అంశం : ఆరోగ్యం,హోమియోపతి
ప్రశ్నిస్తున్నవారు : Marxist Leninist.


చాలా మంది ఆయుర్వేదాన్ని నాటు వైద్యం అనుకుంటారు. కానీ ఆయుర్వేద మందులన్నీ నాటు మందులు కావు. ఆయుర్వేద మందుల్ని మొక్కల నుంచి తీసిన పదార్థాలతో తయారు చేస్తే అల్లోపతి మందుల్ని వివిధ పద్దతుల్లో సేకరించిన రసాయనాలతో తయారు చేస్తారు. ఆయుర్వేదం, అల్లోపతి రెండూ శాస్త్రీయమే కానీ హోమియోపతి మీదే అనేక అనుమానాలు ఉన్నాయి. హోమియో మందులు తయారు చేసేవాళ్ళు నిజమైన మందులనే నీళ్ళలోనో, ఆల్కహాల్లోనో dilute చేసి వాటి మోతాదు తగ్గిస్తారు. మందు యొక్క మోతాదు తగ్గడం వల్ల రోగం ఆలస్యంగా తగ్గుతుంది. రోగం ఆలస్యంగానైనా తగ్గుతుందని చెప్పి హోమియో వైద్యులు రోగుల్ని ఎటూ వెళ్ళిపోకుండా చేస్తారు. అల్లోపతి, ఆయుర్వేద మందుల వల్ల రోగం తొందరగా తగ్గుతుంది. అటువంటప్పుడు హోమియోపతిని నమ్ముకోవడం అవసరమా? హోమియోపతి వల్ల side effects ఉండవని అంటారు. హోమియో మందులోనే మందు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది కనుక దాని వల్ల రోగం తగ్గడమే కష్టం. రోగం తగ్గించలేనిది side effectని కూడా కలిగించలేదు. హోమియో మందులు ఎంత వరకు పని చేస్తాయో తెలియాలంటే ఈ లింక్ చదవండి
Reactions:

Post a Comment

 1. మీ దృష్టిలో నాటు వైద్యం అంటే ఏమిటి? హోమియోపతి నాటు వైద్యం ఎలా అవుతుంది?

  ReplyDelete
 2. రోగ నిరోధక శక్తిని కొంచెం పెంచితే రోగం తగ్గుతుందని హోమియోపతిని కనిపెట్టినవాడే అన్నాడు. రోగ నిరోధకశక్తి అందరిలో ఒకేలా ఉండదు. అది ఆహారపు అలవాట్లు & వాతావరణం బట్టి ఉంటుంది. కేవలం రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల రోగం తగ్గుతుందని చెపితే అల్లోపతి & ఆయుర్వేద వైద్యులు ఎవరూ నమ్మరు. ఒక నాటువైద్యుడు 26 రోగాలకి ఒకే మందు ఇస్తే అతన్ని నమ్మరు కానీ ల్యాబ్ పరీక్షల్లో మందే దొరకని రకం మందుని హోమియో వైద్యుడు ఇస్తే మాత్రం అది తీసుకుంటారు.

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్ గారు,

   ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు. రోగం ఎందుకు వస్తుంది? రోగానికి ఏ వైద్యం చేయాలి? రోగి శరీర తత్వం ఎలాంటిది? ఏ రోగానికి ఏ వైద్యం చేయాలి? ఇలాంటివి లోతైన అంశాలు. అందరికీ అవగాహన కల్పించాల్సిన అంశాలు. ఎవరు పడితే వారు , ఏది పడితే అది వ్రాసి, వాదిస్తే అంతగా ఫలితం ఉండదు. జనాలను కంఫ్యూజ్ చేయడానికి పనికి వస్తాయీ వాదనలు తప్ప ఏ వైద్యం ఎలా మంచిదో చెప్పాల్సినది సమాజ హితం లక్ష్యంగా ఉన్న నిపుణులు మాత్రమే. నేనిక్కడ సమాజ హితం కలిగిన అని ఎందుకు అన్నానంటే ప్రతి వైద్య విధానమూ మంచిదే. ఇతర వైద్య విధానాలలో ఉన్న మంచిని అంగీకరించే బుద్ధి ,ధైర్యం డాక్టర్లకు అందరికీ ఉండదు.

   జీవన విధానం వేరు. వైద్య విధానం వేరు. జీవన విధానం సరిగా ఉండే సంస్కృతీ-సాంప్రదాయాలను మనం ప్రోత్సహిస్తే 99% రోగాలు దరి చేరవు. ప్రతి వైద్య విధానం ఓ సూత్రం పై ఆధారపడి ఉంటుంది. అన్నింటికంటే అల్లోపతి ఎక్కువగా జనానికి ఉపయోగపడుతున్నప్పటికీ అవసరానికి మించి ఇంకా చెప్పాలంటే వ్యాపారంగా సాగుతున్న మందుల వాడకం వల్ల అల్లోపతి వైద్యంపై అపనమ్మకం ఏర్పడుతున్నది. దీనిని ఆసరాగా చేసుకుని మిగతా వైద్య విధానాలను ప్రచారం చేసుకుంటూ వారు సైతం సొమ్ము చేసుకుంటున్న మాటా వాస్తవం. ఇంకో కోణంలో ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు అంటే బాగుంటుందేమో!

   మన సంస్కృతిలో యోగాకు ప్రాధాన్యం ఉన్నది. దీనివల్ల ఫలితం లేదంటూ ఎద్దేవా చేస్తూ మన బ్లాగర్లలో ఆర్టికల్స్ వ్రాసిన వారిని చూశాను. అల్లోపతి వైద్యుడికి వారి పాఠ్యగ్రంధాలలో వ్రాసినది లేదా బట్టీ పట్టింది మాత్రమే తెలుస్తుంది. వారి రంగానికి సంబంధంలేనివాటిపై పిచ్చి కామెంట్లు చేయడం మంచిదా? అది శాస్త్రీయమా? కానే కాదు. అతివాదం వేరు శాస్త్రీయ వాదన వేరు.

   అన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలిగితే మంచిది. కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేనంత మాత్రాన ఆచరణలో ఫలితం వస్తున్న అంశాలను గుడ్డిగా త్రోసిపుచ్చడమూ సరి కాదు. ఆ ఫలితాలు ఎలా వస్తున్నాయో తేల్చగలిగే కెపాసిటీ సైన్స్ కు అందలేదని చెప్పాలి. మూఢనమ్మకం వేరు ఆచరణలో ఫలితాలు రావడం వేరు. ఉదాహరణకు మన యోగాకు ఈమధ్యనే ఐక్యరాజ్యసమితి గుర్తింపు వచ్చింది. చైనా సాంప్రదాయ వైద్య విధానం అయిన ఆక్యుపంచర్ కొన్ని రోగాలు అద్భుతంగా పని చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ తెరపీ గా గుర్తించినా మన దేశంలో సరైన ఆదరణ లేదు. మన వైద్య విధానం అయిన ఆయుర్వేదం కు కూడా మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి.

   హోమియోపతిపై భిన్నాభిప్రాయాలున్నమాట ఎంత నిజమో చాలా రోగాలకు మంచి ఫలితాలుంటున్నమాటా అంతే నిజం. ప్రతి వైద్య విధానంలోని మంచిని సమాజపరం చేసే వ్యవస్థ ఏర్పడేవరకూ కార్పొరేట్ హాస్పిటళ్ల మాయలో జనానికి ఏది నిజమో, ఏది అబద్దమో అనే సంశయం తప్పదు. ప్రభుత్వ పరంగా వీటిపై సరయిన అవగాహనా కార్యక్రమాలు కలిపించాలి.

   Delete
  2. అల్లోపతి ఎలా పని చేస్తుందో, ఆయుర్వేదం కూడా అలాగే పని చేస్తుంది. మందుల తయారీ పద్దతిలోనే ఆ రెంటి మధ్య తేడా ఉంటుంది. హోమియోపతి మాత్రం నాటువైద్యంతో సమానమే. మందుని నీళ్ళు, ఆల్కహాల్, చక్కెర మిశ్రమాల్లో dilute చెయ్యడం ఇంటిలో కూడా చేసుకోవచ్చు. అది పుస్తకాలు చదివి నేర్చుకున్న చిట్కా వైద్యంతో సమానం.

   Delete
 3. http://naprapamcham.blogspot.in/2009/04/blog-post.html?m=1

  ReplyDelete
 4. > రోగ నిరోధకశక్తి అందరిలో ఒకేలా ఉండదు. అది ఆహారపు అలవాట్లు & వాతావరణం బట్టి ఉంటుంది

  నిజం. అందుకే హోమియోలో ఫలానిరోగానికి ఫలాని మందు అంటూ సాధారణంగా బండగా ఇవ్వరు. రోగి శరీరతత్త్వమూ, జీవనవిధానమూ వగైరావన్నీ‌ బాగాపరిశీలించి రోగికి వ్యక్తిగతంగా సందర్బానుకూలంగా సూచితమైన మందునే ఇస్తారు.

  మీకు వైద్యవిధానాలమీద జనరల్ అవగాహన ఉంటే ఉండవచ్చు కొద్దిగా. ఆ మాత్రానికే లోతుపాతులు తెలియని విషయాలమీద అతిసాహసంగా మాట్లాడటం వలన ప్రయోజనం లేదు.

  పదేపదే ఇదేవేదిక మీద వెలిబుచ్చిన అభిప్రాయం ఒకటి మళ్ళా చెప్పక తప్పదు. విషయచర్చలు చేసేవారికి సదరువిషయం మీద తగినంత పట్టూ అధికారమూ ఉందకపోతే ఆ చర్చల వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ‌ మాటలు కొందరికి రుచించకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు.

  ఇక ఈ‌చర్చలో నేను వ్రాయవలసింది ఏమీ లేదు.

  ReplyDelete
 5. హోమియోపతి వల్ల రోగం ఆలస్యంగా తగ్గుతుందని ఆ మందులు వాడినవాళ్ళందరికీ తెలుసు. రోగం ఆలస్యంగానైనా తగ్గుతుందని చెప్పి రోగులు ఎటూ పోకుండా చూస్తారు హోమియో వైద్యులు. మందుని నీళ్ళు లేదా ఆల్కహాల్‌లో కలిపితే దాని ప్రభావం పెరగడం అసంభవం అని ఫిజిక్స్ చదివిన ప్రతి విద్యార్థికీ తెలుసు. ఆ లెక్కన హోమియో వైద్యులకి కూడా ఈ నిజం తెలిసే ఉంటుంది. లక్షలు ఖర్చుపెట్టి హోమియోపతి చదివిన తరువాత ఆ నిజం ఒప్పుకుని వైద్యం మానేస్తే, కొత్తగా మళ్ళీ అల్లోపతి చదవడానికి డబ్బులు ఉండవు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top