, ఉద్యోగులని తరిమేయదానికే అని చెప్తున్నాడు .
  ఆయన ఒక జర్నలిస్ట్ అని తెలుస్తుంది ,

  ReplyDelete
  Replies
  1. ఆయనెవరో కాదు , సీఎం పేషీలోని పీఆర్వో విజయ్

   http://www.sakshi.com/news/telangana/controversy-on-telangana-survey-158322?pfrom=home-top-స్టొరీ

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top