చర్చాంశం - సాహిత్యం, మాండలికాలు, తెలుగు భాష
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు. సన్యాసి అని తిట్టడం సరయినదేనా!?

సాధారణంగా ఈ పదాన్ని తిట్టడానికి ఉపయోగిస్తుంటాము. సన్యాసి అనే పదానికి ఇది విక్రుతి లేదా వాడుక భాషలో సన్యాసికి బదులుగా సన్నాసి అని వాడుతుంటారు. సాధారణంగా పని చేయకుండా ఉండేవారిని ఇలా తిడుతూ ఉండడం మనం వ్యావహారికంగా చూస్తుంటాము. ఇది మాండలీకానికి సంబంధించినది కాదనుకుంటాను. నాకు తెలిసి తెలంగాణా - ఆంధ్రాలలో ఇరు ప్రాంతాలలోనూ ఇలాగే వాడతారనుకుంటాను. మరో రకంగా చెప్పాలంటే సంసారి కానివాడిని సన్యాసి అంటారనుకుంటాను. గృహస్తాశ్రమం - సన్యాశ్రమమ అంటూ హిందూ ధర్మంలో చెప్తుంటారు. నాకీ ఆశ్రమాల గురించీ తెలీదు. తెలిసిన వారు చెప్పాలి. ఇక్కడ నేనడగదలచుకున్నది ఎవరినైనా సన్నాసి అంటూ తిట్టడం సరయినదా? సన్నాసి అనేది సన్యాసి విక్రుతి అయితే సన్యాసి అనే ఓ జీవన విధానాన్ని కించపరచడం అవదా?

*Re-published
-----------------------------------------
ప్రజ లో తెలుగు భాష అభివృద్ధి పడే ఏ అంశం గురించి అయినా మాకు వ్రాసి పంపితే తెలుగు-వెలుగు లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము. ఏదైనా పదం గురించి చర్చించాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి. 
---------------------------------------------
Reactions:

Post a Comment

 1. ఇక్కడ సన్యాసి అంటే భాద్యత లేకుండా తిరిగే వాడు అని. నిజమైన సన్యాసి భాద్యతలనుంచి విముక్తుడయితే, మనం తిట్టే సన్యాసి భాద్యతలనుంచి తప్పించుకు తిరిగేవాడు

  ReplyDelete
  Replies
  1. వజ్రం గారు, అలాగే జరుగుతున్నదండీ. అయితే అలా పోల్చి తిట్టడం సన్యాస జీవితాన్ని అవమానించడం అవుతుందా? అనేదే నా ప్రశ్న. సన్యాసి అంటే ఏయే బంధనాలనుంది విముక్తుడవడమని హిందూ ఆశ్రమ ధర్మం చెపుతున్నదో తెలిసినవారు వివరిస్తే బాగుంటుందనుకుంటున్నాను. సన్యాసి తన పనులు తానే చేసుకుంటాడు. జీవించడానికి శ్రమ చేయాల్సిన అవసరం ఉన్నదా? లేక భిక్షాటననే సూచించారా? తెలుసుకోవాలనుంది.

   Delete
 2. కొత్త కామెంట్లు సరే,పాత పోష్టు లన్నీ యేమయినట్టు?కాలగర్భంలో కలిసి పోయినట్టేనా?!

  ReplyDelete
  Replies
  1. పాత పోస్టులలో అవసరమైనవి రీ పబ్లిష్ చేస్తాను హరి బాబు గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top