*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
ReplyDeleteఎవరండీ ఈ కంచె ?
జిలేబి
కచ్చితంగా అవి కులోన్మాద వెఱ్ఱి రంకెలే. వీటి గురించి టంకశాల అశోక్, ఎంవిఆర్ శాస్త్రి, కల్లూరి శ్రీనివాసరెడ్డి - ఈ ముగ్గురు రకరకాల కోణాల్లో వెలిబుచ్చిన విశ్లేషణలు చూస్తే మనకు విషయం సాకల్యంగా అర్థమవుతుంది.
ReplyDeleteలక్ష్యానికి ఉపయోగపడని చర్చ - టంకశాల అశోక్
https://www.facebook.com/notes/bbc-news-telugu/%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%89%E0%B0%AA%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%AA%E0%B0%A1%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A/509810222695979/
ఐలయ్య పైత్యం-4.... ఎం.వి.ఆర్. శాస్త్రి
ఇదే ఫేస్ బుక్ పేజీలో దీని క్రింది మిగతా మూడు భాగాలూ వుంటాయి.
https://www.facebook.com/vunnamata/photos/a.118816045489368.1073741828.118386302199009/119439312093708/?type=3&theater
కల్లూరి శ్రీనివాసరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్
ఐలయ్య మాస్ ప్రయాస
--------------
రిలయన్స్, హెరిటేజ్ లాంటి కొత్త కోమట్లను వదిలేసి పాత కోమట్ల గురించి మాట్లాడుతున్న అపర మేధావిని చూస్తే నిజంగా జాలేస్తుంది కదా
50 ఏళ్ల క్రితం దాకా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపిన కోమట్లు ఇపుడు అదే వ్రుత్తిలో ఎంత మంది ఉన్నారు? వ్యవసాయం దండగను కున్న ప్రతి కులం వాళ్లు ఇవాళ కిరాణా షాపులు, పైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్లంతా ఐలయ్య ద్రుష్టిలో ఇప్పటి సామాజిక స్మగ్లర్లేనా మరి? సమాజంలో అన్ని వ్రుత్తులలో మంచి చెడులు ఎప్పుడూ ఉంటాయి. కాలానుగుణంగా ఆయా కులాల వ్రుత్తులు ఇవాళ దాదాపు తురమరుగవుతున్నాయి. కుల వ్రుత్తులకు కాలం చెల్లింది. కానీ ఐలయ్యనే అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు.
అప్పటి కోమట్లు ఇపుడు అదే వ్రుత్తిలో బతుకుతున్నోళ్లు బహుశా పది శాతం కూడా ఉండిఉండరు. ఇపుడు నయా కోమట్లుగా రిలయన్స్ ఫ్రేష్, హెరిటేజ్ ఫ్రెష్, బిగ్బజార్లు, మైక్రో పైనాన్స్ కంపెనీలు వచ్చాయి. కాలంతో పాటు అన్ని వ్రుత్తులు మారినట్లే.. కోమట్లు కూడా తమ వ్రుత్తిని వదులు కొని షాపింగ్ మాల్లలో పని చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. అయినా ఇప్పటికీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోమట్ల చేతిలో ఉందని కంచె భావిస్తే.. సమాజం పట్ల ఉన్నఆయన అజ్ఞానానికి జోహార్లు చెప్పగలం తప్ప ఏమీ చేయలేం. కంచె ఐలయ్యలో ఇప్పటికీ 50 ఏళ్ల క్రితపు ఆలోచనలు తప్ప ఇపుడు సమాజం ఎంత మారిందో పట్టకపోతే ఆయన పుస్తకానికి ఉండే విలువేమిటో వేరే చెప్పనక్కర లేదేమో? నిజంగా సమాజానికి ఆయన ప్రయోజనం కలిగించాలంటే.. ఇపుడు చిల్లర వ్యాపారంలోకి, ఫైనాన్స్ వ్యాపారంలోకి వచ్చిన కార్పొరేట్ కంపెనీల గురించి వాటి మోసాలు, కల్తీల గురించి పుస్తకం రాసివుండాలి.
కులాలను గిల్లి తనకు తాను మాస్ కావాలనుకుంటే సమాజం అంత గుడ్డిది కాదు కదా? అయినా కాలం చెల్లిన ఆయన పుస్తకానికి విలువే లేదు. ఆయన పుస్తకంపై వైశ్య సమాజం కూడా తమ నిరసన తెల్పడం సరైనదే. పెద్దగా రాద్దాంతం జరిగితేనే తనకు పుక్కిడి ప్రచారం జరుగుతుందని ఆయన భావిస్తుండొచ్చు. వైశ్య సంఘాలు అందుకు అవకాశం ఇవ్వకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఆయన అసహజ రాతల పట్ల సమాజంలోని సబ్బండ కులాల వాళ్లకు కూడా కొంత ఏహ్యభావం వచ్చింది. ఆయనకు సమాజం నుంచి తిరస్కరణ పెరగడం మించి శిక్ష ఏముంటుంది?
@B Sreenivasu:
Deleteముందు మాట: నేను ప్రస్తుతం వివాదంలో ఉన్న ఐలయ్య రచన & మీరు ఉటంకించిన ముగ్గురి వ్యాఖ్యలు చదవలేదు. ఎంవిఆర్ శాస్త్రి ఎవరో కూడా నాకు తెలీదు (ఇది నా ఆజ్యానం, వారి తప్పు కాదు). నా ఈ స్పందన మీరు మీ వ్యాఖ్యలో ఇచ్చిన ఆధారాల మీదే తప్ప ఇంకొకటి కాదు.
ఈ టపా శీర్షిక మరొక్కసారి చూద్దాం: కంచ ఐలయ్య రాతలు & వాదనలు *తన* లక్ష్య సాధన దిశగా ఉన్నాయా లేదా అన్నది కొండలరావు ప్రశ్న. అవి మనకు అంగీకారమా కాదా, అలాగే *మన* లక్ష్య సాధన దిశగా ఉన్నాయా లేదా చర్చాంశం కాదు.
కల్లూరి దృష్టిలో జన్మతః వైశ్యులు ఇప్పుడు పెద్దగా వ్యాపారరంగంలో లేరు, ఈ స్థానాన్ని "నయాకోమట్లు" (ఐలయ్య ఈ కులాలను నయాక్షత్రియులు అంటారు, ఇది వేరే విషయం) ఆక్రమించారు. వారి వాదనలో కులాల కుంపట్ల వలన వర్గపోరాటం సన్నగిల్లుతుందన్న భావన కనిపిస్తుంది.
కొంతవరకు ఇదే పోకడ టంకశాలలో కూడా ఉంది: ఆయన *మా* లక్ష్యానికి ఉపయోగపడని చర్చ అని ఉంటే బాగుండేదేమో?
ఐలయ్యకు ఒక నిర్దిష్ట లక్ష్యం లేదని వీరిద్దరూ అంటున్నట్టు లేదు. ఆయన గమ్యం తమ ఆశయంతో సరితూగదని వాపోవడం సబబా అన్నది నా అనుమానం.
భవిష్యత్ లో " నేను మనిషిని ఎట్లైతా " అనే పుస్తకాన్నిరాసే అవకాసంవున్న మేధావి ఎవరు? వారికున్న అర్హత వివరించగలరు?
ReplyDeleteకులచట్రం దాటని ఐలయ్య విశ్లేషణ - ప్రొఫెసర్ నాగేశ్వర్
ReplyDeletehttp://epaper.navatelangana.com/c/22307238.......
సామాజిక పోరాటంలో సమగ్రదృష్టి.... తెలకపల్లి రవి
http://epaper.prajasakti.com/1369589/Prajasakti-Main/Main-Pages#page/4/1...........
వైశ్యులపై విశ్లేషణ వాస్తవాలు - నాగేశ్వర్
http://epaper.prajasakti.com/1367722/Prajasakti-Main/Main-News#clip/22370424/023f0f15-313a-474b-bcc9-ac99674758dd/1164.826624:1035.4122837599998
కంచె దాటని కులం.... నాగేశ్వర్
http://epaper.andhrajyothy.com/c/22389129........................................
కులాలు సవాళ్లు.... తిగుళ్ల కృష్ణమూర్తి.
http://epaper.andhrajyothy.com/c/22334905
పై నాలుగు వ్యాసాలు కూడా చూడండి.
ఐలయ్య పుస్తకంలోని కొన్ని ఆణిముత్యాలు - ఇలాంటి ముత్యాల గని ఆ పుస్తకంలో వుంది. ఇవి చాలా కొద్ది మాత్రమే...
‘‘ఆర్యవైశ్యులు దొంగ వ్యాపారులు , సామాజిక స్మగ్లర్లు
అక్రమపద్ధతులలో ఆరితేరారు, తమ అవినీతి సంస్కృతినే భారతీయ సంస్కృతిగా మార్చేసారు.
అధికారులను అవినీతిలోకి దించడంలో, చట్టాలను అతిక్రమించడంలో వీరికి మరెవ్వరూ సాటిరారు.
నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ముకంటే లంచగొండి అధికారులకు అక్రమంగా చెల్లించే మొత్తమే ఎక్కువ
వీరి దొంగవ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది, మోసపూరిత తూనికలు, కొలతలే అందుకు ఉదాహరణ.
అబద్ధాలాడే కళను ఒక వ్యాపారాంశంగా తీర్చిదిద్దారు, వ్యాపారాన్ని పాపిష్టి కార్యంగా మార్చారు. అందువల్లే దేవుళ్లను వైశ్యులు పెద్ద ఎత్తున పూజిస్తారు. హుండీల్లో పెద్ద ఎత్తున కానుకలు వేస్తారు. తిరుపతి హుండీల్లోకి చేరుతున్న డబ్బే దీనికి ఉదాహరణ.
కోమట్ల వ్యాపారం ఎప్పుడూ జవాబుదారీతనాన్ని వ్యతిరేకిస్తుంది. ఆధ్యాత్మిక జవాబుదారీతనాన్ని అవహేళన చేసేందుకు కుబేరుడు, గణపతి వంటి దేవుళ్ళని సృష్టించారు. డబ్బులని కూడబెట్టుకోడానికి, వడ్డీవ్యాపారానికి, తిండిపోతుతనానికి ఈ ఇద్దరు దేవుళ్లూ ప్రతీకలు.
వైశ్యులు అధికవడ్డీలతో అనైతికంగా డబ్బుని కూడబెట్టే విధానాన్ని అనుసరిస్తారు.
ప్రాచీనకాలంలో వైశ్యులు మాంసం, చేపలు తినేవారు.
బ్రాహ్మణులు, కోమట్లు దొంగవ్యాపారం ద్వారా సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు.
వైశ్యులలో అపనమ్మక సంస్కృతి ఎక్కువ. కోమటితనం పిసినారితనాన్ని దేశంలో మరో సమస్యగా మార్చింది.’’
నా అభిప్రాయంలో అతడి లక్ష్యం ఏదైనా సరే ఇవి కులోన్మాద వెఱ్ఱి రంకెలే. ఒక జాతినో, ఒక కులాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక వర్గాన్నో, ఒక ఊరినో, ఒక దేశాన్నో, ఒక తెగనో విమర్శిస్తూ ఒక్క మాట అంటేనే రేసిస్టుగా పిలవబడుతున్న ఈ రోజుల్లో వైశ్యుల గురించి భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో పైన చెప్పిన విధంగా పుస్తకం వ్రాయడం, దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకోవడం కూడా రేసిజం క్రిందే వస్తుంది. రేసిజంతో చూసే, వ్రాసే ప్రతిదీ లక్ష్య దిశగా వెళ్ళదు సరికదా విద్వేషాలను పెంచడానికి మాత్రమే తోడ్పడుతుంది.
నా దృష్టిలో నాకు అర్థమైనంతవరకూ ఐలయ్య కుల రేసిస్ట్. క్రైస్తవానికి పరమ భక్తుడు, క్రైస్తవమే ఈ ప్రపంచ సమానత్వానికి మూలకారణం అని మనసా వాచా నమ్ముతున్న వ్యక్తి. లక్ష కోట్ల డాలర్లు యిస్తే భారతదేశాన్ని క్రైస్తవంలోకి మారుస్తాను అని టివి సాక్షిగా ఒప్పుకున్న వ్యక్తి.
లక్ష్యము, దాని సాధించే మార్గమూ వేరు వేరు కావు. మన రాగద్వేషాలని, దురభిమానాలని సామాజిక సమానత్వం సాధించే లక్ష్యంలోకి చొప్పించకూడదు. మార్పు అనేది మననుండే మొదలవ్వాలి.
శ్రీనివాస్ గారూ, నాగేశ్వర్ & రవి గార్లు ఇద్దరిదీ అదే వర్గపోరాట మూస. మీరు పేర్కొన్న "ఆణిముత్యాలలో" కులం పేరు (వైశ్యులు) తీసేసి వృత్తి (వర్తకులు) రాస్తే వీరికి పెద్దగా అభ్యంతరం ఉంటుందా? ఉండదని నా అనుమానం!
Deleteఐలయ్య వ్యాఖ్యలు పూర్తిగా తప్పే కావొచ్చు కానీ విశ్లేషణ కూడా దారి తప్పకూడదు.
‘వర్తకులు’ అనగానే ఐలయ్య లక్ష్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఆ ప్రశ్న కూడా అతడిని వివిధ ఛానెల్స్ యిచ్చిన ఇంటర్వ్యూలలో అడిగారు. అతడు దానికి కూాడా ఒప్పుకోలేదు. భారతదేశంలో ప్రతిదానికీ కులమే కారణం అనేదే అతడి నినాదం, భావజాలం. నేను మీకు చ్చే సలహా ఏమిటంటే, వ్రాసిన వ్యక్తి దేనికి చెందినవాడు, చెందనివాడు అనేది ఆలోచించకుండా నేనిచ్చిన వ్యాసాలన్నీ విషయంపరంగానే చదవండి, చూడండి. ఐలయ్య దేనికి చెందినా, దేనికి చెందకపోయినా నాకు ఇబ్బంది లేదు, పట్టించుకోను. అతడి వ్యాఖ్యల్లో నిజం వుందా, లేదా, అది సమాజంలో విద్వేషాలు పెంచుతాయా, లేదా అనేది నేను చూస్తాను. మీ అంత మేధావితనంగా సామాన్యుడు ఆలోచించలేడు. సామాన్యుడి భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా వుండే ఏ పనైనా ఏ పౌరుడూ చేయకూడదు. మేధావులు అనబడేవారికి ఇంకా ఎక్కువ బాధ్యత వుంటుంది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులున్నాయి. అది మీరు మన రాజ్యాంగం చూస్తే అర్థమవుతుంది. ఐలయ్యకి వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న నిరసనలు కూడా ఆ స్వేచ్ఛ పరిధిని దాటుతున్నాయి. వాటినీ నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందే. వారు కమ్యూనిస్టులు, వీళ్ళు అంబేడ్కరిస్టులు అని ఎవరినైనా ఒక పరిధిలో ఇరికించి వారు చెప్పిన దాన్ని చూడకండి. ఆ పరిమితులు లేకుండా విషయాన్ని విషయంగా చదవండి, అని నా సూచన. నాగేశ్వర్ విశ్లేషణ హెచ్ ఎమ్ టివిలో వచ్చింది. లింక్ యిస్తాను, చూడండి. ఇక్కడ విషయం వ్యాసాలు వ్రాసినవారు దేనికి చెందారా, లేక చెందరా అని కాదు. వారు వ్రాసినదానిలో సత్యం వున్నదా, లేదా అనేది......
Deletehttps://www.youtube.com/watch?v=_hGt9DvkvYM
https://www.youtube.com/watch?v=-SPiayPhq5w
<< సామాన్యుడి భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా వుండే ఏ పనైనా ఏ పౌరుడూ చేయకూడదు. మేధావులు అనబడేవారికి ఇంకా ఎక్కువ బాధ్యత వుంటుంది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులున్నాయి. అది మీరు మన రాజ్యాంగం చూస్తే అర్థమవుతుంది. ఐలయ్యకి వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న నిరసనలు కూడా ఆ స్వేచ్ఛ పరిధిని దాటుతున్నాయి. వాటినీ నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందే. వారు కమ్యూనిస్టులు, వీళ్ళు అంబేడ్కరిస్టులు అని ఎవరినైనా ఒక పరిధిలో ఇరికించి వారు చెప్పిన దాన్ని చూడకండి. ఆ పరిమితులు లేకుండా విషయాన్ని విషయంగా చదవండి, అని నా సూచన. >>
Deletegood suggestion.
@B Sreenivasu:
Delete"భారతదేశంలో ప్రతిదానికీ కులమే కారణం అనేదే అతడి నినాదం, భావజాలం"
నేను చెప్తుంది ఇదే. అమ్మయ్య, మనిద్దరి మధ్య దీంట్లో ఏకాభిప్రాయం కుదిరింది.
హెచ్చు శాతం "మేధావులు" వాడే వర్గపోరాటం నమూనా బదులు ఈయనది కులపోరాటం పంధా. మీరు ఇచ్చిన ఉదాహరణలు దాదాపు అన్నీ ఇలాంటి వారే. ఇదొక్కటీ వదిలేస్తే వీళ్లూ చెప్పేది ఇటువంటిదే. భాష "సరళత" మూలాన విషయం బయటకు అగుపించదు అదే తేడా.
నేను ఐలయ్య ప్రస్తుత వివాదాస్పద రాతను చదవలేదు & సమర్తించలేదు. నా గొడవంతా ఐలయ్య విమర్శ ముసుగులో మరో భావజాలం (కమ్యూనిస్ట్ లేదా సనాతన) పైకి రావడమే.
అందరికీ "అజెండాలు" ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త :)
రాజ్యాంగం, భావ ప్రకటన హద్దులు వగైరా విషయాలు ఇంకోసారి చర్చిద్దాం. మనకు నచ్చిన & మనం మెచ్చిన నియమాలను మనకు నచ్చని మనుషులు & రుచించని విషయాలకు అన్వయించడం ద్వారా బాగా అర్ధం అవుతాయి.
మీ నాన్నగారున్నారా? అన్నదానికి మీ అమ్మ మొగుడున్నాడా? అన్నదానికి అర్ధం ఒకటే అయినంత మాత్రాన రెండూ సమాన వాక్యాలు కావు.
ReplyDeleteకొండలరావుగారూ, పైన నేనిచ్చిన ఆణిముత్యాలలో ‘నాన్నగారు’ అని ఎక్కడుందండీ? ‘భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోనూ కోమట్లందరూ అమ్మమొుగుడ్లే’ అని వుంది. ఉన్నదొకటే సూటియైన అర్థం. దాన్ని అతడు తన ఇంటర్వ్యూలలో కుండ బ్రద్దలు కొట్టి చెప్పాడు. ‘నాన్నగారు’ అనే భావానికి స్థానం లేనేలేదని కూడా అన్నాడు. అతడికి ఆ మాత్రం consideration తీసుకోవడం కూడా యిష్టంలేదు. అతడు నమ్మింది సూటిగా, స్పష్టంగానే చెబుతున్నాడు. అర్థం చేసుకోలేకపోతే అది మన తప్పు. అతడిది కాదు.
Deleteఅవును. ఐలయ్య వాదన అలాగే ఉన్నది. ఐలయ్య పరిశోధనలో మాత్రం పనికి వచ్చే అంశాలున్నాయి. ఐలయ్య ఆవేదనలో అర్ధం ఉన్నది.
Deleteకోమట్లందరూ అమ్మలకి మొగుళ్ళే అనడంలో మీకు ఆవేదన కనిపించిందా?వింతగా ఉంది!నాన్నలు అనే పదానికి అర్ధం లేనేలేదని తెగేసి చెప్పాక కూడా తను మీకు గౌరవ్నీయుడిగ అకనిపిస్తున్నాడంటే నాకు మీ సంస్కారం మీదనే అనుమానంగా ఉంది.
Deleteఒక సంవత్సరం పాటు మీ బ్లాగు వైపుకు రాను.వచ్చినా కామెంట్లు వేసి ఇక్కడి చర్చల్లో పాలు పంచుకోను!
:)
Deleteహరిబాబు గారూ,
Deleteఆవేదన అన్న పదం అన్ పార్లమెంటరీ పదమా ? మీరు ఎంతో కష్టపడి వ్రాస్తున్నారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కకపోతే మీరు ఇలాగే మాట్లాడగలరా ? ఆయనకి చేతనైనది వ్రాయడం మాత్రమే ! ఎవరి మనోభావాలూ ఆయనకు అవసరం లేదు.వ్రాసేవాడికి ఎందుకు వ్రాసాడో తెలుసు,వాళ్ళకు కావలిసింది ప్రచారం మాత్రమే !