Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:మీ జీవిత భాగస్వామి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే మీరు ఏమి చేస్తారు?  
Message:
మీ జీవిత భాగస్వామి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే మీరు ఏమి చేస్తారు?

మగవాళ్ళని అడిగితే తాము విడాకులు ఇచ్చేస్తామనే సమాధానం వెంటనే వస్తుంది.

ఆడవాళ్ళని అడిగితే కొంత మంది తాము విడాకులు ఇస్తామంటారు, కొంత మంది తాము క్షమిస్తామంటారు.

క్షమాగుణం ఆడవాళ్ళకే గానీ మగవాళ్ళకి అవసరం లేదా?
Reactions:

Post a Comment

 1. అక్రమ సంబంధం అంటే ఏమిటి? సక్రమ సంబంధం అంటే ఏమిటి? ఈ విషయంలో పుచ్చలపల్లి సుందరయ్యగారు వ్రాసిన యువజనులు రాజకీయాలు అనే పుస్తకంలో ఆయన అభిప్రాయాలు చదివాను. సుందరయ్య గారి అభిప్రాయాలు అందులో వ్రాసినవి బాగా గుర్తు లేవు. ఆ పుస్తకం ఇప్పుడు దొరకడం లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి ప్రవీణ్ గారు?

  ReplyDelete
 2. క్షమాగుణం ఆడవాళ్ళకే ఎందుకు అవసరం అవుతుందంటే ఎక్కువశాతం మంది ఆడవాళ్ళు భర్తమీద ఆర్ధికంగా ఆధారపడి ఉంటారు కాబట్టి.

  అదీకాక మగాళ్ళు ఒకరికి ఇద్దరిని maintain చెయ్యడం 'relatively' తప్పుకాదన్న భావం అన్ని సమాజాల్లోనూ ఉంది. కాబట్టే పాతివ్రత్యం దాదాపు అన్నిమతాల్లోను ఒక విలువైకూర్చుంది.

  ReplyDelete
 3. తన్‌హాయీ నవల రెండో సారి చదువుతున్నాను. 160 పేజిలు చదివిన తరువాత నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది. అక్రమ సంబంధాల విషయంలో ఏమి చెయ్యాలో నాకే స్పష్టమైన అభిప్రాయం లేదు.

  ReplyDelete
  Replies
  1. వోల్గా గారి "విముక్త" చదవండి. అందులో సీత, తాటక మరియు అహల్య పాత్రలచేత శక్తివంతమైన సంభాషణలే పలికించారు.

   కొన్ని ప్రశ్నలు : మీకు చలం రచనలు నచ్చుతాయా? నచ్చితే ఎందుకు నచ్చుతాయి? నచ్చకపోతే ఎందుకు నచ్చవు? వ్యక్తికి తనదేహంపైన, దాన్ని ఎవరితో పంచుకోవలనే విషయంపైనా స్వాతంత్ర్యం ఉందని మీరు భావిస్తారా?

   Delete
 4. ప్రవీన్,
  ముందుగా ఇలాంటి ప్రశ్న అడిగినందుకు మీకు అభినందనలు. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్న మగవారిని ఆడవారు క్షమించి పెళ్ళిచేసుకోగా లేనిది, మగవారు మాత్రం ఎందుకు పెళ్ళిచేసుకోరు. మీకు 'చలం' అనే రచయిత గురించి తెలుసా? ఆయన కూడా మీలానే అభ్యుదయవాది. మీ వ్యాఖ్యలు చూస్తుంటే నాకు చలం రాసిన రచనలే గుర్తుకు వస్తున్నాయి. ఆయన ఆలోచనలకు దరిదాపుల్లో, కొన్ని సార్లు ఆయనకన్నా గొప్పగా ఉన్నాయి మీ అభ్యుదయ భావాలు. రంగనాయకమ్మ అనే రచయిత్రి కూడా ఇలాంటి వాటి గురించి రాసినట్టు గుర్తు, వీలైతే మీరు ఒక సారి ఆమె రచనలను కూడా చదవండి. అసలు మీరే ఒక నవల ఎందుకు రాయకూడదు, ఈ విషయం మీద? మీ అభ్యుదయ భావాలు ఇలా వృధాగా పోగూడదు.

  తర తరాలుగా ఆడవారు క్షమిస్తూనే ఉన్నారు, ఇప్పుడు క్షమించి సర్దుకుపోవాల్సిన బాధ్యత మగవారిది. అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆడా మగా ఇద్దరికీ తప్పే అయినా, ప్రస్తుతం సమాజములో స్త్రీపురుషుల సమానత్వం లేదు. బలవంతుడైన పురుషుడు, ఈ పురుషాధిఖ్య సమాజములో స్త్రీపై పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆపెత్తనం పోయేవరకూ స్త్రీకి, పురుషునికీ ఒకే తరహా న్యాయం అమలు చేయలేం. సామాజికంగా బలహీనురాలైన స్త్రీకి అక్రమసంబంధం తప్పు అని చెప్పలేం. కాబట్టి, పురుషులు అక్రమ సంబందాలు పెట్టుకోకుండదు కానీ.. స్త్రీలను అక్రమ సంబందాలు పెట్టుకోకండి అని చెప్పలేం. బలవంతునికీ బలహీనులకీ ఒకే న్యాయం అనడం పురుషాహంకారం తప్ప మరొకటి కాదు.

  ReplyDelete
 5. అసలు అక్రమ సంభంధం అనేదే తప్పు అది ఆడవారైనా మగ వారైనా!
  ఇక క్షమించడం అంటే ఏమిటి? క్షమిస్తే ఆ అక్రమ సంభందం వల్ల వచ్చిన రోగాలు పోతాయా?

  అక్రమ సంభంధం పెట్టుకున్న ఇద్దరినీ ఉరితియ్యాలి!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top