రంగనాయకమ్మ గారి దృష్టిలో మార్క్సిజం

“ఒక మంచి డాక్టర్ కావాలంటే ముందు వారు మార్క్సిస్టు అయి ఉండాలి. ఒక మంచి తండ్రి కావాలంటే ముందు మార్కిస్టు అయి ఉండాలి. …” అని రంగనాయకమ్మగారు తన ‘పెట్టుబడి పరిచయం’ పుస్తకం వెనక అట్టమీద రాస్తారు. మార్క్సిజాన్ని చదివితేనే ఎవరైనా ఒక మంచి “_____” (ఖాళీలొ మనుషుల లక్ష్యాలు ఏవైనా పెట్టుకోవచ్చు) అవుతారని రంగనాయకమ్మ చెప్పదలుచుకున్నారు. అయితే ఇక్కడ ఆవిడ చెప్పేది ఒక శాసనంలాగా, తప్పనిసరి షరతు లాగా ధ్వనిస్తుంది. మార్క్సిజంతో పరిచయం లేనివారికి అది చాలా అభ్యంతరకరంగా తోచడం సహజం. అందువలనే మార్క్సిజం లేకపోతే ఇక ప్రపంచమే లేదా, అది లేకపోతే ప్రపంచం బతకదా? అనే ప్రశ్నలు కూడా సహజంగానే ఉద్భవిస్తాయి.
వాస్తవానికి మార్క్సిజం గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రమే ఆవిడ అలా రాశారని గమనించాలి. మార్క్సిజంతో పరిచయం లేకపోయినా అభ్యుదయంగా ఆలోచించేవారూ, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి డాక్టర్ గా, ఇంకా మంచి “___”గా ఉన్నవారు, ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. ఆ అభ్యుదయ భావాలు, మంచితనానికి మార్క్సిజానికి సంబంధించిన అవగాహన కూడా తోడయితే అటువంటి మంచివారూ, అభ్యుదయ కాముకులూ తన కుటుంబమూ, స్నేహితులతో పాటు సమాజానికి కూడా మరింత ప్రతిభావంతంగా ఉపయోగ పడతారని రంగనాయకమ్మగారు (ఆ మాట కొస్తే మార్క్సిజం చదివినవారు ఎవరైనా సరే) చెప్పదలుచుకున్నారని గమనించాలి.
మార్క్సిజం తెలిసి ఉంటే వివిధ రకాల మనుషులు లేదా వృత్తుల్లో ఉన్నవాళ్ళు సమాజానిక మరింత సమర్ధవంతంగా ఉపయోగపడతారని ఇక్కడ రంగనాయకమ్మగారి భావన తప్ప మార్క్సిజంపై అవగాహన లేకపోతే ఏమవుతారు అన్న ప్రశ్నకు ఆవిడ చెప్పినదాంట్లో సమాధానం వెతకరాదని గమనించాలి. అంటే మార్క్సిజంపై ఆవిడ చెప్పే విషయాలు ఒకవైపునుండి చూసినప్పుడే అవిడ సరిగ్గా అర్ధమవుతారు. రెండో చివరనుండి చూస్తే వచ్చే అర్ధాలు ఆవిడ ఉద్దేశ్యంలో లేవని గమనించాలి. అంటే… మార్క్సిజం తెలిస్తే… మనుషులెలా ఉంటారో చెప్పింది తప్ప, మార్క్సిజం తెలియక పోతే గనక ఖచ్చితంగా అది తెలిసినవారికి వ్యతిరేకంగా ఉంటారని ఆవిడ ఉద్దేశ్యం కాదు.
“ఒక మంచి డాక్టరు కావాలంటే ముందు అతను/ఆమె మార్క్సిజం తెలుసుకొని ఉండాలి” అంటే, “మార్క్సిజం తెలియకపోతే చెడ్డ డాక్టర్ అవుతాడు” అని అర్ధం చేసుకుంటే అది తప్పని గమనించాలి.
మార్క్సిజం అనగానే చాలామందికి సుత్తీ కొడవలి, ఎర్రజెండా, పోరాటాలు, తుపాకి గొట్టం… ఇలాంటివే కనపడతాయి. కాని అవన్నీ వాస్తవానికి కొన్ని కోణాల్లో కనిపించే సంకేతాత్మక (సింబాలిక్) వస్తువులే తప్ప అవే మార్క్సిజం కాదు.
మార్క్సిజం అనేది ఒక సామాజిక శాస్త్రం, ఒక ఆర్ధిక శాస్త్రం. ఒక రాజకీయ శాస్త్రం కూడా. తత్వ శాస్త్రంలో సమస్త శాస్త్రాలూ ఇమిడి ఉంటాయని తెలిస్తే మార్క్సిజం ఒక తత్వ శాస్త్రం. అప్పటివరకూ తత్వ శాస్త్రం అంటే పండితులు మేధావులూ మాత్రమే చర్చించుకునే శాస్త్రం అని భావిస్తున్న దశలో మార్క్సిజం మొదటి సారిగా తత్వశాస్త్రాన్ని సామాన్య ప్రజల చెంతకు తెచ్చింది. సమాజం ఎలా ఉందో అప్పటివరకూ తత్వశాస్త్ర పండితులు చెబితే ఉన్న సమాజాన్ని సమస్త ప్రజా బాహుళ్యాలకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మార్క్సిస్టు తత్వశాస్త్రం చెప్పింది. అందుకనే అదింకా సజీవంగా నిలిచి ఉంది. అది సమాజం గురించి వివరిస్తుంది. సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య సంబంధాలను విశ్లేషిస్తుంది. సామాజిక సంబంధాలు ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలతో ఎలా ఆధారపడి ఉన్నాయో వివరిస్తుంది. సామాజిక సంబంధాలు సరిగా ఉన్నాయో లేదో చర్చిస్తుంది. సరిగా లేని సంబంధాలను ఎలా మార్చుకోవచ్చొ చెబుతుంది. మార్చుకోవడానికి అవసరమైన సైద్ధాంతిక ఉపకరణాలను అందిస్తుంది.
సామాజిక సంబంధాలను సరిగా అర్ధం చేసుకున్న డాక్టరు సమాజం అనుభవిస్తున్న సంపదలన్నీ శ్రమ ద్వారానే సృష్టించబడ్డాయని గ్రహిస్తాడు. సంపదలు సృష్టించే శ్రామికుడు శ్రమకు తగిన ఫలితం లేక పేదవాడిగా మిగిలాడని గ్రహిస్తాడు. అందువలన డబ్బులేని కూలీలు, కార్మికులు నిజానికి గౌరవనీయులనీ, అతని శ్రమే ప్రపంచ సంపదలకు మూలాధారమనీ గ్రహింపుతో పేద, గొప్ప తేడాలను నిరసిస్తాడు. పేదవారికి తక్కువ ఖర్చుతో, అసలు డబ్బులు కూడా లేకుండా వైద్యం చేయడానికి ముందుకు వస్తాడు. జార్ఘండ్ లో బినాయక్ సేన్ అలాంటి వైద్యుడే. అతని వైద్య జీవితమంతా గిరిజలుల జీవితాలకే అంకితం. తన వైద్య వృత్తిని డబ్బు కోసం కాకుండా మనుషుల కోసం, అందునా శ్రమ చేసే మనుషుల కోసం అంకితం చేశాడు. ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ చదివిన వాళ్ళు తప్పనిసరిగా రెండు సంవత్సరాలు గ్రామాల్లో పనిచేయాలని నిబంధన తేబోతే జూ.డాలు సమ్మెకు దిగడం గమనిస్తే మంచి డాక్టరు, అందునా మార్క్సిజం తెలిసిన డాక్టరు ప్రాముఖ్యత అర్ధం అవుతుంది.
రంగనాయకమ్మగారు వ్యక్తిగత జీవితాలు సామాజిక వ్యవస్ధలతో ముడిపడి ఉన్న విషయాన్ని ప్రతి అంశంలోనూ చెబుతారు. కనుక వ్యక్తిగత బాగోగులు సమాజం బాగోగులతో ముడిపడి ఉన్న సంగతిని మనముందు ఉంచడానికి ప్రయత్నిస్తారు. మార్క్సిజం సమాజం బాగోగులను గురించే పట్టించుకున్న శాస్త్రం. అందువలనే జానకి విముక్తిని సమాజం విముక్తిని ప్రతిపాదించే మార్క్సిజంతో ముడిపెట్టి నిజమైన విముక్తి ఎలా వస్తుందో చెప్పడానికి ప్రయత్నించారు.
ఇక్కడ మార్క్సిజం గాల్లోంచి వచ్చింది కాదని గమనించాలి. సమాజాన్నీ, సామాజిక సంబంధాలనీ, సామాజికార్ధిక సంబంధాలనూ, రాజకీయార్ధిక సంబంధాలనీ తన జీవితకాలంలో అధ్యయనం చేసిన మార్క్సు “ఇదిగో, సమాజం, ప్రకృతి ఫలానా నియమాల ప్రకారం నడుస్తోంది. కొద్దిమంది స్వార్ధపరులు ఆర్ధిక వనరులను గుప్పిట్లో పెట్టుకుని మొత్తం సామాజిక గమనాన్ని తలకిందులుగా నడిచేలా శాసిస్తున్నారు” అని ఉన్న విషయాన్ని వీవరిస్తూ తాను గ్రహించిన సామాజిక నియమాల వెలుగులోనే తలకిందులుగా నడుస్తున్న సమాజాన్ని యధాస్ధానానికి ఎలా తెచ్చుకోవాలో ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలోనే సామాజిక, రాజకీయ, ఆర్ధిక అపసవ్యతలను ఎలా సవరించుకోవచ్చునో వివరించాడు. సైన్సు సూత్రాలు విశ్వజనీనమైనట్లే మార్క్సిస్టు శాస్త్రం కూడా విశ్వజనీనమైనది. ఒక జాతి, మతం, ప్రాంతం, దేశం అన్న పరిమితులతో నిమిత్తం లేకుండా మానవ సమాజాలన్నింటి గమనాన్ని మార్క్సిజం వివరిస్తుంది గనక అన్ని దేశాలకూ, అన్ని సమాజాలకూ, అన్ని ప్రాంతాలకూ అది పరిష్కారాన్ని సూచిస్తుంది.
అయితే మార్క్సిజం గురించి పరిచయం లేనివారికి మార్క్సిజానికీ, సమాజానికి ఉన్న సంబంధంతో గూడా పరిచయం ఉండదు. వారు మార్క్సిజం గొప్పతనాన్ని ఒప్పుకోమని శాసించలేము. మార్క్సిజం ఫలానా చెబుతుంది అని ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. అలా చెబుతున్న చోట మార్క్సిజం నిజానికి ఏం చెబుతుందో చెప్పడానికి ప్రయత్నించవచ్చు. వారు చెబుతున్నది నిజమని నమ్ముతున్నవారికి మాత్రమే మార్క్సిజం ఏం చెబుతుందో చెప్పగలం కానీ, మార్క్సిజంపై గుడ్డి ద్వేషంతో అదేం చెబుతుందో కూడా తెలియకుండా అది ఫలానానే చెబుతుందని వాదించేవారికి మార్క్సిజం గురించి బోధించాలని చూడటం వృధా ప్రయాస.
రంగనాయకమ్మగారి నవలలను గమనించండి. అంత ప్రతిభావంతంగా రాయడానికి కారణం ఏమిటి? ఆవిడ అధ్యయనం చేసిన మార్క్సిజమే దానికి కారణం. ఆచరణ, అధ్యయనాలతో సంపాదించిన జ్ఞానం ద్వారనే ఆకట్టుకునేలా, చదివిన వారిలో అత్యదికులు నవలలో ఏదో ఒక చోట “ఇది నా జీవితమే” అని భావించేలా రాయగలిగిందని గమనిస్తే ఆవిడ మార్క్సిజం గురించి తన నవలలలో చెప్పడానికి ఎందుకు తాపత్రయపడిందీ అర్ధం అయ్యే అవకాశం ఉంది.
from facebook
Reactions:

Post a Comment

 1. ఈ వీడియో చూసినపుడల్లా నిద్ర వచ్చేస్తుంది. ఎప్పటికి పూర్తి చేస్తానో ...ఈ వీడియోలో ఆవిడ కుర్చీ వెనకాల చిరుగులు చూస్తే జంద్యాల పాపయ్య శాస్త్రి గారు "కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు" అన్నట్లు...చాలా పేదరికంలో ఉన్నట్లు అర్ధం అవుతున్నది. పేదరికంలో పుట్టడం తప్పుకాదుకానీ పేదరికంలో చనిపోవడం మాత్రం ఖచ్చితంగా అపజయమే ...ఒక స్త్రీవాదిగా, ఒక మార్కిస్టుగా తను ఏమి నేర్చుకున్నదన్నది ఇంకా తెలియవలసి ఉన్నది. మొత్తం వీడియో చూసాక అర్ధం అవుతుందేమో ! మార్కిస్టులు ధనవంతులు కాకూడదా ? ధనవంతుడైన తండ్రి మార్కిస్ట్ కాకూడదా ? రంగనాయకమ్మగారు వివాహం ఒక బానిసత్వం అన్నారు. బసవరాజు అప్పారావు గారు అన్నట్లు "వలపెరుగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా" అని సహజీవనాన్ని ఎంచుకున్నట్లున్నారు ! అది మరీ ఇంత ఘోరంగా ఉంది ఏమిటా అని ఒకటే బాధ పడ్డాను.

  ReplyDelete
  Replies
  1. నీహారిక గారూ,
   ఈ మధ్యకాలంలో హృదయస్పందనల చిరు సవ్వడి బ్లాగు దగ్గిర ఆజ్ఞాత వేసిన naaku elaa pagilindoe... కామెంటు తర్వాత మరో గొప్ప జోకు మీ అభిప్రాయం:-)
   బహు నెనర్లు!

   Delete
  2. నీహారిక గారు:

   డబ్బుసంపాదించడమే విజయం అన్నట్లుగా మాట్లాడారు.

   ఒకటి చెబుతాను వినండి. యూరప్లో వ్యభిచారగృహాల్లో రొమేనియన్, బల్గేరియన్ అమ్మాయిలు పనిచేస్తారు. వీళ్ళు నెలకి ఎంతలేదన్నా పదిహేనువేల యూరోలు సంపాదిస్తారు. అంటే సంవత్సరానికి ఒకలక్షాఎనభైవేల యూరోలు వీరి ఆదాయం (Tax free). ఇంకొకరెవరైనా ఇంతమొత్తం సంపాదించాలంటే వారు ఒక కంపెనీకి CEOనో, directorనో అవ్వాలి.

   మనుషుల జయాపజయాల్ని వారి సంపదతోనో, ఆస్తులతోనో అంచనావెయ్యగలమనుకోవడం మీ materialismకీ, మీ భావదారిద్ర్యానికీ నిదర్శనం.

   Delete
  3. @విశేషజ్ఞ విశేషజ్ఞ
   మనుషుల జయాపజయాల్ని వారి సంపదతోనో, ఆస్తులతోనో అంచనావెయ్యగలమనుకోవడం మీ materialismకీ, మీ భావదారిద్ర్యానికీ నిదర్శనం.

   hari.S.babu
   మీ భావం నాకు అర్ధం కాలేదు.రంగనాయకమ్మ గారు మార్క్సిజాన్ని ప్రగాఢంగా నమ్ముతారు,కదా!అందులో అన్ని సంబంధాలూ ఆర్ధిక సంబణాలే అని నొక్కి చెప్పారు,కదా!హెగెల్ బావవాదం అన్న సిద్ధాంతాన్నే ఒప్పుకోకుండా భౌతికవాదం అని మార్చారు,అవునా?మరి భౌతిక ప్రపంచంలోని జయాపజయాల్ని materialism తో కొలవకుండా spiritualismతో కొలవాలని మీ ఉద్దేశమా?

   Physical entity ఉన్న మనుషుల జయాపజయాల్నీ ఇంకా ముఖ్యమైన విషయాల్నీ materialismతో గాక ఏ రకం spiritualismతో అంచనా వెయ్యాలో కొంచెం క్లారిటీ తెచ్చుకుని చెబితే అందరం ఫాలో అవుతాం.

   Delete
  4. Materialism అన్నదానికి రెండు అర్ధాలున్నాయి. వ్యక్తుల నడత, విలువలు (అంటే ధర అనికాదు)తో సంబంధంలేకుండా, కేవలం వారి material possessions ఆధారంగా వ్యక్తుల మూల్యత/విజయాన్ని అంచనా వెయ్యడం అన్న అర్ధంలోనే నేను materialism అని నేను వాడాను.

   Spiritualism అన్నమాట ఒక వ్యర్ధమైనమాట. కొందరు సోంబేరులు/మోసగాళ్ళు spirit(ఆత్మ)ని సృజిస్తే, దానికి ఎలాంటి material AND/OR logical ఋజువులూ లేకపోయినా మూర్ఖులు ఇంకా దాన్ని పట్టుకొని వ్రేళ్ళాడుతున్నారు.

   ఆ ప్రకారంగా మీ ప్రశ్న ఒక begging the question అన్న logical fallacyతో మొదలయ్యింది. నేను వాడిన materialismని ఏకంగా dialectical materialismతో ముడిపెట్టి ప్రశ్నించారు.

   Delete
  5. ఈ జవాబు మరీ గందరగోళంగా ఉంది.

   "ఆ ప్రకారంగా మీ ప్రశ్న ఒక begging the question అన్న logical fallacyతో మొదలయ్యింది. నేను వాడిన materialismని ఏకంగా dialectical materialismతో ముడిపెట్టి ప్రశ్నించారు." - మీరు క్లారిటీ ఇస్తే పాటిస్తాను అని చెప్పీనప్పటికీ మీరు నాకు "begging the question అన్న logical fallacy" అంటగట్టారు.

   @you
   "వ్యక్తుల నడత, విలువలు (అంటే ధర అనికాదు)తో సంబంధంలేకుండా, కేవలం వారి material possessions ఆధారంగా వ్యక్తుల మూల్యత/విజయాన్ని అంచనా వెయ్యడం అన్న అర్ధంలోనే నేను materialism అని నేను వాడాను."

   me:
   వ్యక్తుల నడతని ఆధారం చేసుకుని మాత్రమే గౌరవించాలి లేదా విమర్శించాలి అనేది అబ్దఊ ఒప్పుకునే మాటే - ఏనుగు లక్ష్మణ కవి నుంచి పరవస్తు చిన్నయ సూరి వరకు అందరు సుభాషిత కర్తలూ అదే చెప్పారు,నేను ఒప్పుకుంటాను.కానీ ముప్పాళ రంగనాయకమ్మ గారు ఒపుకుంటారో లేదో కనుక్కోండి!

   మీరు చెప్పిన materialismలోనే కాదు నైతిక విలువల్లో కూడా రెండు రకాలు ఉంటాయి - ఇది ముప్పాళ రంగనాఊకమ్మ గారి అభిప్రాయమే,కదా!నాన్ మార్క్సిస్టులు పాటించే నైతిక విలువల్ని కూడా ఆమె తిరస్కరిస్తారు కదా - బొట్టూ గాజులే తీసేశారు,చీరని ఎందుకు ఉంచారో!విరసం అనే మరో విప్లవ సంస్థని పెట్టినందుకు మరో కమ్యునిష్టునే విప్లవం పరువు తీసేశాడన్నారు ఆమె.

   ఇంతకీ, కమ్యునిష్టు సిద్ధాంతం అంతా spiritualism లేకుండా జాగ్రత్తపడి material possessions యొక్క అసమానతల చుట్టూ తిరుగుతూ ఆ material possessions కొందరి దగ్గీరే మూలగడం, ఇంకొందరికి material possessions అసలు లేకపోవడం,material possessions ఎక్కువ పోగేసుకున్నవాళ్లని చంపేసి వాటిని అసలు material possessions లేనివాళ్లకి పంచిపెట్టి material possessions అందరి దగిరా ఒకే మోతాదులో ఉండేలా చెయ్యడం గురించే తిరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా ఉండటం ఎలా?ఆత్మల గురించిన ప్రస్తావమ నేను తేలేదు కదా,spitualism అనేది ఆత్మలూ దెయ్యాలూ భూతాలూ వంటివాటికి సంబంధించిన అర్ధంలో నేనూ వాడలేదు.దేవుడు ఉన్నాడని నమ్మటం ఆస్తికత్వం అయితే లేడని నమ్మటం నాస్తికత్వం - ఇలాంటువన్నీ ఆధ్యాత్మికత కిందకి వస్తాయి.ఆ అర్ధంలోనే నేను వాడాను.మరోలా అర్ధం తీసుకోవడం మీ lagical fallacy అవుతుంది - దాన్ని మీరు సరిచేసుకోవాలి.

   ఇది అర్ధం చేసుకున్నాక మరోసారి నేను వేసిన ప్రశ్నని చదివితే నేను ప్రశ్నని సీరియస్ ధోరణిలోనే వేశానని అర్ధమవుతుంది.అయినా, మళ్ళీ వేస్తున్నాను - నా ప్రశ్నలో మీరనుకున్న begging the question అన్న logical fallacy లేదు.నేను వాడిన spiritualism ఒక చిన్న మాటకే దెయ్యాల్నీ భూతాల్నీ గుర్తుకు తెచ్చుకుని material AND/OR logical ఋజువులూ లేకపోయినా వాటిని నమ్ముతున్నవాళ్ళని మూర్ఖులు అనేటంత ఆవేశపడిపోతున్నారు కాబట్టే నా ప్రశ్నని మరింత స్పష్టంగా అడిఉగుతున్నాను.ఈ బౌతిక ప్రపంచంలో ఆర్ధిక కార్యకలాపాలకి సమబంధించిన జయాపజయాల్ని materialism ప్రభావంతో కాకుండా ఎలా లెక్కించాలి?విజయం,అపజయం అనేవాటికి నీహారిక వేసిన అంచనాని మెటీరీలిస్టిక్ అని విమర్శించిన మీరు ఎట్లా అంచనా వేస్తారు?మళ్ళీ ఇది వ్యక్తిగతంగా మీకు ఆమే గురించి వేస్తున్న ప్రశ్న అని పొరపాటు పడకుండా అందరికీ పనికివచ్చే జవాబు చెప్పండి!

   జియ్యర్ స్వామిగారు కూడా material possessions చల్ల గాక నైతిక విలువలతోనే బతుకుతున్నారు కదా - మరి,ఈవిడా ఆయనా కమ్యునిష్టులూ మరియూ నాన్ కమ్యున్ష్టులూ అనే రెండు వర్గాల చేతా ఒక్కలాగే ఎందుకు గౌరవించబడటం లేదు.

   P.S:అయినా ఇదివరకెప్పుడో నీహారిక ఆమెని తాన్ అభిమాన రచయిత్రి అని పరావ్శించినట్టుగుర్తు.ఇప్పుడు ఈ విసుర్లు ఏమిటో?మెరేమో నేనొకటి అడిగితే మీరొకటి చెప్పి మె ప్రశ్నలో lagical faalacy ఉంది అని నన్ను తప్పు పడుతున్నారు.మీ ఇద్దరిలోని ఈ గనదర్గోళమునకు కారణము మీరిద్దరూ ఆడువారగుటయా లేక మరొకటియా?

   Delete
  6. @ హరిబాబు గారు,
   నాకు చిరంజీవి అంటే కూడా ఇష్టమే అలాగని ఆయన చేసే అన్ని పనులూ ఇష్టపడతానని అర్ధం కాదు. నాకు రంగనాయకమ్మ అంటే ఇష్టమే కానీ ఆవిడలా బొట్టూ,గాజులూ తీసివేసి నేనూ మగాడిలాగా తిరుగుతాను అని అనను. అందరిలోనూ అన్నీ మంచి లక్షణాలే ఉండవు. కొన్ని చెడ్డ లక్షణాలు అందరిలోనూ ఉంటాయి అని చెప్పడమే నా ఉద్దేశ్యం !

   Delete
 2. మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న మార్క్స్ మాటగురించి...

  ఆయనన్నది మానవ సమూహాలమధ్య (classes) సంబంధాలగురించి అనుకుంటాను. ఫ్రెంచి భాషలో chercher l'argent (దీన్ని pro bono అనుకోవచ్చు) అని ఒకటంటారు. నేరాలు జరిగినప్పుడు ఆయా నేరాలవల్ల ఎవరు లాభం పొందారో వారిని ప్రశ్నించండి అంటారుకద అలాగన్నమాట. బహుశా మార్క్స్‌కూడా సాంఘీక నియమాలన్నీ ధనవంతులకే (పెట్టుబడిదారులకే) అనుకూలంగా ఉండడాన్ని గుర్తెరగండి (పాపపుణ్యాలూ, స్వర్గనరకాలూ లాంటి పనికిమాలిన విషయాలను ప్రక్కనపెట్టండి అనడానికి అలా అనుంటాడు. అప్పటి యూరప్‌లో ఒకదిక్కుమాలిన తరహా కర్మసిధ్ధాంతం రాజ్యమేలేదికదా!).

  ReplyDelete
  Replies
  1. @విశేషజ్ఞ విశేషజ్ఞ,
   మీ కమెంట్ నేను ఇపుడే చూసాను. మీరు రెండు రకాలుగా మాట్లాడతారని/గలరని అర్ధం అయింది. మీరు చెప్పిన దాని ప్రకారం అసలు దారిద్ర్యం కంటే భావ దారిద్ర్యమే హీనమైనది అని నేనూ ఒప్పుకుంటాను. భారతదేశం లోని భావదారిద్రాన్ని పోగొట్టడానికే రంగనాయకమ్మ గారు కృషి చేస్తున్నారు అని నేనూ నమ్ముతున్నాను. అసలు ఏది సరి అయినదో ఎవరు నిర్ణయించాలి ? అదే కదా ఇక్కడ సమస్య ? ఎన్నో రకాల మతాలు ఉన్నట్లే ఎన్నో రకాల భావ దారిద్ర్యాలు ఉన్నాయి. అందరూ మాదే సరి అయిన వాదన అని మొండి పట్టు పడితే అదే పెద్ద భావ దారిద్ర్యం. బీదవాడు మార్కిజం గురించి మాట్లాడితే ఆదర్శంగా తీసుకుంటారా ? నేను బీదరాలిని నాకు కనీసం కట్టుకోడానికి బట్టలు కూడా లేవు, తినడానికి తిండి కూడా లేదు అయినా సరే నేను ఆనందంగా బ్రతుకుతున్నాను మీరు నన్నే ఆదర్శంగా తీసుకుని బ్రతకండి అంటే కనీసం మీరయినా నన్ను ఆదర్శంగా తీసుకుంటారా ? నన్ను మీరు అభిమానిస్తారా ? మార్కిజం గురించి మాట్లాడేవాళ్ళూ, అనుసరించేవాళ్ళూ బీదలే ఎందుకు అవ్వాలి అన్న నా ప్రశ్నకు సమాధానం మీరు చెప్పలేదు. అసలు మార్కిజ భావమే అర్ధం కాలేదు అని నేను అంటున్నాను. ఇది నిజంగా నా భావ దారిద్ర్యమే !

   Delete
  2. @విశేషజ్ఞ విశేషజ్ఞ
   ఆయనన్నది మానవ సమూహాలమధ్య (classes) సంబంధాలగురించి అనుకుంటాను.

   hari.S.babu
   "అనుకుంటాను...." అనే సందేహాస్పదమైన విషయం అయినట్టు చెబుతున్నారు - మార్క్సిజం గురించి అధికారికమైఅన్ పరిజ్ఞానం ఉందా లేదా మీకు?

   మార్క్సిజం గురించి పైపైన చదివిన నాకే అది ఖచ్చితమైన సూత్రీకరణ అని తెలుసు!మళ్ళీ యూరో[ఉలోఎ అప్పుడు రాజ్యమేలే కర్మసిద్ధాంతాన్ని దిక్కుమాలినదని అంటూ మీరు నేను అడిగిన ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పలేని దిక్కుమాలిన భావదారిద్ర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

   ఇక మీనుంచ్ ఇంతకన్న సూటైన జవాబును ఆశించలేనా?నిగమసర్మ దేవుడి ఆట కూడా తనే ఆడినట్టు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి మీ తరపున జవాబు కూడా నేనే చెప్పాలా!

   @uuuuu
   అందరిలోనూ అన్నీ మంచి లక్షణాలే ఉండవు. కొన్ని చెడ్డ లక్షణాలు అందరిలోనూ ఉంటాయి అని చెప్పడమే నా ఉద్దేశ్యం !

   hari.S.babu
   మీ భావం నాకు ఎప్పుడో అర్ధమయింది.రంగనాయకమ్మలో అలా తప్పులు ఉందడానికి ఆస్కారం లేదనూన మూఢభక్తితో విశేషజ్ఞ గారు మీలో భావదారిద్ర్యాన్ని చూశారు.తముడు తన్వాదైనా ధర్మం చెప్పమన్నారు.మిమ్మల్ని యాగ్రిగేతరు నుంచి తొలగించినప్పుడు నేను అదే చేశాను కదా!ఇక్కద కూడా మీ తరపున పోట్లాదే దురదని నేను చూపించటం లేదు.

   అవిడకి నిజంగా మార్క్సిజం గురించి తెలిసుండదు.మీరు అనవసరంగా "మార్కిజం గురించి మాట్లాడేవాళ్ళూ, అనుసరించేవాళ్ళూ బీదలే ఎందుకు అవ్వాలి అన్న నా ప్రశ్నకు సమాధానం మీరు చెప్పలేదు." అని నిలదీసి ఇబ్బంది పెట్టకండి!

   P.S:విశేషజ్ఞ గారూ,నాతో వాదించేటప్పుడు "ఆ ప్రకారంగా మీ ప్రశ్న ఒక begging the question అన్న logical fallacyతో మొదలయ్యింది. నేను వాడిన materialismని ఏకంగా dialectical materialismతో ముడిపెట్టి ప్రశ్నించారు." లాంటి భాషతో కోపం తెప్పించకండి - హద్దులు తెలుసుకుని మర్యాద మీరకుండా ప్రవర్తించండి.

   Delete
  3. "ఆ ప్రకారంగా మీ ప్రశ్న ఒక begging the question అన్న logical fallacyతో మొదలయ్యింది. నేను వాడిన materialismని ఏకంగా dialectical materialismతో ముడిపెట్టి ప్రశ్నించారు."

   మీ వ్యవహారమే ఇలా సాగింది. మీరు కోపాన్ని ఎంతలా అభినయించినా నేనన్నది నిజమే.

   మీరు భలేగా ఊహించేసుకుంటారండీ. నేను రంగనాయకమ్మకు వకాలత్ పుచ్చేసుకుంటున్నట్లు, మీరు అవతారపురుషుడిలెవల్లో యుధ్ధానికి దిగిపోయారన్నమాట. Let's define clearly నా మొదటి కామెంటు ఒకరి విజయాన్ని/అపజయాన్ని వాళ్ళ material possessions ఆధారంగా నిర్ణయించకూడదు అని చెప్పడం వరకే.

   P.S. : నాకూ కోపం తెప్పించవద్దూ.. అంటూ బ్రతిమలాడుకోవడం మానండి. నిజం అంత కఠినంగా ఉంతే అది విననట్లు నటించండి అంతేగాని ఇలాంటి సినిమా వేషాలు వద్దు. మర్యాద పుస్తకాలు పోగొట్టుకున్నదెవరో బ్లాగుల్లో తెలియనిదెవరికి? మీరు సుద్దులు మాత్రమే చెబుతారా? లేక వేదాలుకూడా వల్లిస్తారా?

   Delete
  4. @viSaeshajna
   మీరు భలేగా ఊహించేసుకుంటారండీ. నేను రంగనాయకమ్మకు వకాలత్ పుచ్చేసుకుంటున్నట్లు, మీరు అవతారపురుషుడిలెవల్లో యుధ్ధానికి దిగిపోయారన్నమాట. Let's define clearly నా మొదటి కామెంటు ఒకరి విజయాన్ని/అపజయాన్ని వాళ్ళ material possessions ఆధారంగా నిర్ణయించకూడదు అని చెప్పడం వరకే.

   hari.S.babu
   వ్యక్తుల నడతని ఆధారం చేసుకుని మాత్రమే గౌరవించాలి లేదా విమర్శించాలి అనేది అబ్దఊ ఒప్పుకునే మాటే - ఏనుగు లక్ష్మణ కవి నుంచి పరవస్తు చిన్నయ సూరి వరకు అందరు సుభాషిత కర్తలూ అదే చెప్పారు,నేను ఒప్పుకుంటాను.కానీ ముప్పాళ రంగనాయకమ్మ గారు ఒపుకుంటారో లేదో కనుక్కోండి!
   ..........
   ఈ బౌతిక ప్రపంచంలో ఆర్ధిక కార్యకలాపాలకి సమబంధించిన జయాపజయాల్ని materialism ప్రభావంతో కాకుండా ఎలా లెక్కించాలి?
   .....
   జియ్యర్ స్వామిగారు కూడా material possessions చల్ల గాక నైతిక విలువలతోనే బతుకుతున్నారు కదా - మరి,ఈవిడా ఆయనా కమ్యునిష్టులూ మరియూ నాన్ కమ్యున్ష్టులూ అనే రెండు వర్గాల చేతా ఒక్కలాగే ఎందుకు గౌరవించబడటం లేదు.
   .........
   ఇక మీనుంచ్ ఇంతకన్న సూటైన జవాబును ఆశించలేనా?నిగమసర్మ దేవుడి ఆట కూడా తనే ఆడినట్టు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి మీ తరపున జవాబు కూడా నేనే చెప్పాలా!

   Delete
  5. @విశేషజ్ఞ విశేషజ్ఞJanuary 9, 2018 at 11:50:00 AM GMT+5:30
   నిజం అంత కఠినంగా ఉంతే అది విననట్లు నటించండి అంతేగాని ఇలాంటి సినిమా వేషాలు వద్దు. మర్యాద పుస్తకాలు పోగొట్టుకున్నదెవరో బ్లాగుల్లో తెలియనిదెవరికి?

   hari.S.babu
   నేను మీకు భయపడి "నాకు కోపం తెప్పించవద్దు!" అని బతిమిలాడుకునేటంత కఠినమైన నిజాలు ఏమి చెప్పారు మీరు?"మేధోశ్రమనే గుర్తించని మార్క్సిస్టు భావజాలం ప్రకారమే బౌతిక ప్రపంచంలోని వ్యక్తుల కార్యశీలత యొక్క సాఫల్యతలని /జయాపజయాలని భౌతికశాస్త్ర నియమాలతో గాక ఆధ్యాత్మిక విషయాలతో ఎట్లా కొలవాలి?" అని మీరు ప్రస్తావించిన విషయానికి సంబంధించి ఒక సూటి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న అర్ధం గాకనో జవాబు చెప్పలేక తప్పుకుపోదామనో "ఆ ప్రకారంగా మీ ప్రశ్న ఒక begging the question అన్న logical fallacyతో మొదలయ్యింది. నేను వాడిన materialismని ఏకంగా dialectical materialismతో ముడిపెట్టి ప్రశ్నించారు." అంటూ హడావిడి చేస్తున్నారు!

   మీలో ఏం చూసి నేను మీకు భయపదాలి?పాండిత్యమా?జ్ఞానమా?ఔన్నత్యమా?నా ప్రశ్న చాలా సూటిగా ఉంది.అది ఇక్కద ఉన్న కొందలరావు గారు,నీహారిక గారు - ఎవరిని అడిగినా చెబుతారు ఆ విషయం.మీరు చెప్పలేనని చేతులెత్తేస్తే నిగమసర్మలా జవాబు కూడా నేనే చెబుతాననై అంటున్నాను కదా!జవాబు తెలిసే అడిగాను మిమ్మల్ని ఆ ప్రశ్న - ఇతరుల భావదారిద్య్రం గురించి వ్యాఖ్యలు చేస్తున్న మీ జ్ఞానదారిద్య్రం గురించి మీకూ సర్వులకీ సభాముఖంగా తెలియజెప్పదానికి వ్యూహాత్మకంగానే అడిగాను,అయితే ఏమిటి?నన్ను భయపెట్టి మిమ్మల్ని బతిమిలాడించుకోగలిగిన పాండిత్యమే మీకుంటే జవాబు చెప్పండి!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top