Name:Chiranjeevi 
E-Mail:
Subject:My question 
Message:
ఏదేశంలోనైనా మైనారిటీలకు ఉండే మతపిచ్చి ఉగ్రవాదం, మెజారిటీలకు ఉండే మతపిచ్చి దేశభక్తి ఎలా ఔతుంది? 

Reactions:

Post a Comment 1. వలలో సాలీడిచటన్
  కలగనె నోయీ జిలేబి కసబిస యనుచు
  న్నిలలో వైషమ్యములకు
  విలువలకు మతములకసలు వీయము గలదో ?

  జిలేబి

  ReplyDelete
 2. ఇతరుల మతాలను అవమానించకుండా తమ మతం పట్ల నిష్టకు పరిమితమై ఉన్నంతవరకు మెజారిటీ ప్రజల యొక్క మతాభిమానానికి ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం మతపిచ్చి అనకూడదు.ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో పడుతునన్ వోట్ల లెక్కని బట్టి గానీ చటసభల్లో శాసనాలు చెయ్యడంవిషయంలో గానీ మెజారిటీ అవ్భిప్రాయానికే విలువ ఇస్తున్నప్పుడు ఆ మెజారిటీ మైనారిటీ అనేవి నిర్ణయించడానికి మీరు మతాన్ని ప్రాతిపదిక తీసుకునప్పుడు మెజారిటీ మతస్థులు తమ మతానికి నాయమైన స్థానాన్ని కోరుకోవడం పిచ్చి ఎలా అవుతుంది?

  మతాలను ఆ మతాలను పాటించే వారి సంఖ్యని బట్టి ఒకటి మెజారిటీ మతం అనీ ఒకటి మైనారిటీ మతం అనీ చెప్పటం సార్వకాలిక సత్యం కానప్పుడు ఇది మెజారిటె మతస్థుల మతపిచ్చి అనీ ఇది మైనారిటీ మతస్థుల మతపిచ్చి అనీ విడదీసి పర్శ్నించడం తప్పు కదా!హరిబాబు భారతదేశంలో ఉన్నంతవరకే మెజారిటీ మతస్థుడు,కానీ పాకిస్తాన్ వెళీతే మైనారిటీ మతస్థుడు అవుతాడు - కాబట్టి మతపిచ్చి అనేది సాపేక్షమైన మాట!

  ఈ తేడాలని తీసేస్తే మతాచారాల్లో హేతుబద్ధతని వెతకడం మానేస్తే సహజంగానే ఒక ప్రాంతంలో ఎక్కువమంది ఒకే మతానికి చెందినవాళ్ళు ఉన్నప్పుడు వారు తమ మతాచారాలను స్వేచ్చగా పాటించుకుంటారు - ఇతరుల నుంచి అభ్యంతరాలు తక్కువ గనక వారు పిచిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉండదు.మెజారిటీ మతస్థులకి మతపిచ్చి ఉండదనటానికి ఈ సాంకేతికమైన కారణమే తప్ప సంఖ్యాబలాన్ని చూసుకుని ఇతర మతస్థులని అవమానించినట్లయితే మాత్రం ఆ మెజారిటీ మతస్థుల్ని కూడా మతపిచ్చిగాళ్ళ కింద లెక్కైంచాల్సిందే!

  ఇక దేశభక్తికి నిర్వచనం ఏమిటి?దేశం బాగుండాలని కోరుకోవటం!మైనారిటీలతో సహా ందరూ పాటించి తీరాల్సిన శాసనాలు మెజారిటీ అభిప్రాయం ప్రకారం జరగటం న్యాయమే అయినప్పుడు దేశభక్తికి నిర్వచనం కూడా మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండటం న్యాయమే కదా!

  ReplyDelete
  Replies
  1. Kool;

   నేను మత పిచ్చి గురించే మాట్లాడాను. మతాభిమానం గురించికాదు..

   మతాభిమానం: తన మతం లో గొప్పదనాన్ని ఇతర మతాలకి చెప్పుకునేవాడు. తన బ్లాగుల్నిండా దాని గొప్పదనం ఉంటుంది

   మతపిచ్చి: ఎప్పుడూ ఎదుటివాడి మతంలో తప్పుల్ని వెదకడంలో జీవితాన్ని గడిపేసేవాడు. వాళ్ళ బ్లాగుల్నిండా అవతలిమతస్థుల తప్పుల గురించి వార్తలు వెదికి పబ్లిష్ చేసుకుంటారు. సహజంగా వీల్లకి ఎక్ష్పోర్ట్ బిజినెస్సు ఉంటుంది. తమల్ని ఖండించినవాళ్ళనందరినీ ఇతర దేశాలకి ఎక్ష్పోర్ట్ చేస్తుంటారు

   Delete
 3. ఏ దేశంలోనో అయితే తెలియదు గాని మన దేశంలో మెజారిటీలకు మత పిచ్చి లేదు. అలా వుంటే కొద్ది శాతంలోని మత పిచ్చగాళ్ళు మత ప్రాతిపదికపై దేశాన్ని నిలువుగా చీల్చుకుపోయినా, ఇక్కడ మత రాజ్యానికి వత్తాసు పలక లేదు మెజారిటీలు. మత ప్రసక్తి లేని ప్రజాస్వామ్య రాజ్యనికే మొగ్గు చూపారు అదే మెజారిటీలు. మత పిచ్చ మెజారిటీలు అయిదే ఇది సాద్యమయ్యేదా..?

  ReplyDelete
  Replies
  1. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపొయినా.. దేశ విభజన కొందరి "రాజకీయ అవసరాల" దృష్ట్యా జరిగింది అంతే గానీ.. మనతాతలు ఓట్లేసి నిర్ణయం తీసుకుంది కాదు.

   Delete
  2. చిరంజీవి గారూ,
   మీరన్నది నిజం!ఎవరి రాజకీయ అవసరాల కోసం జరిగిందో కూడా చరిత్ర తేల్చి చెప్పేసింది - జవహర్ లాల్ నెహ్రూ అనే వ్యక్తి యొక్క రాజకీయ అవసరాల కోసమే ఆ విభజన జరిగింది.

   దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, రెండు సనివేశాల్ని గమనించితే తెలుస్తంది.సుభాష్ చందర్ బోసుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నది కాంగ్రెసేతరులు కాదు.అప్పట్లో ఆ పార్టీ పాటించీన అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం కింద నుంచి పైకి పార్టీ కార్యకర్తలు అతనికి మెజారిటీని ఇచ్చారు.కానీ మహాత్ముడు అది తన ఓటమి అని భావించి పట్టిన నిరాహార్ దీక్షకి జడిసి నెహ్రూ దగ్గిర్నుంచి పటేల్ వరకు పొమ్మనకుండా పొగబెట్టి తనకు తనే రిజైన్ చేసి పోయేలా చేసారు.చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కాంగ్రెస్ లోక్ సభా పక్షం ప్రధానిగా మొదట పటేల్ వైపుకే మొగ్గు చూపింది.బహుశా ప్రధానిగా ఎన్నుకున్నాకనో ఇక అతని ఎన్నిక ఖాయమని తెలిశాకనో గాంధీ నెహ్రూని సమర్ద్జించడం వల్లనే నెహ్రూ ప్రధాని కాగలిగాడు.అద్వానీ జిన్నాని పొగిడినప్పుడు చాలామంది అతను తపు చేశాడని విమర్శించారు గానీ ఒక సమర్ధుడైన వ్యక్తి సమర్ధతాసమర్ధతల్ని పక్కకి పెట్టి కేవలం తనకి నచ్చటం అనే కారణంతో గాంధీ నెహ్రూని ప్రమోట్ చేస్తుంటే ఎలా సహించగలడు?ఒక చిన్న పాటి కంపెనీలో ప్రమోషన్ల కోసం జరిగే పోటీలో ప్రతివాడూ తనని తను ప్రొజెక్ట్ చేసుకోవదానికి ఎన్ని ఎత్తులు వేస్తున్నారు?జిన్నా తనకన్న ఎందులోనూ గట్టివాడు కాని నెహ్రూని ప్రమోట్ చేస్తుంటే భరించలేకనే ముస్లిం లీగ వైపుకి జరిగాడు జిన్నా.గాంధీ జిన్నా కన్న నెహ్రూని ఎక్కువ ప్రొజెక్ట్ చెయ్యటానికి సరైన కారణాలు లేకపోవటంతో చూసేవాళ్ళకి,ముఖ్యంగా జిన్నాకి దానికి కారణం నెహ్రూ హిందువై జిన్నా ముస్లిం కావడమేనని అనిపించడం సహజమే కదా!

   తొలిరోజుల్లో జిన్నా హిందూ ముస్లిం ఐక్యత కోసం వేసిన ప్లాన్ కాంగ్రెస్ అమలు చేసి ఉంటే దేశం విడిపోయేవరకు వచ్చేది కాదు.దేశాన్ని విడగొట్టాల్సిన అవసరం వచ్చాక కూడా కొంత సమయం తీసుకుని చేసి ఉంటే విభజన అంత భయంకరంగా జరిగి ఉందేది కాదు.నెహ్రూ పదవీ కాంక్షయే జిన్నాని సైడ్ లైన్ చెయ్యటానికీ విభజనలో జరిగిన తొందరకీ కారణం.నీహారిక గాంధీ బోడిగుండు మీద చిన్న జోకు వేసినందుకే శ్యామలీయం దగిర్నుంచి అందరూ గోల చేసి యాగ్రిగేటర్ నుంచి వెలివేసే వరకు వెళ్ళారు గానీ గాంధీ చేసింది అప్పటి సంపన్న హిందువులకి రాజుల వేషాలకి బదులు పార్లమెంటేరియన్ల వేషాలు వేసి అధికారంలో కూర్చోబెట్టడమే.అటువైపు ముస్లిం లీగులో ఉన్నది కూడా సంపన్న కులీన కుటుంబాల వారే - రాజకీయ సంస్కృతిలో అందరూ ఒక్కటే.

   వేషాలు మాత్రమే మార్చిన పాతకాలపు రాజవంశీకులు మన రాజకీయ నాయకులు - వందిమాగధులూ వంశపారంపర్యతతో సహా అంతా అదే వైభవం!

   P.S:"మనతాతలు ఓట్లేసి నిర్ణయం తీసుకుంది కాదు" - మీకు అసలు జరిగినది తెలియదు కాబోలు,పాకిస్తాన్ ఏర్పాటుకు రిఫరెండం అని భావించే 1937 ప్రావిన్షియల్ ఎనికల్లో మన తాతలు(ముస్లిములు కూడా+ పాకిస్తాన్ ఏర్పాటుకు వ్యతిరేకంగానే ఓటు వేశారు.

   దేశ విభజన తప్పనిసరి అనిపించటానికి జరిగిన జగన్నాటకం నడిచింది 1940ల తర్వాతనే!

   Delete
  3. >>ముస్లిములు కూడా+ పాకిస్తాన్ ఏర్పాటుకు వ్యతిరేకంగానే ఓటు వేశారు.

   హరిబాబుగారూ! నేను చెప్పాలనుకున్నది కూడా అదే. ప్రజలు ఇలాంటి మతాల పేరుతో జరిగే విభజనల మీద ఆసక్తి లేదని అందరూ తెలుసుకుంటే చాలు.

   Delete
 4. మతపిచ్చికి, దేశభక్తికి ముడిపెట్టి అడిగిన విధానం బాగుంది. ఎవడు ఎలా రియాక్ట్ కావాలో అర్ధంగాక తన్నుకుంటున్నారు.

  ReplyDelete
  Replies
  1. స్పందించినందుకు ధన్యవాదాలు. నేను ఎవరికీ వ్యతిరేకంగా లేను. జనాలు మతపిచ్చికి, మతాభిమానాని మధ్య ఉండే భారీ తేడాని తెలుసుకోవాలన్నదే నా కోరిక.

   శ్యామలీయం గారు నా అభిమాన బ్లాగరు.

   Delete
 5. జరిగిందేదో జరిగిపొయింది. ఇప్పటికైనా బ్లాగర్లు తమ బ్లాగులో మత/మతస్తుల వ్యతిరేక పోష్టులు, కామెంట్లు తీసివెయ్యండి. ఒక మంచి సాంప్రదాయం బ్లాగుల్లో నిర్మించడానికి నాంది పలకండి. _/\_

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top