Reactions:

Post a Comment

 1. People get the government they deserve a అని ఆంగ్లంలో ఒక సామెత. తెలంగాణాప్రజ TRS ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. వారు KCR గార్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయన నిజాంభక్తుడు. అందుకని విద్రోహమే అనాలి మరి.

  ReplyDelete
 2. కొండలరావు గారూ, ఈ ప్రశ్న తేనె తుట్టను కెలుకుతుంది. ఏది ఏమయినా చరిత్రను విస్మరించడం సబబు కాదు కనుక దీన్ని అర్ధం చేసుకోవడం ముఖ్యం.

  హైదరాబాదు సంస్థానం పరిధిలో 16 జిల్లాలు (తెలుగు: 8, మరాఠీ: 5 & కన్నడ: 3) ఉండేవి. ఆరవ నిజాం తండ్రి మహబూబ్ అలీ ఖాన్ చిరకాలం పాలించాడు. ఈయన వివాద రహితుడు.

  మహబూబ్ పాషా కాలం చేసాక ఆయన కొడుకు ఏడవ (చివరి) నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 1911 లో గద్దె నెక్కి సుదీర్ఘ కాలం (1911-1948) పరిపాలించాడు. ఉస్మాన్ అలీ పాలనలో కొంత అభివృద్ధి జరిగినా వివాదాలు కోకొల్లలు.

  దేశంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర సమరం ఊపెక్కిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా రాజకీయ వాతావరణం జోరు పుంజుకుంది. నిజాముకు మద్దతుగా మజ్లీస్ ఏర్పడింది. స్వామీ రామానంద తీర్థ మొదలయిన వారి ప్రోద్బలంతో హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ జాతీయోద్యమానికి అండగా నిలిచింది.

  1938 సంవత్సరంలో రామానంద తీర్థ సత్యాగ్రహం దరిమిలా మూడు ప్రముఖ పోకడలు వచ్చాయి:

  1. స్టేట్ కాంగ్రెస్ భాషల వారీ చీలికలు మొదలయ్యాయి. తీర్ధ & కేవీ రంగారెడ్డి వర్గాల మధ్య పోరు పెరిగింది.

  2. కమ్యూనిస్ట్ భావాలు పుణికి పుచ్చుకున్న రావి నారాయణ రెడ్డి లాంటి వారు ముందుకు వచ్చారు కానీ నిషేధం దృష్ట్యా వారికి రాజకీయ కార్య కలాపాలు చేసే అవకాశం లేదు. వీరికి ఒక రాజకీయ వేదిక అవసరం కావడంతో "భాషోద్ధరణ" నినాదంతో రంగారెడ్డి ప్రభృతలతో చేయి కలిపారు. స్టేట్ కాంగ్రెస్ తెలుగు, మరాఠీ & కన్నడ సంఘాలుగా చీలి పోయింది.

  3. మజ్లిస్ నాయకత్వం బహదూర్ యార్ జంగ్ చేతిలోకి వెళ్ళింది. ఈయన నిజాం-మజ్లిస్ ఈక్వేషన్ మార్చేందుకు పూనాడు. నిజాం స్థాయి తొలుత ఒప్పుకున్న "కుటుంబ పాలన" అవగాహనను వదిలేసి "ముస్లిం మత పరిరక్షకుడు" గా మార్చే ప్రయత్నం చేయడంలో నిజాం-మజ్లిస్ సంబంధాలలో గందరగోళం & విబేధాలు వచ్చాయి.

  1939 రెండవ విశ్వ యుద్ధం మొదలయ్యింది. ఇంగిలీషు ప్రభువుకు వీర విధేయడయిన ఉస్మాన్ అలీ తన సైన్యాన్ని గంపగుట్టుగా యుద్దానికి పంపించాడు. రాష్ట్రంలో రోజువారీ సైనిక బాధ్యతలు మజ్లిస్ కార్యకర్తలు మొదలెట్టారు, వీరే రజాకార్లు.

  మరోవైపు నాజీ వ్యతిరేకత అన్న నెపంతో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఇంగిలీషు పాలకులను సమర్తించింది. దీనితో వీరిపై నిషేధం ఎత్తివేయడం, వారు మూడు జిల్లాలలో బలం పుంజుకోవడం చెకచెకా జరిగాయి. ఆంద్ర మహాసభలో మితవాద-అతివాద పోరు ముదిరి సంఘం మొత్తం కమ్యూనిస్టుల ఆధీనంలో వచ్చింది.

  యుద్దానంతరం కమ్యూనిస్ట్ నిషేధం యథాతథంగా తిరిగి వచ్చింది. దీనికి ప్రతిక్రియగా వీరు సాయుధ పోరాటం ప్రారంభించారు.

  1944 లో తనకు పోటీగా మారుతూ వస్తున్న బహదూర్ యార్ జంగ్ ను ఉస్మాన్ అలీ విషం పెట్టించి కంపించాడు. మజ్లిస్ నాయకత్వం ఖాసీం రాజ్వీ చేతుల్లోకి వెళ్ళింది. ఈయన బహదూర్ యార్ జంగ్ కన్నా కట్టర్ వాది కావడం మూలాన అనుకున్న ఫలితం రాలేదు సరికదా మొదటికే మోసం వచ్చింది.

  మరోవైపు ఎన్నో ఉన్నత ఆదర్శాలతో ఆరంభమయిన సాయుధ పోరాటంలోనూ విపరీత పోకడలు మొదలైనాయి. స్టాలిన్ కనుసన్నలలో రాష్ట్రేతర (ముఖ్యంగా సుందరయ్య లాంటి ఆంధ్రులు) నాయకుల పెత్తనం పెరిగింది.

  ReplyDelete
  Replies
  1. రెండవ భాగం:

   1947 భారత స్వాతంత్రం దరిమిలా ఇంగిలీషు పాలన ముగిసింది. హైదరాబాద్ లాంటి సామంత సంస్థానాలు తమ నిర్ణయం తామే తీసుకోవచ్చనే మెలికను వాడుకొని తాను ఒక సార్వభౌమునిగా ఎదగవచ్చని ఉస్మాన్ అలీ కళలు కనడం మొదలెట్టాడు. దీన్ని ఆసరాగా తీసుకొని "ఢిల్లీ ఎర్రకోటపై ఆసఫ్జాహీ జండా" పేరుతొ పెత్తనం చేయొచ్చని రాజవీ సైతం ఊహించాడు.

   కేంద్ర ప్రభుత్వానికి ఇవి సహజంగానే రుచించలేదు. (మూడుగా చీలినప్పటికీ పూర్తిగా బలహీనం కాని) స్టేట్ కాంగ్రెస్ విలీనోద్యమం తీవ్రతరం చేసింది. కేంద్రం తొలుత "స్థాయి ఒప్పందం" చేసుకున్నా నిజాం పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు & రజాకార్ల ఆగడాలతో విసిగి సైనిక చర్యకు దిగింది. నిజాం వివాదాన్ని ఐక్యరాజ్యసమితికి సమర్పించాడు. కొద్దీ రోజుల యుధానికే ఓడిపోయి సెప్టెంబర్ 17, 1948 నాడు నిజాం సైన్యం లొంగిపోయింది.

   పైవన్నీ జరుగుతుండగా అడపాదడపా "హిందూత్వవాదులు" మేమూ ఉన్నామంటూ చిన్నచిన్న చప్పుళ్ళు (ఉ. సావర్కర్ హైదరాబాద్ పర్యటన) కొన్ని చేసినా వారి పాత్ర అత్యంత స్వల్పం.

   సైనిక చర్య తదనంతరం మజ్లిస్ సంక్షోభంలో పడిపోయింది. రాజవీ జైలు కెళ్ళాక పూర్తిగా చెల్లాచెదరయిన పార్టీకి అబ్దుల్ వహీద్ ఒవైసీ నాయకుయ్యాడు. కొన్నేళ్ల తరువాత మజ్లీస్ భారత దేశం పట్ల నిబద్దత ప్రకటించి రాజకీయాలలో తిరిగి ప్రవేశించింది.

   హైదరాబాద్ భారత దేశంలో చేరాక స్థానిక కమ్యూనిస్ట్ నాయకులు (ఉ. రావి నారాయణ రెడ్డి) సాయుధ పోరాటాన్ని ఆపుదామని వాదించారు. దీనికి రాష్ట్రేతరులు (సుందరయ్య ప్రభృతులు) ఒప్పుకోలేదు. స్టాలిన్ నిర్ణయం ప్రకారం మరో మూడేళ్లు పోరాటం కొనసాగింది కానీ చెప్పిన ఫలితాలు రాలేదు. స్టాలిన్-నెహ్రు సఖ్యత, చైనా అంతర్యుద్ధ పరిసమాప్తి, విశాలాంధ్ర భావజ్వాలవ్యాప్తి & స్టాలిన్ అనారోగ్యం వగైరా పరిణామాల నేపథ్యంలో 1951 లో సాయుధ పోరాటం విరమించారు. మొదటి సామాన్య ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో కమ్యూనిస్ట్ నిషేధం ఎత్తివేయడంతో పైని పేర్కొన్న చారిత్రిక ఘట్టాల అధ్యాయం ముగిసింది.

   క్లుప్తంగా ఇదండీ జరిగిన చరిత్ర. ఇక ఎవరు ఈ తేదీని ఏమని ఎందుకు అంటారో వచ్చే వ్యాఖ్యలో.

   Delete
 3. మొదటి వాదన విమోచన. ఈ రోజున నిజాం నిరంకుశం అంతమయ్యి భారత దేశ స్వాతంత్య్రం పరిపూర్తి అయింది కనుక విమోచన దినోత్సవం అన్నది దీని సారాంశం.

  ఇవాళ ఊరూరా విమోచమంటూ దండోరా వేస్తూ తిరుగుతున్న కాషాయ వాదులు అప్పట్లో నిజాం వ్యతిరేక పోరాటం చేసిన దాఖలాలు లేవు (భారత స్వతంత్ర పోరాంలోనూ లేవు, అది వేరే విషయం). వీరి తతంగం బేగానీ షాదీ మీ అబ్దుల్లా దీవానా అన్నట్టుంది.

  విద్రోహ వాదన అతివాద ఎడమ ధోరణి. నక్సలైట్లు "సాయుధ పోరాటం భారత సైన్యం అణిచి వేసింది" అంటారు. దీంట్లో నిజమెంతో స్టాలిన్ ఆత్మకే తెలియాలి :)

  విలీనం ఈ రెంటికీ మధ్య తరహా వాదన, అలాగే వివాద రహితం కూడా.

  ఎవరు ఎన్ని చేసినా, ఎవరికీ నప్పినా మానినా, మన చరిత్ర మనం వదులుకోలేము & తిరగరాయలేము.

  ReplyDelete
 4. కూలంకషంగా ప్రెజెంట్ చేశారు గొట్టిముక్కల గారూ, బాగుంది. అయితే మీ వ్యక్తిగత అభిప్రాయంలో ఏమంటారో చెప్పలేదు.
  "విలీనం" అనడం సబబుగా ఉంటుందనిపిస్తుంది; ఎందుకంటే "విలీనం" యొక్క ఒక పరోక్ష ఫలితం "విమోచనం" లభించడం అనవచ్చు కదా.

  ReplyDelete
  Replies
  1. విలీనం ఖచ్చితంగా జరిగింది, ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. విలీనం ద్వారా హైదరాబాద్ విముక్తి చెందిందా లేదా ద్రోహానికి గురయ్యిందా అన్నది కేవలం దృక్పధం మాత్రమే.

   మీరు చెప్పామన్నారు కనుక నా సొంత అభిప్రాయం. నిరంకుశత్వం స్థానంలో బహుళ జనాదేశం రావడం ఖచ్చితంగా విమోచనే. మీరన్న "విలీనం యొక్క ఒక పరోక్ష ఫలితం విమోచనం" నేను పూర్తిగా అంగీకరిస్తాను.

   మనం విమోచన ఫలితాలు పూర్తిగా పొందలేదు. దీనికి కారణం అప్పటి నాయకుల చారిత్రిక తప్పిదాలు. వీటిలో అతి ముఖ్యం: సాయుధ పోరాట కొనసాగింపు & రాజ్యాంగసభలో ప్రాతినిధ్యం కోల్పోవడం.

   Delete
 5. జై గారూ,

  మీ presentation బాగుంది.

  చారిత్రకదృష్టితో ఏమంటారూ‌ అన్నది ఒక ప్రశ్న ఐతే దానికి మీ వివరణలో సమాధానాన్ని వెదుక్కొన వచ్చును.

  సమకాలీన రాజకీయవాతావరణంలో ఏమంటారూ అన్న ప్రశ్నకు మీ వివరణతో‌ పాటుగా ప్రస్తుతసామాజం కోణంలోనూ, రాజకీయ నాయకత్వాల కోణంలోనూ‌ సమాధానాన్ని వెదకటం‌ అవసరం‌ కావచ్చును.

  ఈ‌ప్రశ్న వేయటంలో కొండలరావు గారి ఉద్దేశం చరిత్ర ఏమి చెబుతోందా అని కాక ఈరోజున ఎలా భావించటం సబబూ అని కూడా కావచ్చును. చరిత్ర తెలిసిఉండటం అవసరమే ఐనా అది చెప్పే జవాబు కాక వర్వమానం ఇచ్చే సమాధానం కూడా ఆలోచించాలి కదా. ఈ విషయంలో మీరేదైనా విశ్లేశ్ఝిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

  ఒక రకంగా కేసీఆర్ గారి నిర్లిప్తవైఖరి కారణంగా ఈ‌ప్రశ్న మరింత ముందుకు వచ్చిందా అంటే అది కూడా కావచ్చును.

  ReplyDelete
  Replies
  1. నా వ్యక్తిగత అభిప్రాయం పైన (Jai Gottimukkala September 22, 2017 at 2:45:00 PM GMT+5:30) చెప్పాను.

   కెసిఆర్ విషయానికి వస్తే ఉద్యమంలో ఈ అంశం ఆయనకు రెండు రకాలుగా కలిసి వచ్చింది:

   1. ఒక గ్రీవెన్స్ లేవనెత్తడం
   2. బీజీపీ వారిని (& అంతకముందు నరేంద్ర గారిని) కలుపుకొని పోవడం

   ఈరోజు రెండూ అవసరం లేవు కనుక ఆయన పట్టించుకోవడం లేదు.

   దీన్ని ముస్లిం అపీస్మెంట్ అనవచ్చా అంటే తెలీదు. తెరాసకు వచ్చే ఓట్లు & సీట్లు ఇందు మూలంగా మాత్రం మారవు.

   Delete
 6. కొండలరావుగారూ, కల్నల్ ప్రభాకరరావుగారి బ్లాగులో ఈ విషయమై ఆయన వ్రాసారు. పైన చెప్పిన అభిప్రాయాలకు భిన్నంగా వుంటుంది. ఆసక్తి వుంటే చూడండి.

  http://kuntamukkalaprabhakar.blogspot.in/2010/11/who-betryed-hindus-in-former-
  princely.html

  http://kuntamukkalaprabhakar.blogspot.in/2010/09/kasim-razvi-deserved-capital-punishment.html

  http://kuntamukkalaprabhakar.blogspot.in/2009/06/hyderabad-nerve-center-of-mischief_29.html

  http://kuntamukkalaprabhakar.blogspot.in/2010/01/does-hyderabd-belong-only-to-muslims.html

  http://kuntamukkalaprabhakar.blogspot.in/search?q=hyderabad

  ఈ బ్తాగులో ఇంకా వెదికితే ఈ విషయం గురించి వ్యాసాలు, వాటి చివర వున్న చర్చలు కూడా వుంటాయి. ఏవైనా సందేహాలుంటే ఆయన్ని అడిగి తెలసుకోవచ్చు.

  ReplyDelete
  Replies
  1. కొండలరావుగారూ, ఆ చారిత్రక సంఘటనకు సంబంధించి పూర్తి సచిత్ర వ్యాసం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు.

   How Sardar Patel prevented Hyderabad from becoming another Pakistan – Operation Polo

   http://guruprasad.net/posts/sardar-patel-prevented-hyderabad-becoming-another-pakistan-operation-polo/

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top