Name:Srikanth Chari 
E-Mail:deleted 
Subject:మళ్ళీ పాత మైండ్ సెట్ లోకే చంద్రబాబు వెళ్తున్నారా? 
Message:క్రింది వ్యాసం చదవండి.

http://www.indiacurrentaffairs.org/2014/10/blog-post_490.html

చంద్రబాబు విలేకరుల సమావేశం చూస్తే ఆయన పదేపదే ఒక విషయం చెప్పడం గమనిస్తాం. తాను మాత్రం విరామం ఎరగకుండా పనిచేస్తున్నాడు కానీ ప్రభుత్వ అధికారులూ, ఉద్యోగులు మాత్రం సరిగా పనిచేయడం లేదు. ఇదే మాట చంద్రబాబు పదేపదే చెపుతున్నారు.

చంద్రబాబు వాదన వింతగా కనిపిస్తుంది. ఒకవైపు తన ప్రభుత్వం సహాయ చర్యలను సమర్ధ వంతంగా నిర్వహిస్తోంది అని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ సిబ్బంది సరిగా పనిచేయడంలేదు. అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇట్లాగా పనిచేస్తే ప్రజలు రాళ్ళుపట్టుకుని కొడతారు ’’ అని ఉద్యోగులను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు రాళ్ళతో కొట్టే స్థాయిలో ఉద్యోగులు పనిచేస్తుంటే ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసినట్లు ఎలా అవుతుంది? ప్రభుత్వ యంత్రాంగం పనిచేయకుండా ఒక్క ముఖ్యమంత్రే ఉరుకులు పరుగులు తీసినంతమాత్రాన పనిజరుగుతుందా?

ఆఖరికి ఉద్యోగులు సమయానికి రాకపోతే పోలీసులను పంపించి వారిని తీసుకొస్తామంటున్నారు. కానీ ఇంతచేతకానివారిగా చంద్రబాబు పాలనలో ఎందుకు తయారయ్యారు. పోలీసులను పంపించి అరెస్టు చేసి అధికారులను తీసుకురావచ్చేమో కానీ వారిని పనిచేయిండం పోలీసులు తరం అవుతుందా? ఒక వేళ పోలీసులే సరిగా పనిచేయకపోతే ? చంద్రబాబు మోడీ సాయంతో మిలటరీనీ రప్పించి పోలీసులను పిలిపిస్తారా?

48 గంటలలో విద్యుత్తును పునరుద్ధరించాం అంటున్నారు చంద్రబాబు అదే సమయంలో విద్యుత్ సిబ్బంది పనిచేయలేదంటున్నారు. నీటి సరఫరాను సమర్ధవంతంగా పునరుద్ధరించాం మున్సిఫల్ సిబ్బంది పనిచేయడం లేదు. టెలికాం సేవలు అతి తక్కువ సమయంలోనే మొదలయ్యాయి టెలికాం ఆపరేటర్లు కదలడం లేదు. పాలు కూరగాయలూ భారీగా తుఫాను పీడిత ప్రాంతాల్లో డంప్ చేసాం రెవిన్యూ సిబ్బందిలో కదలిక లేదు. మరి ఇవ్వన్నీ ఎవరు చేసినట్లు? చంద్రబాబే వేల అవతారాలెత్తి తానే సర్వాంతర్యామి యై చకచకా పనులు చక్కబెట్టాడా? 
Reactions:

Post a Comment

 1. అటు చంద్రబాబు యిటు మనమూ కూడా అతిగా స్పందిస్తున్నామేమో?
  మొత్తం మీద ప్రభుత్వం కార్యకలాపాలు సంతృప్తికరంగా నిర్వహించటం ఒక సంగతి.
  ఉద్యోగుల పనితీరు ఆశించిన స్థాయిలో ఉండటం వేరొక సంగతి.

  ఉద్యోగుల తాను పనితీరు ఆశించిన స్థాయిలో ఉన్నట్లైతే ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని ముఖ్యమంత్రిగారి అభిప్రాయం కావచ్చును కదా?

  ఉద్యోగుల పనితీరు తాను ఆశించిన స్థాయిని అందుకోలేక పోయినా మొత్తం మీద ప్రభుత్వం యొక్క పనితీరు కూడా తాను ఆశించినంతగా కాకపోయినా తగినంత సమర్థంగానే ఉందనీ ముఖ్యమంత్రి భావించవచ్చుకదా?


  ప్రమాణాలు అందుకోలేక పోయిన ఉద్యోగులను ఉద్దేశించి అలసత్వం చూపుతూ పనిచేస్తే రభుత్వం యొక్క పనితీరు క్రమంగా దిగజారి ప్రజల అసహనానికి దారితీస్తుందని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించటం జరిగిందని అనుకోవచ్చు కదా?

  వ్యంగ్యవిమర్శనోత్సాహం ప్రక్కన బెడితే ముఖ్యమంత్రి ఉరుకులూ పరుగుల పరిస్థితికి ప్రస్తుత రాష్ట్రవిపత్తు ఎంతకారణమో దానికి తగినట్లుగా ఉద్యోగయంత్రాంగంలో కదలిక లేకపోవటాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారనుకోవచ్చు కదా?

  ముఖ్యమంత్రి ప్రధానితో‌ మాట్లాడవలసి వస్తే చుట్టూ ఉన్న మనుష్యులకు దూరంగా పరుగెత్తి మరీ మాట్లాడి తీరాలా? ప్రస్తుత పరిస్థితిలో తన ఛాంబర్‌లో, ఏసీలో కూర్చుని కాని మాట్లాడకూదదని విమర్శకుల ఉద్దేశమా?

  రంధ్రాన్వేషణచేస్తూ వాదించుకోవటాలూ తప్పుబట్టటాలూ పెడర్ధాలు తీయటాలూ ఇవేనే చేయవలసిన పనులు?

  ఒక ముఖ్యమంత్రి ఏమి మాట్లాడినా అందులో దురర్ధాలు వెదుకుతారు.
  మరొక ముఖ్యమంత్రి ఏమి చేసినా అందులో తప్పులు వెదుకుతారు.
  తప్పులు వెదికేవారిని తప్పించుకొని పనిచేయటం ఎవరికైనా దుస్సాధ్యం. అందులోనూ అదేపని మీద బోలెడు మంది రంద్రాన్వేషకులు అహర్నిశలూ పనిచేస్తున్నప్పుడు నిజంగా అసాధ్యం.

  ఇలాంటి చర్చల వలనే రాజకీయచర్చలమీద వెగటు పుడుతున్నది.

  ReplyDelete
  Replies
  1. >>> ముఖ్యమంత్రి ఉరుకులూ పరుగుల పరిస్థితికి ప్రస్తుత రాష్ట్రవిపత్తు ఎంతకారణమో దానికి తగినట్లుగా ఉద్యోగయంత్రాంగంలో కదలిక లేకపోవటాన్ని

   ఫేస్‌బుక్‌లో ఒక ఆంధ్ర పౌరుడి కామేంటు:

   ఐఎండి (ఇండియన్ మిటిరియలాజికల్ డిపార్టమెంట్) హడూడ్ తుఫానుని అక్టోబర్ 7న ప్రకటిస్తూ ఉత్తరాంధ్ర, వైజాగుకి ముప్పని తెలిపింది. ఐఎండి అక్టోబర్ 8, 9, 10, మరియు 11లలో తీవ్రతను పెంచుకుంటూ హెచ్చరికలను జారీ చేసింది! ఆరోజుల్లో విజన్ నాయుడు గారు జన్మభూమి, తెరాసతో జగడం, బస్ యాత్ర, లీగలుగా కొన్న సరస్వతి భూములను రాజకీయం చేయడం లాంటి బృహత్తర కార్యక్రమాల్లో ఉన్నారే గాని హడూడ్ తుఫాను ఎలా ఎదుర్కోవాలనే విషయం గురించి అధికారులతో ఒక్కటంటే ఒక్కటి కూడా మీటింగ్ పెట్టలేదు! 12 అక్టోబర్ పరిస్థితి కొంచెం అర్ధమైంది అందరిలాగానే! 13 అక్టోబర్ నాడు వైజాగ్ చేరుకుని చూస్తే ఏముంది బాధితులకి నీల్లు లేక రోగిస్టులమవుతామని తెలిసీ సముద్రపు నీరు తాగడం, ఆకలితో అలమటించడం లాంటివి చేస్తున్నారు! ఒక్కటంటే ఒక్కటి కూడా ముందు జాగ్రత్త చర్య తీసుకోలేదు కాని పచ్చ మీడియా, నిత్యకల్యాణం పచ్చతోరణం పవనకల్యాణం ఆహో వోహో నాయుడిగారి విజన్ చూడండి ఈయన ఈ ప్రపంచంలో పుట్టడమే మానవజాతి అదృష్టం అంటూ భజన! అలా మనం ముందుకు పోతున్నాం!

   ముందస్తు సమాచారం ఉన్నా ఈయన నాలుగురోజులు గాఢనిద్రలో ఉండి, లేదా పక్కవారి మీద పుల్లలు పెట్టడంలో బిజీగా వుండి ఇప్పుడూ మేలుకుని ఉరుకులాడితే పరిస్థితులు చక్కబడతాయా?

   7వ తేదీన హెచ్చరిక వస్తే ముఖ్యమంత్రిగా 12వ తేదీ వరకు ఈయన ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేశాడు? తుఫానుపై సంసిద్ధతకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడు? 200 కిలోమీటర్ల స్పీడుతో గాలులు వీస్తే స్థంభాలు కూలుతాయని తెలియదా? మంచినీటికి, కూరగాయలకు, నిత్యావసరాలకు ఇబ్బంది అవుతుందని ఎందుకు తెలియలేదు? సమీక్షలు జరిపితే గదా తెలిసేది?

   తుఫాను తీరం చేరుతున్న దశలో ఎవరైనా ప్రెస్‌మీట్లతో కాలం గడుపుతారా? ఒక్క చంద్రబాబు తప్ప? చివరికి హెలికాప్టరులో బయలుదేరే సమయంలోనూ NDTV వారు రాగానే ప్రయాణం రెండు గంటలు వాయిదా వేసి మరీ ఇంటర్వూ ఇచ్చిన ప్రచార కండూతి ఆయనది.

   >>> ముఖ్యమంత్రి ప్రధానితో‌ మాట్లాడవలసి వస్తే చుట్టూ ఉన్న మనుష్యులకు దూరంగా పరుగెత్తి మరీ మాట్లాడి తీరాలా?

   తీరాలని ఏమీ లేదు. ప్రధాని తో అకస్మాత్తుగా మాట్లాడరు. ముందుగా అడిగితేనే అపాయింట్‌మెంట్ వస్తుంది. దాన్ని ప్రెస్‌మీట్‌కి ముందో తర్వాతో అడ్జస్టు చేసుకోవచ్చు. ఇలా మధ్యలో మాట్లాడడ్డం కూడా ప్రచారకండూతిలో భాగమే. ప్రధానితో మాట్లాడడానికి పక్కకు వెళితే ప్రెస్ వాళ్ళు అభ్యంతరం ఏమీ చెప్పరు కదా?

   కూసే గాడిదకు మోసే గాడిద లోకువని... నాలుగురోజులు మొద్దు నిద్దర పోయి, అధికారులను ఉన్నపళంగా అన్నీ సరిచేయమని అంటే మాటలా? అవి ఒక్క రోజులో అయ్యే పనులేనా? అలా అలవికాని పనులు చెయ్యబోతే మరిన్ని ప్రమాదాలు కలుగవా? కూలిన సెల్ టవర్లు ఒక్కరోజులో నిలబెట్టడం సాధ్యమా?

   చూ: http://www.ndtv.com/article/india/chief-minister-chandrababu-naidu-loses-cool-with-telecom-executives-607799

   >>> ఇలాంటి చర్చల వలనే రాజకీయచర్చలమీద వెగటు పుడుతున్నది.

   అవున్లెండి, మనమేమో అర్థ శతాబ్దం కింది వీడియోను పట్టుకొచ్చి ఈరోజు జరిగినట్టుగా, కొంపలు మునిగిపోయినట్టుగా, దేశ సార్వభౌవంత్వానికి గొడ్డలి పడ్డట్టుగా చర్చలు పెట్టొచ్చు. ఇతరులు మాత్రం జరుగుతున్న వాస్తవాలపై ససాక్ష్యంగా చర్చకు దిగితే అది "వెగటు"గానే అనిపిస్తుంది మరి!

   Delete
  2. శ్రీకాంత్ చారి అన్నా, మీ పైన చెప్పిన లాజిక్లు అన్ని కచర విషయంలో అయి ఉంటె కరెక్టు అయితాయి కాని చెంబు విషయంలో కరెక్టు కావు, అది సృష్టి నియమానికే విరుద్దం అన్నా. ఆ తుఫాన్ ఎదో తెలంగాణాలో వచ్చుంటే ఇవన్ని లాజిక్లు వాళ్ళే చెప్పెటోల్లు కదన్నా

   Delete
 2. కనకపు సింహాసనమున
  శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
  దొనరగ బట్టము గట్టిన
  వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ

  బంగారు తెలంగాణ వొచ్చేసినా ఈ ఆంధ్రా మీద పడి ఏడుపులేందో!!

  ReplyDelete
  Replies
  1. @అచంగ/அசங்க/Achamga

   మీవాళ్ళు తెలంగాణాపై ఏడ్చే ఎడ్పులకన్నా ఎక్కువేమీ కాదు లెండి. అన్నట్టు మీరు పద్యరూపంలో ఇచ్చిన జవాబు ప్రశ్నకు సరిగ్గా సరిపోయిందండీ!

   Delete
  2. శ్రీకాంత్ చారిగారూ,
   అటూ ఇటూ కూడా ఈ విషయం నిజమే. అంతా చూచే దృష్టిని బట్టి ఉంటుంది.

   Delete
 3. శ్రీకాత్ చారి గారూ,
  తప్పు లేకుండా తిదితే యెవరూ సహించరు,అది తెలుసునా , కేవలం వుద్యోగుల్నే కాదు టెలికాం పెద్దల్ని కూడా తిట్టాడు.పాయింటు వుంది.మామూలప్పుదు పజల నుంచి ఆ ఆప్షన్ అనీ ఈ ఆప్షన్ అని సంపాదించుకుంటున్నారు,ఇప్ప్పుడు మీరు కొంచె ఫాస్టుగా కదిలితే బాగుండేది అని.వాళ్ళు కూడా బయటి కొచ్చి నిజమే, ఆయన అంచనాలను అందుకోలేక పోయాం అని వొప్పుకున్నారు!

  ReplyDelete
 4. శ్రీకాంత్ ఛారిగారూ మీ సుభాషితాల్లో మఃచ్చుకు కొన్నింటికే జవాబిస్తున్నాను.

  1.ఫేస్‌బుక్‌లో ఒక ఆంధ్ర పౌరుడి కామేంటు:
  2.ఒక్కటి కూడా ముందు జాగ్రత్త చర్య తీసుకోలేదు
  3.ప్రచార కండూతి ఆయనది
  4.ప్రధాని తో అకస్మాత్తుగా మాట్లాడరు. ముందుగా అడిగితేనే అపాయింట్‌మెంట్ వస్తుంది.

  నా అభిప్రాయాలుః
  1. భారతపౌరులే కాని రాష్ట్రస్థాయిలో పౌరసత్వాలు ఉండవు.
  2. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం వలననే ప్రాణనష్టాన్ని నివారించగలిగారు పెద్దయెత్తున జరక్కుండా.
  3. బాబుగారిది ప్రచారకండూతి అనటం మీ అభిప్రాయాన్నైతే ప్రతిఫలిస్తున్నది కాని అది వాస్తవమా కాదా అన్నది జనం నిర్ణయిస్తారు. మరలా జనం అంటే ప్రతిపార్టివారూ కెమేరాలముందుకు లాగుకొని వస్తే డబ్బుపుచ్చుకొని చెప్పే మనుషులు మాత్రమే కానక్కరలేదు.
  4. విపత్కర పరిస్థితుల్లో కొద్ది రోజుల ముందే అప్పాయింట్‍మెంట్ ఉండాలని ఏ దేశాధినేతా పట్టుబడతాడనుకోను..

  ఇంకా చర్చపేరుతో అభిప్రాయబేధాల కొట్లాట అనే రాగం-తానం-పల్లవి కార్యక్రమంలో పాల్గొనటానికి నాకు ఓపికా తీరికా లేవు. అందుకు నన్ను మన్నించండి.

  ReplyDelete
  Replies
  1. >>> 1. భారతపౌరులే కాని రాష్ట్రస్థాయిలో పౌరసత్వాలు ఉండవు.

   పౌరుఁడు
   పౌరుఁడు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
   n.
   a citizen, townsman, burgher.

   పౌరుడు అన్న పదం కేవలం పౌరసత్వం contextలోనే కాక అనేక విధాలుగా వాడొచ్చు. ఉదా: రేపటి పౌరులు, రాష్ట్ర పౌరులు, సాధారణ పౌరులు. అనగా రేపు కాబోయే దేశ పౌరులు, రాష్ట్రమునకు చెందిన దేశ పౌరులు, సాధారణమైన దేశ పౌరులు అని అర్థం చేసుకోవాలి.

   >>> 2. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం వలననే

   అది సదరు ఆంధ్ర పౌరుడి (సారీ, పురజనుడి) వ్యాఖ్య లెండి, ఒకటి రెండు తీసుకునే వుంటారు.


   >>> 3. బాబుగారిది ప్రచారకండూతి అనటం మీ అభిప్రాయాన్నైతే ప్రతిఫలిస్తున్నది కాని అది వాస్తవమా కాదా అన్నది జనం నిర్ణయిస్తారు.

   అలా నిర్ణయించిన ఒక జనుడి కామెంటునే విన్నవించడం జరిగింది. మిగతా వారి సంగతి నాకు తెలియదు.

   >>> 4. విపత్కర పరిస్థితుల్లో కొద్ది రోజుల ముందే అప్పాయింట్‍మెంట్ ఉండాలని ఏ దేశాధినేతా పట్టుబడతాడనుకోను.

   సరేలెండి.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top