ప్రార్ధనలతో రోగాలు నయమవుతాయా!?
 • విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా మరోవైపు అజ్ఞానం దాని ఆధారంగా కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. వీటిలో ఆరోగ్యంతో చెలగాటమాడే ప్రమాదకర అంశాలుండడం దారుణం.
 • ఏ రోగమున్నా స్వస్తత కూటములకు వస్తే దేవుడు అద్భుత మహిమలు తో నయం అవుతాయనడం దారుణం కాదా? దేవుడు అనే భావన వేరు. దేవుడు పేరుతో సాగే అజ్ఞానం వేరు.
 • గతం లో వేలు ముంచే స్వామి పేరుతో ఓ దొంగ స్వామి నీటిలో వేలు ముంచి ఇస్తే ఆ నీటిని త్రాగితే ఏ రోగమైనా పోతుందని ప్రచారం చేస్తే చాలా మంది అమాయకులు బలయ్యారు. ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. తర్వాత ఆ దొంగ స్వామిని అరెస్ట్ చేశారనుకోండి. ఎన్ని సార్లు మోసపోయినా ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు.
 • విశ్వాసం - స్వాంతన అనేదానికి శక్తి ఉన్నా.... అన్ని రోగాలు దానివల్ల తగ్గుతాయనేదానిని మీరు ఎంత మేరకు విశ్వసిస్తారు?

ప్రార్ధన అనేది రోగాన్ని నయం చేయడంలో ఎంతమేరకు పాత్ర వహిస్తుంది? 
ఈ పేరుతో జరిగే మోసాలను అరికట్టేదెలా?

Palla Kondala Rao,
28-11-2014

*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. రోగనివారణలో అనేక అంశాలున్నాయి.

  మందులు (సరైనవి వాడటం, సరియైన విధంగా వాడటం వగైరా) ప్రముఖపాత్రను పోషిస్తాయన్నదాంట్లో అతిశయోక్తి ఎంతమాత్రం ఉండదు.

  అలాగే రోగియొక్క మానసిక స్థితి కూడా ముఖ్య భూమికను పోషిస్తుందన్నదీ‌ నిజమే. దీనిని విస్మరించరాదు. రోగి యెంత ధైర్యంగా ఉంటే ఎంత విశ్వాసంతో ( అనగా మందుల పట్లా, వైద్యుల పట్లా వగైరా అన్నమాట) ఉంటే రోగాన్ని ఎదుర్కొని పోరాడి గెలిచేందుకు ఆ రోగికి అంత హెచ్చుగా అవకాశం ఉంటుంది. మనషి అంటే ఒక భౌతిక శరీరమే కాదు, మనస్సు కూడా అందులో‌ భాగమే. మనస్సు ధృఢంగా ఉంచేందుకు సాయపడే అన్ని అవకాశాలనూ వైద్యశాస్త్రం ప్రోత్సహిస్తుంది.

  ప్రార్థన అనేది రోగికి మానసికంగా ధృఢత్వాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించినది. దానికి కారణం రోగికి కల మత విశ్వాసాలు కారణం ఐనంతమాత్రాన ఆ అవకాశాన్ని వైద్యశాస్త్రం మూఢంగా వెలివేయదు.

  ఐతే ఈ అవకాశాన్ని కొందరు స్వార్థప్రయోజనాలకోసం దుర్వినియోగిస్తున్నారు. దానిని మనం‌ తప్పకుండా నిరోధించాలి. అంతే‌ కాని లోపం ప్రార్థన అనే ఒక ప్రక్రియ శాస్త్రీయమా కాదా అన్న పిడివాదం అనవసరం.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారు, మీరు పొరబడుతున్నారనిపిస్తోంది. మరోసారి ఆలోచించాలని మనవి. మనసు ప్రధానమైనవాడే మనిషి. జంతువులనుండి మనిషిని వేరు చేసేదీ ఈ అంశమే. మనసు గురించి ఇప్పటికి కొంత మాత్రమే శాస్త్రీయంగా మనకు తెలుసు. తెలుసుకోవలసింది చాలా ఉంది. ప్రార్ధన అనేది డెఫినెట్ గా మనిషికి ముఖ్యంగా మనసుకు సాంత్వనను ఇస్తుంది. మనిషిలోని అద్భుతమైన అంతర్గత శక్తిని తట్టిలేపుతుంది. ప్రార్ధన అంటే దేవుడి పేరుమీదనో మతం పరంగానో మాత్రమే కానవసరం లేదు. అంత:చేతనను చైతన్యపరచుకునే స్వీయ చర్చ ఏదైనా (దీనినే ఆత్మ విమర్శ లేదా ఆత్మావలోకనం అనికూడా అనవచ్చేమో) ప్రార్ధన అవుతుందని నా అభిప్రాయం. హీలింగ్ పవర్ కూడా చాలావరకు శాస్త్రీయమని నిరూపించబడుతుంది. అయితే ప్రార్ధన పవర్ వేరు. ప్రార్ధనతో లేదా ప్రార్ధన పేరుతో అనీ రోగాలూ నయమవుతాయని చెప్పడం వేరు. ప్రారధనను గురించిన చర్చ ఎట్టిపరిస్తితిలో పిడివాదం కాదు. నిజానికి ఈ వాదనవల్ల ప్రార్ధన పవర్ ఏమిటో నిరూపించవచ్చు. ప్రార్ధన పవర్ ని ఎవరు మరుగుపరుస్తున్నారో తెలియపరచవచ్చు.

   Delete
  2. కొండలరావుగారు, పునరాలోచనకు నాకు అభ్యంతరం లేదు. కాని ఏ విషయంలో పొరబడుతున్నా ననుకుంటున్నారో సూచించ వలసింది. ప్రస్తుతం ఉన్న పనుల ఒత్తిడి వలన ఈ విషయంలో ఆలోచించటానికి ఎక్కువ సమయం ఇవ్వలేక పోతున్నాను. అందుచేత మీ సూచన మరింతగా అవసరం అవుతున్నది.

   Delete
  3. < ప్రార్థన అనే ఒక ప్రక్రియ శాస్త్రీయమా? కాదా? అన్న పిడివాదం అనవసరం. > మీ వ్యాఖ్యలో ఈ అంశంపైననే నా అభ్యంతరం. మిగతా భాగం తో ఏకీభవిస్తున్నాను. ఉదాహరణకు ఆక్యుపంచర్ కు చైనా, జపాన్, కొరియాలలో ఉన్నంత లీగాలిటీ ఇండియాలో లేదు. ప్రార్ధన అనేది మనసుకు ఎలా ఎంత పవర్ ఇస్తుందనేది శాస్త్రీయంగా నిరూపించలేమా? ప్రార్ధనలవల్ల మనసుకు పవర్ వస్తున్నది నిజమైనప్పుడు దానిని శాస్త్రీయంగా నిరూపించాలంటే చర్చ అనేది పిడివాదం కాదు. అసలు ప్రార్ధనవల్ల మనసుకు ఏ పవరూ రాదు అంటే పిడివాదమవుతుంది. ప్రార్ధనలతో సకల రోగాలూ నయం కావు. వైద్య విధానాలు ఏవైనా ప్రార్ధన అనేది వైద్య ప్రక్రియకు లేదా శరీరానికి ఉండే ఆటోమేటిక్ మెకానిజానికి ఊతంలా పని చేస్తుంది. కొన్నింటికి ముఖ్యంగా మానసిక సమస్యలకు మందులా కూడా పని చేస్తుంది. అయితే ప్రార్ధన లేదా ఆత్మవిశ్వాసం కలిగించే మాటలు లేదా అధ్యయనం ఇలాంటివేవైనా రోగికి లేదా ప్రజలకు మంచినే చేస్తాయి.

   Delete
  4. మాస్టారు చెప్పినట్టు రోగి మానసిక స్థితి పాత్ర ఖచ్చితంగా ముఖ్యమే. అయితే దీని పాత్ర ఆపరేషన్లలో ఎక్కువ మామూలుగా తక్కువ ఉండవచ్చని నా అనుమానం.

   Delete
  5. ధైర్యం వల్ల బి.పి. కొంచెమే తగ్గుతుంది. ఇతర రోగాలు ధైర్యం వల్ల తగ్గే అవకాశం లేదు. క్షుద్ర పూజలు చేసేవాళ్ళకి కూడా ధైర్యం ఎక్కువే ఉంటుంది. కేవలం ధైర్యం కోసమైతే క్షుద్ర పూజలు కూడా చెయ్యొచ్చు.

   Delete
  6. దొంగతనాలు చేసేవారికి కూడా ధైర్యం ఎక్కువే. కేవలం ధైర్యం కోసమైతే దొంగతనాలు కూడా చెయ్యొచ్చు!

   Delete
  7. ఎవరు కాదన్నారు? రోగం తగ్గడానికి ధైర్యం కూడా ముఖ్యమే అని బి.వి. పట్టాభిరాం అనే హిప్నాటిస్ట్ చెపితే, మనవాళ్ళు పిడుక్క్కి కూడా అదే మంత్రం అన్నట్టు సర్వ రోగాలకీ అదే థెరపీ అని తేల్చేసారు కదా.

   Delete
 2. తాడూబొంగరం లేని చిట్ ఫండ్ కంపెనీలు బోర్డ్ తిప్పేసి తమ ఖాతాదారుల్ని ముంచేసి పరారవుతున్న సంగతి న్యూస్ పేపర్లలోను, హోరెత్తించే టీవీ ఛానెల్స్ లోనూ చూస్తూనే ఉంటారు. అయినా కూడా, మరో కొత్త కంపెనీ పుట్టుకొస్తే దాని ఆఫీసులోనుంచి బయట రోడ్డు మీద పేవ్ మెంట్ దాకా క్యూ కట్టి మరీ సభ్యులుగా జేరట్లా? అల్లాగే రోగాలు నయం చేస్తామనే బాబాలు / స్వామీజీలు, స్వస్ధతా కూటములున్నూ. జనాల వెర్రినమ్మకము, ఆశ, గొర్రెదాటు మనస్తత్వం కాష్ చేసుకోవటం జరుగుతూనే ఉంటుంది, ఆగటం కష్టం.

  ReplyDelete

 3. దొంగ స్వాముల వారి ఉదంతముల ప్రక్క న బెట్టి ,

  సరియైన జవాబు చూడవలె నన , ఖచ్చితము గా ప్రార్థన లో రోగములు సరి యగును !

  ఎటువంటి రోగములు ఐనను సరి యగునా అనునది డాటేరు బాబులు ప్రార్థన జేసి గాని జెప్ప లేమందురు !!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. లెస్సబలికితిరి జిలేబి గారు. ధన్యవాదములు.

   Delete
 4. శరీరానికి తనంత తాను నయం చేసుకునే గుణం ఉంటుంది. ఆ గుణం వల్లనే అడవి జంతువులు ఎలాంటి వైద్యం లేకుండానే రోగాలను నయం చేసుకొగలుగుతాయి. అలా నయం కానపుడు చావ వలసి రావచ్చు కూడా.

  సరిగ్గా ఈ నయం చేసుకునే గుణం మీద ఆధారపడే, భూత వైద్యులు, బాబాలు వగైరా తమ వ్యాపారం సాగిస్తుంటారు. నయం అయితే తమ గొప్ప, కాకపొతే ప్రారబ్దం.

  ఇక పొతే మానసిక బలాన్ని కూడా తక్కువగా చూడలేం. రోగి మానసిక బలాన్ని కోల్పోయి డిప్రెషన్ లోనికి వెళ్తే శరీరంలో కూడా రోగాన్ని తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. అటువంటి మానసిక బలం కేవలం ప్రార్థన వల్లనే రానవసరం లేదు. డాక్టరు ఇచ్చే భరోసా వల్ల రావచ్చు, మంచి ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం పొందుతున్నాను అన్న ధీమా వల్ల రావచ్చు, బంధు మిత్రులు తనకు అండగా ఉన్నారన్న ధీమా వల్ల రావచ్చు.

  మిగతా ప్రయత్నాలేమీ లేకుండా కేవలం ప్రార్థన మీద ఆధారపడడం గాలిలో దీపం లాంటిది.

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ చారి గారు, మీ వివరణ బాగుంది.

   Delete
  2. Of course, ప్రార్ధన effect and the placebo effect yield the same results.

   But when the experiments were were double blinded, the results revealed that the results were quite random. And when the patients did know that their relatives were praying for them, their situation deteriorated much further- perhaps because they suffered a performance anxiety.

   Delete
  3. శ్రీనాథ్ గారు చెప్పినది మీకు తెలుగులో అర్థమయ్యేలా చెపుతాను. ప్రార్థన ప్రభావమూ, నాటు మందు ప్రభావమూ ఒకటే. ప్రార్థన చేస్తూ అల్లోపతి మందులు వేసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో, నాటు మందు వేసుకుంటూనే అల్లోపతి మందులు వేసుకుంటే అదే ఫలితం వస్తుంది.

   Delete
  4. తెలుగులో చెప్పినందుకు ధన్యవాదములు ప్రవీణ్ గారు.

   Delete
 5. ప్రార్థన వల్ల రోగాలు నయం అవ్వవు కాని, రోగభయం తగ్గి వైద్యానికి మద్దతు లభిస్తుంది.

  ReplyDelete
 6. దెయ్యాలు లేవు అనే నిజం తెలుసుకుని అర్థరాత్రి మసానంలో ధైర్యంగా పడుకోవడం మంచిదా? లేదా మెడలో హనుమంతుని బొమ్మ ఉన్న గొలుసు వేసుకుని, మస్జీద్‌లో సాహెబు మంత్రించిన తాయెత్తు చేతికి కట్టుకుని, అలా కృత్రిమ ధైర్యం కూడగట్టుకుని అర్థరాత్రి మసానంలో పడుకోవడం మంచిదా?

  స్వైన్ ఫ్లూ వచ్చిన రెండు రోజుల్లోపే ఆసుపత్రిలో చేరితే అది తప్పకుండా తగ్గుతుంది, తగ్గుతుందనే నమ్మకం లేనివానికి కూడా. ఇక్కడ నమ్మకం ఉండడం, లేకపోవడం అనే తేడాల వల్ల పరిస్థితిలో తేడా ఏమీ రాదు కదా.

  ReplyDelete
  Replies
  1. ధైర్యం విషయ నిర్ధారణ చేసుకోగలిగేవాడికి మీరు చెప్పినట్లు వస్తేనే మంచిది నిస్సందేహంగా. కానీ అంత స్థాయి లేనప్పుడు విపరీత భయం తో ఉన్నదానిని తాయత్తు వల్ల వల్ల వచ్చే క్రుత్రిమ ధైర్యం పోలిస్తే కొద్దిగా బెటర్. దెయ్యలతో భయపెట్టేదీ , తాయత్తుతో క్రుత్రిమ ధైర్యాన్నిచ్చేదీ ఈ సమాజంలోని ఓరకపు భావజాలమే. దానిని చైతన్యం పెంచడం ద్వారా మాత్రమే అడ్డుకట్టవేయగలం. ఇందులో స్వీయ కృషి ఉన్నవాడికి ఈ భయం త్వరగా వదులుతుంది. అయితే రోగం తగ్గడానికి రోగి విశ్వాసం పాత్ర ప్రధానమే. అటువంటప్పుడు తాయత్తు కట్టుకుని మందులు వేసుకుంటే నష్టం లేదు. తాయత్తు మహిమపై మూఢవిశ్వాసంతో మందులే మానేస్తే ప్రమాదం. ఇదొక భాగమైతే ప్రజల మూఢవిశ్వాసాల ఆధారంగా నకిలీగాళ్లు వ్యాపారం చేసుకోవడం మరో భాగం. ఏ రోగమైనా సైన్స్ అవసరం లేకుండానే స్వస్తత కూటములతో బాగు చేస్తాననడం ఇంకొకటి. సాంప్రదాయ వైద్య విధానాలలో అసలు ఏ విజ్ఞానం లేదనడం తప్పవుతుంది. కానీ సైన్స్ డెవలప్ అయ్యాక సాంప్రదాయ వైద్యవిధానంలో ఏది మంచిదో, ఏది ఎంతమేరకు పనికివస్తుందో, మందులతో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కనుక సాంప్రదాయంలోని మంచిని ఎంతమేరకు మంచిగా ఉపయోగించవచ్చో చూడవచ్చు. కానీ సైన్స్ కూడా ఇంకా ప్రజా సైన్సుగా అందుబాటులోకి రావడం లేదు. సైన్స్ కూడా సామాన్యుల పక్షానికి ప్రజా పక్షానికి అంబుబాటులోకి వస్తే సంప్రదాయంలోని మంచిని కొనసాగిస్తూ మనుషులలోని మనసులలోని అజ్ఞానాన్ని పోగొట్టేందుకు సహాయకారిగా ఉంటుంది. ఆ దిశగా ఇంకా ఎక్కువ కృషి జరగాల్సి ఉన్నది.

   Delete
  2. HIV లాంటి విషజ్వరాలు తప్ప అన్ని రోగాలూ అల్లోపతి మందులకి తగ్గుతాయనే నిజం తెలిస్తే ఒక పక్క దేవుణ్ణి నమ్ముకుంటూ ఇంకో పక్క మందులు వేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? వైరస్ అనేదే సగం జీవం - సగం నిర్జీవం అయిన పదార్థం. అది మందులకి అంత సులభంగా చావదు. HIV అనేది సాధారణ వైరస్ కంటే జఠిలమైనది కనుక అది మందుల వల్ల మాయమవ్వదు. దేవుణ్ణి నమ్మినంతమాత్రాన అసాధ్యాలు సుసాధ్యాలైపోవు, దాని వల్ల కృత్రిమంగా ఎంత ధైర్యం కూడినా సరే.

   Delete
 7. scientifically proved that prayers will be answered. We should know how to pray. Strong faith,belief are needed.Srinivas 9441481014

  ReplyDelete
 8. స్వస్థత సభలకెలితే మందులు వాడొద్దు అని చెప్పే క్రైస్తవ పూజారుల్ని చూశాను. ఎందుకలా అంటే "మరి రోగం తగ్గితే... అది దేవుడివల్లా లేక డాక్టర్వల్లా అని తెలిసేదెలా?" అంటారు. కానీ వీళ్ళు మాత్రం వాల్ల రోగాలకి మాత్రం., హాస్పిటల్ కి పోతారు. ఇంతకంటెస్ ఋజువులు కావాలా.. ప్రార్ధనలకి రోగాలు తగ్గవనీ?

  ReplyDelete
  Replies
  1. హిందుత్వవాదులు ఇంత కంటే మొండి. వాళ్ళు గంగాజలంలోని బాక్టీరియాతో వైరస్‌ని చంపొచ్చు అంటున్నారు.

   Delete
 9. అవకాశాలుండచ్చేమో 😁? మన గంగానదీ జలాలు విపరీతంగా కలుషితం అయిపోయాయి కాబట్టి ఆ జలాలతో వైరస్సులను చంపినా చంపొచ్చేమో లెండి 😁.

  ReplyDelete
  Replies
  1. Even if Amazon river is polluted at that rate, it's water can also kill virus.

   Delete
 10. కోకాకోలా, పెప్సీ వగైరా సాఫ్టుడ్రింకులు విషపూరితమని అ మధ్య విపరీతంగా ప్రచారం జరిగింది, విడియోలు తిరిగాయి కదా. వైరస్సులను చంపటానికి అటువంటి డ్రింకుల్ని వాడచ్చేమో అనే ఆలోచన రాలేదా జనాలకు? 😁😁

  ReplyDelete
  Replies
  1. బాగా పెప్సీకోలాలు తాపించి, గంగానదిలో ముంచితీసి, ప్రార్ధన చేపిస్తే... ఎటువంటి రోగమైనా మాయం.

   Delete
  2. వేక్సీన్‌లు తయారు చేసేవాళ్ళు కొన్ని రకాల బాక్టీరియానీ లేదా వైరస్‌ని నిర్వీర్యం చేసి, దానితో వేక్సీన్ తయారు చేస్తారు. ఆ రకం బాక్టీరియా లేదా వైరస్ మన ఇంటి ఎదురుగా మురికి కాలువలో కూడా దొరుకుతుంది. అంత మాత్రాన మురికి కాలువ పవిత్రమైపోదు. గంగా నదిలోని బాక్టీరియాకి వేక్సినేషన్‌తో లింక్ పెట్టడం అంటే బోడి గుండుకీ, మోకాలికీ......

   Delete
  3. గంగా నదిని శుద్ధి చెయ్యాలని డిమాండ్ చేసే కొన్ని సంఘాలవాళ్ళు గంగా నది నుంచి బాక్టీరియాని సేకరించి దానితో వేక్సీన్‌లు తయారు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. సైంటిస్టులు అందుకు ఒప్పుకోవడం లేదు. చిత్రవిచిత్రమైన బాక్టీరియా రకాలైతే ముంబై మురికివాడల్లో కూడా ఉంటాయి. గంగా నది నీటిలో దొరికే బాక్టీరియా మాత్రమే వేక్సీన్‌ల తయారీకి పనికొస్తుందనడానికి ఆధారాలు లేవు. వీళ్ళు మందుల విషయంలో కూడా మత నమ్మకాలని రుద్దితే సైంటిస్టులు ఏమి చెయ్యగలరు?

   Delete
  4. "వేక్సీన్‌లు తయారు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు."

   పైసలు ఎవడు పెట్టాలంటా?

   Delete
  5. వాళ్ళు దొంగ నోట్లు ముద్రించి ఖర్చు పెట్టినా ఆ కష్టం కూడా గంగలో మునుగుతాది. బాక్టీరియాని నీటి నుంచి వేరు చేసినా అక్కడ మిగిలి ఉన్న మలమూత్రాల వ్యర్థాల వల్ల బాక్టీరియా మళ్ళీ పెరగగలదు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top