చర్చకు ఉంచిన పదం : అవునా! 
పదం పంపినవారు : శివరామప్రసాదు కప్పగంతు.
example:

అవునా! అనే పదం సమంజసమైనదేనా?

Name:శివరామప్రసాదు కప్పగంతు  
E-Mail:deleted  
Subject:\\"అవునా\\" అన్న పద వాడకం సమంజసమైనదైనా  
Message:
1970 దశకంలో \"అవునా\" అనే మాట పెద్దగా వాడకంలో లేదు. నేనెప్పుడూ ఎవరన్నా \"అవునా\" అని ఆశ్చర్యపోవటం వినలేదు. ఈ మధ్య కాలంలో \"అవునా\" అన్న పదం \"అలాగా\" అనే ఆశ్చర్యపోయ్యే సందర్భంలో వాడెయ్యటం ఎక్కువగా వినపడుతున్నది.

అవును అనే మాట ఒప్పుకోలు. అక్కడ నుంచి అవునా అని దీర్ఘం ఇచ్చి సాగతీసి మాట్లాడితే కొత్త పదం అయ్యి అలాగా కు సమానార్ధంగా ప్రస్తుతం వాడబడుతున్నది. ఇలా 'అవును' ను అవునా! అని వాడటం ఎంతవరకూ సబబు?

భాషా శాస్త్రకారులు ఒప్పుకుంటారా? లేదా? అని కాదు నా ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పదం లోంచి పుట్టిన ఈ పదం ఎంతవరకూ సబబైనది అని! ఇదే పధ్ధతి లో ఆంగ్లంలో అవును అనటానికి Yes వ్రాతలోనూ yea, yeah అని వాడుకలో ఉన్నది. తెలుగులో అవును ను అవునా చేసినట్టు ఆంగ్లంలో Yes ను Yessaa అని వాడబడటం వినలేదు.

ఇక హింది లో ఐతే అవును కు \"హా\" . దీన్ని హాహా వాడగలగటం దాదాపు అసాధ్యం. తెలుగులో మాత్రమె ఇలా అవును, అవునాగా మారి వేరే అర్ధం వచ్చింది, వాడుకలోకి వచ్చేసింది కాబట్టి గత 30-40 సవత్సరాల్లో ప్రజల నోళ్ళల్లో పడి తయారైన ఒక కొత్త మాట.  
*Re-published

Post a Comment

 1. చూడండి: http://www.andhrabharati.com/dictionary/ ఈ అవును అనేది బ్రౌన్ నిఘంటువులోనే ఉంది. ఇది సరైన పదమే. అవును లాగే అవునా అన్నది కూడా సరైన పదమే. ఇబ్బంది ఏమీ లేదు.

  ReplyDelete
  Replies
  1. అవునా! అనే పదం ఏ సందర్భంలో వాడడం సరయినది. అలాగా? అన్నదానికి అవునా!? అన్నదానికీ తేడా ఉంటుందనిపిస్తున్నది. ఇవి రెండూ ఒకటేనా?

   Delete
 2. అవునా / ఔనా అనే పదం ముందు నుంచీ ఉన్నదే. ప్రాచీన సాహిత్యంలో చాల చోట్ల అవునా పదం కనిపిస్తుంది. అంతెందుకు 1951 లో విడుదలయిన మల్లీశ్వరి చిత్రంలో ఔనా నిజమేనా అనే ప్రసిద్దమైన పాటలో దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు ఈ పదాన్ని వాడటం అందరికీ తెలిసిందే కదా!

  ReplyDelete
 3. ఉంది - ఉందా?
  లేదు - లేదా?
  కాదు - కాదా?
  వీటిలాగే ...
  అవును - అవునా?

  ఇది ప్రాచీన కాలం నుండి ఉన్న ప్రయోగమే!

  ఈ పదం గూర్చి పస లేని చర్చను ముందుంచడం ఆశ్చర్యంగా ఉంది

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top