మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------
ఒక దేశ భూభాగం ఇదీ అని నిర్ధారించడమేలా? 
వీలయినంతమేరకు ఇందుకు అనుసరించాల్సిన ప్రాతిపదిక ఏమిటి?

Reactions:

Post a Comment

 1. భారత దేశం అనేది ఒక దేశం కావచ్చేమో కానీ ఒక జాతి మాత్రం కాదు. సింధూ నది తీరాన నివసించేవాళ్ళని పెర్సియన్‌లు హిందూ అనేవాళ్ళు, గ్రీకులు ఆ నది ప్రవహించే ప్రాంతాన్ని ఇందియా అనేవాళ్ళు. అరబ్బీయులు ఇప్పుడు కూడా మన దేశాన్ని "హింద్" అనే అంటారు. స్కూల్ పుస్తకాలలో కూడా మన దేశం పేరుని "హింద్" అనే వ్రాస్తారు.

  ఇందియా ఒక జాతిగా మాత్రం ఎన్నడూ లేదు. ఇందియాలో అనేక కులాలు ఉన్నాయి. ఇవి ఐక్యంగా ఎన్నడూ లేవు. 1857 సిపాయిల తిరుగుబాటు విఫలమైన తరువాత ఆంగ్లేయులకి వ్యతిరేకంగా ఇక్కడివాళ్ళని ఏకం చెయ్యడానికి భారత జాతీయవాదం అని కొందరు, హిందూ జాతీయవాదం అని మరి కొందరూ కొత్తగా కాన్సెప్త్స్ తీసుకొచ్చారు. హిందూ జాతీయవాదం కూడా గతంలో లేదు. ఇప్పుడు కూడా హిందువులలో మతాభిమానం కంటే కులాభిమానం ఎక్కువగా కనిపిస్తుంది. తమకి దేవాలయ ప్రవేశం లేదని దళితులు క్రైస్తవ మతంలోకి మారుతోన్నా అగ్రకులాలవాళ్ళు ఇప్పటికీ దళితులని ఆలయాలలోకి రానివ్వకపోవడానికి కారణం ఇదే.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పేది ఏ దేశానికైనా వర్తించదా? నాకు కావలసిన జవాబు : భూమి దేశాలుగా విభజింపబడిన క్రమం లో ఇప్పుడు ఫలానా ప్రాంతం ఆక్రమణ దురాక్రమణ లాంటివి తెల్చాలంటే ఏ ప్రాతిపదిక సహేతుకం?

   Delete
 2. ఈ శాన్య రాష్ట్రాలు గతంలో ఇందియాలో లేవు. వాటిని ఆంగ్లేయులు ఇందియాలో కలిపారు. భారతీయ, నేపాలీ, పాకిస్తానీ, అఫ్ఘనిస్తానీ భాషలలో retroflex plosives (ట, డ, ణ) ఉంటాయి కానీ అస్సామీ భాషలో అవి ఉండవు. అస్సాం ప్రాంతానికి గతంలో భారత దేశంతో పెద్దగా సంపర్కం ఉండేది కాదు అనడానికి ఇది కూడా ఒక ఋజువు.

  ReplyDelete
 3. తెలంగాణా ని ఇండియా ఆక్రమించిందా? తెలంగాణా భూభాగం ఎవరిది? అనేది తేల్చుకునేందుకు సహేతుకంగా ఏది పద్ధతి అనేదానికై ఈ పోస్టు ఉంచాను. శ్యామలీయం గారి పోస్టులో వచ్చిన కొందరి కామెంట్లు ఆలోచింపజేసేదిగానూ, ఈ విషయంలో నాకున్న నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవలసిన అవసరంగానూ అనిపించినందున దీనిని ప్రశ్నగా ఉంచాను.

  ReplyDelete
  Replies
  1. హైదరాబాద్ రాష్ట్ర ప్రజలలో 85% మంది హిందువులే. క్రైస్తవులూ, సిక్కులూ, జైనులూ కూడా అక్కడి మైనారితీలు కనుక అక్కడ ముస్లిం జనాభా 12% దాటలేదు. అందువల్ల హైదరాబాద్‌ని కశ్మీర్‌తో పోల్చలేము. కశ్మీర్ రాజు హిందువు కావడం వల్ల కశ్మీర్‌ని ఇందియాలో కలిపారు. కశ్మీర్‌లో హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూ ప్రాంతం, బౌద్ధులు ఎక్కువగా ఉన్న లద్దఖ్ ప్రాంతం తప్ప మిగితావి పాకిస్తాన్‌కే వెళ్ళాల్సినవి. గతంలో ఆంగ్లేయులు కలిపి పాలించిన రాజ్యాలు ఒకటిగా ఉండాలనే సెంతిమెంత్ తప్ప నిజమైన ఐక్యత ఎక్కడ ఉంది?

   Delete
  2. వేమన చెప్పినట్టు "భూమి నాది అనిన భూమి ఫక్కున నవ్వు", అశాశ్వతమైన మానవుడు శాశ్వతమైన భూమిని నాది నాదే అనుకొంటాడు. దేశం అంటే భౌగోలిక సరిహద్దుల మధ్య ప్రదెశమా లేక దానిలో నివశించే ప్రజలా? ఇది ఎడతెగని చర్చ. పురాణ కాలంలొ మనదేశానికి జంబూద్వీపమని పేరు తరువాత భరత చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని పేరు వచ్చింది.
   ఇక తెలంగాణా చరిత్ర (తెలుగు ప్రజల చరిత్రని) పరిశీలిస్తే 12 నుంచి 14వ శతాబ్దమం వరకు కాకతీయుల పాలనలోను 14 నుండి 15 వ శతాబ్ధం వరకు విజయనగర సామ్ర్రాజ్యంలోను తదుపరి 15 వ శతాబ్ధం నుండి 17వ శతాబ్ధం వరకు కులికుతుబ్ షాహి వంశస్తుల (గోల్కొండ సుల్తానుల) పాలనలోను తదుపరి 17వ శతాబ్ధం మద్యభాగంలో మొఘల్ చక్రవర్తుల ఆధీనంలొనికి వచ్చి వారిచే నియమింపబడిన ప్రతినిధి గా ఆసిఫ్ జాహి అను వానిని (ప్రస్తుతపు ఉబ్జకిస్తాన్ దేశానికి చెందిన వాడు) నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదుతో నియమించటం జరిగింది తదుపరి మొఘలులు బలహీనపడటంతో తనని తాను స్వత్రంత్రునిగా ప్రకటిచుకొని నైజాం పాలకుడిగా 1వ నిజాం మారాడు. నిజాం వంశస్తుల పాలనలోనే 18వ శతాబ్ధపు మద్యభాగంలొ బ్రిటీష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించి సంధి చేసుకొని ఆనాటి నిజాం నవాబ్ బ్రిటిష్ వారి సైన్యాన్ని పొషించటానికి
   వారికి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించి ఇచ్చి,తన రాజ్యం లొని ప్రస్తుత తెలంగాణా ప్రాతంతో పాటు 1956 లో కర్ణాటక, మహరాష్ట్రా లలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆయా రాష్ట్రాలలో కలిపిన ప్రాంతాన్ని మాత్రం తన అధీనంలో ఉంచుకొని కోస్తాంధ్రా (సర్కార్ జిల్లాలు) మరియు రాయలసీమ (దత్త మండలాన్ని) బ్రిటిష్ వారికి ధారాదత్తం చేసేవరకు తెలంగాణ, రాయలసీమ మరియు అంధ్రప్రాంతాలు మూడూ ఇంచుమించు కొద్ది ప్రాంతాలు మినహా కలిసి ఉండేవనేది చారిత్రిక సత్యం. 1956 సంవత్సరం వరకు ఒక 2 శతాబ్ధాలు మాత్రం బ్రిటిష్ వారి కాలంలో వేరు వేరుగా ఉన్నాయి. అలాగే 1956 తరువాత ఆంధ్రప్రదెశ్ ఆవిర్భావం గురించి తెలిసిందే. హైదరాబాదు నగరాన్ని నిర్మించిన గోల్కొండ సుల్తానుల రాజ్యంలో మరియు నైజాం రాజ్యం లొ కూడా సీమాంధ్రలు తెలంగాణ తొ కలసి ఉన్నాయి అంటే హైదరాబద్ నగరం మూడు ప్రాంతాల ప్రజల పన్నులతో నిర్మించబడింది. 1947 లో బ్రిటీష్ వారు తమ ఆధీనంలోని భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు, అంటే అర్థం వారి ఆధీనంలోని
   400 పైచిలుకు సంస్థానాలన్ని భారత యూనియన్ పరమయ్యాయి అంటే బ్రిటిషర్ల సామంత రాజ్యమైన హైదరబాద్ సంస్థానం తో సహా, కాని భారత్ యూనియన్ లో కలపటానికి మొండికేసిన అనాటి నిజాం నవాబ్ పై సైనిక చర్య ద్వారా భారత్ తనలో కలుపుకొంది. ఆనాటి సైనిక చర్యకు తెలంగాణా ప్రజల అమోదం కూడా వుంది. ఓక భౌగోలిక సరి హద్దుల్లో నివసిస్తున్న ప్రజలుగా (పైగా మనదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం) భిన్నత్వం లో ఏకత్వంగా స్రుహుద్భావంగా జీవించాలి. పై చరిత్ర ప్రకారం ఏ రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారని చెప్పగలం? చరిత్రని చరిత్రగా మాత్రమే చూడాలి, వర్తమానంలో జీవించాలి.

   Delete
 4. చారిత్రక విషయాలను చరిత్రకారులు చర్చించినట్లుగా వివరించినట్లుగా పైపై అవగాహనతో బ్లాగుచర్చల్లో వాదనలతో మన్ం చర్చించలేము. సర్వజ్ఞులం అనుకునే వారు ఎందరో ఉంటారు అన్ని చోట్లా. అలాగే నిజంగా సర్వజ్ఞులూ ఉండవచ్చును మనం అనుకోని చోట్లా. విపులాచ పృధ్వీ. వారిని గురించి నేను ప్రస్తావించటం లేదు. సామాన్యరాజకీయ అవగాహనలూ, పత్రికలూ పాఠ్యపుస్తకాలూ, రాజకీయపార్టీలదృకథాలూ రాజకీయమేథావుల వ్యాసాలూ ఆధారంగా ఇంత విస్తృతమైన అంశాన్ని చర్చించటం సరైనది కాదన్నది నా అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కాబట్టి ఇతరులు సీరియస్‌గా చర్చించదలచుకుంటే అందులో నాకు అభ్యంతరం కూదా లేదు.

  ReplyDelete
 5. పాలకులను ఎన్నుకొనేహక్కు పాలితులకే దఖలుపరచడం ప్రజాస్వామ్యపు మౌలిక సూత్రం. ఆ ప్రకారంగా ఏదేశంలో భాగమవ్వాలి అనేది సంస్థానాల్లోని ప్రజలు నిర్ణయించాల్సిన అంశమేగానీ, సంస్థానాధీశులు నిర్ణయించడం ప్రజాస్వామ్యమవ్వదు. ఆప్రకారంగా తెలంగాణ భారత్‌లో అంతర్భాగమవ్వడం సబబే! మిగిలిన సంస్థానాల విషయంలో ఆనాటీ భారత్ సంస్థానాధీశుల అభిప్రాయాన్నే పరిగణలోనికి తీసుకున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలేవీ తలెత్తలేదుకాబట్టి ఆ విలీనాలన్నీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగాయని భావించవచ్చు.

  Having said that, ఈనాటికీకూడా ఎవరైనా ఒక ప్రాంత ప్రజలు తాము వేరేదేశంగా ఉండాలనుకుంటే, వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా వారిని ఆదేశంలోనే పడిఉండమని చెప్పడం 'దేశభక్తి' అవుతుందేమోకానీ ప్రజాస్వామికం అవ్వదు. బెలూసిస్థాన్, తూర్పుపాకిస్థాన్ ఉర్ఫ్ బంగ్లాదేశ్, టిబెట్ ప్రజల స్వాతంత్ర్యకాంక్షలను గుర్తించగల/గుర్తించిన పెద్దమనసులున్న మనం మనదేశంలోని ప్రాంతప్రజల స్వాతంత్ర్య కాంక్షలనుకూడా గుర్తించగలిగేంత పెద్దమనసులున్నవారలమైతే బాగుండేది.

  ReplyDelete
 6. @Iconclast
  బెలూచ్ ప్రజల స్వాతంత్ర్యకాంక్షల మనం ఎప్పుడు, ఏ విధంగా పెద్దమనసుతో గుర్తించాము?

  ReplyDelete
  Replies
  1. అధికారికంగా కాదనుకోండి, పేపర్లలో చదివినప్పుడు బెలూచిస్తాన్‌కి పాకిస్తాన్నుండి స్వాతంత్ర్యంవస్తే బాగుండునని అనుకోవట్లేదూ?(నాకైతే 'అనుకోవట్లేదు' అనిచెప్పిన భారతీయుడు ఇంతవరకూ తారసపడలేదు) మిగతా రెండుదేశలవిషయంలో మాత్రం అధికారికమేనండోయ్!

   Delete
  2. తూర్పుపాకిస్థాన్ ఉర్ఫ్ బంగ్లాదేశ్ వారు వారి దేశాన్ని వదలి మనదేశంలోకి లక్షల సంఖ్యలో రావాటం మొదలైన తరువాత. మహిళల పైన లెక్కలేన్నన్ని అత్యాచారాలు, ప్రజలపైన దౌర్జ్యన్యాలు జరుగుతూంటే వాటిని అరికట్టటం కోసం భారత్ యుద్దం చేయ వలసి వచ్చింది. బంగ్లాదేశ్ ప్రజల స్వేచ్చ, ప్రజల స్వాతంత్ర్యకాంక్షలను కొరకు మాత్రమే యుద్దం చేయలఏదు. అదొక్కటే క్రైటిరియా కాదు.
   ప్రజలకి చాలా కావాలి. పక్క దేశంలో ఎది మంచి గా కనిపిస్తే అది వాడి దేశంలో అప్పటికప్పుడు కష్ట్ట పడకుండా లభించాలి. స్వేచ్చ కావాలి, స్వాతoత్రం కావాలి, డబ్బులు కావాలి, ఆటలో వాడి దేశమే నం1 గా ఉండాలి, ఇటువంటి కోరికలన్ని ప్రభుత్వం తీర్చాలి. ప్రజలకి ఎవి వద్దో చెప్పండి? :)

   Delete
  3. నీజమే! కాందిశీకుల సమస్య, దేశానికి ఇటువైపున పాకిస్థాన్‌ని వదిలించుకొనే ఆలోచన, ఆ తిరుగుబాటుకు సహాయంచేస్తే ఏర్పడబోయే ప్రభుత్వం షేహంగా మెలుగుంతదన్న ఆశ యుధ్ధసహాయానికికారణం. కానీ ప్రపంచవేదికలమీద మనం అధికారికంగా చెప్పుకున్నది మానవీయ కారణాలు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడాలేకానీ అసలైనవికాదుకదా :-)

   Delete
 7. * ప్రపంచవేదికలమీద మనం అధికారికంగా చెప్పుకున్నది మానవీయ కారణాలు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడాలేకానీ అసలైనవికాదుకదా *

  మీరు,ఇంకా కొందరు రాసే కొన్ని వ్యాఖ్యలు గమనించాను, భారత ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ ఈ బ్లాగులో చాలామంది ఆరోపణలు చేస్తుంటారు. ఆ వ్యాఖ్యలు మానవత్వ కోణంలో నుంచి కొందరు, ప్రభుత్వాలకి అధికారాన్ని కాపడుకొనేదుకు చేస్తూంటాయనే ఉద్దేశంలో మరికొందరు విమర్శిస్తుంటారు. వారి దృష్టిలో భారతప్రభుత్వం అంటే సర్వశక్తివంతమైనది. అదనుకొంటే ఎమైనా చేయగలదు. విచక్షణ ఉన్నవాడు ఎవరు అలా ఏకపక్షం గా మాట్లాడడు. అటువంటి వ్యాఖ్యలను పట్టించుకోను.

  1970వ దశాబ్దంలో భారతదేశం దగ్గర ఉన్నదేమిటి? ప్రభుత్వాలు వాళ్లదేశ ప్రజలకే ఉపాధికలిపించటానికి నానా అవాస్థలు పడేరోజులు అవి. పక్క దేశాల నుంచి లక్షల మంది బికారి జనం, ఊహించని విధంగా, ఉన్నపళ్లాన కట్టుబట్టల తో జొరబడుతుంటే వారికి తిండి ఎలా పెట్టాలి? బట్టలు,నివాసం, వైద్యం, రక్షణ ఎలా కల్పించాలి? ఎప్పుడైనా మీరాలోచించారా?

  ఇందిరా గాంధి కనిపించిన ప్రతివారిని ఈ సమస్యను పరిష్కరించమని బ్రతిమాలింది. ఒక్క అగ్ర రాజ్యం ముందుకు రాలేదు. అమేరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే,వాస్తవ పరిస్థితి వివరించి (మహిళలపైన అత్యాచారాలు, ప్రజల పైన దౌర్జ్యాలు) బంగ్లా సమస్యకు పరిష్కారించమని కోరితే, వాడు నోరు కూడా మెదపలేదు. చివరికి ఏ గత్యంతరం లేక ఆమే యుద్దానికి దిగింది. యుద్దం మొదలైన తరువాత అమేరికా వారు మనదేశానికి వ్యతిరేకంగా రంగ ప్రవేశం చేశాడు. వాడిని విజయంవంతంగా రష్యాసహాయం తో నిరోధించ గలిగాం. అది వేరే విషయం.
  అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు అమేరికా,బ్రిటన్,ఇంకా ఎన్నో శక్తివంతమైన ముస్లిం దేశాలు మద్దతు తెలుపుతాయి. మన దేశానికి అటు మత పరంగాను,ఇటు పశ్చిమదేశాల వారు ఎవరు వెనకేసుకు రారు. వారి అవసరముంటే తప్ప. ఇటువంటి విపత్కర పరిస్థితిలో మనదేశం ఇతర దేశాల పై అనవసరంగా యుద్దం చేస్తే అందరూ చూస్తూ గమ్ముగా ఉంటారా? చీల్చి చెండాడుతారు. ఆ రోజుల్లో,ంవారి దృష్టిలో మనదేశం తిండి గింజలకోసం ముష్టేతుకొనేది. మీరేమో భారతదేశం అమెరికా వలె మానవ హక్కులు,ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడి ఇతరదేశాల పై యుద్దంచేస్తుందన్నట్లూంది మీరు రాసిన పాయింట్.
  పాక్ వారు ఎన్ని చెత్త పనులు చేసినా, ఇప్పటికి పాక్ వారికి బ్రిటన్ అండదండలకు కొదవేలేదు.
  Pakistan’s enemy is our enemy: Cameron – The Express Tribune
  http://tummeda.wordpress.com/2014/05/26/pakistans-enemy-is-our-enemy-cameron-the-express-tribune/

  ReplyDelete
 8. *సహాయంచేస్తే ఏర్పడబోయే ప్రభుత్వం షేహంగా మెలుగుంతదన్న *

  మనదేశం బంగ్లాదేశ్ తో స్నేహంగా ఉంటే వచ్చే అదంపు లాభామేమిటి? వారిదగ్గర టెక్నాలజి ఉన్నాదా? పెట్రోల్ ఉన్నాదా? ఇంకా సంపదేమైనా ఉందా? ఎమి లేదు కావాలంటే దుస్తులు కుట్టించి ఇచ్చే శ్రామికులు ఉన్నారు. మనదేశంలో కూడా వారు ఉన్నారు. కవులు కళాకారులు, విప్లవ కవిత్వాలు, నవలలు రాసుకొనే రచయితలు కొందరు, ఆ దేశం లో ఉండి ఉండవచ్చు. వారేమైనా భారత ప్రభుత్వానికి, ప్రజలకి ఉపయోగపడతారా చెప్పండి? :)

  ReplyDelete
 9. No regime is 100% revolutionery but is a spit image of the old guard. Every regime inherits its legitimacy from its predecessors though it is an antagonist of the latter. Likewise the power of the present Govt of India over Indian States was inherited from its immediate predecessor, the British Empire. It is an inheritance not just in conceptual terms but also in physical terms such as the same administrative premises, same norms of day-to-day governance and staff. The question of whether the accession of a particular territory to an empire is democratic or not - I deem the question is irrelevant because, as the collective experience of humanity amply demonstrates, all systems of administration, including democracy, are equally imperialistic, equally colonialistic, equally dictatorial, equally racist and equally war-mongering. Consequent to an accession, public consent to the same will be artificially manufactured over time through state propaganda machinery like educational system and the culture industry approved by it. So, after passage of several decades, we are left to wonder which part of a country is a legitimate one and which is not.

  ReplyDelete
 10. స్వాతంత్రానికి పూర్వం ప్రస్తుత భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు బ్రిటిష్ వారి ప్రాంతాలు. మనకి స్వతంత్రం కావాలని గట్టిగా పోరాడటంతో అందుకు బ్రిటిష్ వారు సమ్మతించారు. అప్పుడు భారత ఉపఖండంలో రెండు రకాల ప్రాంతాలు.

  1. నేరుగా బ్రిటిష్ వారి పాలనలో ఉన్న ప్రాంతాలు (అప్పటి డిల్లి, మద్రాసు మొదలైన ప్రాంతాలు)
  2. బ్రిటిష్ వారి పెత్తనాన్ని ఒప్పుకున్నా సంస్థానాలు (హైదరాబాదు, కాష్మీరు లాంటిసంస్థానాలు)

  భారత ఉప ఖండంకు స్వాతంత్రం ఇవ్వదలచిన బ్రిటిష్ వారు వారి అధికారాలను ఆయా ప్రాంతాలకు బదిలీ చేస్తూ వారి చట్ట సభలో Indian Independence Act 1947 అనే చట్టం చేసారు. భారత ఉపఖండం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం కాబట్టి మనకు స్వతంత్రం ఇచ్చే చట్టం అక్కడే చెయ్యాలి, కాని భారత పార్లమెంటులో కాదు.

  ఇక్కడ ఒక విషయం గమనించాలి. అమెరికా దేశం తమ స్వతంత్రాన్ని కోరుకొని వారికి వారు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అంటే వారు బ్రిటిష్ వారి చట్టాలను గౌరవించనవసరం లేదు. కాని భారత్ కు బ్రిటిష్ వారు వారి చట్టం ద్వారా మనకు స్వతంత్రం ఇచ్చారు, ఆ చట్టాన్ని మన వారు సమ్మతించారు. అంటే ఆ చట్టాన్ని అంగీకరించారు.

  ఆ చట్టంలో ఉన్న కొన్ని ముఖ్య అంశాలు
  1. నేరుగా బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాలను ఇండియా, పాకిస్తాన్ దేశాలుగా విడదిస్తూ, ఆ రెండు దేశాలకు స్వతంత్రం ప్రకటించారు.
  2. బ్రిటిష్ వారి పెత్తనంలో ఉన్న సంస్థానాలకు కూడా స్వతంత్రం ఇస్తూ వారి భవ్యిశ్యత్తును వారికే వదిలి వేసారు, అంటే వారి ఇస్ట ప్రకారం ఏదొక దేశంలో కలవొచ్చు, స్వతంత్రంగా ఉండొచ్చు.

  దీనిని బట్టి భారత దేశము, పాకిస్తాన్ లతో పాటు హైదరాబాదుతో సహా వందల సంస్థానాలు ఒకే సారి స్వతంత్రం పొందాయి.

  దీనిని బట్టి హైదరాబాదు సంస్థానంపై భారత్ కు ఎలాంటి హక్కు లేదని గమనించాలి.

  1. హైదరాబాదు సంస్థానం ప్రజలు హైదరాబాదు రాజుపై తిరుగుబాటు చేసి, విజయం సాదించి, తరువాత హైదరాబాదును భారత్ లో విలీనం చేస్తే అది ఆక్రమణ కాదు.
  2. తిరుగుబాటు చేసే హైదరాబాదు ప్రజలకు డబ్బు, మిలటరీ లాంటి సహాయాలు చేసి, వారు విజయం సాదించాకా వారి మద్దతుతో హైదరాబాదును ఇండియాలో విలీనం చేస్తే అది ఆక్రమణ కాదు.
  3. లేదా మిగితా సంస్థానాల వలే చర్చల ద్వారా లేదా బేషరత్తుగా హైదరాబాదును హైదరాబాదు ప్రభుత్వం ఇండియాలో కలిపేస్తే అది ఆక్రమణ కాదు.

  ఇవేవి జరగలేదని గమనించాలి. ఇది ఆక్రమనే అనే వాదన మద్దతుకు కొన్ని
  1. 'ఆపరేషన్ పోలో' అనే దానిలో భారత ఆర్మీపాల్గొంది, అయినను దీనిని ఒక 'సైనిక ఆపరేషన్' గా ప్రకటించలేదు. హైదరాబాదులో మత కల్లోలాలు, హిందువుల పై దాడులు మొదలైనవి అరికట్టటానికి చేస్తున్న 'పోలిస్ ఆక్షన్' గా ప్రకటించింది. ఎందుకంటే ఇది 'సైనిక ఆపరేషన్' గా ప్రకటిస్తే 'దురాక్రమణ' గా మనమే ఒప్పుకున్నట్లు. అప్పుడు ఐక్యరాజ్య సమితి కల్పించుకునే అవకాశం ఉంది, అలా జరిగితే అది పూర్తీ స్థాయి యుద్దానికి దారితీసి భారత్ కు నష్టం కలిగించగలదు. అందుకే పోలిస్ యాక్షన్ అని పిలిచారు.
  http://indiatoday.intoday.in/story/hyderabad-indian-army-telangana-police-action-independent-india/1/309167.html

  2. 'పోలిస్ ఆక్షన్' కు ముందు షరుతులతో కూడిన స్వతంత్ర హైదరాబాదు దేశం ఉండటానికి భారత్ హైదరాబాదు ప్రభుత్వంకు ప్రతిపాదించింది. కొన్ని ముఖ్య షరతులు ఏమిటంటే హైదరాబాదుకు సొంత సైన్యం ఉండరాదు, పాకిస్తాన్ తో స్నేహం/విలీనం చెయ్యరాదు ... మొదలైనవి. హైదరాబాదు ప్రభుత్వం ఆ షరతులకు నిరాకరించటంతో ఒప్పందం కాలేదు. దీనిని బట్టి కూడా హైదరాబాదు సంస్థానం భారత్ లోని భుబాగం అని అప్పట్లో భారత్ వాదించలెదని అర్థం చేసుకోవచ్చు.
  http://en.wikipedia.org/wiki/Operation_Polo#Breakdown_of_negotiations

  కొండల రావు గారు, "తెలంగాణా ని ఇండియా ఆక్రమించిందా?" అని మీరు ప్రశ్నించారు , బహుశా మీ ఉద్దేశం "హైదరాబాదును ఇండియా ఆక్రమించిందా' అని ఉండాలి కాబోలు. ఎందుకంటే తెలంగాణా అనే ప్రాంతం అప్పట్లో హైదరాబాదు సంస్థానంలో ఒక భాగం. తెలంగాణతో పాటు మరి కొన్ని ప్రాంతాలను కలిపి హైదరాబాదు సంస్థానంగా పిలిచే వారు.

  ఏ రకంగా చూసినను ఇది ఆక్రమనే. అయితే, దీనిని ఆయా ప్రాంత ప్రజలు వ్యెతిరెకించలేదని గమనించాలి. ఎవరూ వఎతిరేకించని ఈ ఆక్రమణ గురించి ఎందుకు ఇంత రబస చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆక్రమణ అంటే ప్రతి సందర్బంలో తప్పే కానవసరం లేదు కదా.

  ఈ రబసకు జరగటానికి నాకు అనిపించే కారణాలు
  1. తెరాసా లేదా తెలంగాణపై వ్యెతిరేకత
  2. చరిత్రపై అవగాహన లేక పోవటం
  3. దేశంపై వల్లమాలిన ప్రేమ, మన దేశం తప్పులు చెయ్యదు అనే బలమైన నమ్మకం (నేను చెప్పేది పాకిస్తాన్ తో లేదా చైనాతో ఏది జరిగినా ప్రతిసారి మనమే రైటు అనే లాంటి ప్రేమల గురించి)
  4.అతర్లీనంగా నిజాంపై లేదా ముస్లిములపై ఉన్న వ్యెతిరేకత

  ఇది నా అభిప్రాయం. ధన్యవాదములు.

  ReplyDelete
  Replies
  1. కిరణ్ గారూ, మీ సమాధానం బాగుంది.

   ప్రముఖ చరిత్రకారులు నరేంద్ర లూథర్ & కాప్టెన్ పాండురంగారావు (సోల్జర్ స్కాలర్ ఫేం) ఇంకా విపులంగా ఇదే విషయంపై రాసారు. పొత్తూరి వెంకటేశ్వర రావు & తడకమళ్ళ అశోక్ గార్లు కూడా ఈ సబ్జెక్టుపై రాసారు. ఆంధ్రజ్యోతిలో శర్మ అనే ఆయన కూడా రాసినట్టు సమాచారం.

   ముఖ్యంగా కాప్టెన్ పాండురంగారావు చాలా పరిశోధన చేసారు. కుదిరితే ఆయన పీహెచ్డీ థీసిస్ చదవండి.

   Delete
  2. కిరణ్ కుమార్ గారు,

   మీ వివరణతో చాలావరకు ఏకీభవిస్థాను. కొన్ని అభయంతరాలున్నాయి. అయితే వాటిని కూడా నిర్ధారించుకుని మాట్లాడతాను. బ్రిటీషోడి ఏక్టుని అంగీకరించాల్సిన అవసరం భారత్ ప్రజలకు లేదు. నిజాం తన స్వలాభం కోసం బ్రిటీషోడితో రాజీ పడ్డాడు. అలాంటప్పుడు హైదరాబాద్ సంస్థానం భారత్ భూభాగం కాకుండా పోతుందా. అది ఆక్రమణ ఎలా అవుతుంది? స్వాధీనం అవుతుందేమో. చూడాలి - ఈ విషయంపై కూలంకషంగా అధ్యయనం చేయాలి. వీలయితే ఈ పోస్టులన్నీ - కామెంట్లను కలిపి ఓ ఆర్టికల్ వ్రాయాలనుకుంటున్నాను. శ్యామలీయం గారి పొరపాటుని కూడా ఆయనకు మెయిల్ చేశాను. ఆ పోస్టుని కామెంట్లను క్రోడీకరించి పోస్టు వ్రాయమని ఆయనకు చెప్పాను. కొనంచెం ఆడిటింగ్ పనిలో ఉన్నందున తరువాత వ్రాస్తామన్నారు.

   టీ.ఆర్.ఎస్ మీద కోపంతోనే ఈ రగడ జరిగిందనే విషయంలో నేనూ ఏకీభవిస్థాను. ఆ విషయంలో శ్యామలీయం గారు కూడా రియలైజ్ అయ్యారు. నాకు తెలిసి టీ.ఆర్.ఎస్ పై దేశ విచ్చిత్తి దేశ సార్వభౌమాధికారంనే శాసిస్తారా? వంటి అనుమానాలు అనవసరం. కే.సీ.ఆర్ మిగతావారికంటే భిన్నంగా పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణాకోసం ప్రయత్నించారు. ఆంధ్రా ప్రాంతం పై కే.సీ.ఆర్ వ్యాఖ్యానాలపై నాకు పూర్తిగా ఆక్షేపణ ఉన్నది. తెలంగాణావాదులుకు దేశాన్ని విచ్చిన్నం చేయాలనే దురుద్దేశాలు లేవు. అంత ఆందోళన అనవసరం. కానీ వీ. ప్రకాశ్ దురాక్రమణ అనే పదం వాడడం తప్పనే నా అభిప్రాయం. దానిని టీ.ఆర్.ఎస్ తో ముడిపెట్టడం తప్పు. మరో విషయంలో తెరాస ఎంపీ కవిత అలా మాట్లాడినట్లు నేను చూడలేదు. కాశ్మీర్ విషయంలో ఆమె ఏమి వ్యాఖ్యానించిందో నాకు తెలీదు. కాశ్మీర్ - అరుణాచల్ ప్రదేశ్ వంటి వాటిలో చరిత్రను శాస్త్రీయంగా పరిశీలించడానికీ , దేశభక్తి అనే స్వీయమానసిక ధొరణితో మాట్లాడడం వేరు. ఈ విషయంలో iconoclost గారి కామెంట్ బాగుంది. దేశభక్తి అంటే మనదేశం ఏ తప్పు చేసినా సమర్ధించడం కానక్కర్లేదు. అయితే ఇలాంటి సున్నిత అంశాలలో బాధ్యత కలిగిన పదవులలో ఉన్నవారెవరైనా ఆచితూచి మాట్లాడడమే మంచిదని నా అభిప్రాయం.

   తెలంగాణా - ఆంధ్రా ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఎవరు మాట్లాడినా ఖండించాలి. రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు విమర్శించాలి. బాబు, కే.సీ.ఆర్ భజన పరులకు కోపం వచ్చినా ఆ విషయాలలో వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. కానీ ఏకంగా దేశద్రోహులుగా అర్ధం వచ్చేలా తొందరపడి అవసరానికి మించి ఆవేశపడడం కూడా ఇరు ప్రాంతాల మధ్య ఐక్యతకు విఘాతం కలిగిస్తుంది. అలా అనుకున్నప్పుడు టీ.డీ.పీ ఎంపీలు కూడా తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసిన లింకుని శ్రీకాంత్ చారి గారు ఉంచారు. అది భావోద్వేగంలో వచ్చినదిగా చూడాలని శ్రీకాంత్ చెప్పారు. అదొక్కటే కాదు తెలంగాణా వారి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలి. వారి భావోద్వేగాలను ఒకింత ఎక్కువగానే ఓపికగా తీసుకోవాలి వివిధ కారణాల రీత్యా.

   చివరిలో మీరు చెప్పిన 4 కారణాలు బాగున్నాయి. ముస్లిములపై అనేది కొందరికే ఉంటుంది తప్ప అందరికీ కాదు. మిగతా మూడు ఎక్కువమందిలో కామన్ గా ఉంటున్నాయి.

   Delete
  3. పైన కిరణ్ కుమార్ గారి సమాధానంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పైన కొండలరావుగారు బ్రిటీషోడి ఏక్టుని అంగీకరించాల్సిన అవసరం భారత్ ప్రజలకు లేదు అన్నారు. వాడి యాక్టును అంగీకరించి స్వాతంత్ర్యాన్ని పొందుతున్నప్పుడు మిగతా అంశాలు కూడా అంగీకరించడం నైతికత. ఒక వేళ వ్యతిరేకించ దలిస్తే అది కేవలం హైదరాబాదు సంస్థానమే ఎందుకు కావాలి? అవిభక్త పాకిస్థాన్ కూడా మాదే అనవచ్చు కదా? ఎందుకు అనలేదు?

   ఇక్కడ విషయం ఏమిటంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత కుడా భారత ప్రభుత్వం 29 Nov 1947 రోజున నిజాంతో ఒక ఒప్పందం చేసుకుంది. (చూ: Standstill Agreement between India and Hyderabad). ఆ ఒప్పందం లోని ఆర్టికల్-1 ఇలా చెపుతుంది.

   Article 1. Until new agreements in this behalf are made, all agreements and adminitrative arrangements as to the the matter of common concern, including External Affairs, Defence and Communications, which were existing between the Crown and the Nizam immediately before the 15th August 1947 shall, in so far as may be appropriate, continue as between the Dominion of India (or any part thereof) and the Nizam.
   Nothing herein contained shall impose any obligation or confer any right on the Dominion:-

   (i) to send troops to assist the Nizam in the maintenance of internal order.

   (ii) to station troops in Hyderabad territory except in time of war and with the consent of the Nizam which will not be unreasonably withheld, any troops so stationed to be withdrawn from Hyderabad territory within 6 months of the termination of hostilities.


   ఒప్పందం కాలపరిమితి ఒక సంవత్సరంగా వ్రాసుకున్నారు. కాని ఆ ఒప్పందం గడువు కూడా తీరకముందే అంటే సెప్టెంబరు 15వ తేదీ 1948 న భారతదేశం హైదరాబాదుపై దాడి చేసింది. నిజాం సైన్యాలనే కాక, అంతవరకూ నిజాం వ్యతిరేక రైతాంగ పోరాటం సాగిస్తున్న కమ్యూనిస్టులను కూడా అది అణచివేసిన విధానం గనక చూస్తే... భారత ప్రభుత్వం యొక్క ఆరాటం హైదరాబాదుని విముక్తం చేయాలన్నది కాక, కమ్యూనిస్టులకు హైదరాబాదు దక్కకూడదు అన్నదే ముఖ్య ఉద్దేశంగా కనపడుతుంది. దానికి ప్రేరణ ఎవరో ఊహించడం పెద్ద కష్టం కాదు.

   ఇదంతా చరిత్ర. కాని తదనంతరం తెలంగాణ ప్రజలు భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. భారత రాజ్యాంగానికి లోబడే ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడి సాధించుకున్నారు.

   Delete
  4. *ఏ రకంగా చూసినను ఇది ఆక్రమనే. అయితే, దీనిని ఆయా ప్రాంత ప్రజలు వ్యెతిరెకించలేదని గమనించాలి.*

   కిరణ కుమార్ గారు,
   ఒక బలమైన ప్రభుత్వం వేరే దేశాన్ని చుట్టుముట్టి, స్వాధీనం చేసుకొంటే, ఆ ప్రాంత ప్రజలు దానిని వ్యతిరేకించకపోతే, కొంతకాలం తరువాత ఆ ప్రజల వారసులు, చట్టాలలోని నాలుగు మాటలు చూపించి దానిని "ఆక్రమణ" అని తీర్మానిస్తారా? హైదరాబాద్ నవాబు,వారి వారసులు నా రాజ్యాన్ని భారతదేశం వాళ్లు ఆక్రమణ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు. కాని ప్రజలు అనడం, ,పైగా మీవాదనతో కొంతమంది ఏకీభవించటం చాలా విడ్డురంగా ఉంది.ఈ రబసకు జరగటానికి నాకు అనిపించే కార్ణాలు కూడా సహేతుకంగా లేవు.
   To be continued ...

   Delete
  5. శ్రీకాంత్ చారి గారు,
   భారత ప్రభుత్వం యొక్క ఆరాటం ఎందుకో తెలుస్కోండి.
   On April 30, 1948, Indian Army withdrew fully from Hyderabad. After that, Rizvi and the Razakars began to behave licentiously all over the state. Mountbatten had left and Rajaji was the Governor General. Nehru, Rajaji and Patel were all aware of the dangerous situation prevailing in Hyderabad. Patel believed that the army should be sent to put an end to the Nizam’s wantonness. At about that time, the Nizam had sent an emissary to Pakistan and transferred a large sum of money (20 crores)from his Government account in London to Pakistan.

   The situation in Hyderabad worsened day by day. Rajaji wanted to find a solution to the basic issue and also conciliate between Nehru and Patel. He called V P Menon and talked to him. As V P Menon was on his way to Rashtrapati Bhavan for the meeting, an ICS officer named Butch (from the State Home Ministry who had conducted discussions for integration of Travancore and Kochi) stopped him and handed over a letter. It was from the British High Commissioner and protested the rape of seventy year old nuns of a convent two days earlier by Razakars. V P Menon handed over the letter to Rajaji when he reached for the meeting.
   The letter from the British High Commissioner. Nehru read it. His face turned red and veins bulged on his bald head. Anger choked his words. He shot out of his chair, slammed his fist on the table and cried out, ‘Let’s not waste a moment. We’ll teach them a lesson.’
   ______________________________
   Almost before the ink was dry on the Standstill Agreement, the Nizam’s Government issued two ordinances in quick succession.
   The first imposed restrictions on the export of all precious metals from Hyderabad to India. The second declared Indian currency to be not legal tender in the State.
   I wrote to the Government of Hyderabad on 25 December 1947 pointing out that these two ordinances were violations of the Standstill Agreement.

   On top of this, the Government of India received information that the Government of Hyderabad had advanced a loan of Rs 20 Crore to Pakistan in the form of Government of India securities of equivalent value.
   Rajaji immediately told V P Menon, ‘VP, inform the Commander in-Chief to proceed according to the plan’

   To be continued ...

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. India was stated to be very weak and to be incapable of military action now or at any time. All the Muslim countries were friendly to Hyderabad and would not permit any military action to be taken against it. The Hyderabad radio went to the extent of announcing that if there was a war against Hyderabad thousands of Pathans would march into India

   He has categorically stated that if the Indian Dominion comes to Hyderabad it will find nothing but the bones and ashes of the one and a half crores of Hindus.
   Meanwhile Laik Ali was pressing that the Hyderabad issue should be taken to the United Nations Organizations. The American Charge d’Affaires in New Delhi apprised us meanwhile of the fact the Nizam had written to the President of the United States requesting that he should arbitrate and that the latter had refused.
   The Razakars did not spare even missionaries and nuns. Early in September the States Ministry received complaints that some foreign issionaries had been assaulted and some nuns molested by the Razakars.

   SOURCE :
   http://blog.lkadvani.in/blog-in-english/the-%E2%80%98operation-polo%E2%80%99-in-hyderabad

   http://blog.lkadvani.in/blog-in-english/when-vp-menon-cornered-a-british-general

   Delete
  8. కొండల రావు గారు, ఆ కారణాలు వాటి ర్యాంక్ పరంగా ఇచ్చానండి. ముస్లిములపై అనేది కొందరికే ఉంటుంది, నేను ఒప్పుకుంటాను, అందుకే చివరన ఉంది.

   "హైదరాబాద్ సంస్థానం భారత్ భూభాగం కాకుండా పోతుందా" అని అన్నారు. బ్రిటిష్ వారు రాకముందు భారత 'దేశం' ఎక్కడిది? బ్రిటిష్ వారు ఇచ్చిన ప్రాంతాన్నే ప్రస్తుతం భారత దేశం అని అంటున్నాము. నిజాం పాకిస్తాన్ వైపు మొగ్గు చూపి ఉండక పొతే, ఆయన హయాంలో పాలన పై ఆ సంస్థాన ప్రజలకు వ్యెతిరెకత లేనట్లయితే భారత దేశం హైదరాబాదు సంస్థానంపై పోలిస్ ఆక్షన్ లాంటి సైనిక ఆపరేషన్ లు చేసే అవకాశం ఎంతవరకు ఉండేది అంటారు? అటువంటి పరిస్తితులు ఉంటె హైదరాబాదు ప్రత్యెక దేశంగా ఉండే అవకాశం లేదంటారా? ఇలాంటి వాదనే పాకిస్తాన్ కాశ్మీర్ విషయంలో చేస్తే మన వాళ్ళు ఒప్పుకుంటారా? చైనా టిబెట్ విషయంలో చేస్తే ఓప్పుకుంటారా ?

   బ్రిటిష్ వాని ఆక్ట్ ను అంగికరించనవసరం ఉంది-లేదు అనే చర్చను నేను మొదలు పెట్టబోను. కాని భారత్ కు స్వతంత్రం వచ్చినట్లే మిగిలిన సంస్థానాలకు కూడా స్వతంత్రం వచ్చింది అనే సంగతి గుర్తించాలి అని నా భావం. వారి స్వతంత్రాన్ని కూడా గౌరవించాలి అని నా భావం. భారత్ కు ఎన్ని హక్కులు ఉన్నాయో, మిగిలిన సంస్థానాలకు కూడా అన్నే హక్కులు ఉన్నాయని గుర్తించాలని నా భావం. 1990 దశకం వరకు హైదరాబాదు ఆక్రమణ విషయమై ఐక్యరాజ్య సమితిలో కేసు పెండింగ్ ఉండనే విషయం కుడా చాలా మందికి తెలియదు. హైదరాబాదు ప్రజలకు వ్యెతిరెకత లేని ఆక్రమణ కాబట్టి సరిపోయింది, లేదంటి ఇది ఇంకొక కాశ్మీర్ అయ్యేది.

   అవన్నీ పక్కన పెట్టండి, ఏ రకంగా ఇండియాకు హైదరాబాదు సంస్థానంపై హక్కు ఉందని మీరు చెపుతున్నారు? ఆ హక్కులపై భారత దేశం ఆ రోజుల్లో వాదన ఎందుకు జరపలేదు? వీటిని మీరు వివరిస్తే నాకు మీరు ఏమి చెప్పదలుచుకున్నారో అర్థం అయ్యేది.

   ఆక్రమణ అనేది అన్ని సమయాలలో తప్పు కాదు అని నేను ఇంతకూ ముందే చెప్పినాను. మన భారత దేశ పుస్తకాలలో తప్ప మిగితా హెచ్చు చరిత్ర పుస్తకాలలో 'ఆక్రమణ' అనే రాసి ఉన్నారు అనేది గమనించాలి.

   దురాక్రమణ(ఆక్రమణ కాదు), బలవంతంగా లాంటి మాటలు వాడవలసిన అవసరం లేదు. కాని పోలిటీశియాన్ల సంగతి తెలిసిందే. ఇలా దేశంలో రోజు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు, వాటికి బదులుగా ఒకటి రెండు విమర్శలు చేస్తే సరిపోతుంది కాని కక్ష కట్టినట్లు ఇంత రాద్దాంతం అవసరం లేదు.

   Delete
  9. నాకు ఒక వర్క్ ప్లేస్ లో గూగుల్ లాగిన్ పనిచెయ్యదు, అందుకే ఈ మారు పేరు ఉపయోగించాను. :)

   Delete
  10. మొదట్లో గూగుల్ లాగిన్ పని చెయ్యకపోవటం వలన వర్డ్ ప్రెస్ లాగిన్ ఉపయోగించాను. ఈ వర్డుప్రెస్సు ఐడి చాలా రోజుల క్రితం మీ బ్లాగులో ఒకటి రెండు సార్లు ఉపయోగించాను.

   నా ఐడెంటిటి మార్చి రాస్తే నా స్నేహితులు అది నేనేనని తెలియక నన్ను ఏదో అనటం నేను తిరిగి వారిని అనటం జరగకూడదని అవి రెండు నావే అని చెపుతున్నాను. ఇకపై రెండు పేర్లతో వచ్చేవి నావే అని గమనించగలరు.

   Delete
  11. @Kiran Kumar K
   హైదరాబాదుపై మనకు ఎలాంటి అధికారం లేదు అంటున్నారు. మనం చేసిన దాడిని, సైనిక దాడిగా పిలుస్తే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంటుందని భావించారని అంటున్నారు. మరి, మనకు హక్కులేని పరాయి దేశముపై "పోలీస్ చర్య" మాత్రం ఎలా తీసుకుంటారు? దానికి ఏ అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకుంటాయి?? ఇప్పుడు పాకిస్తాను పై మనం పోలీసు చర్య తీసుకోలేం, అక్కడ హిందువులు దాడులకు గురవుతున్నారు అని..!!

   Delete
  12. కిరణ్ కుమార్ గారూ,

   బ్రిటీషు చట్టాలను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది అని మీరు చెప్పిన తరువాత ఆ విషయములో వాదించడానికి ఏమీలేదు. అప్పుడు మనం బానిసలం, ఇది మాక్కావాల్సిందే అని అడిగే పొజిషనులో లేం కాబట్టి, వేరే గత్యంతరం లేక ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి బ్రిటీష్ వాడి చట్టాలకు మనం "కట్టుబడాల్సిన అవసరం లేదు" అని నేను చెప్పిన దానికి కట్టుబడుతూ.. Let us agree to disagree అనడం తప్ప. కానీ, ప్రస్తుతం ఉన్న గొడవకు టీ.ఆర్.ఎస్ లేదా తెలంగాణా పైద్వేషం కారణం అంటే నేను ఒప్పుకోను.

   గొడవ/వాదన మొదలవ్వడానికి కారణం, "మేము భారతీయులం కాము" అన్న మాట. "మమ్మల్ని భారత దేశం ఆక్రమించుకుంది", "మేం అన్నదమ్ములం ఎలా అవుతాం, మేము అన్న దమ్ములం కాము" అన్న మాటలు (వేరే టపాలోని విడియో, క్రితం సవత్సరం దే అయినా). అవే కాక" కాశ్మీర్, హైదరాబాద్ రెండింటికీ సారూప్యం ఉంది (ఇవి ఇప్పుడు కవిత అన్న మాటలు)" అనడం కూడా. మీ వాదన ప్రకారమే హైదరాబాదును భారత దేశం ఆక్రమించుకుంది అనుకున్నా, అది కేవలం నిజాం తరపు వాదన మాత్రమే. హైదరాబాద్ ప్రజలు బ్రిటీషు నుండి స్వాతంత్రం కోసం, మిగిలిన భారతీయులతో కలిసి పోరాడారు. తమను తాము భారతీయులుగానే భావించారు. వారిని భారతీయులందరూ సో-కాల్డ్ అన్నదమ్ములుగానే భావించారు. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏమిటంటే, ప్రజల్లో ఉన్న భారతీయులం అనే భావన బ్రిటీషు వాడి దయ మాత్రం కాదు. అలాంటిది, ఇప్పుడు భారత్ దేశం మమ్మల్ని ఆక్రమించుకుంది, మాకూ ప్రస్తుతం ఉన్న కాశ్మీరుకు పోలిక ఉంది అనడమే కాదు, కాశ్మీర్ విషయములో మన దగ్గరలేని కాశ్మీరు సరిహద్దులను కూడా గుర్తించాలి అనడం. ఇవన్నీ ప్రస్తుతం ఎందుకు? ఏ ఉద్దేశ్యముతో వారు ఇవన్నీ చేస్తున్నారు? కాశ్మీర్ అంశాన్ని పక్కనబెడితే ఇవన్నీ ఒకప్పటి నిజాం వాదనలు, ఆయన ఏలుబడిలోని ప్రజల వాదనలు కాదు. ఒకప్పుటి నిజామును వ్యతిరేకించాం. ఇప్పుడూ వ్యతిరేకిస్తున్నాం. నిజాముకు వత్తాసు పలుకుతున్నట్టుగా మాట్లాడేవారు టీ.ఆర్.ఎస్ వారైనా సరె, ఎం. ఐ. ఎం వారైనా సరే, వ్యతిరేకిస్తాం. ఈ విషయములో తేడా ఉండదు.

   నేను ఇక్కడే కాదు, ప్లస్సుల్లో కూడా చెప్పాను. టీ.ఆర్.ఎస్ అనేది ప్రత్యేక దేశ భావన ఉన్న పార్టీ అనడం తీవ్ర ఆరోపణ అవుతుంది. వారికి ఆ ఉద్దేశ్యం ఉండదు అన్నది. ఇవన్నీ వారు చేయడానికి నాకు తెలిసిన కారణం ఒక్కటే. ప్రస్తుతం హైదరాబాదులో ముస్లిముల ప్రాబల్యం బాగా ఉంది. హైదరాబాదులోనే కాదు, తెలంగాణాలో పలుచోట్ల కూడా అలాంటి ప్రాబల్యమే ఉన్నా... పాతబస్తీలోని కొంత మంది "పెద్దలకు" నిజాం వాసనలు పోలేదు. ఆ "నిజాం" సెంటిమెంటును వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. ఈ ప్రయత్నాలలో భాగంగా ఒకప్పటి ప్రజల "భారతీయతా" భావాన్ని తోసి రాజని, "మేము భారతీయులం కాము" అనడం జరుగుతోంది.

   సీమాంధ్రులతో వచ్చే చిక్కులను తప్పుకోవడానికి "మేము అన్నదమ్ములం ఎలా అయితం" అన్న మాటాలు వాడడం జరిగింది. సో-కాల్డ్ అన్నదమ్ములు కాము అనేదానికి వివరణ, హైదరాబాద్ స్టేట్ అనేది భారత దేశములో లేదు అనుకున్నా మనం నిజాముల దగ్గర, లేదా ఆంగ్లేయుల దగ్గర చరిత్రను ఆపేయాల్సిన అవసరం లేదు. ఇంకాస్త ముందుకు వెల్లొచ్చు. అక్కడ హైదరాబాదుతో సహా ప్రస్తుత సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలు ఒక రాజు ఏలుబడిలో ఉన్నాయి. కాబట్టి, సీమాంధ్రులు సో-కాల్డు అన్నదమ్ములే. అందుకే, ఆ వ్యాఖ్యలను నేను వ్యతిరేకించాను.

   Delete
  13. @Sri kanthJuly 28, 2014 at 8:11 AM , good analysis.

   Delete
  14. *1990 దశకం వరకు హైదరాబాదు ఆక్రమణ విషయమై ఐక్యరాజ్య సమితిలో కేసు పెండింగ్ ఉండనే విషయం కుడా చాలా మందికి తెలియదు.*
   ఉంటే ఎమిటి? ఐక్యరాజ్య సమితి లో ఇతర దేశాల చాలా కేసులు ఉన్నాయి. కేస్ వేయటం అక్కడ ఎదో మనకు మద్దతు లభిస్తుందని అనుకోవటం హాస్యాస్పదం. కాష్మీర్ విషయంలో ఇరుకున పెట్టాలని విశ్వ ప్రయత్నం చేసి పాక్ వారు సాధించింది చివరికి శూన్యం.

   *మన భారత దేశ పుస్తకాలలో తప్ప మిగితా హెచ్చు చరిత్ర పుస్తకాలలో 'ఆక్రమణ' అనే రాసి ఉన్నారు*

   ఇక్కడ చర్చించేవారు దేశ విదేశాలలో ఉంట్టూ, ప్రపంచాన్ని చూసినవారు,అవగాహన ఉన్నవారు. చరిత్రను వక్రీకరిస్తూ పాకిస్తాన్ వారు, విదేశీయులు వారి స్వప్రయోజనాల కోసం భారతదేశానికి వ్యతిరేకంగా రాసుకొంటారనే విషయం తెలియని అమాయకులా? మీరు ఆ విదేశి పుస్తకాలలో 'ఆక్రమణ' రాసి ఉన్నారని కోట్ చేయటంలో అర్థమేమిటి?
   పాకిస్తాన్ టెక్స్ట్ బుక్ లో చరిత్రను వక్రీకరిస్తూ మనదేశానికివ్యతిరేకం గా రాసుకొన్నారు. ఆ దేశం వారు మన గురించి వారి పాఠ్య పుస్తకాలలో రాసుకొన్నారని, ప్రమాణికమైనట్లు కోట్ చేస్తామా? ఆ మాటలను అసలికి పట్టించుకొంటామా?
   http://tribune.com.pk/story/360063/teaching-hate-punjab-textbooks-spreading-bigotry-hate-says-ncjp/

   *కాని కక్ష కట్టినట్లు ఇంత రాద్దాంతం అవసరం *

   కిరణ్ కూమార్ గారు,
   ఇందులో కక్ష ఎమీ లేదు. మీ విజయాల సంబరాలలో, దానిని సాధించిన నాయకుడి మత్తులో మునిగి మీరు ఉండవచ్చు. ఆయన కుటుంబ సభ్యులు చేసే ప్రతిపని మీరు నెత్తిన పెట్టుకోవచ్చు. అందులో తప్పేమిలేదు. అది మీ ఇష్టం. ఆమే ఇచ్చిన స్టేటెమెంట్ మాత్రం ఓవర్ కాంఫిడేన్స్ తో, పెడర్ధాన్ని ధ్వనింపచేసేదే! దానిని ఖండిచకపోగా భారతదేశం తెలంగాణాను ఆక్రమించిందని వాదనకు మద్దతుగా, చాలా డిప్లమాటిక్ గా విదేశిపుస్తకాలలో అలా రాసిఉన్నారని వాదించటం వివేకం ఉన్నవారు చేసేపని మాత్రం కాదు.

   Delete
  15. "మనకు హక్కులేని పరాయి దేశముపై "పోలీస్ చర్య" మాత్రం ఎలా తీసుకుంటారు?"

   మనక హక్కు ఉన ప్రాంతాని స్వాధీనం చేస్కుతున్నాం అని ఎందుకు ప్రకటించలేక పోయారు

   "బ్రిటీషు చట్టాలను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది అని మీరు చెప్పిన తరువాత"

   No, I didn't said that. I said respect others rights too.

   "మేము భారతీయులం కాము" అన్న మాట."

   I have already mentioned, he said 'Before 1948 we are not Indians" which is very true. Anyway I have no wish to defend him or anyone else. This post is about how Hyderabad became part of India. I gave my side History. Anyone can agree/disagree. I gave my independent sources to back my statement.

   I clearly said 'ఆక్రమణ' is not always a bad thing. So I see no point in arguing in this.

   " ఇవన్నీ ప్రస్తుతం ఎందుకు? "
   So that country can move on.

   "సీమాంధ్రులతో వచ్చే చిక్కులను తప్పుకోవడానికి........."
   Unrelated.

   " ఆ "నిజాం" సెంటిమెంటును వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. "
   Totally agree with your point. Still, I see no issue in Kavita's statement. I can try to answer, if you quote false statements from her statements.

   "హైదరాబాద్ ప్రజలు బ్రిటీషు నుండి స్వాతంత్రం కోసం, మిగిలిన భారతీయులతో కలిసి పోరాడారు."
   I don't know about this. I wish to read if you can provided me with few links.


   {Sorry for my bad Telugu and writing in English, I have no good source to type Telugu from this very restricted computer}

   Delete
  16. "పాకిస్తాన్ వారు, విదేశీయులు వారి స్వప్రయోజనాల కోసం భారతదేశానికి వ్యతిరేకంగా రాసుకొంటారనే విషయం తెలియని అమాయకులా?"

   I didn't mention about Pakistan. You can show me your version of history from any of India's friendly country.

   "మీ విజయాల సంబరాలలో, దానిని సాధించిన నాయకుడి మత్తులో మునిగి మీరు ఉండవచ్చు. ఆయన కుటుంబ సభ్యులు చేసే ప్రతిపని మీరు నెత్తిన పెట్టుకోవచ్చు."

   So, you branded me as TRS guy. Thank you.

   "వివేకం ఉన్నవారు చేసేపని మాత్రం కాదు."
   Personal attack? I see no point in continue this debate with you.

   Delete
  17. "టీ.ఆర్.ఎస్ లేదా తెలంగాణా పైద్వేషం కారణం అంటే నేను ఒప్పుకోను"

   నేను 'ద్వేషం' అనలేదండి. 'వ్యేతిరేకత' అన్నాను :)

   "పరాయి దేశముపై "పోలీస్ చర్య" మాత్రం ఎలా తీసుకుంటారు?"

   నేను చదివినదానిని లింకుతో ఇచ్చాను. బహుశా అంతర్జాతీయ వ్యేతిరేకత తీవ్రత తగ్గించటానికి అలా చేసి ఉండొచ్చు. అలా ఎందుకు చేసారు అనేది భారత ప్రభుత్వమే చెప్పాలి.

   " నిజాముకు వత్తాసు పలుకుతున్నట్టుగా మాట్లాడేవారు టీ.ఆర్.ఎస్ వారైనా సరె, ఎం. ఐ. ఎం వారైనా సరే, వ్యతిరేకిస్తాం. ఈ విషయములో తేడా ఉండదు."

   దానితో నాకు పనిలేదు. నేను కేవలం నాకు తెలిసిన చరిత్రను, ఆధారాలను ఇక్కడ పొందు పరచ దళిచాను.

   "నేను ఇక్కడే కాదు, ప్లస్సుల్లో కూడా చెప్పాను."

   అది నేను చదివానండి. ఈ విషయంలో మీ అభిప్రాయమే నా అభిప్రాయం.

   Delete
  18. This comment has been removed by the author.

   Delete
  19. @కిరణ్ కుమార్ కే,

   //మనక హక్కు ఉన ప్రాంతాని స్వాధీనం చేస్కుతున్నాం అని ఎందుకు ప్రకటించలేక పోయారు//
   దీని గురించి తరువాత వివరిస్తాను. రాయాల్సింది ఇంక్ఆ ఉంది.

   --------------------------------------------------------------------
   //"బ్రిటీషు చట్టాలను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది అని మీరు చెప్పిన తరువాత"
   No, I didn't said that. I said respect others rights too.//


   పైన మీరు ఏమి రాశారో ఒకసారి చూడండి...

   బ్రిటిష్ వాని ఆక్ట్ ను అంగికరించనవసరం ఉంది-లేదు అనే చర్చను నేను మొదలు పెట్టబోను. @jalandhar101July 28, 2014 at 4:33 AM
   -----------------------------------------------

   బిర్టీష్ వాడి యాక్టును మనం గౌరవించాల్సిన వసరం లేదు అనే మాటను నేను ఈ పోస్టులోనే కాదు, ఇదివరకూ శ్యామలీయం గారు రాసిన పోస్టులో కూడా ఉంచడం జరిగింది. కొంత మంది, అలా అనుకుంటే.. పాకిస్తాన్ కూడా మనదే అని ఎందుకు అనుకోకూడదు అని అడిగారు. అనుకోవచ్చు, కొంత మంది అనుకునే వాళ్ళు కూడా అప్పుడు ఉండేవారు. పాకిస్తాను మత ప్రాతిపదికన ఏర్పడడం చాలా మందికి ఇష్టం లేదు. మొన్నా మధ్య మార్ఖండేయ కట్జూ (రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్) కూడా పాకిస్తాన్ ఫేక్ కంట్రీ అనేశాడు, అది ఇండియానే అనేశాడు. కానీ, భారత ప్రభుత్వానికి కొన్ని పరిమితులున్నాయి అప్పుడు. మనం అతి శక్తివంతులమేమీకాదు, బానిస స్థాయినుండి స్వయం పరిపాఅలనా స్థాయికి అప్పుడప్పుడే వస్తున్నవారం. Don't bite off more than you can chew అని ఫీలయ్యి ఉండొచ్చు.

   ఇక మిగిలిన వారి హక్కులను కూడా గౌరవించడమనేదే మీ అభిప్రాయం అంట్న్నారు..

   ఆ హక్కులు వారికి రావడానికి కారణం ఆ బ్రిటీషు చట్టమే కదండీ? దాన్ని గౌరవించడమే అవుతుంది. ప్రజాభీష్టం ఏమిటో ఎరిగిన మనవారు Hyderabad వీలైనంత సామరస్యంగానే భారత్ లో విలీనం చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. దేనికైనా వేచి చూసే ధోరణి అనేది ఉంటుంది. హైదరాబాద్ పరిస్థితి చేయి దాటిపోతుంది అనిపించినప్పుడు బలప్రయోగానికి దిగి మరీ స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ విషయములో కూడా అదే ధోరనే కనిపిస్తుంది కానీ అక్కడ పాకిస్తాన్ జోక్యం ఎక్కువవ్వడముతో పరిస్థితి ఇప్పుడు అదుపు తప్పి కాశ్మీరీల పాలిట శాపం లా మారింది.

   //I have already mentioned, he said 'Before 1948 we are not Indians//

   మేము చెబుతున్న అభ్యంతరం, ఇలాంటి టెక్నికలు విషయాలు నిజాం వారసులు మాట్లాడితే అర్థం ఉంది కానీ, భారతీయులుగా భావిస్తున్న వారు, బ్రిటీషునుండి స్వాతంత్రాన్ని కోరుకున్న వారు, భారత దేశములో విలీనాన్ని కాంక్షించి పోరాడిన వారి వారసులు (తెలంగాణా ప్రజలు), మాట్లాడడములో అర్థం ఏమిటి అని? టెక్నికలుగా చూసుకున్నా, హైదరాబాద్ అనేది బ్రిటీషు ఏలుబడిలోనే ఉంది, కానీ దానికి నిజాం ఒక సామంత రాజు అని చెప్పుకోవచ్చు. స్వాతంత్రం తరువాత కొద్ది నెలలు పాటు "బ్రిటీషు చట్టం" ప్రకారం స్వతంత్ర సంస్థానముగా ఉండేదని అనుకున్నా, అందులో కూడా చాలా లొసుగులు ఉన్నాయని గొట్టిముక్కలవారి వ్యాఖ్యల వల్ల తెలుస్తోంది. మరి అలాంటప్పుడు, "నిజాం" దృక్పధాన్ని వ్యతిరేకించిన వారి వారసులు మేము భారతీయులం కాము అనడం ఏమిటి? ప్రస్తుతూం ఉన్న పరిస్థితులలో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప.

   //I clearly said 'ఆక్రమణ' is not always a bad thing. So I see no point in arguing in this.//
   ఇక్కడ మేము మిమ్మల్ని తప్పు పట్టడం లేదండి. ఇంకో విషయం, ఈ టపా కొండల రావు గారు, ఇది వరకే శ్యామలీయం గారు పెట్టిన టపాకు కొనసాగింపే అన్న ఉద్దేశ్యముతో.. ఆటపాలోని విడియోలోని వ్యాఖ్యలను కలిపి సమాధానం ఇవ్వడం జరుగుతోంది. అంతే.

   కానీ, పరిస్థితి ఎలా తయారయ్యింది అంటే.. వారు తెలంగాణా వారు కాబట్టి సీమాంధ్రులు దాడి చేస్తున్నారు అన్నట్లు తయారయ్యింది. ఈ మాటలు అన్నది (కాశ్మీర్ విషయములో) మరెవ్వరైనా దానికి రెస్పాన్సు ఇలానే ఉండేదని మాత్రం చెప్పగలము. ఈ విషయం మీద ఇదివరకే చాలా సార్లు కమ్యూనిస్టులతో కూడా పోరాడడం జరిగింది బ్లాగుల్లోనే.. :-)

   (Continued...)

   Delete
  20. //" ఇవన్నీ ప్రస్తుతం ఎందుకు? "
   So that country can move on. //   మనం ముందుకు వెల్లడం లేదండీ, రాజకీయ ప్రయోజనాల కోసం కొంత మంది సీసాలో బందించి, భూమిలో కప్పెట్టిన భూతాన్ని తవ్వి తీస్తున్నారు. కాశ్మీర్ విషయం ఒక్కటే మాట్లాడి ఉంటే అలానె అనుకుని ఉందే వాల్లం. (నిజానికి కాశ్మీర్ యాదార్థ సరిహద్దులను గుర్తిస్తే సమస్య తగ్గుతుంది అన్నది అమాయకత్వం అని చెప్పొచ్చు. It's completely Naive, అయినా సరే ఆ మాటలు చెప్పొచ్చు). కాశ్మీరుకు, తెలంగాణాకు లింకు పెట్టడం, అదే Contextలో హైదరాబాదును కూడా భారత దేశం ఆక్రమించుకుంది అనే విషయాన్ని ప్రస్తావించడం ... ఇవన్నీ తేనెటీగల తుట్టెను కదిల్చే పనుల్లా ఉన్నాయి తప్పిస్తే మీరు చెప్పినట్టులేవు.

   //"సీమాంధ్రులతో వచ్చే చిక్కులను తప్పుకోవడానికి........."
   Unrelated.//

   శ్యామలీయం గారు ఇదివరకూ .. మేము భారతీయులం కాము అన్నవ్యక్తి విడియో పెట్టి పోస్టేశారు. దానికి కొనసాగింపుగానే ఈ టపా అని భావించి దాన్ని రాయడం జరిగింది.

   //"హైదరాబాద్ ప్రజలు బ్రిటీషు నుండి స్వాతంత్రం కోసం, మిగిలిన భారతీయులతో కలిసి పోరాడారు."
   I don't know about this. I wish to read if you can provided me with few links.//


   తప్పకుండా. మొదటిగా నేను దీన్నే రాసుండుంటే బాగుండేది అనిపిస్తోంది. చాలా విషయాలు క్లియరుగా ఉండేవి. ప్రస్తుతం కాస్త పని ఒత్తిడిలో ఉన్నాను. వీలైతే ఇక్కడే రాస్తాను లేదా నా బ్లాగులోకానీ రాస్తాను. ఒకటి మాత్రం చెప్పగలను. తెలంగాణా వారిలో భారతీయత అనే భావం పైన శ్రీకాంతా చారి ఒక కామెంటులో అన్నట్లు భారత సైన్యాలు ఆక్రమించుకున్న తరువాత రాలేదు. నిజం చెప్పాలి అంటే 1947 లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే ... హైదరాబాదులో త్రివర్ణ పతాకం సుల్తాన్ బజార్ లాంటి చోట్ల రెప రెప లాడింది. నిజాం దాన్ని వ్యతిరేకించినా కూడా ఆగలేదు. మరో కామెంటులో మరింత వివరంగా రాస్తాను. :-)

   Delete
  21. @కొండలరావు గారూ,
   ఈ పోస్టులో నేను రాయాల్సిన కామెంట్లు ఇంకా కొన్నున్నాయి. అప్పుడే త్వరపడి ఒక నిర్ణయానికి రాకండి.. :-)

   Delete
  22. అలాగే శ్రీకాంత్ గారు :)

   Delete
  23. హక్కులను గౌరవించాలి అని మాత్రమె అన్నాను? బ్రిటిష్ వారి గురించి అననే లేదు? మీరు అలా ఎలా అర్థం చేసుకున్నారు?

   బలప్రయోగానికి దిగి మరీ స్వాధీనం చేసుకున్నారు.

   నేను చెప్పేది ఒక్కటే. పోలిస్ ఆక్షన్ కు ముందు హైదరాబాదు పై భారత్ కు హక్కు లేదు. హక్కు లేకుండా వస్తే అది ఆక్రమణనే. పోలిస్ ఆక్షన్ కు ముందు భారత్ కు హైదరాబాదు పై ఎలాంటి హక్కు ఉందొ చెపితే నా అభిప్రాయాన్ని సమిక్షించుకునే అవకాశం నాకు ఉంటుంది. రాచరికంలో రాజ్యం పై రాజుకే హక్కు ఉంటుంది. ప్రస్తుతం రాచరికంలో ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. మొన్న మొన్నటి వరకు నేపాల్ కూడా రాచరికంలోనే ఉంది. ఏ పద్దతి ప్రకారం ఆక్రమణ కాదు అనే విషయంపై ఆల్రెడీ నేను రాసేసాను.

   హైదరాబాదు రాజ్యం బ్రిటిష్ వారికి సామంత రాజ్యం కాని, భారత్ కు కాదు. అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అప్పటి భారత్ కు చట్టాలు చేసింది కాని హైదరాబాదు కు చట్టాలు చెయ్యలేదు. బ్రిటిష్ వారు వారికి నేరుగా ఏలుబడి ఉండే ప్రాంతాలకు భారత్ పాకిస్తాన్ లుగా స్వతంత్రం ఇచ్చారు కాని, వారి ఏలుబడిలో ఉన్న సామంత రాజ్యాలను కూడా తీసేసుకోండి అని చెప్పలేదు. పైగా సామంత రాజుల ఇష్టం అని స్పష్టంగా చెప్పారు.

   టెక్నికలుగా చూసుకున్నా, హైదరాబాద్ అనేది బ్రిటీషు ఏలుబడిలోనే ఉంది,

   మీరన్నట్లు ఆ రోజులల్లో హైదరాబాద్ వారు భారతీయులు అయితే, ఆ రోజుల్లో టెక్నికల్ గా భారతీయులు బ్రిటిష్ వారా? ఈ పోలికే తప్పు.

   నిజాం" దృక్పధాన్ని వ్యతిరేకించిన వారి వారసులు మేము భారతీయులం కాము అనడం ఏమిటి?

   ఆయన అన్న సందర్బం ఏమిటి? ఇది
   యాంకర్ : 1956 అనే దగ్గర ఎందుకు ఆగుతున్నారు? 1920 ఎందుకు అనరు?
   వినోద్ : 1920 కాదు, 1948కు ముందు మాది వేరే దేశం, we are not indians......

   అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎదో ఆయన వాదన వినిపిస్తున్నాడు. దానికి ఇంత రబస అవసరం లేదు.

   కాశ్మీరుకు, తెలంగాణాకు లింకు పెట్టడం,

   ఆమె సంగతి ఏమో కాని నేను కొన్ని పోలికలు చెపుతాను, ఈ పోలికలు ఆ రోజుల్లోనే, ఈ రోజుల్లో వర్తించక పోవచ్చు

   ఈ ప్రాంతాలలో మిగితా ప్రాంతాల వారు భూములు కొనుట నిషిద్దం
   భారత/బ్రిటిష్ చట్టాలపై అవగాహన లేదు
   ఎన్నికలు వగైరాలు తెలియవు
   ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి
   విద్యా విదంగా కూడా వెనకబడి ఉన్నాయి
   ప్రత్యెకమైన స్థానికత చట్టాలు ఉన్నాయి

   తెలంగాణా వారిలో భారతీయత అనే భావం

   నేను టేక్నికల్ గా నిలబడే అంశాలనే ప్రస్తావిస్తున్నాను. హైదరాబాదు జనానికి భారత్ లో కలవాలని లేదని నేను అనటం లేదు. మనసులో ఉండే భావన వేరు, యదార్థం వేరు.


   తెరాసా వారి వాఖ్యలు, భారతీయత లాంటి విషయాలకు పోయి చర్చ పక్క దారి పడుతుంది.

   నేను చెప్పేది ఒక్కటే. పోలిస్ ఆక్షన్ కు ముందు భారత్ కు చట్ట పరంగా హైదరాబాదు పై ఎలాంటి హక్కు లేదు. కాబట్టి హైదరాబాద్ పై పోలిస్ ఆక్షన్ అనేది ఆక్రమనే.

   పై వాఖ్యంతో విభేదించే వారు అందుకు రుజువులు పొందు పరిస్తే నేను నా అభిప్రాయాన్ని మరో సారి విశ్లేసించుకోగలను.

   Delete
  24. కిరణ్ గారూ, నాకున్న అవగాహన పట్టి మీ వ్యాఖ్యలోని కొన్ని అంశాలను విశ్లేసిస్తాను:

   "పోలిస్ ఆక్షన్ కు ముందు హైదరాబాదు పై భారత్ కు హక్కు లేదు": కరెక్ట్

   "హైదరాబాదు రాజ్యం బ్రిటిష్ వారికి సామంత రాజ్యం కాని, భారత్ కు కాదు": కరెక్ట్

   "అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అప్పటి భారత్ కు చట్టాలు చేసింది కాని హైదరాబాదు కు చట్టాలు చెయ్యలేదు": పూర్తిగా కరెక్ట్ కాదు అయితే దీనివల్ల మీ వాదనకు బలానికి పెద్ద నష్టం లేదు

   "బ్రిటిష్ వారు వారికి నేరుగా ఏలుబడి ఉండే ప్రాంతాలకు భారత్ పాకిస్తాన్ లుగా స్వతంత్రం ఇచ్చారు కాని, వారి ఏలుబడిలో ఉన్న సామంత రాజ్యాలను కూడా తీసేసుకోండి అని చెప్పలేదు. పైగా సామంత రాజుల ఇష్టం అని స్పష్టంగా చెప్పారు": కరెక్ట్

   Delete
 11. కిరణ్ కుమార్ గారు,
  మీరు ఇచ్చిన వివరణ బాగుంది గానీ, ఇండియన్‌ యూనియన్‌ పోలీసు చర్యకు కారాణాలేమిటి అనేది స్పష్ట పడితే మీ వివరణ సంపూర్ణంగా వుంటుంది. ఇండియన్‌ యూనియన్‌ చేసినది ఆక్రమణ అంటే కాదనే సమాదానం చెప్పాల్సివుంటుంది. ఎందుకంటే అది ఒక నాటకీయ పరిణామం. అది పూర్తిగా నవాబును లొంగదీసుకోవా టానికి కాదు. అతను సిద్ధమే. రజా కార్లను అణచటం పెద్ద సమస్య కాదు. వారు పూర్తిగా రాజుతో పాటు భూస్వామ్య పెత్తన్‌ దార్ల సైన్యం. వారికి తెలుసు భారత భూభాగంలో ఒక ముస్లీం రాజ్యాన్ని స్తాపించి దాన్ని కొన సాగించటం అంత సులభం కాదని. ఆనాటి రాజకీయ పరిస్తితుల దృష్ట్యా అక్కడ కమ్మ్యునిష్టులు మాత్రమే భారత యూనియన్‌ కు తలనొప్పిగా మారారు. వీరిని ఏమాత్రం విశ్మరించినా కొత్తగా ఏర్పడుతున్నా భారత యూనియన్‌ కు ముప్పు. అందు వల్లనే ఈ పోలీస్‌ యాక్షన్‌ జరిగింది. దీన్ని పూర్తిగా ఆక్రమణ అని చెప్పలేము. అంటె పుచ్చలపల్లి సుందరయ్య లాంటి కమ్యునిష్టు నాయకులు విదేశానికి పోయి ఆ ప్రజలకు నాయకత్వం వహించారా? వారు కూడా జాతియ భావంతోనే అక్కడ పని చేశారు.

  Reply