Reactions:

Post a Comment

 1. శ్రీరామకృష్ణ గారు కాని, మీరు కాని వైద్యరంగనిపుణులు కారు. ముఖ్యంగా ఎండోక్రైనాలజీ రంగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉన్నవారు కాదు.

  మీరు ప్రచారం చేస్తున్న ఆహారవిధానాన్ని కీటోడైట్ అంటారు. సరే ఏదో ఒకటి. ఇది పాటించటం వలన కలిగే అద్భుతఫలితాల గురించి రామకృష్నగారు ఎలాగూ ఊదరగొడుతున్నారు. మీరూ ఆయనవిధానానికి ప్రచారకార్యకర్తృత్వం వహిస్తున్నారు. ఈ విధానం దీర్ఘకాలంలో ఎలాంటి ఫలితాలనిచ్చేదీ అన్నవిషయంపై ఇంకా కూలంకషంగా పరిశోధన జరగవలసి ఉంది.అది జరుగకుండా ఏదీ మా అమ్మగారు వాడారూ, మా స్నేహితులు వాడారూ మీరందరూ వాడండీ అని ప్రచారం చేయటం సరైనదిగా అనిపించదు. అది పధ్ధతి కూడా కాదు. అది శాస్త్రీయవిధానం అస్సలు కానేకాదు. కాని మీ దృష్టిలో అదే సరైన విధానం - ఎందుకంటే మీకు వైద్యపరిశోధనా విధానం గురించి అవగాహన లేకపోవటమే కారణం. దురదృష్టం ఏమిటంటే ఒకరంగంలో సాధికారికంగా మాట్లాడాలంటే ముందు ఆరంగంలో నైపుణ్యం ఉండాలన విషయం మీరు ఒప్పుకోరు. మీ‌ నమ్మకాలే మి దృష్టిలో నిజాలు! అంతే.

  రాబోయే కాలంలో ఏమైనా దుష్పరిణామాలు వెలుగులోనికి వస్తే, ముఖ్యంగా తీవ్రమైన పరిణామాలు ఎదురైతే ? వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి?

  రామకృష్ణ గారే కాదు, మీలాంటి ప్రచారసారధులూ‌ ఆ దుష్పరిణామాలకు సంపూర్ణంగా బాధ్యులే అన్నది మరవకండి. అప్పుడు మీరు ఎన్ని కొత్త వ్యాసాలు వ్రాసినా ఎంత దిద్దుబాటు ప్రచారం చేసినా జరిగిన నష్టం పూడ్చలేనిదే అవుతుంది. అది మరొక థలిడోమైడ్ ట్రాజెడీగా సంఘాన్ని దెబ్బకొట్ట వచ్చును! ఆలోచించండి.

  మీ‌ ప్రచారపుహోరులో వైద్యరంగం పైనా వైద్యులపైనా కూడా కొన్ని అనుచితవ్యాఖ్యలు - ముఖ్యంగా దొంగడాక్టర్లు వగైరా అంటూ - చూసాను. ఇదంత సరైన పధ్దతి కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ‌ కాదు.

  మీ దృష్టిలో మీరు నూటికినూరుపాళ్ళు ప్రజాసేవకులమని భావిస్తున్నారని అనిపిస్తున్నది. కాని తమకు తెలియని రంగాల్లో వేళ్ళూ కాళ్ళూ పెట్టి జనానికి హితబోధలు చేయటం అంత హర్షణీయమైనది కాదు.

  ఇలా వ్రాసినందుకు మీకు ఆగ్రహం కలుగవచ్చును. దానికి నేనేమీ చేయలేను. నా అభిప్రాయాన్ని నిర్మొగమాటంగా తెలియజేయాలనే తప్ప మీపైన ఏమీ దురుద్దేశంతో వ్రాయలేదని గమనించవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశ్నకు కాస్త సమయం తీసుకుని సంయమనంతో సమాధానం చెప్తాను. ముందొక కామెంట్ వ్రాసాను. దానిని డిలీట్ చేసాను.

   Delete
 2. వామ్మో రోజుకు డెబ్బై గ్రాముల నెయ్యి నూనె వెన్నపూస తీసుకోవాలా. ఆరోగ్యం బుచికోయమ్మ బుచికి అయిపోతుందేమో సార్.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top