2018 కు స్వాగతం ! 
జయించేందుకు మనకో ప్రపంచం ఉంది !!
మారనిది మార్పు ఒక్కటే 
నిరంతరం పురోగమిద్దాం 

ప్రతి అనుభవమూ ఓ పాఠమే
ప్రతి పాఠమూ కొందరికి ఉపయోగమే

మనిషికి ఓ మనసు ఉంటుంది
ప్రతి మనసూ అభిప్రాయాలను కలిగి ఉంటుంది

అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్యం
కించపరుస్తూ గొంతునొక్కాలనుకునే ధోరణులు దుర్మార్గం

వందపూలను వికసించనిద్దాం
వేయి భావాలను సంఘర్షించనిద్దాం

జ్ఞానోన్మాదం - మతోన్మాదం మనుషులకు హాని చేసేవే
అతిగా వాదించే జ్ఞానులకన్నామితంగానైనా సహకరించే సంప్రదాయ, సాదాజీవులే మిన్న

జ్ఞానముండీ చేయూతనివ్వలేని ముసుగు వీరులు మనకు శత్రువులు
స్పందనతో తోచింది ఆచరించి, ఆదరించే అల్పజ్ఞానులే మన మేలుకోరే మిత్రులు

జయించేందుకు మనకో ప్రపంచం ఉంది
అందరికీ 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు


అవసరమైన అన్నింటా అందరిలో మార్పు రావాలని కోరుకుంటూ... బ్లాగు అంటే ఏమిటో సరిగా తెలీకుండా 2011 జూన్ లో బ్లాగుల లోనికి ప్రవేశించి అనేక ప్రయోగాలు చేసి బ్లాగులపై కనీస అవగాహన పెంచుకునేందుకు ఇప్పటి దాకా ఓపికగా సహకరించిన తెలుగు బ్లాగర్లందరికీ ధన్యవాదములు. 
 పల్లా కొండల రావు
Reactions:

Post a Comment

 1. ముందుగా కొండలరావుగారు మీకు,మీ బ్లాగు ద్వారా బ్లాగు మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  "అతిగా వాదించే ఙానులకన్నా మితంగానైనా సహకరించే సాంప్రదాయ సాదా జీవులే మిన్న".బాగుంది.మీరు వ్రాసినవన్నీ అంగీకరించే సత్యాలే. కానీ అంగీకరించేవారెవరు?ఆచరించే వారేరి?ఏనాటి నుండీ చదువుకుంటున్నాం,"సొంతలాభం కొంత మనుకు పొరుగువారికి తోడు పడవోయి"అని ఎంతవరకూ ఆచరిస్తున్నాం.పక్కనవాడికి సహకరించకపోఇనా పరవాలేదు,కీడు తలపు చేయకుండా వుంటేచాలనుకునే రోజుల్లో బతుకుతున్నాం.కాదంటారా?

  ReplyDelete
  Replies
  1. అంగీకరించేవారూ, ఆచరించేవారూ ఉన్నారనడానికి సాక్ష్యం ఈ పోస్టుకు మీరుంచిన కామెంటే. " స్వార్ధమే ఈ అనర్ధదాయకం - అది మాపుకొనుటే క్షేమ దాయకం " అన్నాడు శ్రీ శ్రీ ఓ సినిమా పాటలో. మానవ సహజంగా ఉండే కొద్ది స్వార్ధాన్ని సైతం లేకుండా చేసే మానవ సమాజ వ్యవస్థ ఏర్పడే వరకూ ఈ అవస్థలు తప్పవు. కీడు చేయకూడదనే తలంపునుండి ఒక్కరి కోసం అందరూ...అందరికోసం ఒక్కరూ అంటే ఒకే కుటుంబం-ఒకే సమాజం ఉండే ప్రపంచం ఏర్పడేలా మనుషులంతా కలసి నిరంతరం ప్రయత్నించాల్సి ఉంది. అందుకు మనవంతు సహకారం అందిద్దామండీ అవసరమైనప్పుడల్లా ఉడుతా భక్తిగా. ముందుగా హేపీ న్యూ ఇయర్ చెప్పిన మీకు ధన్యవాదములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు లక్ష్మీ'స్ మయూఖ గారు.

   Delete
 2. నూతనహూణవత్సరశుభాకాంక్షలు!
  అన్నట్లు, "ప్రజ అందరికీ" అనకూడదండీ, "ప్రజ లందరికీ" అనాలి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు శ్యామలీయం గారు. ప్రజలందరికీ లేదా ప్రజకు అనవచ్చనుకుంటున్నాను. మీరు చెప్పినట్లు సరిచేశాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

   Delete
  2. ప్రజ అని జాత్యైకవచనంగా చెప్పినప్పుడు 'ప్రజ యంతటికీ' అనాలి. అందరికీ అని బహువచనంలో చెప్పేటప్పుడు దానిముందు ప్రజలు అని బహువచన రూపమే వాడి 'ప్రజ లందరికీ' అనాలి. 'ఇద్దరు తమ్ముళ్ళకి' అంటాం కాని 'రెండు తమ్ముళ్ళకి' అనం‌ కదా, అలాగన్నమాట.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top