----------------------------------
అంశం - 'రాజీనామా' పదం అర్ధం తెలుసుకోవడం
పదం పంపిన వారు - Praveen
----------------------------------
example:


తెలుగు పత్రికలు "రాజీనామా" అనే పదాన్ని పదవీత్యాగం అనే అర్థంతో వాడుతున్నాయి. నిజానికి రాజీనామాకి పదవీత్యాగంతో సంబంధం లేదు. పెర్సియన్ భాషలో రాజీ అంటే అంగీకారం, నామా అంటే పత్రం, రాజీనామా అంటే agreement. హిందీ, ఒడియా భాషల్లో రాజీనామా అనే పదాన్ని agreement అనే అర్థంతోనే వాడుతారు. ఒరిస్సాలోని మా ఊరిలో అందరూ agreementని రాజీనామా అనే అంటారు. పదవీత్యాగాన్ని హిందీలో ఇస్తీఫా లేదా పదత్యాగ్ అంటారు తప్ప రాజీనామా అనరు. హైదరాబాదీ ఉర్దూ శబ్దాలని సరిగా వినకుండానే తెలుగులో చేర్చడం వల్లే తెలుగులో ఈ పరిణామం జరిగి ఉంటుందని నేను అనుకుంటాను. మీ అభిప్రాయం తెలుపగలరని విజ్ఞప్తి.
                                                   *Re-published

Post a Comment

 1. You are right! రాజీనామా అంటే ఒప్పందపత్రమ్మాత్రమే!

  కానీ ఒకే పదానికి వేర్వేరు భాషాల్లో వేర్వేరు అర్ధాలుండడం సహజమే. ఉదాహరణకి ఇంగ్లీషులో gourmet restaurant అని రాస్తుంటారు. ఒక ఇంగ్లీషువాడిని gourmet అనంటే వాడు పొంగిపోతాడు. అదే ఒక ఫ్రెంచివాడిని ఆమాటంటే కర్రిచ్చుకు వెంటబడతాడు (ఆమాటకి ఫ్రెంచిలో 'తిండిబోతు' అని అర్ధం. ఫ్రెంచి వాణ్ణి తిండి విషయంలో పొగడాలంటే connoisseur అని అనాలి).

  ReplyDelete
 2. బహుశా ఆ పత్రాన్ని అవతలివారు ఆమోదిస్తే ఇవతలివారు పదవి లేని స్థితితో రాజీపడాల్సిన దుస్థితిలో ఉంటారు కాబట్టి ఆ పత్రానికి రాజీనామా అని వాదటం కరెక్టేనేమో:-)

  ReplyDelete
 3. "తిండిబోతు" అర్ధంలో gourmet కాదు, gourmand అంటారనుకుంటాను ఫ్రెంచ్ భాషలో కూడా.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top