'వీరమచనేని రామకృష్ణారావు గారి ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సు'ను జయప్రదం చేసిన ఖమ్మం జిల్లా ప్రజలకు "పల్లెప్రపంచం" తరపున "జనవిజయం" వార పత్రిక తరపున హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సభకు రాష్ట్రం నలుమూలలనుండి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు. ఇప్పటికే జ్ఞానాన్ని, ఆచరణలో ఫలితాన్ని అప్డేట్ చేసుకుని సమాజానికి మంచి చేయడానికు ముందుకొస్తున్న వైద్యులకు, పాజిటివ్ ప్రచారం కల్పిస్తున్న పత్రికలు, చానళ్లకు అభినందనలు.

విపరీతమైన ఎండలోనూ, సి.పి.ఎం జాతీయ మహాసభలున్నప్పటికీ, రామకృష్ణ గారి సభ ఖమ్మంలొ నిర్వహించడం రెండవసారి అయినప్పటికీ ఈ సభను జయప్రదం చేసిన ప్రజలకు అభివందనం. గత 10 రోజులుగా ఈ సభను జయప్రదం చేయడానికి సహకరించిన, కృషి చేసిన పల్లెప్రపంచం, మైత్రీ డెవలపర్స్ కార్యకర్తలకు ముఖ్యంగా శెట్టి శ్రీనివాస్, గుత్తా శివ శంకర ఫ్రసాద్ , భాస్కర రావు, లగడపాటి హేమలత, ఉషారాణి, సూర్యకుమారి, సత్య, రుద్రగాని మాధవరావు, శంభయ్య, అంజయ్య, పరశురాం, రామారావు తదితరులకు ప్రత్యేక ధన్యవాదములు. 

సహకరించిన ప్రింట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఖమ్మం నగర మునిసిపల్ కార్పోరేషన్ అధికారులకు, పోలీసు డిపార్టుమెంటుకు ధన్యవాదములు. మాకు ప్రచారానికి వీడియో తయారు చేసి ఇచ్చిన హైదరాబాద్ ఈగల్ మీడియా సముద్రపు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. 

మా ఆహ్వానాన్ని మన్నించి ఈ అవకాశం ఇచ్చి, ఎంతో ఓపికగా ఆఖరి ప్రశ్న వరకూ అందరి అనుమానాలకు సమాధానాలు ఇచ్చిన  వీరమాచనేని రామకృష్ణ గారికి, సభలో పాల్గొన్న మిత్రుడు ఇమ్రాన్ భయ్యాకు ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు.

ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమానికి ఆటంకాలు కలిగించాలని కొందరు ప్రయత్నించినా వారు విఫలం కాక తప్పలేదు. నెగిటివ్ ప్రచారం కల్పించిన మిత్రులు కూడా ఫెయిల్ అయ్యారు. అదే విధంగా మిడి మిడి జ్ఞానంతో అల్పబుద్ధితో అతి ఉత్సాహంతో ఈర్ష్యా ద్వేషాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఆనందపడుతున్న వారికి జాలితో నా సానుభూతిని ప్రకటిస్తున్నాను. 

దీనంతటికీ కారణం రామకృష్ణ విధానం పై ప్రజలలో ఉన్న అభిమానం కారణం తప్ప మా గొప్పతనం కాదన్నది నాకు తెలుసు. బహుశా ఎన్.టీ.ఆర్, వై.ఎస్సార్ ల తరువాత  2 తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచ వ్యాపితంగా ఉన్న తెలుగు ప్రజలలోనూ వీరమాచనేనికి అంతటి ఫాలోయింగ్ ఉన్నదంటే అతిశయోక్తి కాదనుకుంటున్నాను. సమాజానికి సేవ చేయాలన్న తపనతో ఒక్క పైసా ఆశించకుండా తన స్వంత ఖర్చులతో ఇన్ని చోట్లకు వెళ్లి గంటలతరబడి ఓపికగా ఓ మంచి జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను ప్రచారం చేస్తున్న వీరమాచనేని రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు. 

వేల్యూస్ పాటించే కొద్దిపాటి కార్పోరేట్ ఆసుపత్రులతో పాటు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే వైద్యులదాకా ఈ విధానంలోని శాస్త్రీయతను గుర్తించి క్రమంగా మద్దతిస్తున్నారు. వీరి సంఖ్యా అనివార్యంగానైనా పెరుగుతుండడం సమాజానికి మేలే చేస్తుందని అభిప్రాయపడుతున్నాను. వారికి అభినందనలు. వారి హాస్పిటల్స్ లో ఇప్పటికే కొబ్బరినూనెను అమ్ముతున్నారు. ఈ డైట్ ను ఫాలో అవుతూ మందులను క్రమంగా తగ్గిస్తూ తమ పేషంట్లకు సేవ చేస్తున్న మందుల స్థానంలొ ఆహారం ప్రిస్క్రిప్షన్ గా వ్రాసే మంచురోజులు ముందున్నాయన్నదానికి ఇది సూచిక. మళ్లీ ప్రక్రుతికికి దగ్గరగా జీవన విధానం మారడానికి సంకేతం. మెడికల్ మాఫియాకు దూరంగా వేస్తున్న ముందడుగు. 

సత్యానికి ఎవరైనా తలొగ్గాల్సిందే. సత్యాన్ని కనుగొనగలమేగానీ సృష్టించలేము. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము. అలాగే సైన్స్ ప్రక్రుతిలొ ఓ చిన్న పార్ట్ తప్ప సైన్స్ ప్రక్రుతిని సృష్టించలేదు. శాసించలేదు. అలా ఆశించిన వారికి భంగపాటు తప్పదు.

ఫ్యాట్ (కీటో) దైట్ కు , కార్బ్ డైట్ కు తేడాను తెలుసుకోవాలి. శరీరంలొ ఉండే రెండు మెటబాలిజం ల మధ్య తేడాను గుర్తించాలి. ఇప్పటికే అధికారికంగా కీటో డైట్ ను గుర్తించిన దేశాల అనుభవం నుండి మన నేతలు పాఠాలు నేర్చుకోవాలి. పిల్లలకు పాఠ్యాంశాలలొ ఏ ఆహరంలొ ఏముంటున్నదన్న సిలబస్ ప్రవేశ పెట్టాలి. 

5 వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి ఆయుర్వేదం ఆవిష్కరణతో మొట్టమొదటిగా వైద్యాన్ని , యోగా వంటి మంచి జీవన విధానాన్ని అందించిన భారత్ నేడు కార్పోరేట్ల కుట్రకు వైద్యంలోనూ, జీవన విధానంలోనూ బలికావడం, దానికి మిడి మిడి జ్ఞానులు కుహనా మేధావులు వత్తాసు పలకడం ఆశ్చర్యం కాకున్నా ఆటంకమే. లంఖణం పరమౌషధం అన్న పెద్దల ఆచరణ పూర్వక అనుభవజ్ఞానం, ఆరోగ్యమే మహా భాగ్యమన్న సూక్తిని ఏ సైన్స్ కాదనగలదు? ఒక్క... ఫార్మా, మెడికల్ మాఫియా కుట్రకు బలయ్యే పిచ్చ జ్ఞానం ఉన్న వెర్రివాదులు తప్ప. 

వివేకానందుటన్నట్లు విద్య అంటే పుస్తకాలను బట్టీ బట్టడం, డిగ్రీలు పొందడం కాదు. వినయన్ని, శీలాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకోవడమే నిజమైన విద్య. అది డిగ్రీలతో కొలిచి మూర్ఖంగా ఆనందపడితే అణువంతైనా రాదు. వీరూ తమ జ్ఞానాన్ని అప్టేడ్ చేసుకునీ సమాజానికి ఎనతగానో మంచి చేస్తున్న వీరమాచనేని జీవన శైలి విధానం ను ముందుగా అవగాహన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్ని డిగ్రీలున్నాయన్న అహంకారం వదలి ఎంతగా ధర్మం వైపు, సత్యం వైపు ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడే తత్వాన్ని అలవరచుకుంటున్నామన్నది ఆలోచించుకోవాలి. 

ఆ దిశగా అందరూ అడుగులు వేయాలని ఆశిస్తూ.....ఆరోగ్యకరమైన చర్చకు నేనెపుడూ ఆహ్వానం పలుకుతున్నాను. మిడి మిడి జ్ఞానం,  తమకు తెలిసిందే జ్ఞానమని, బట్టీ పట్ట్టింది అప్పజెప్పడమే గొప్పనుకునే అహంకారులతో మిడి మిడి జ్ఞానులతో  విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. 

మీ....
పల్లా కొండల రావు.


My Speech : Setty Srinivas Speech :

Reactions:

Post a Comment

 1. dear sir very good blog and very good content

  Telugu News

  ReplyDelete
 2. శ్రీ కొండల రావు గారి ఉవాచ:
  . . . . అదే విధంగా మిడి మిడి జ్ఞానంతో అల్పబుద్ధితో అతి ఉత్సాహంతో ఈర్ష్యా ద్వేషాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఆనందపడుతున్న వారికి జాలితో నా సానుభూతిని ప్రకటిస్తున్నాను. . . .

  ఏతావాతా తేలిందేమిటంటే శ్రీకొండల రావు గారితో ఎవరైనా విబేధించిన పక్షంలో వారికి ఈ క్రింది లక్షణాలు (అర్హతలను బట్టి కొన్నో మొత్తం అన్నీనో) ఆపాదించబడును:
  1. మిడి జ్ఞానం
  2. అల్పబుద్ధి
  3. అతి ఉత్సాహం
  4. ఈర్ష్యా ద్వేషాలు
  5. దుష్ప్రచారబుధ్ది
  కొండలరావు గారు కాని మరొకరు కాని జనాకర్షణ అన్నది ప్రాతిపదికగా శాస్త్రీయతను ఎలా నిరూపిస్తున్నారో అన్నది బోఢపడటం లేదు. పోనివ్వండి. ఎవరికి బోధపడకపోయినా వారి వారి బాధల్ని వారివారి బ్లాగుల్లో వెళ్ళబోసుకోవచ్చును కానీ కొండలరావు గారిని ఇబ్బంది పెట్టవధ్ధని విజ్ఞప్తి.

  కొండల రావు గారూ, ఈ ఒక్కసారికి మన్నించేయడి. ఇకపై మీ అపరమితవిజ్ఞానభాండారం తలుపులు తట్టే దుస్సాహసం చేయను.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారు, ఇది మిమ్ములను మాత్రమే ఉద్దేశించి వ్రాసిన పోస్టు కాదు. నాకు మా జిల్లాలోనూ చాలా బెదిరింపులు, ఆటంకాలు వచ్చాయి. అందులో తమ పొరపాటును తెలుసుకుని... సారీ చెప్పి... తిరిగి ఆనందంతో ఆర్ధిక సహాయం చేసిన వారూ ఉన్నారు. అయినా మేము ఈ చాలెంజ్ లను, బెదిరింపులని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే ఈ విధానంలోని శాస్త్రీయతను అధ్యయనం చేశాకే దీనిని మా జిల్లా వరకు గ్రామాలలొ సైతం ప్రచారం చేయలాని నిర్ణయించుకుని ప్రజారోగ్య చైతన్య వేదికను ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో నేను తప్ప కమ్యూనిస్టు భావాలున్నవార్లు లేరు. బి.జె.పీ, టీ.ఆర్.ఎస్ , వై.కా.పా , తెలుగుదేశం వంటి పార్టీలవారు ఉన్నారు. మీరు స్వయంగా వచ్చి వారిని కలసి మాట్లాడవచ్చు.

   మీరంటే నాకు గౌరవం ఉన్నది, మీకూ నాకు చాన్నాళ్ల నుండి పరిచయం ఉన్నది కనుకనే పల్లెప్రపంచంలో మొదట వ్రాసిన కామెంటుని నేనే రద్దు చేసుకున్నాను. మీకు కామెంటు వద్దు మెయిల్ ద్వారా సమాధానం వ్రాద్దామనుకున్నాను. మీ వ్యాఖ్యలపట్ల విపరీతమైన కోపం ఉన్నా... మీతో నాకున్న అనుబంధం మూలాన నేను అంత ఘాటుగా మీపట్ల రియాక్ట్ కావడం సరయినది కాదనుకునె వెంటనే తొలగించాను. కానీ అది మాలికలొ వచ్చినట్లుంది. దానిని పట్టుకుని హరిబాబు తొందరపడ్డాడనిపించింది. అక్కడ అతనుపయోగించిన భాష మీకు సంతోషాన్ని కలిగించి ఉండవచ్చు. అది మీ ఇష్టం. అతను నేను తన్నులు తింటానని, మీ తరపున ఇంకేదో రకంగా ఉన్నట్లు .... తనే గెలిచినట్లు .... వాడిన పదజాలం కూడా కొందరికి వినసొంపుగా ఉండవచ్చు. అది వ్యక్తిగతమైన ఇగోలకు సంబంధించినది. సరే.... ఎవరి వ్యక్తిత్వం వారిది. ఆ పోశ్టులో ప్రవీణ్ గురించి, కమ్యూనిస్టుల గురించి హరిబాబు ప్రస్థావించిన దానిపైనా మీరేమీ సలహాలు ఇవ్వలేదు. నేను ఎదుటివారి భావప్రకటనకు ఎంత విలువనిస్తానో మీకు తెలియనిదా? దీనివల్ల నేను iconoclast వంటి నాస్తికులతోనూ, హిందూ మతవాదులతోనూ ఇబ్బందులను ఎదుర్కున్నాను. ప్రవీణ్ గురించి హరిబాబు మాట్లాడడం మరీ హాస్యాస్పదం. ప్రవీణ్ పట్ల నా వైఖరి అందరికీ తెలిసిందే. దానిని చర్విత చరణం చెయడం మర్యాద కూడా కాదు. ప్రవీణ్ వ్యాసాలు వ్రాస్తే ప్రచురించినట్లె ఎవరు వ్రాసినా ప్రచురించాను. నేను తీవ్రగా వ్యతిరేకించే మనువు భావజాలాన్ని.... నేను ఆధునిక మనువునని చెప్పుకునే నరసిమ్హారావు గారి భావాలను అక్షరం మార్చకుండా పబ్లిష్ చేశాను. అయినా ఎక్కడా సమ్యమనం కోల్పోలేదనే అనుకుంటున్నాను. నాకు వాదనలో కమ్యూనిస్టులమనుకుంటున్నవారెవరూ బ్లాగులలో ఉన్నవారిలొ నచ్చలేదు. గ్రీన్స్టార్(ఆయన/ఆమె ఎవరో నాకు ఇప్పటికీ తెలీదు), భరద్వాజ్, జై గొట్టిముక్కల వంటి కొద్ది మంది మాత్రమే నచ్చుతారు. వారి భావాలు వేరు... నా భావాలు వేరు అని వారికీ తెలుసు. జై గారయితే చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటారు. ఆ తరువాత మీరు నచ్చుతారు.వారందరి కంటే మీతో నాకున్న పరిచయం, అనుబంధం కూడా ఎక్కువే. ఇప్పటికీ ఆ విషయంలో తేడా లేదు. మీలో నాకు నచ్చనది ప్రధమ కోపంతో చేసె తప్పులు, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, కొన్ని సందర్భాలలొ అలగడంతోపాటు ఫలాయన వాదం, సున్నిత మనస్తత్వంతో ఎక్కువ బాధపడడం (ఈ రోగం నాకూ ఉన్నది లెండి). వీటిని మీరు పాజిటివ్ గా తీసుకోవాలని విజ్ఞప్తి. ........ part 2 unnadi.

   Delete
  2. part 2...
   ఇక కీటో డైట్ కు సంబంధించి మీకున్నది మిడి మిడి జ్ఞానం మాత్రమే. హరిబాబుకు ఏదో తెలుసనుకుని, నాకేదో ఆయన పరిశోధించి బోధనలు చేస్తున్నారనుకుని మీరు భ్రమ పడుతున్నారు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలొ ప్రముఖ వైద్యులు.... మీరు చెప్పే హరిబాబు కంటే ఎక్కువ డిగ్రీలు, వైద్య రంగంలొ అనుభవం ఉన్న వైద్యులే దీనిని ప్రోత్సహిస్తున్నారు. వైజాగ్ కు చెందిన డా. పి.వి.సత్యానారయన గారు మనం ఎమి తినాలి? అని బుక్ వ్రాశారు. ఓ జర్నలిస్టు పరిశోధనల ఆధారంగా ఆయన దీనిని అధ్యయనం చేసి, తనపై ప్రయొగం చేసుకుని ఆయన పేషంట్లకు సేవ చేస్తున్నారు. ఆయన స్వయంగా షుగర్ పేషెంటు, హార్ట్ ఆపరేషన్ చేయించుకుని రెండు స్టంటులు వేయించుకున్నవారు. ఆయన స్వయంగా పాటించడమే కాదు వైజాగ్, హైదరాబాదులలో చాలామంది షుగర్ పేషంట్లకు కొత్త లైఫ్ నిస్తున్నారు. ఇలా అందరు డాక్టర్లు ఇగోలకు స్వస్తి చెప్పి జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోగలిగితే వీరమాచనేనికి ఇంత ప్రచారం, సీను వచ్చేవే కావు. దురదృష్టం ఏమిటంటే మెడికల్ గైడ్లైన్స్ సాధికారికంగా మారాక కూడా... తాము బట్టీ బట్టి నేర్చుకున్న వైద్య సిలబస్ ఆధారంగా మాత్రమే.... ఏమత్రం అప్టేట్ కాకుండా ఇప్పటికీ కోడిగుడ్డు ఎల్లో తినడం ప్రమాదమని చెప్పే డాక్టర్లున్నారు. ఈ అంశంపై తమ వైద్య సోదరులు అప్టేట్ కావాలని, వారికి ఈ జ్ఞానంపై సరయిన సమాచారం లేదని డ్ర్.ఫ్.వ్. శత్యన్రయన చెప్తున్నారు. ఆయన ఇంటర్వ్యూలను పరిశీలించగలరు. నాగార్జున, కేర్..... వంటి ఆసుపత్రులలోని ప్రముఖ వైద్యులు ఈ విధానాన్ని ప్రపఓజ్ చేస్తున్నారు. స్వయంగా హాస్పిటల్స్ వారే వీరమాచనేనితో సభలు పెట్టించినవి ఉన్నాయి. పరిశీలంచాలని మనవి. వివరాలు మీరే తెలుసుకొండి. లేదా నేను మీకు డేటా పంపిస్తాను. మీరు వారిని ఇంటర్వ్యూ చేయండి. జాసన్ ఫంగ్ గారి భ్లొగ్ చూడండి. ఆయన పరిశోధనలను గమనించండి. కొన్ని దేశాలు అధికారికంగా గుర్తించాయి. అయితే ఇంకా దీనిపై పూర్తి నిర్ధారణ రావడానికి కొన్నేళ్ళు కూడా పట్టవచ్చు. నోబెల్ బహుమతి పొందిన పెన్సిలిన్ కైనా తప్పులు దొరికితే బేన్ చేయక తప్పదు. అది ఎపుడంటే ఆచరణలొ తిరిగి ప్రమాదకర పరిస్తితులు ఉన్నపుడు మాత్రమే. కానీ ఆలూ లేదూ చూలూ లేదు అన్న చందంగా వీరమాచనేని రామకృష్ణ చెప్తున్నది వినకుండా.... లక్షలాదిమంది మెడికల్ రిపోర్టులు పరిశీలించకుండా కేవలం హరిబాబును నమ్ముకుని మీవంటి వారు పైపై కామెంట్లు చేయడం మంచిది కాదేమో మరొక్కసారి పునరాలోచించాలి అని మనవి. ఎందుకంటే ఈ జ్ఞానం మీవంటి వారు శ్రద్ధతో పరిశీలిస్తే డెఫినెట్ గా సమాజానికి మేలు జరుగుతుంది. దయచేసి ఆ దిశగా మీరు ఆలోచించాలని ప్రత్యేక విజ్ఞప్తి. part 3 unnadi.

   Delete
  3. part 3 లేదూ.... దీనివల్ల సమాజానికి జరిగే చెడుని మీరు గుర్తిస్తే.... అదేమిటో నాకు తెలియజేయండి. మీ వాదనలొ ఏ మాత్రం సత్యం ఉన్నా నేను పునరాలోచిస్తాను. ఇక్కడ వ్యక్తుల గొరవాలు, ఈగోలు, చాలెంజులు కాదు కావలసింది. మన యోగాను, హోమియోనూ, ఆక్యుపంచర్ నూ కూడా శాస్త్రీయత అని చెప్పడానికి చాలా కాలం పట్టింది. అంత మాత్రాన వాటిని మెడికల్ కౌన్సిల్ గుర్తిస్తేనె మేము సపోర్ట్ చేస్తాము, సైన్స్ అనుకుంటాము అనుకుంటే అది మీ ఇష్టం. దానిని నేను కాదనను.

   కానీ నా బ్లాగులో దూరో, రచ్చ చేసో, తంతామని బెదిరించడమొ చేస్తె భయపడడానికి పిరికిపందను కాను. ఈ అంశంలొ సబ్జెక్ట్ పరంగా చర్చ చేయండి. పూర్తిగా పరిశీలన చేయండి.

   ఇన్నాళ్లూ కోడిగుడ్డు యెల్లోను తినొద్దన్నది ఎవరు? ఎందుకు? రిఫైనుడ్ ఆయిల్ ఎందుకు ఎలా సృష్టించబడింది? ..... ఇపుడు అదే అమెరికన్ కార్డియాలజీ అసోషియేషన్ ఏమి చెప్తున్నది. అమెరికా వాడు ఏ గైడ్లైన్స్ చెపితే వాటిని తోక ఊపుతూ ఫాలో కావాలా? మన ఆయుర్వేదంలో ఉన్న మంచిని, మన భారతీయ జీవ విధానంలోని మంచిని పాటిస్తూ, అవసరమైన కొన్ని ముఖ్యమైన శాస్త్రీయతన్ను అల్లోపతి లేదా ఇతర మెడికల్ సైన్సును ఉపయోగించుకోవాలి. దేనినీ మనం మీదేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే సైన్స్ ప్రక్రుతిలొ భాగం తప్ప సైన్సే ప్రక్రుతిని సృష్టించలేదు. ఎప్పటికపుడు సైన్స్ జ్ఞానాన్ని అప్టేట్ చేసుకుంటుంది. సైన్సే తప్పు చేస్తె వినమ్రంగా తప్పును సరిదిద్దుకుంటంది. ఆ పరిధి సైన్సుకు ఉంటుంది.

   కీటో డైట్ గురించి.... దానిని బేస్ గా చెసుకుని వీరమాచినేని రామకృష్న చెప్తున్న విధానాన్ని పరిశీలించి దానిలో ఏ లోపాలున్నాయో చెప్పండి. డిగ్రీలు చూపి భయపెట్టకండి. మీరు చెప్తున్న డిగ్రీలకంటే పెద్ద డిగ్రీలున్నవారు, వైద్యరంగంలోని ప్రముఖులే దీనిని సమర్ధిస్తున్నారు. సామాన్యులు బోలెడంత డబ్బుని ఆదా చేసుకుంటున్నారు. మందులు అవసరం లేకుండా ఆత్మ విశ్వాసంతొ హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నారు. వారందరి వివరాలను వారి అనుభవాలను మేము జనవిజయంలో పబ్లిష్ చేయబోతున్నాము. వారి అడ్రెస్సులు కూడా ఇస్తాము. మీరు ఎవరైనా స్వయంగా వెళ్లి వారి పాత రిపోర్ట్లు, కొత్త రిపోర్ట్లుఊ చెక్ చేసుకోవచ్చు. వారి డాక్టర్లనూ సంప్రదించి ఇది నిజమా? కాదా? అని నిర్ధారణ చేసుకోవచ్చి.

   ఇంత మంచి జరుగుతున్నపుడు శ్యామలీయంగారి మీద ఉన్న గౌరవం కోసం నేను వెనుకడుగు వేయలేనని సవినయంగా మనవి చేస్తున్నాను. నాకు బాగా కోపంతొ చేసిన మొదటి కామెంటులో సబ్జెక్ట్ విషయంలొ రాజీ లేదు కానీ అది మీ మనసును కష్ట పెట్టేది ఉన్నందుకు, మీకూ నాకూ ఉన్న వ్యక్తిగత పరిచయం కారణంగా అంత ఎమోషనల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక మీకు బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను. సారీ శ్యామలీయం గారు. completed.

   Delete
 3. కొండల రావు గారూ,

  కొన్ని చిత్రమైన పరిస్థితులు వస్తాయి. వాటి నెదుర్కొనక తప్పదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంటుంది పరిస్థితి. ప్రస్తుతం నా స్థితి ఆలాగే ఉంది. నాకు వ్రాయటానికో చేయటానికో సమర్థత ఉన్న విషయాలపై కూడా ఎక్కువగా సమయం కేటాయించలేను. ఆఫీసుకే రోజుకు పదిహేను గంటలదాకా సరిపోతున్నది నాకు. ఆఫీసుపనుల సమయాన్ని ఇతరవిషయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించను. బాగా సీనియర్ ఐన నేనే ఆఫీసు సమయాల్లో సోషల్ మీడియా పేజీలు తెరుస్తే ఇతరులు అది ఆదర్శంగా తీసుకొనే ప్రమాదం ఉంది. అది ఎవ్వరికీ మంచిది కాదు. ఒక విషయంపై అభిప్రాయం చెప్పాక దాన్ని వివరించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. కాని హెచ్చుగా ఆపని చేయటానికి సమయం చిక్కక ఇబ్బందిగా ఉన్నా ఇతరులు అపార్థం చేసుకొనే అవకాశం పుష్కలంగా ఉంది. అందుకే వీలైనంతగా రామసంకీర్తనం తప్ప మరేమీ చేయటం లేదు కాని ఇదిగో అప్పుడప్పుడు ఇలా ఇబ్బందుల్లో పడుతున్నాను. దయచేసి అపోహలు విరమిద్దాం.

  మీ సుదీర్ఘవ్యాఖ్యను శ్రధ్ధగా చదివాను.

  మీ చిత్తశుధ్ధిని నేను శంకించటం లేదు. మీరు నమ్మి ప్రచారం చేస్తున్నారు. అందులో తప్పుపట్టవలసినది నాకు కనిపించటం లేదు. కాని వేరే విషయాలున్నాయి. వాటి గురించి ఇక్కడ వ్రాయటం చర్చించటం వలన గ్రంథవిస్తరణ అవటమూ చర్చలో అందరూ ప్రవేశించి ఆవేశకావేశాలు పెరగటమూ మించి మరేమీ జరగదు. నాకు అందుకు సమయం కేటాయించటమూ కుదరని పరిస్థితి అని సవినయంగానే మనవి చేసాను.

  మీ నంబరు నా దగ్గర ఉన్నది కాని ఫోన్ పోవటంతో అది గల్లంతైనది. మరొక పాతదాంట్లో కూడా ఉండవచ్చునని వెదకి పట్టుకొన్నాను చివరకు. మీకు రెండురోజుల క్రిందట ఫోన్ చేసాను కాని కలవలేదు. బహుశః మీ ఫోన్ నంబరు మారి యుండవచ్చును. నా ఫోన్ నంబరు మాత్రం మారలేదు కాబట్టి మీ వీలు చూసుకొని మాట్లడగోరుతాను.

  ముఖ్యంగా ఎవరివిషయంలోనూ నాకు విరోధాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ కలుగవు. అపార్థాలకు దూరం. కాబట్టి మీరు సారీలు వగైరాలు చెప్పనవసరం లేరు.

  ReplyDelete
 4. "వారి అడ్రెస్సులు కూడా ఇస్తాము"

  కొండలరావు గారూ, అంతపని మాత్రం చేయకండి ప్లీస్. ఇతరులను అనవసరంగా identity theft ప్రమాదానికి గురి చేయడం బాధ్యతాయుతమయిన హోదాలో ఉన్న వారికి సరి కాదు.

  ReplyDelete
  Replies
  1. లేదండీ. వారి ఆమోదం మేరకే పాత కాత్త రిపోర్ట్ లతో జనవిజయం లో పబ్లిష్ చేస్తున్నాంం. అందరివీ కావు.

   Delete
  2. అడ్రసు ల విషయం పై మీ సూచనను పరిగణనలోకి తీసుకుంటాను. ధన్యవాదాలు.

   Delete
 5. మీరు మీరు బానే ఉన్నారు గానీ.. అంత చించుకున్న హరీ బాబు కంఠసోష గొంతునొప్పేనా???

  ReplyDelete
  Replies
  1. హరిబాబు తో కూడా నాకు శత్రుత్వం లేదండీ. ఎందుకా పోస్టు పెట్టాడన్నది అర్ధం కాలేదు కూడా.

   Delete
  2. హరీ బాబు తో ఎవ్వరికీ శతృత్వం ఉండదు.. చచ్చో, చంపో.. తనే శతృవుల్ని తయారు చెసుకుంటాడు.

   Delete
  3. "చచ్చో, చంపో" ని "తిట్టో, తిట్టించుకునో" అని చదువుకోవచ్చు

   Delete
  4. "ప్రశ్న ఎదురైతే.. సైన్సు.. లేచి సమాధానం వెతకమంటుంది.

   మతం... చతికిలపడి పూజలు, ప్రార్ధనలు చెయ్యమంటుంది"

   Delete
  5. "ప్రశ్న ఎదురైతే.. సైన్సు.. లేచి సమాధానం వెతకమంటుంది.

   మతం... చతికిలపడి పూజలు, ప్రార్ధనలు చెయ్యమంటుంది"........ 100%.... sure

   Delete
  6. కొండలరావు గారూ,

   మీరే ఈ టపాలో "సైన్స్ ప్రక్రుతిలొ ఓ చిన్న పార్ట్" అని రాశారు. ప్రకృతిలో సైన్స్ తీసేస్తే మిగిలింది మతం (nature minus science equals to faith?) అవుతుందా?

   మీ టపాలో ఇంకో చోట "వీరమాచనేనికి అంతటి ఫాలోయింగ్ ఉన్నదంటే అతిశయోక్తి కాదనుకుంటున్నాను" అన్నారు. అలాగే ఓపిక, సేవ చేయాలన్న తపన, సొంత ఖర్చుతో ప్రచారం వంటి "మంచి" గుణాలు వారికి మీరు అంటగట్టారు.

   ఇవి "సమాధానం వెతకడం" లా ఉన్నాయా లేదా "చతికిలపడి పూజలు, ప్రార్ధనలు" అవుతాయా? మీరే ఆలోచించాలి మరి

   Delete
  7. మిగతాది మతం ఎలా అవుతుంది? ఖచ్చితంగా కాదు. కొంత మతం గా మార్చుతున్నారనవచ్చేమో! మిగతాది తెలియాల్సిన సైన్స్ లేదా ప్రకృతి అవుటుంది.

   వీరమాచనేని కి నేను అంటగట్టడం కాదు. నాకు ఆయనతో పరిచయం మేరకు అభిప్రాయపడుతున్నవి. ఇవి పూజలు, ప్రార్ధనల వంటి దరిద్రాలు కావు. ప్రేమ, అభిమానం, సంస్కారం వంటి కోవలోకి వస్తాయి. అవి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినవి, మరీ విపరీతంగా చర్చిన్చాల్సినవి కావని కూడా నా అభిప్రాయం.

   ఒక వేల మరీ అంత ప్రాధాన్యం, అతిశయోక్తులు వద్దంటే మాత్రం నాకు మీరిచ్చే మంచి సలహాగా పాటించడానికి ఇబ్బందేమీ లేదు. అది సబ్జెక్టుకు సంబంచించినది కాదు. వ్యక్తిగతమైనది. నాకు నష్టం కలిగించేది కానీ పట్టుబట్టి వాదించాల్సింది కానీ కాదు.

   Delete
 6. "పార్వతిని పెళ్ళాడతానంటే పాపి అయ్యాడు.. కృష్ణుడ్ని పెళ్ళాడతానంటే దేవతయ్యింది".. ఆడదానికి ఇంతకన్నా విలువ ఇంకేదేశంలోనైనా ఉందా??

  ReplyDelete
  Replies
  1. "పార్వతిని పెళ్ళాడతానంటే పాపి అయ్యాడు.. కృష్ణుడ్ని పెళ్ళాడతానంటే దేవతయ్యింది....
   అర్ధం కాలేదు. పాపి ఎవరు? దేవత ఎవరు ?

   Delete
  2. పేరు సరిగా గుర్తులేదుగానీ.. దేనికోసమో ఒక రాక్షషుడు తపస్సుచేసి.. తీరా శివుడు ప్రత్యక్షమయ్యాక... పక్కనున్న పార్వతిని కోరతాడు. అతనిని మనం పాపం చేశాడంటున్నాం. అదే గోదా దేవి కృష్ణుడ్ని కోరుకుంటే.. ఆమెని దేవతన్నాం.

   ఇక్కడ మెలిక అదాల్టున చదివితే అర్ధం కాకపోవొచ్చు. కాస్త స్థిమితంగా ఆలోచిస్తే తత్వం బోధపడుతుంది

   Delete
  3. పార్వతికి భర్త ఉన్నాడండీ....గోదాదేవికి భర్త లేడు కదా ?

   Delete
  4. (ఇక్కడ మెలిక అదాల్టున చదివితే అర్ధం కాకపోవొచ్చు. కాస్త స్థిమితంగా ఆలోచిస్తే తత్వం బోధపడుతుంది)

   కృష్నుడికి భార్య ఉందండీ

   Delete
  5. బహు భార్యత్వం(శ్రీకృష్ణుడు), బహు భర్తృత్వం (ద్రౌపది)హిందూ మతంలో ఉంది.అయితే ఆరాధన వేరు. బలవంతం పెట్టడం వేరు.
   శూర్పణఖ కీ గోదాదేవికీ ఉన్న తేడా వల్లే ఒకరు రాక్షసి, ఒకరు దేవత అయ్యారు.ఎవరినైనా కోరుకోవడం సహజం కానీ వారికిష్టం లేకుండా బలవంతపెట్టడం రాక్షసమే కదా ?

   Delete
  6. వారి ఇష్టా అయిష్టాలు? అవి వారిద్దరికీ వుంటే చాలా? వాల్లని నమ్ముకున్నవాళ్ళ ఫీలింగ్స్ తో పనిలేదా??

   గోదా దేవి ని స్వీకరించడానికి కృష్నుడు తన భార్యలందరి పర్మిషన్ తీసుకున్నాడా?

   అస్సలు ఈ ఆరాధనంతా ఆడవాల్లుమాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మీరు వొదిలేస్తున్న లాజిక్ అదే..

   ఇప్పుడు ఒకడు రుక్మిణిని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నడనుకుందాం.. అప్పుడు రుక్మిణి వాడితో వెల్లిపోతానంటే.. దాన్ని ఒప్ప్పుకోగలిగే దమ్ము ఎంతమందికి వుంటుంది?

   ఇంకా అర్ధం కాలేదా??

   Delete
  7. దాన్ని ఒప్ప్పుకోగలిగే దమ్ము ఎంతమందికి వుంటుంది ?

   చేతకానివాడు అని అనకుండా దమ్ము అని అనగలిగిన మీ సంస్కారానికి నా ప్రణామాలు.ఆరాధన ఆడవాళ్ళు మాత్రమే చేయగలరు కానీ యుద్ధాలు చేయలేరు కదా ? అసలే బక్క ప్రాణాలూ,పిడత మొఖాలూ... యుద్ధాలేమి చేస్తారు ? ఇపుడు విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళిచేసుకుంటున్నారు. అందరూ ఆమోదిస్తున్నారు. భార్యకోసం యుద్ధాలు చేసేవాళ్ళు గానీ భర్త కోసం త్యాగాలు చేసేవాళ్ళు కానీ లేరు.అంతా సర్వ మంగళ మేళమే !

   Delete
 7. . . . పూజలు, ప్రార్ధనల వంటి దరిద్రాలు . . .

  noted.

  ReplyDelete
  Replies
  1. దరిద్రాలు అంటే భావదారిద్ర్యాలు అని అర్ధం శ్యామలీయం గారు. భక్తులకు ఇది అభ్యంతరకరమే కానీ భక్తులను డైరెక్టుగా తిట్టడం ఇక్కడ చర్చ ఉద్దేశం కాదు. భావానికి సంబంధించి వాడడమే గనుక తప్పు పట్టాల్సిన అవసరం రాదనే అనుకుంటున్నాను. పూజలు,ప్రార్ధనలు వంటివి చేసేవాళ్ళని దరిద్రులు అనడం కాదు దీని అర్ధం. గమనించగలరని విజ్ఞప్తి. అయినా ఇబ్బంది అనుకుంటే ప్రత్యామ్నయపదాలు వాడాల్సి ఉంటుంది. అదే అర్ధం వచ్చేలా ప్రత్యామ్నాయ పదాలు ఉంటే బెటర్. ఇక్కడ అర్ధం చేసుకోవలసినది ప్రకృతి శక్తులకి భయపడో, భ్రమపడో, అర్ధం కాకో దేవుడు,మతం వంటివి పుట్టుకొచ్చాయి. మతం, దేవుడు వ్యక్తిగతం ...... కానీ ఇక్కడ చర్చ ప్రక్రుతికీ, సైన్స్ కు సంబందిచినపుడు అలాంటి పదాలు రావడం సహజమే. ఆ పదాలు కాకుండా మరో రకంగా చెప్పగలిగితే మంచిదే. అలా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top