Reactions:

Post a Comment

 1. సమాజంలో అంతరువులు ఉండడం అన్ని చోట్లా ఉంది - అది కేవలం మీరు హిందూధర్మం అంటున్న హిందూమతానికి సంబంధించిన విషయం కాదు.ప్రిన్స్ చార్లెస్ పెళ్ళి చేసుకున్న డయానా స్పెన్సర్ కూడా రాజవంశానికి చెందిన కులీనస్త్రీయే,కాకపోతే వాళ్ళ కుటుంబం భేషజాలు వదిలి మామూలు మనుషులతో కలిసిపోవాలని అనుకున్నది,అంతే!అక్కడ కూడ కులీనత ఉన్నది కదా,అక్కడే కాదు ప్రపంచంలోని ప్రతి మానవసమాజంలోనూ రాజకీయ,ఆర్ధిక,సామాజిక అంతరువులు ఉన్నాయి.అన్నిచోట్లా ఉన్న వాటిని కేవలం హిందూమతంలో భాగం అని ఎలా అంటారు?

  కులాలు సామాజికపరమైనవి,మతం ఆధ్యాత్మికమైనది.

  ReplyDelete
  Replies
  1. < సమాజంలో అంతరువులు ఉండడం అన్ని చోట్లా ఉంది >

   ఉన్నది. లేదని ఈ ప్రశ్నలో కానీ, ఎపుడూ కానీ నేను చెప్పలేదు.

   < అది కేవలం మీరు హిందూధర్మం అంటున్న హిందూమతానికి సంబంధించిన విషయం కాదు >

   హిందూధర్మం , హిందూ మతం ఒకటేనా? నాకు తెలిసిన వరకూ కులం హిందూ మతానికి సంబంధించినదే.

   ఈ ప్రశ్నకు మాత్రమే పరిమితమై చర్చ్ ఉంటే అర్ధవంతమైన సమాధానం దొరుకుతుంది. ఇతర మతాలు బాగున్నాయనీ, హిందూ మతమే బాగోలేదనేది ఈ ప్రశ్నలో అడగలేదు. నా ఉద్దేశం కూడా కాదు.

   Delete
  2. @Kondala Rao Palla
   నాకు తెలిసిన వరకూ కులం హిందూ మతానికి సంబంధించినదే.

   hari.S.babu
   పూర్తిగా తప్పుడు అభిప్రాయం ఇది!ఎందుకంటే ప్రతి కులమూ ఒక లౌకికవృత్తికి సంబంధించిన గుంపు.దీనికి సాక్ష్యం ప్రాచీన కాలం నుంచి గ్రామం,నగరం అంటూ ఏర్పడి అవి రాజ్యం అనే వ్యవస్థకి రూపాంతరం చెందిన సమాజంలో "చాకలి వీధి","మంగలి వీధి","కంసాలి వీధి" అని ఒక వృత్తికి సంబంధించినవాళ్ళు ఒకచోట చేరేవాళ్లు.ఇందులో ఉన్న మతానికి సంబంధిన అంశం ఏమిటి?ఆయా వృత్తుల మీద పట్టు సాధించడానికీ ఆదాయాన్ని పంచుకోవడానికీ వాళ్ళు చేసుకున్న ఏర్పాటులో బ్రాహ్మణులు పైనుంచి రుద్దడం ఎట్లా జరుగుతుంది?శాతవాహనుల కాలంలో ప్రతి గ్రామంలోని ఈ కులపెద్దలు శ్రేణులు అనే సమూహాలు ఉందేవి.అంటే,ప్రతి గ్రామంలోనూ ఒకో కులానికి ఒక కులపెద్ద వారికి రాజ్యం నుంచి రావలసిన సౌకర్యాలకి బాధ్యత తీసుకునేవాడు.అలాంటివాళ్లు ఏ కులానికి ఆ కులశేణిలో సభ్యులుగా ఉండేవాళ్ళు.ఇందులో మతానికి సంబంధం ఉన్న అంశం ఏమిటి?

   ఇలా అన్ని వృత్తుల వాళ్ళూ స్థిరమైన ఆదాయాలు తెచ్చే వృత్తులకి అంకితం అయ్యాక అన్ని వృత్తుల వారికీ అవసరమయిన ఆధ్యాత్మిక/మత కర్మకాండల్ని జరిపించడం కోసం బ్రాహ్మణులు ఒక కులంగా వేరుపడ్డారు.

   హిందూమతం అనేది ఎప్పుడూ ఉనికిలో లేదు - ఇవ్వాళ హిందువులు అని పిలువబడుతున్న సమూహం ఇతరులు వాళ్ళకి హిందువులు అని పేరు పెట్టకముందు తమ గురించి సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు అనే అర్ధంలో సనాతన ధార్మికులు అని చెప్పుకునేవాళ్ళు.అది మీకూ ఇతరులకీ అర్ధం కాదు గాబట్టి హిందూమతం అని వాడాను.

   దేవుడు,భక్తి,ఆరాధన,క్రతువులు - ఇవి ఆధ్యాత్మికపరమైనవి కాగా కులవృత్తులు సామాజికపరమైనవి.వాస్తవం ఇలా ఉంటే ఆర్ధికానికి సంబంధించిన కులాలని తీసుకెళ్ళి హార్ధికానికి సంబంధించిన మతానికి కట్టేస్తే ఎలా?

   Delete
 2. ఇప్పుడు ప్రశ్నని మార్చినట్టున్నారు.ఇదివరకు హిందూమతంలో భాగమేనా అని ఉండేది,అవునా?

  ReplyDelete
  Replies
  1. కులాలకీ మతానికీ సంబంధం లేదు అని తెలిస్తే ఇంక ఈ ప్రశ్నకి జవాబు సూటిగానే చెప్పొచ్చు.కులాలు లేక వృత్తిని బట్టి చేసిన విభజనలు అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.ఎక్కడైనా సరే అవి మతానికి సంబంధించినవి కాదు,సామాజిక,ఆర్ధిక అవసరాల కోసం ఏర్పడినవి కాబట్టి వాటి అవసరం వున్నంతవరకు కులాలు ఉనికిలో ఉంటాయి,ఆ కులాల వాళ్ళకి తమ కులం యొక్క అవసరం లేనప్పుడే కులాలు పోతాయి.

   Delete
  2. దేవాలయల్లోకి దళితులు రాకూడదనేది మతపరమైన నిబంధన కాదా?

   Delete
 3. అన్ని మతాలలోనూ కులాలున్నాయి కానీ హిందూ ధర్మంలో కులాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రొటెస్టంట్లు - క్యాధలిక్ లూ సమానమే, సున్నీలూ - షియాలూ సమానమే ! కానీ హిందూ ధర్మంలో కొందరు క్రింది స్థాయి మనుష్యులు వర్ణసంకరం చేయడమే కాకుండా కొన్ని వర్ణాలను విభజించి, కొన్ని వర్ణాలకు గొప్పతనం ఆపాదించి కొంత వ్యూహ రచన చేసారు. ఆ వ్యూహానికి ప్రతివ్యూహం కూడా సిద్ధమయ్యే ఉంటుంది. కుల ఏర్పాటు, కుల అంతరాలు హిందూ ధర్మం ఏర్పడిన తర్వాతే ఏర్పడ్డాయి కానీ హిందూ ధర్మం లో భాగం కాదు. ఏ ఒక్క వ్యక్తి వల్లో, ఏ ఒక్క కులం వల్లో హిందూ ధర్మం నడవదు. హిందూ ధర్మం సమిష్టి తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. నేను శాస్వతుడిని అని అంటే కృష్ణుడు భోదించిన దాన్ని కృష్ణుడే విభేధించినట్లు కాదా ? శాస్వతుడు మోక్షాన్ని ఎలా సాధిస్తాడు? క్రింది స్థాయి వ్యక్తులు వర్ణాలను విభజించి మళ్ళీ వారే వర్ణాలను ఎలా ప్రోత్సహించగలరు ? నైజ గుణానికీ లొట్టకంటికీ మందు లేదు. హిందూ ధర్మమే తనను తాను రక్షించుకోవాలి.

  ReplyDelete
  Replies
  1. @neehaarika
   నేను శాస్వతుడిని అని అంటే కృష్ణుడు భోదించిన దాన్ని కృష్ణుడే విభేధించినట్లు కాదా ? శాస్వతుడు మోక్షాన్ని ఎలా సాధిస్తాడు?

   hari.S.babu
   ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది?కొంత అసందర్భం అనిపిస్తున్నది!దానికి మీ వ్యాఖ్యానంలో కూడా స్పష్టత లేదు.కాబట్టి ఒంత విడమరిచి చెప్పగలరా?

   Delete
 4. దీని గురించి Gurucharan Das అనే ఆయన ఒకానొక పుస్తకంలో ఈ విధంగా అభిప్రాయ పడ్డారు. జపాన్‌లోకూడా కులవ్యవస్థ ఉందికానీ అది మరీ ఇండియాలో ఉన్నంత rigid గా లేదు. అక్కడివారికి కులపరంగా పదోన్నతులుకూడా ఉండేవి. ఒకప్పుడు (60ల్లో) ఉత్తరాదిన కొన్ని గ్రామాల్లో కొందరు తమను తాము promote చేసుకోవడం ఉండేదికానీ, ఇప్పుడది పూర్తిగా నశించింది.

  కులానికీ, మతానికీ సంబంధం లేదనడం సత్యదూరమైన వాదన. మనుస్మృతి జన్మ ఆధారంగా మనుషులను కులాలుగా విభజించి వారికి అర్హతలు నిర్ణయించిందని మనం చదివాం. కొన్ని గుళ్ళలో దళితులకి గతంలో ప్రవేశం కల్పించకపోవడం మనం చూశాం. ఈనాటికీ పల్లెల్లో పండగనాడు దళితులను దూరంగా ఉంచడం మనం చూస్తున్నాం. హిందూమత సాహిత్యంలో (రామాయణం సహా) బ్రాహ్మణులకు చేయాల్సిన దానధర్మాలను పొగుడుతూ, ఇతరుల ఏయే స్థానాల్లో ఉంచాలో చెప్పడంచూశాం. రామాయణం మతగ్రంధంకాదా? కులానికీ మతానికీ సంబంధంలేకపోతే మొత్తం హిందూమతం కులాంతో ఇంత obsessionకు గురై ఎందుకు ఉంది?

  అసలు హిందూ మతం అంటూ ఏమీలేదు. ఉన్నదల్ల బ్రాహ్మణ మతమ్మాత్రమే! ఆ మతంలో బ్రాహ్మణులకు దక్కాల్సిన previleges చెప్పుకుంటూ వారు గ్రంధాలు రాసుకున్నారు. వారి కులస్తులను, వారు చెప్పిన విధంగా పాలించినవారినీ దేవతలుగా, గొప్పవారిగా కీర్తించుకున్నారు. ఈ మతం వారిని ఉధ్ధరించినంతగా, ఇంకెవరికీ దోచిపెట్టిందేమీలేదు. ఈమతంలో బ్రాహ్మణుణ్ణె సేవించినందువల్ల జరిగే పుణ్యలోకాలు అంటూ ప్రతి గ్రంధంలోనూ రాసుకున్నారు, బ్రాహ్మణుడు చెడ్డవాడైనా దండించకూడదనీ రాసుకున్నారు. దాన్నీ మన బ్రహ్మశ్రీ ప్రవచనకారులు చెబుతున్నారు.

  ReplyDelete
  Replies
  1. ఆ కెప్టెన్లు ఎవరు?వారు అంబేద్కరుని మోసం చెయ్యటానికి కూడా బ్రాహ్మణులే కారణమా?మాటిమాటికీ అంబేద్కరు నామం జపిస్తూ కొన్ని వేలయేళ్ళనాటి బ్రాహ్మణుల దుర్మార్గాల్ని కూడా కనిపెట్టి వెలికి తియ్య్యగలిగినవాళ్ళు నిన్న గాక మొన్న అంబెద్కర్ ఎవరి గురించి ఆ మాటలు అన్నాడో కనిపెట్టలేరా?ఎవడి స్వార్ధం వాడు చూసుకోవటానికి అణిచివేయబడిన కులాల నుంచి వచ్చిన దళిత మేధావులే అతీతులు కానప్పుడు బ్రాహ్మణుల్ని తప్పుపట్టి ప్రయోజనం ఏమిటి?   ఒకానొకప్పుడు కులదోపిడీ జరిగింది,నిజమే!అయితే, ఆ కులదోపిడీ నుంచి బయటపడటానికి డా.అంబేద్కర్ వజ్రాయుధం కన్న బలమయిన ఆయుధమే ఇచ్చాడు,దాని సక్తిని తెలుసుకుని ఉపయోగించుకోవాల్సినవాళ్ళు సరైన తీరున ఉపయోగించుకుంటే కేవలం పదేళ్లు చాలు కులదోపిడీ నుంచి ఆయా కులాలు బయటపడటానికి!మరి,డెబ్బయ్యేళ్ళ తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్లు లేనిదే బతకలేని స్థితిలో ఎందుకు ఉన్నారు?అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్లలో మొదటి భాగం అర్హతలు విద్యకైన ఔద్యోగానికైన అప్రాతినిధ్యానికైనా ఆవ్సరమైన అర్హతలకి పెట్తుకున్న కొలబద్దకి అతి దగ్గిరగా వచ్చినవాళ్ళకి కొంచెం ప్రోత్సాహం కల్పించదమే తప్ప అర్హత ఏమాత్రం లేనివాళ్లని వెనకబడినకులం పేరుతో ముందుకు తొయ్యమని కాదు,అవునా?   అదీ గాక అంబేద్కర్ చెప్పిన రెండో భాగం ప్రత్యేకించి ఆయా వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లని అందుకుంటున్నవారికి - ఈ రిజర్వేషన్ సౌకర్యం మీకు వ్యక్తిగత దరిద్రాన్ని వదిలించుకోవదానికి కాదు,మీ కులానికి సరయిన ప్రాతినిధ్యం ఉండటం కోసం కాబట్టి ఈ సౌకర్యాన్ని మీ కులంలోని ఇతరులని కూడా మీలాగే ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి అని నొక్కి చెప్పాడు,అవునా?మరి,ఇన్నేళ్లు ఆనాడు అంబేద్కర్ స్వయంగా ఆరోపణ చేసినట్టు కుక్షింభరులై తమ సొంత కులాలనే పట్టించుకోనివాళ్ళకి బ్రాహ్మణుల్ని తమ కులాలకి అన్యాయం చేశారని విమర్శించే హక్కు ఉందా!మరి,ఇవ్వాళ ఏ విధమయిన అస్పృశ్యతనీ అనుభవించని కాపులు మీతో పోటీపడి మీ వాటాని తగ్గించడానికి వస్తుంటే వాళ్లతో పోట్లాడి మీ హక్కుల్ని రక్షించుకోవడానికి నోళ్ళు పెగలలేదు,కారణం ఏమిటి?నోరూ వాయీ లేని బ్రాహ్మణులే దొరికారు వీళ్ళకి - సిగ్గు లేకపోతే సరి.

   Delete
 5. క్షేత్రస్థాయిలో ఇవ్వాళ దళితులు ఆలయనిర్మాతలుగా కూడా ఉన్నారు,మీకు తెలుసా?నిన్నటివరకు బీదరికంలో అలమటించిన ఒక దళీత కుటుబం కొంత పరిస్థితి మెరుగు పడగానే దైవభక్తిని పెంచుకుంటున్నది,ఆలయ సందర్శన చేస్తున్నారు,కొందరు మరీ ఎక్కువ ధనవంతులై వెసులుబాటు గనక ఉంటే తమ ప్రాంతంలో ఆలయాలు తామే కట్టుకుంటున్నారు.వెయ్యేళ్ల కాలపు విషయాల్ని ఇవ్వాళ కూడా పాటలా పాడితే ఏమి చెప్పాలి?

  ఒకనాడు మమ్మల్ని చదువుకోనివ్వకుండా బ్రాహ్మణులు తొక్కేశారు,క్రీ.స 1947లో స్వతంత్రం వచ్చింది.అంబేద్కర్ మాకు రిజర్వేషన్లు అనే వజ్రాయుధాన్ని ఇచ్చాడు.అది లేకపోతే ఇంక ఆఘోరిస్తూనే ఉందేవాళ్ళం అని చిలకపలుకులు పలుకుతున్నవాళ్ళకి ఓరియెంటల్ ఎడ్యుకేషన్ సిస్టం గురించి ఎంత తెలుసు?ఆ స్కూళ్ళలో చదువుకుంటున్న వాళ్లో బ్రాహ్మణేతరులే ఎక్క్కువ,ఫీజులు తక్కువ,క్వాలిటీ ఎక్కూవ్ విద్య పూర్తయ్యాక ఖాళీగ ఔందే పరిస్థితి కూద అతక్కువే - అప్పటి అన్ని ప్రెసిడెన్సీలలోనూ అంతే!మీరు వరప్రసాదం అనుకుంటున్న్న మెకాలె ఎడ్యుకేషను ఖరీదు కావటం,మాతృభాషలో లేకపోవటం,బోధనలో క్వాలిటీ లేకపోవటం లాంటి రోగాలు వచ్చి చేరాయి.మెకాలే మనల్ని బాగుచెయ్యటానికి కాదు కొత్త విద్యావిధానం పెట్టింది,తమకి బానిసల్ని తయారు చేసుకోవటానికి.అది తెలియక పొలోమని పోటీలు పడి చదివి ఏమి ఉద్ధరించారు?వాళ్లకి చాలీనంతమందిని వడకట్టి తీసుకుంటే మిగతావాళ్ళు నిరుద్యోగం రుచి ఎలా ఉంటుందో రుచి చూసారు.అప్పటినుంచి అదే పరిస్థితి కొనసాగుతున్నది.చరిత్ర తెలియదు.తెలుసుకోవాలని కూడా అనుకోరు.ఒక ప్రశ్నకి వెయ్యిసార్లు జవాబు చెప్పినా వెయ్యిన్నొకటోసారి కూదా అదే ప్రశ్నని వేస్తుంటే దాన్ని కేవలం అజ్ఞానం అనాలా,లేక ఈ హరిబాబు చెబితే మేం వినేదేమిటి మారేదేమిటి అన్న అహంకారం అనుకోవాలా?

  ఒక సూటి ప్రశ్న వేస్తాను,బాగా ఆలోచించుకుని జవాబు చెబుతారా?నిజమే,ఒకనాడు అస్పృశ్యత ఉంది,మనుస్మ్ర్తిలో దాన్ని సమర్ధించహె శ్లోకాలు ఉన్నాయి.నా బ్లాగులోనూ వాటిని నేనూ సాక్ష్యాలు చూపించి చెప్పాను.కానీ ఉందని చెప్పి బ్రహ్మల్ని తిట్టటంతో సరిపెట్టుకోకుండా దానినుంచి బయటపడటానికి దళితులకి ఎన్నేళ్లు పడుతుంది?రిజర్వషన్ల మీద అంత ఆశపెట్టుకుని పోరాడి సాధించిన అంబేద్కర్ 1950లోనే "నా కెప్తెన్లు నన్ను మోసం చేశారు.రిజర్వేషన్లని నేను వూహించిన పద్ధతిలో ఉపయోగించుకోవతం లేదు,స్వార్ధపరులైపోయారు" అని కన్నీళ్ళు పెట్టుకున్న సన్నివేసం జరిగిందా లేదా?ఆ కెప్టెన్లు ఎవరు?వారు అంబేద్కరుని మోసం చెయ్యటానికి కూడా బ్రాహ్మణులే కారణమా?ఎవడి స్వర్ధం వాడు చూసుకోవటానికి దళిత మేధావులే అతీతులు కానప్పుడు బ్రాహ్మణుల్ని తప్పుపట్టి ప్రయోజనం ఏమిటి?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top