ఫలానా విషయం అని కాదు.... చాలా మంది చాల సందర్భాలలో కొన్ని విషయాలను ప్రశ్నిస్తే సహించలేరు. మరీ బహిరంగంగా చర్చించడం కరెక్టు కాదంటారు? అసలు ప్రశ్నలేకుండా ప్రగతి సాధ్యమా? ప్రశ్నకు భయపడడం దేనికి? కొన్ని విషయాలను (ఏవైనా సరే) మార్మికంగా ఉంచాల్సిన అవసరం ఉందా? ఉంటే ఎందుకు? దయచేసి తెలిసినవారు మాత్రమే చర్చలో పాల్గొనడం మంచిది. అలిగే వారు, ఆగ్రహించేవారు, అరచి సాధిద్దాం అనుకునేవారు... అలాంటి భావంతో పంపించే కమెంట్లు పబ్లిష్ చేయబడవు. ఖచ్చితంగా ప్రశ్నించడం వల్ల ప్రయోజనం, లేదా ఫలానా విషయాలని ఫలానా విధంగా మాత్రమే ప్రశ్నిస్తేనే ప్రయోజనం అనేవి ఉంటే నిరభ్యంతరంగా చెప్పవచ్చు.
- పల్లా కొండలరావు
---------------------
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ఉగ్రవాదులు ఎక్కడైనా అంతే. వాళ్ళని ఎవ్వరూ ప్రశ్నించకూడదు

    ReplyDelete
  2. గుజరాత్‌లో ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడం, ప్రకటన విషయంలో తీవ్ర జాప్యం చేయడం నిష్పాక్షిక సంస్థగా భావించే ఎన్నికల సంఘంపై పలు సందేహాలకు కారణమవుతోంది. గుజరాత్‌లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్ళడం పరిస్థితి తీవ్రతను చెప్తోంది.
    ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కాంగ్రెస్‌కు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారో మర్చిపోయినట్లుగా ఉన్నారు. అప్పటి ఎన్నికల కమిషనర్ జేమ్స్ లింగ్డో మీద తాను చేసిన తీవ్ర ఆరోపణల విషయం మోదీకి గుర్తులేదేమో.

    జేమ్స్ మైకేల్ లింగ్డో క్రైస్తవుడని అందుకే ఆయన మరో క్రైస్తవరాలైన సోనియా గాంధీకి సహకరిస్తున్నారని అప్పటి సీఎం నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై లింగ్డో కూడా తీవ్రంగానే స్పందించారు. "నాస్తికుడనే పదానికి కూడా అర్థం తెలియని ఇలాంటి దిగజారిన నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు" అని ఆయన స్పందించారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top