PORN సైట్ లను నెట్ లో రాకుండా నిషేధించే అవకాశం లేదా!?

ఇటీవల టీ.వీ 9 లో పిల్లల్లో సెక్స్ పట్ల విపరీత ధోరణుల విషయమై ఓ చర్చా కార్యక్రమం నడిచింది. ఈ సందర్భంగా POW సంధ్య, ప్రముఖ సైక్రియాటిస్ట్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి తో పాటు మరొకరు పాల్గొన్నారు. ఆయన ఓ మాట చెప్తూ స్మార్ట్ ఫోన్లు వాడకం తక్కువ వయసులోనే జరుగుతున్నదని, తల్లిదండ్రులు కూడా ముద్దుగా వాటిని వాళ్లకి కొనిస్తున్నారని చెప్తూ కొన్ని దేశాలలో పోర్న్ సైట్ లు రాకుండా నిషేధించారని చెప్పారు. థాయిలాండ్ ప్రభుత్వం అలా చేసిందని ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వమూ ఆ దిశగా ప్రయత్నిస్తోందన్నారు. 

నెట్ లో పోర్న్ సైట్ లు అశ్లీల సైట్ లను ప్రభుత్వమే అరికట్టే అవకాశం ఉన్నదా? ఉంటే ఎందుకు చేయడం లేదు?
-------------------

ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
అంశం : స్త్రీ హింస, సంస్కృతి, పిల్లలపై అశ్లీలత ప్రభావం
------------------------------------------------
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

 

Post a Comment

 1. పార్న్ చూడడం సైకలాజికల్ సమస్యే కానీ సైకియాత్రిక్ సమస్య కాదు. ఒక మెదికల్ రిప్రజెంతేతివ్ పై అత్యాచారయత్నం చేసిన ఇండ్ల రామసుబ్బారెడ్డి ఇక్కడ శ్రీరంగ నీతులు చెప్పడం విచిత్రంగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. పోర్న్ సైట్ లు చూడడం సైకలాజికల్ సమస్య కావచ్చు. సామాజిక పరిస్తితులలో అది ఓ ఎడిక్షన్ గా మారితే ఖచ్చితంగా సైకియాట్రిక్ సమస్యేనని నా అభిప్రాయం. ఇక ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యక్తిగతానికి , వృత్తిలో సలహాలకూ పొంతన పెట్టడం సరయినది కాదు. ఇక్కడ ప్రశ్న కూడా థాయిలాండ్ లో ఇలాంటి సైట్ లు నెట్ లో రాకుండా ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకుందట. అలాంటి నిర్ణయాన్ని తెలంగాణా ప్రభుత్వమూ పరిశీలిస్తుందట. దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉంటే చెప్పండి ప్రవీణ్.

   Delete
  2. మీరు ఒక సామాజిక సమస్యని మెదడు & నరాల వైద్యశాస్త్రంతో ముడిపెడుతున్నారు. స్త్రీని చెత్తగా చూడడం తప్పు కాదనుకునే సమాజంలో మెదడూ, నరాలూ సరిగా పని చేసేవాడు కూడా పార్న్ చూస్తాడు. దానికి సైకియాత్రిస్త్‌లు ఏమి చెయ్యగలరు? రామసుబ్బారెడ్డి కేవలం మెదడు & నరాలని బాగు చేసేవాడే కానీ ప్రవర్తనని బాగు చేసేవాడు కాదు. ప్రవర్తన అనేది ఎలా ఉండాలో వైద్య శాస్త్రం చెప్పదు. రామసుబ్బారెడ్డికి అతని మొదటి భార్య విడాకులు ఇచ్చేసింది, రెండో భార్య కూడా కోర్త్‌లో కేస్ వేసింది, ఒక మెదికల్ రిప్రజెంతేతివ్ అతని మీద రేప్ కేస్ పెట్టింది. మనిషిని కేవలం మెదడు & నరాలు నడిపించవు, సమాజం నడిపిస్తుంది. అందుకే కదా ఒక సైకియాత్రిస్త్ ప్రవర్తన ఇలా ఉంది.

   Delete
  3. మీరే సమస్యని సరిగా అర్ధం చేసుకోకుండా వ్యక్తిగతనిందకు దిగారు. ఇక్కడ సమస్య ఇండ్ల రామ సుబ్బారెడ్డిది కాదు. సైక్రియాట్రిస్టులే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? అలాగే ఇండ్ల రామ సుబ్బారెడ్డి వ్యక్తిత్వం గురించి అతని వ్యక్తిగత ప్రవర్తన గురించి ఇక్కడ అనవసరం. ఇక్కడ ప్రశ్న నెట్ లో పోర్న్ సైట్ లు రాకుండా ఏం చేయాలి? కొన్ని ప్రభుత్వాలు అలా చేస్తున్నాయని తెలంగాణా ప్రభుత్వమూ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నదని ఆ చర్చలో పాల్గొన్న మూడో వ్యక్తి చెప్పారు. ఇండ్ల రామ సుబ్బారెడ్డి కూడా మందులువాడాలని చెప్పలేదు. తల్లిదండ్రులు సమాజం ఎలా ఉండాలో చెప్పాడు. ఇక్కడ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యక్తిగత జీవితం గురించి చర్చ అనవసరం. నెట్ లో పోర్న్ సైట్ లు రాకుండా చేసే అవకాశం ప్రభుత్వాలకు ఉంటే అది చేయాలంటారా? వద్దంటారా? చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు ఇవ్వవద్దని ఇచ్చినా ఓ కన్నేసి ఉంచాలని చెపుతున్నదాని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ప్రశ్నని మరోసారి పరిశీలించి మీ అభిప్రాయం చెప్పాలని కోరుతున్నాను.

   Delete


  4. మార్కెత్‌లో విషం దొరక్కపోతే అన్నంలో విషం కలిపి హత్య చేసే కేస్‌లు తగ్గుతాయి. అలాగే పార్న్ వెబ్‌సైత్‌లు లేకపోతే పార్న్ చూసేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. పార్న్ వెబ్‌సైత్‌లని బ్లాక్ చెయ్యకుండా పిల్లలని అదుపులో పెట్టుకోవాలని చెపితే ఏమి లాభం.

   మందులు లేనిదైతే అది సైకలాజికల్ అవుతుంది కానీ సైకియాత్రిక్ కాదు. సైకియాత్రిస్త్‌లకి సైకాలజీలో మూడు నెలలు మాత్రమే శిక్షణ ఇస్తారు. ఐదేళ్ళు సాధారణ వైద్యశాస్త్రం, రెండేళ్ళు మానసిక వైద్యం చదివిన సైకియాత్రిస్త్‌కి సైకాలజీ గురించి తెలిసినది తక్కువే ఉంటుంది. నాకు masturbation (నిద్రలో సెక్స్ చేస్తున్నట్టు ఊహించుకోవడం, వీర్యం కారడం) అనే సమస్య ఉంది. ఇది కేవలం సైకలాజికల్ కనుక నేను సైకియాత్రిస్త్ దగ్గరకి వెళ్ళలేదు. మా వీధిలోనే ఒక సైకియాత్రిస్త్ ఉంది. నా సమస్య గురించి ఆవిడకి చెప్పినా యోగా చెయ్యండి లాంటి సలహాలైతే ఇస్తుంది. దీనికి మందులు ఉండవు కానీ యోగా చెయ్యండి అనే సలహా తీసుకోవడానికి సైకియాత్రిస్త్ దగ్గరకి వెళ్ళడం అవసరమా?

   Delete
  5. mastrubation అనేది మీ ఒక్కరి సమస్య అని శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన ఉన్నవారు అనుకోరు. అది అత్యంత సాధారణ సమస్య. యోగా చాలావరకు మైండ్ రిలీఫ్ కు ఉపయోగపడుతుంది. యోగా అనేది అశాస్త్రీయమేమీ కాదు. యోగాతో సర్వరోగ నివారణలూ జరుగవు. యోగా అనేది ఒక అభ్యాసన. సాధన. అది తప్పు కాదు కదా. పిల్లలకు సెక్ష్ పట్ల కనీస అవగాహన కల్పించడం కూడా పాపం అనుకుంటే క్యూరియాసిటీ వల్ల కొన్ని దొంగచాటుగా తెలుసుకునే సందర్భంలో కూడా పిల్లలో ఇలాంటి విపరీత ధోరణులు ఏర్పడతాయి. ప్రపంచానికి కామశాస్త్రాన్ని అందించిన మన దేశంలో సెక్ష్ ఎడ్యుకేషన్ ఎలా అనేదానిలో సరైన అవగాహన పెంపొందించడంలేదనేది నా అభిప్రాయం.

   PORN సైట్ లు బంద్ చేయడమే గాక , సరైన సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి. గతంలో మన సంస్కృతిలోనే కలగలపి కొన్ని ఆచారాలుండేవి. ఉమ్మడి కుటుంబాలలో పెద్దలు పిల్లలకు నేర్పేవారు కొన్ని. కానీ నేడంతా బిజీ గజిబిజి జీవితం. సెక్స్ అంటే పాపం అని కాకుండా అది కూదా ఆహారం అంత సాధారణ అవసరమేనని చైతన్యం పెరగాలి. ఇక మానవ సంబంధాలు ఎలా ఉండాలీ అనేది కూడా ఆయా ప్రాంతాలను బట్టి సాంస్కృతిక వారసత్వాలను బట్టి ఉంటుంది. వీటిలో అశాస్త్రీయమైన భావాలపై సున్నితంగా పోరాడుతూ విజయం సాధించాల్సి ఉంటుంది.

   Delete
  6. అధికారికంగా ప్రభుత్వం వీటిని కంట్రోల్ చెయ్యాలంతే ఇప్పుదున్న చట్టాలు సరిగ్గా లేవు.సరిగ్గా వుండటమంటే ప్రతి మాటనీ కోర్టు పరిభాషకి మార్చటం,సరిగా నిర్వచించటం - లేకపోతే రాం జఠల్మానీ లాంటి లాయర్లు అక్కడ ఫలానా మాట ఫలానా విధంగా లేదు గాబట్టి మా క్లయింటు ఈ నేరం పరిధిలోకి రాడు అని మెలికేసి పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్య చేసిన వాణ్ణి కూడా నిర్దోషిగా బయట పడేస్తారు.

   ఇలాంటి పనులన్నీ ముక్యమంత్రిగారు ఆర్డరేసెయ్యగానే జరిగిపోవు.న్యాయశాస్త్ర సబంధమయిన విషయాల్లో కోర్టులు బయటివాళ్ళ జోక్యాన్ని సహించవు.కాకపోతే ఒకటి చెయ్యవచ్చు.ఆ లాయర్లనీ లా ని సవరించటానికి అధికారం వున్నవాళ్ళని సలహాలు అదగవచ్చు,చట్టాలు మార్పులు చేసి గానీ లేకపోతే వున్న సెక్షన్లలో అధికారికంగా వుపయోగించుకోగలిగిన వాటిని గురించి తెలుసుకోవచ్చు.గబూక్కున యేదో ఓకటి చేసేసి ఆతర్వాత కోర్టులతో మొట్టికాయలు వేయించుకుని వెనక్కి తగ్గేలా కాకుండా అన్నీ పక్కాగా చెయ్యాలంటే దానికి చాలా ఓపిగ్గా ప్రయత్నించాలి.టైం పడుతుంది.

   Delete
 2. కామాతురణాం నభయం నలజ్జ!
  పోర్నాతురాణాం నకోర్టుః నశిక్షః!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top