మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు -  Palla Kondala Rao
అంశం : ఆరోగ్యం, నమ్మకాలు-నిజాలు, ప్రకృతి జీవన విధానం, సైన్స్
----------------------------------------

" సైన్స్ ఓ మూఢనమ్మకంగా మారుతోంది "  ------ మీ కామెంట్!?

" ఇటీవల నేను విజయవాడనుండి ఖమ్మం కు ట్రైన్ లో వస్తున్నప్పుడు నా దగ్గరున్న ఆక్యుపంచర్ బుక్స్ చూసి పక్కన ఒకతను ఈ కోర్సుకు సర్టిఫికెట్లు ఎవరిస్తారన్నాడు. వివరం చెప్పాను. అతని మాటలను బట్టి తెలంగాణావాడనుకుని మీది కరీం నగరా అన్నాను. వరంగల్ అన్నాడు. నేనూ విజయవాడలోనే కుంగుఫూ కోర్సు నేర్చుకుంటున్నాని చెప్పాడు. 
ప్రక్రుతి జీవన విధానం గురించి చాలా విషయాలు చర్చించాడు. హైదరాబాద్ దగ్గరలోని ఆల్వాల్ వద్ద వెంకటరెడ్డి అని ఒకరు 70 ఏండ్ల వయసులోనూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ప్రక్రుతి జీవనం సాగిస్తున్నాడని అన్నాడు..... ఇలా వివరాలు చెప్తూ డాక్టర్లు అవసరం లేకపోయినా మందులు వ్రాస్తూ ఫార్మ కంపెనీలతో కుమ్మక్కై మనుషుల శరీరాలతో దారుణంగా ఆడుకుంటున్నారన్నాడు. నిజమే అన్నాను. డాక్టర్లు - హాస్పిటల్స్ నాశనం కావాలన్నాడు. తప్పన్నాను. ఒప్పుకున్నాడు. కానీ సర్ అవసరమైనప్పుడే అంటే శర్జికల్ విభాగాలకే అల్లోపతిని వాడాలన్నాడు. అవసరమైనప్పుడు ఏ వైద్యవిధాన్నైనా వాడాలి. కాకుంటే అనవసరంగా డాక్టర్లు బాగుపడడానికి ఏ వైద్యవిధానాన్ని ఉపయోగించకుండా వ్యవస్థలో మార్పులు రావాలన్నాను. 
ఈ సందర్భంగా అతనో మాట అన్నాడు... అదే : " సైన్స్ ఓ మూఢ నమ్మకంగా మారింది సర్ " అని. అర్ధం కాలేదన్నాను.  అవసరం లేకున్నా సైన్స్ పేరుతో ప్రతీదానిని శల్యపరీక్ష చేస్తూ సాంప్రదాయ వైద్య విధానాలపట్ల ప్రజలలో భయాందోళనలకు గురి చేస్తున్నారన్నాడు. నేను అంగీకరించలేదు. సాంప్రదాయవైద్యం పేరుతోనూ, ఆధునిక వైద్యం పేరుతోనూ ప్రజల అమాయకత్వాన్ని బట్టి దోపిడీ జరుగుతూనే ఉన్నది. దోపిడీకి వైద్య విధానానికీ సంబంధం లేదని చెప్పాను.  సైన్స్ మూఢనమ్మకంగా మారడం కాదు. సైన్స్ ఈ వ్యవస్థలో దోపిడీదారులకు ఉపయోగపడుతుంది. అది సైన్స్ తప్పు కాదు కదా? అన్నాను. అతను అర్ధం కాలేదన్నాడు. ఈలోగా నేను ట్రైన్ దిగాను."

ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ప్రతీదానికి సైన్స్ పేరు చెప్పి శల్యపరీక్ష చేయడం అవసరమా? సైన్స్ ఓ మూఢనమ్మకంగా మారుతున్నదా? 
--------------------------------------------------
*Republished

ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

  1. మనిషికి దేవుడు విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చాడు. కాని మనిషి దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడంటె అది మనిషి తప్పే, కత్తులతో కూరగాయలూ తరగవచ్చును, తలకాయలూ తరగవచ్చును కదా? తలకాయలు తరిగే వారి సంఖ్య మితిమీరి పోతోందని కత్తి అన్నది లేకుండా పోవాలని కోరుకుంటారా? మేధస్సు బాగా ఉన్న వాళ్ళు అది ఆట్టే లేని వారిని దోచుకుంటున్నారన్నది నిర్వివాదం అని ప్రకటించి, మనుష్యులకు మేధస్సు ఉండకూదదు అని కోరుకోగలమా?
    విజ్ఞానశాస్త్రాలు మానవనాగరికతాపురోభివృధ్ధికే అన్నదాంట్లో విప్రతిపత్తి లేదు కాక లేదు. ఐతే శాస్త్రజ్ఞుల ఆవిష్కరణలు వినాశనానికి దారితీయటం అన్నది శాస్త్రజ్ఞులనూ కలవరపెట్టే విషయమే అన్నదీ ఒప్పుకోవాలి. ఆల్‌ఫ్రెడ్ నోబుల్ అనే ఆయన తాను కనిపెట్టిన డైనమైట్ విధ్వంసాలకు వినియోగపడుతుంటె విలవిల్లాడటం జగమెరిగినదే. మానవస్వార్థం దేనిని విడువదు కాబట్టి శాస్త్రవిజ్ఞానాలనూ విడువదు. అంతమాత్రం చేత సైన్స్ అంటె మూడనమ్మకంలా ఐపోతోది కాబట్టి దీనినీ నిరోధించాలి అనుకుంటే అది అసమంజసమైన ఆలోచనావిధానం!

    ReplyDelete
  2. మీరు చర్చించిన వ్యక్తీ ఆలోచనల్లో ఇంకా పరిపక్వత రాలేదని మీరు రాసిన దాన్ని చదివితే అర్థమవుతోంది. మీ చర్చలో అనేక సార్లు తానూ చెప్పినదాన్ని తర్వాత కాదని అతను ఒప్పుకోవడమే అందుకు సాక్ష్యం. యౌవన ప్రాయంలో తమకు చాలా తెలుసని ఇతరులకు తెలియజెప్పాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అలా తెలిసీ తెలియని విషయాలపై కూడా చర్చకు దిగుతూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. బహుశా అలాంటిదే అనుకుంటా మీ అనుభవం.

    >>> ప్రతీదానికి సైన్స్ పేరు చెప్పి శల్యపరీక్ష చేయడం అవసరమా?

    అవసరం లేదు. కాని రోగ నిర్ధారణ జరిగే వరకు రకరకాల పరీక్షలు చేయడం డాక్టరు విధి. రోగ నిర్ధారణ జరిగాక కూడా డబ్బులకోసం పరీక్షలు చేయడం తప్పు.

    రోగి తలనొప్పి అని వెళ్ళాడనుకోండి, తలలో జలుబు ఉన్నట్టు నిర్ధారణ అయితే డాక్టరు దానికే మందులు ఇస్తాడు. జలుబు లేకపోతే అప్పుడు మరో పరీక్ష చేయాలి. కంటి చూపు మసకబారినా తలనొప్పి వస్తుంది. తలలో ఏదైనా సిస్ట్ ఉండొచ్చు. ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు. సాధారణంగా చిన్న వాటితో మొదలు పెట్టి నిర్ధారణ కాక పొతే పెద్ద పెద్ద పరీక్షలు చేస్తారు. అంతేకానీ ముందే పెద్ద పెద్ద పరీక్షలు చేయడం సాధారణంగా జరగదు. అలాగే కడుపునోప్పికి గ్యాస్ కారణం కావచ్చు. అల్సర్ కావచ్చు. కిడ్నీ కావచ్చు. అపెండిసైటిస్ కావచ్చు. మరోటి కావచ్చు. నిర్ధారించేది పరీక్షలే.

    ఒక రుగ్మతను శాస్త్రీయంగా పరీక్ష చేసి నిర్ధారించినపుడు అది మూఢనమ్మకం కాదు. అలా కాక ఏ పరీక్ష లేకుండానే ఇది ఫలానా రోగం అని నిర్ధారించే నాటు వైద్యానిదే మూఢనమ్మకం అవుతుంది.

    ReplyDelete
  3. ఇక్కడ ఇది నాకు జరిగినది నేను వ్రాస్తాను, నాకు ౨౦౦౭ లో Accident జరిగింది. తలకు దెబ్బ తగిలింది అది పడిపోవడం వలన.
    అది మా తల్లిదండ్రులు కు తెలియదు, కానీ వైద్యులు Bangalore లోని Hosmat Hospital వాళ్ళు మీ అబ్బాయి తలలో నరం చిట్లింది బ్రతకడం కష్టం అన్నారు, కానీ జరిగింది పుర్రె లోపల కాదు పుర్రి పైన ఉండే భాగంలో!
    దాంతో మా తల్లిదండ్రులు హైరానా పడ్డారు, మా నాన్నగారికి తెలిసిన ఒక వైద్యుడిని సంప్రదిస్తే పై విషయం చెప్పి మా ఊరు తీసుకు రమ్మన్నారు!
    ఊరుకు తీసుకు వెళ్ళారు!
    మరి రెండురోజులు Hosmat లో ఉంచి నన్ను ICU లో పెట్టి రోజూ లేదా నాకు మెలుకువ వచ్చినప్పుడల్లా మత్తు injection ఇచ్చేవారు, ఆ రెండు రోజులకు లక్షా యాభై వేలు దండుకున్నారు!
    ఆ test లు అసలు అవసరం లేదు అన్ని సార్లు చెయ్యడం అని మా వైద్యుడు అన్నారు!
    మరి ఎందుకు చేసారు అని అడిగితె పరిపక్వత లేని చదువులు మరియు అక్కడ చదువుతున్న విద్యార్ధులకు నువ్వు ఒక వస్తువువు అందుకే ఇది జరుగుతుంది!

    ఇక వైద్యం ఒకటే కాదు అన్నిట్లోనూ ఆయన చెప్పినది ఇలా అర్ధం చేసుకోవాలి!
    మానవత్వం లేని ఏ ఇజం అయినా మూఢ నమ్మకం!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కరంట్ అఫైర్స్ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి హ్యూమనిజం
 
Top