Post a Comment


 1. కక్ష అన్నది తెలుగు పదము ! ఇందులో క వర్ణ మాల లో ఉన్నది కాబట్టి క్ష కూడా ఉండాలి !

  ఆల్రెడీ, అలరారు గా అలరెడి క్ష ని మళ్ళీ చేర్చాలా అంటే ఎట్లా మరి !!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. వ్యాకరణ నియమం అంగీకరించదని క్ష తెలుగు వర్ణమాలలో చేరకూడదని ఒకరు, చేర్చాలని ఒకరు పెద్దలు అంటున్నారు. చేరితే అక్షరమాల సంఖ్య 57 అవుతుంది. మా తెలుగు మాష్టారయితే తెలుగుకు 56 అక్షరాలే కరెక్టు అంటారు. క్ష ని సంయుక్తాక్షరంగా మాత్రమే చూడాలంటారు. గుండు మధు సూదన్ గారు చేర్చొచ్చు అంటున్నారు. చేర్చితే తప్పేమిటో తెలిసినవారు చెపితే బాగుంటుంది.

   Delete
 2. >>> " క్ష " ను తెలుగు వర్ణమాలలో చేర్చవచ్చా!?

  ఇప్పటికే చేర్చ బడి వుంది. వుంది కాబట్టే "క్ష" అన్న అక్షరాన్ని చూస్తున్నారు. సంయుక్తాక్షరమైతే "క" అన్న అక్షరాన్నికి "ష" ఒత్తుగానో (వుండాలి "వర్షం"లో లాగ), లేక క్శ గానో వాడుతూ వుండాలి. కాని అలా వాడకుండా "క్ష" ను ప్రత్యేకమైన అక్షరంగా వాడుతున్నామంటేనే అటువంటి అక్షరం వున్నట్టే అనుకోవాలి. ప్రత్యక్షంగా చూస్తూ, రోజూ వాడుతూ కూడా లేదనుకోవడం సరికాదనుకుంటాను.

  ఇక మిగిలిన ప్రశ్న అది అవసరమా అని. అవసరం లేదు.

  ReplyDelete
  Replies
  1. తెలుగు వర్ణమాల గా చెప్పే 56 అక్షరాలలో క్ష లేదని మా తెలుగు మాష్టారు చెప్పారు. క్ష సంయుక్తాక్షరమైనా అదొక్కటే ప్రత్యేకంగా ఉంటుంది. కనుక దీనిని తెలుగు వర్ణమాలలో చేరిస్తే తప్పేంటనేది నా అభిప్రాయం. అయితే కొందరు కరెక్ట్ అంటున్నారు. ఇంకొందరు తప్పు అంటున్నారు. ఈ విషయంపై నా అభిప్రాయం మాత్రం అక్షరమాలలో చేర్చాలనే. కానీ ఎందుకు? ఎలా? అనేది తేల్చి చెప్పే భాషకు సంబంధించిన వ్యాకరణ లేదా నియమాల జ్ఞానం నాకు లేదు.

   Delete
  2. కొండలరావుగారు,
   మీ తెలుగు ఉపాధ్యాయులు చెప్పినదే సత్యం. ఈ విషయమై నా తెలుగు వ్యాకరణం బ్లాగులో త్వరలోనే చెప్పటం‌ జరుగుతుంది. నా అభిప్రాయంగా ఇప్పుడు విడిగా ఏమన్నా చెప్పటం అవసరం కాకపోవచ్చు అని భావిస్తున్నాను.

   Delete
  3. కొండలరావు గారు,

   శ్యామలీయం గారు వ్రాసే లోపు మీరు వ్యాకరణం చదువుకోవాలంటే ఇక్కడ చిన్నయసూరి బాలవ్యాకరణం చదువుకోవచ్చును.

   Delete
  4. శ్రీకాంత్ చారిగారు మంచి లింక్ ఇచ్చారు.
   ఎవరైనా వ్యాకరణం చదువుకోవాలనుకుంటే ఆనందమే.
   ఐతే ఒక్క విషయం. వ్యాకరణం కూడా ఒక శాస్త్రం (కనీసం భారతీయదార్శనికతలో). దానికి కూడా దానిదైన పారిభాషికపదాదులుంటాయి. కాబట్టి మధ్యలో మనకి నచ్చిన్ సూత్రం‌ తీసుకొని నేరుగా చదివి అర్థం చేసుకొనటం అసాధ్యం కాకపోయినా కష్టం కావచ్చును. వ్యాకరణపరిభాష తెలిసివ వారికైతేనే అది సులభం అని నా ఉద్దేశం. నా అభిప్రాయంతో అందరూ ఎకీభవించాలని లేదు.

   Delete
  5. @ శ్యామలీయం గారు, 'క్ష ' పై మీ బ్లాగులో వివరణ వ్రాశాక అక్షరమాలలో ఎందుకు చేర్చకూడదో చూస్తాను.

   @ శ్రీకాంత్ చారి గారు ప్రత్యేక ధన్యవాదములు. దీని కోసం ప్రయత్నించాను. నాకింతవరకూ తెలీదు. వీలున్నప్పుడల్లా ఇది చూస్తుంటాను.

   Delete
  6. @ అందరు మిత్రులు మరియు పెద్దలకు, ఎవరైనా సరే, ఎవరివైనాసరే అన్ని అభిప్రాయాలతో ఎప్పుడూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. కావాలని విభేధించాల్సిన అవసరం ఎవరికీ ఎప్పుడూ ఉండకూడదు. ఏ విషయాన్ని ఎవరు చెప్పారనేదానిని బట్టి గాక ఏమి చెప్పారనేదానిపై కేంద్రీకరణ ఉండాలి. అభిప్రాయాలతో విభేధించడమంటే వ్యక్తిని విబేధించడం కాదు. కాకూడదు. "చర్చల గోల్ తెలుసుకోవడం-తెలియజెప్పడం-కొత్తవి కనుక్కోవడం" ఇది నిరంతర ప్రాసెస్. ఎందుకంటే ఎప్పటికీ ఎవ్వరికీ అన్నీ తెలిసే అవకాశం లేదు. రానున్న కాలంలో పుస్తకాల సంఖ్య - విజ్ఞానం కూడా పెరుగుతుంది. అన్నీ చదివే చర్చలో కూర్చోవాలంటే ఎప్పటికీ కుదరదు. ఎవరూ దేనిని ప్రశ్నించకూడదు. అది సృజనాత్మకతను త్రుంచివేసే కుట్రదారులు మాత్రమే కోరుకోవలసింది. లేదా అసహనం అయినా అయి ఉండాలి. మన అభిప్రాయంతో విబేధించినవారికి ఆ అభిప్రాయం ఎలా సరయినదో వివరిచే ఓపికా, నేర్పూ ఉండాలి. మన అభిప్రాయమే తప్పని తేలితే వినయంగా నేర్చుకునే ఓర్పూ , విజ్ఞతా, మనోశక్తీ ఉండాలి. భావోద్వేగాలకు విషయపరిజ్ఞానాకీ సన్నని గీత ఎపుడూ ఉంటుంది. భావోద్వేగాల ప్రకటన , ప్రతిస్పందన , ఆచరణకు ఆటంకం కాకూడదు. ఇవి పాటించడంలో భావోద్వేగాల ప్రకటన బేలన్స్ తప్పడమనేది ఆయా విషయాలతో ఆయా వ్యక్తులు పెంచుకున్న అనుబంధాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది అందరికీ ఎపుడో ఒకప్పుడు జరిగేదే. చర్చలను గౌరవిస్తేనే చర్చలలో ఇబ్బందులను అధిగమించగలం. చర్చల నుండి తప్పుకోవడం కంటే చర్చలను ఎప్పటికప్పుడు గాడిలో పెట్టడం ఉత్తమం. తెలుగు భాషలో నేను పండితుడని కానని, తెలుగు భాషపై చర్చ ప్రారంభించకపోతే నాకు ఇన్ని విషయాలు తెలిసేవి కావు. ఇందరి సహకారం లభించి ఉండేది కాదు. శ్రీకాంత్ చారి, ప్రవీణ్ వంటి వారలకు భాషపై ఇంతటి పట్టు ( నాకు తెలిసిన మేరకు ) ఉందనేది తెలిసేదే కాదు. కాబట్టి చర్చలనుండి వైరాగ్య ప్రదర్శన అనేది భారత యుద్ధంలో అర్జునిని వైరాగ్యం వంటిదే. అంటే కర్తవ్య నిర్వహణ నుండి వైదొలగడమే. కర్మల ఆచరణ నుండి ఫలాయనం కావడమే. కనుక మంచిని తేల్చడం కోసం యుద్ధం చేయండి. మంచిగా యుద్ధం చేయండి. తప్పులుంటే క్షమించాలి :))

   Delete
 3. కొండలరావుగారూ,

  సరస్వతీ దేవి చేతిలోని అక్షమాల "అకారాది క్షకారాంతమైన (ఆది క్షాంతాః) పంచాశద్వర్ణ (ఏఁబది యక్షరములకు) చిహ్నమని యెందఱో పెద్దలు చెప్పుచున్నారు గదా! ఇందలి క్షకారము "ఆద్యాయాః పంచాశద్వర్ణాః" యను సూత్రమందలిది కాదా?యని సందేహం కలుగుతున్నది. ఆద్యభాష (సంస్కృతభాష)లో క్షవర్ణము లేకపోతే యాభై అక్షరాలు ఎలా పొసగుతాయి? ళ కారము సంస్కృత భాషలో లేదు...ప్రాకృతమునుండి మనకు సంక్రమించినదని పెద్దలు చెప్పుచున్నారు. సంస్కృత నిఘంటువులలోనూ ళకారం లేదు. అలాగే...నేను గమనించినంతవరకు విశ్వకోశంలోనూ క్షాంత పదాలకు అర్థాలున్నాయి గానీ ళాంతపదాల ఊసే లేదు. కనుక మఱి ఆ యాభై అక్షరాలు ఏవి? విజ్ఞులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగు వివరణము నిస్తారని ఆశంస. స్వస్తి.

  ReplyDelete
  Replies
  1. గుండు మధు సూదన్ గారికి,

   క్ష గురించి మీకు వివరించే శక్తి నాకు లేదు. మా తెలుగు మాష్టారు తెలుగు వర్ణమాలలోనిది కాదు అనే చెప్పేవారు. నాకు మాత్రం ఆ అక్షరమొక్కటే ప్రత్యేకంగానూ, ప్రత్యేక అక్షరంగానూ ఒక్కటిగానే ఉన్నందున క్ష ను వర్ణమాలలో ఎందుకు చేర్చకూడదనేది నా ప్రశ్న? ఈ మీ వివరణకు విజ్ఞులెవరైనా వివరంగా చెప్తారేమోననే నా ఎదురుచూపు కూడా!

   Delete
 4. ధన్యవాదాలు కొండలరావుగారూ,

  ఈ క్షవర్ణాన్ని, ళవర్ణాన్ని రెంటిని వదలి, జిహ్వామూలీయ, ఉపధ్మానీయాలను గ్రహించాలని కూచిమంచి వెంకటరాయ కవి తన సుకవి మనోరంజనమందు తెలిపినాడు. ఇది తన అభిప్రాయమేననీ, గ్రహిస్తే గ్రహించవచ్చు లేకుంటే లేదు అని కూడా తెలిపినాడు. కానీ, ఈ జిహ్వామూలీయాన్నీ, ఉపధ్మానీయాన్నీ మనం పిల్లలకు నేర్పడమంటే ఎలా వుంటుంది? కాబట్టి విజ్ఞులెవరైనా ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వివరిస్తే బాగుంటుందని మనవి. స్వస్తి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top