Reactions:

Post a Comment

 1. నటనలో రామారావు,నాగేశ్వరరావు,గుమ్మడి,రంగారావు,జగ్గయ్య - ఆ తరం వాళ్లు అందరూ గొప్పవాళ్ళే!నటన విషయంలో పోటీలు పడినా వ్యక్తిగతంగా అందరూ స్నేహంగానే ఉండేవాళ్ళు.వీళ్ళలో చాలామందికి సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేసే సమయంలో ముఖ పరిచయాలు ఉన్నాయి.హీరోగా డ్యూయెట్లూ ఫైట్లూ వంటివాటితో మార్కెట్ పరమైన వెసులుబాటును మినహాయిస్తే రామారావుని మరీ మోసెయ్యాల్సిన అవసరం లేదు.

  రాజనాలనే తీసుకోండి.అందంలో రామారావుతో సరిజోడు - హీరోయిజానికి తగిన గెటప్పులో ఉన్న రామారావుకి దీటుగా ఉండేవాడు భయకరమైన్ అమాంత్రికుడి గెటప్పులో కూడా!రామారావుకీ పరిమితులు ఉన్నాయి.అతిగా పొగడటం అవ్ల్లనే అతని చుట్టూ ఒక మిస్టిక్ ఏర్పడి వ్యక్తిపూజ మితిమీరుతున్నది.ఎంత కాలమీ రామసుత్తి?

  ReplyDelete
  Replies
  1. "ఎంత కాలమీ రామసుత్తి?"

   రామారావుకు ఇంత క్రేజ్ రావడానికి ఒకే ఒక్క కారణం రాజకీయాలు. ఆయన పేరు చెప్పుకుంటే ఓట్లు పడతాయని అనిపించినంత కాలం "స్తుతి" (సుత్తి) తగ్గదు.

   దీన్నే మార్కెటింగ్ భాషలో బ్రాండ్ ఇమేజీ అంటారు.

   Delete
  2. హరిబాబు గారూ,
   మహానటుడికి మరోవైపు - ఎవరినీ నొప్పించకూడదని విలన్ని హీరోని చెయ్యాలా?
   పురుషుల్లారా వర్ధిల్లండి !
   ఓం...తత్...సత్ !

   Delete
  3. సావిత్రికి భారత రత్న ఎందుకు ఇవ్వకూడదు ??
   ఆవిడకు అభిమానులు లేరా లేక ఆడది కాబట్టి, ఆడవాల్లు సినిమా రనగములోకి రావడమే పాపం కాబట్టి, ఇవ్వకూడదా ? ఆమె వ్యక్తిగతంగా కష్టాలు పడింటే పడిండొచ్చు, కానీ .. ఆవిడ స్థాయి మరే హీరోయినుకూ లేదంటే అతిశయోక్తి కాదు కదా!

   సావిత్రికి భారత రత్న ఇవ్వాలని ఎందుకు ఏ స్త్రీవాది కానీ, ఇప్పుడు ఆడవారికి సినిమా రంగములో సముచిత స్థానం కావాలని గొంతు విప్పుతున్న సినిమా ఆడవారు (హీరోయిన్లూ, క్యారక్టర్ ఆర్టిస్టులూ అందరూ), ఆమె అభిమానులం అని చెప్పుకునే ప్రేక్షకులు కానీ ఎందుకు అడగడం లేదు ??

   బహుషా సావిత్రికి కులం ప్రాథిపదికా అభిమానులు లేకపోవడం కారణమా ? లేక ఎంత గొప్పనటైనా ఆడదైతే ఆమెను తమకు "ప్రతినిధి"గా అంగీకరించలేని జనాల అహమా? ఏది కారణం. ఆవిడ ఎవరికి తక్కువ ? ఏనటుడికి కన్నా తక్కువ ??

   #BharataRatna2Savitri
   #BharatRatna2Mahanati

   Delete
  4. బేసిగ్గా, తాము పురుషాహంకారులం కాము అని చెప్పుకోవడానికి ఉత్సాహపడే మగవారు కూడా సావిత్రికి భారత రత్న అర్హమైనది అని భావించక పోవడం నిజంగానే ఆశ్చర్యం కలిగించే అంశం. బహుషా కొన్ని కొన్ని చెప్పడం వలన అనుకున్నంత ఎఫెక్టు (ఆదర్శవంతులం అన్న పేరు) రాదు అని ఫీలయ్యుంటే ఫీలయ్యుండొచ్చు !

   Delete
  5. టపా శీర్షిక యుగ"పురుషుడు" కనుక మహిళలకు అవకాశం లేనట్టే :)

   Delete
  6. హహ..ఈ టపా విషయం కాదండీ, జనరలుగా ఆలోచిస్తే నాకు అనిపించింది ఇది. ఎంటీయార్ అద్బుతమైన నటుడే కాదన్ను. కానీ, ఆయన కాలములోనే అంతటి ప్రతిభ కనబరిచింది సావిత్రి. ఏ పాత్రైనా సరే, అది జానపదమైనా, పౌరానికమైనా, సాంఘికమైనా .. పోషించి మెప్పించడములో .. ముఖ్యంగా కన్నులతో ఆమె పలికించే హావభావాలు .. ఆమె నిస్సందేహంగా ఒక గొప్ప నటి. దానికి ప్రత్యేకంగా మనం సర్టిఫికేట్లు ఇవ్వక్కర్లేదు. అదీ కాక ఆ కాలములో స్త్రీలు సినిమా రంగములోకి రావాలంటే ఎంత కష్టమో వేరే ఎప్పక్కర్లేదు. ఎంటీయార్ మగవాడు ఆయనకు గొప్ప విషయం కాదు. కానీ అప్పట్లో సావిత్రి లాంటి నటీమణులు ఈ తరహా అణచివేత ధోరణిని ఎదుర్కుంటూనే తమ గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఇంత కంటే గొప్ప రోల్ మోడల్స్ ఎవరుంటారు ? ఏ విధంగా చూసినా సావిత్రి అత్యున్నత పురస్కారానికి అర్హురాలు అని నా భావన. ఇక ఆవిడ వ్యక్తిగత జీవితం, కేవలం వ్యక్తిగత జీవితం మాత్రమే ! దాని గురించి అంతగా పట్టించుకో నక్కర్లేదు!

   Delete
 2. రాముడు,కృష్ణుడు తప్ప మిగిలిన అన్ని పౌరాణిక పాత్రల్లోనూ రామారావు కన్న యస్వీ రంగారావే బాగా చేశాడు.కాకపోతే రామారావు వాటినే ప్రధానపాత్రలు చేసి కధనీ సినిమానీ వాటి చుట్టూ తిప్పి నటించడం వల్ల ఎక్కువ పేరు వచ్చింది.వాటి మీద ఇష్టంతో రిపీటెడ్ ఎక్స్పోజర్ ప్రేక్షకులకి ఇవ్వడం వల్ల అలా జరిగిందని నా భావం, అంతే తప్ప నటన తక్కువ స్థాయిలో ఉన్నా పేరొచ్చేసిందని కాదు.

  ఉదాహరణకి రుద్రవీణ సన్నివేశం హేతువుని బట్టి చూస్తే అసాధ్యమే,కానీ రామారావు నటన వల్ల అది నమ్మదగినదిగా అనిపిస్తుంది.అయితే, సంపూర్ణ రామాయణంలో ఖాళీ కుర్చీల మధ్య రంగారావు చేసిన విషాద నటన గుర్తుకు వస్తే మాత్రం త్రాసు రంగారావు వైపుకే మొగ్గుతుంది!

  ఇంక "పోరా గూట్లే!" పంచ్ డైలాగుతో అదరగొట్టిన కత్తుల రత్తయ్య మూసనే అప్పటి నుంచి ఇప్పటివరకు అందరు హీరోలూ కాపీ కొడుతూనే ఉన్నారు!

  రామారావుకి పరిమితులు ఉన్నాయని చెప్పాను కదా!మొదటిసారి దానవీరశూరకర్ణ చూసేటప్పటికి బహుశ టీనేజి అయ్యుండవచ్చు.అందులో కర్ణుడు శల్యుడితో చెబుతున్న "కృతజ్ఞతని మించిన పుణ్యం కృతఘ్నతని మించిన పాపం లేదు!" అనె డైలాగు విని బుర్ర తిరిగిపోయింది "కృతఘ్నతే పుణ్యమూ కృతఘ్నతే పాపమూనా?" అని - "జ్ఞ"ని కూడ "ఘ్న" అనేశాడు!పలకలేనప్పుడు డైలాగు మార్చుకోవచ్చు కదా "చేసిన మేలు మర్చిపోవడం" లాంటి మాటల్తో! అక్కడికీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి సరిదిద్దబోయాడనీ "మేమూ అదే అంటున్నాంగా బ్రదర్!" అనేసరికి దడుచుకుని అతను మళ్ళీ నోరెత్తలేదనీ తర్వాతెప్పుడో చదివి నవ్వుకున్నాను"-)

  తను చేసిన పాత్రలు మంచివి.అవి ఎవరు చేసినా ఇంత పేరు వస్తుంది.ఆ పాత్రలు చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతల్నీ అతనికి పేరు తెచ్చిపెట్టిన సంభాషణల్ని రాసిన రచయితల్నీ కూడా మర్చిపోయి ఇతన్నే కీర్తించడం మిగిలిన వారి ప్రతిభని మర్చిపోవడమే!

  పౌరాణిక పాత్రల మీద రామారావుకి మోనాపలీ రావటం పూర్తిగా అతనొక్కడి వల్లనే జర్గలేదు. హరనాధ్,రామకృష్ణ లాంటివాళ్ళని తనే ప్రోత్సహించాదు.కానీ వాళ్లెవరూ నిలబడలేకపోవటం వల్ల రామారావుకి మోనాపలీ వచ్చేసింది.

  ఒకటి మాత్రం నిజం - మిగిలిన వాళ్ళందరి కన్న మొత్తం పరిశ్రమ బాగుండాలని తపించిన వాడు ఒక్క రామారావే!నాగేశవర్ రావు తన సినిమాలు,తన పేరు తప్ప మొత్తం పరిశ్రమ కోసం పడిన కష్టం తక్కువ. - రామారవు అంత కష్టపడలేదు.ఎక్కువ సినిమాలు తీసి ఎక్కువ సినిమాలు హిట్ చేసి పరిశ్రమ యొక్క వ్యాపారపరిధిని పెంచడం అనేదాంట్లో మిగిలిన వాళ్ళకన్న రామారావు పాత్రే ఎక్కువ!జై గారి అభిప్రాయం కొంతవరకే నిజం - పాలిటిక్సులోకి రాకముందే ఈ రకమైన మార్కెట్ కంపాటిబిలిటీ వల్ల పాప్యులర్ అయ్యాడు తప్ప పాలిటిక్సులోకి రావడం వల్ల కాదు.

  సినిమా వాళ్ళలో అవార్డులకి చాలామటుకు లాబీయింగ్ ఎక్కువ పాత్ర వహిస్తుంది.సావిత్రికి అవార్డులు రాకపోవటానికి అంతకన్న మరో కారణం కనపడటం లేదు నాకు.సావిత్రి జమినీ గణేశన్ గొడవ కన్న సొంత సినిమాల వల్లనే దెబ్బ తిన్నదనేది నిజం!డైరెక్షనుతో సరిపెట్టుకుని ఉంటే బాగుండేది,ప్రొడక్షను కూడా తీసుకునేసరికి బిజినెస్ ట్రిక్స్ తెలియక నష్టపోయింది.అటుకేసి పోకుండా ఉంటే డబ్బూ పోయేది కాదు,పరపతీ ఉండేది,అవార్డుల్ని తెచ్చుకోగలిగేది!

  ReplyDelete
 3. ఎస్వీ రంగారావు గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను యూట్యూబులో వెతికి వెతికి చూసే సినిమాల్లో ఆయన ఆతరహా మాస్ పాత్రలు వేసిన పాత సినిమాలు చాలానే ఉన్నాయి. జగత్ జెట్టీలు, జగత్ కిలాడీలు, దెబ్బకు ఠా దొంగలముఠా .. (ఆపేర్లు కూడా భలే ఉంటాయి). ఆ సినిమాల్లో ఆయన డయిలాగులు అదరహఓ. పోరా "డోంగ్రే" అన్నా ఇంకోటి అన్నా ఆయనకే చెల్లింది.

  ఎస్వీ రంగారావుగారికి అంత పేరు రాకపోవడానికి కారణం మీరు చెప్పినది ఒక్కటే కాదేమో. ఎందుకంటే పైన నేను లిస్ట్ చేసిన సినిమాలలో ఆయన మెయిన్ హీరో కాదు. హీరోయిన్లతో డ్యూయెట్లు ఆయనకు లేవు. అయినా ఆ సినిమాల్లో ప్రధాన పాత్ర ఎవరంటే ఎస్వీయారే అంతా ఆయనే నడిపించేస్తారు.

  ఇక సావిత్రి డబ్బులు పోగొట్టుకోవడం అనే విషయం, డబ్బు అనేది ఒక్కటే ముఖ్యం కాదు కదా ! చరిష్మా ? అది చాలా ఇంపార్టెంట్. హీరోలకు వచ్చినంత పేరు ఎంత చేసినా హీరోయిన్లకు రాలేదు అన్నది ఆ కాలములో కూడా వాస్తవమే.

  మిస్సమ్మ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే.. నిస్సందేహంగా సావిత్రే. ఆ సినిమాలో ఎస్వీయార్, ఏ ఎన్నార్, ఎన్.టి.ఆర్ అందరూ ఉన్నా సావిత్రి స్టీల్స్ ద షో. అలాంటి పాత్రలు అప్పట్లో బాగానే ఉండేవి. ఇప్పటి మరీ రొడ్డకొట్టుడు మాస్ మసాలా సినిమాల వల్లే కాకుండా హీరోయిన్లకు కూడా నటనకు అవకాశమున్న పాత్రలు బాగానే దొరికేవి. అయినా సరే .. సావిత్రికి, ఈ హీరోలతో పోలిస్తే అంత చరిష్మా దక్కలేదు. దానికి కారణం నేననుకునేది ఏమిటంటే, మొదట్లో స్త్రీ పాత్రలకు కూడా మంచి వెయిటేజీ దొరికినా, రానూ రానూ హీరోల డామినేషన్ ఎక్కువైపోయింది. వాల్లకు సహజంగా ఉండే ఆధిపత్య భావజాలం వల్ల, కథంతా తమ చుట్టూ తిరిగేలా ఉండేట్టు చూసుకున్నారు. ఇక జనాల్లో హీరోయిన్ల పట్ల ఉన్న పలుచన గురించి నేను చెప్పక్కర్లేదు. సింపులుగా చెప్పాలంటే సినిమాల్లో మగవారికే పేరొస్తుంది. ఆడవారికి ఎంత పేరొచ్చినా అది మగవారి తర్వాతే.

  ఒక సారి ఇది ఆలోచించండి .. ఎంటీ రామా రావుగారి దగ్గర చిల్లి గవ్వ లేదనుకుందాం. ఆయన్ను సినిమా రంగం వదులుకోగలదా ? అంతెందుకు సూపర్ స్టార్ క్రిష్ణ కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు. అమితాబ్ బచ్చన్ అయితే, కాలికి స్లిప్పర్లు తొడుక్కునే స్టేజుకి వచ్చేశాడట. కానీ, వాల్లను సినిమా రంగం కానీ, ప్రజలు కానీ వదులుకో గలిగారా? ఎప్పుడో అవసాన దశలో ఇక నటించడానికి ఆయన శరీరం సహకరించదు అన్న టైములో తప్ప .. వారు ఏదో ఒక పాత్రలో సినిమా రంగములో ఉండగలరు.

  సావిత్రికి మాత్రం అలాంటిది ఎందుకు జరగలేదు. ఆవిడ దగ్గర డబ్బు లేక పోవడం కాస్త వ్యసనానికి బానిసవ్వడం జరగగానే ఎందుకు సినిమా రంగం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు (ఎవరో కొంత మంది తప్ప).

  దానికి తోడు హీరోలు కూడా కాస్త పేరు పలుకు బడి రాగానే .. సినిమా మొత్తం తమ చుట్టూ తిరిగితే తప్ప అంగీకరించరు. దానితో హీరోయిన్ల పరిస్థితి.. లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతీరావు చెప్పినట్టు.. ఈ హీరోలంతా వారికున్న ప్రాధాన్యతను లాక్కొని, మీకిదే ఎక్కువ అన్నట్టు విధిలించే ప్రాధాన్యతలేని పాత్రలకే పరిమితమై.. అది తమకు వారు చేసే గొప్ప మేలు అని ఫీలయిపోయి.. అందాల ఆరబోతకో(ఇప్పట్లో అయితే) లేక ఏమాత్రం ప్రాముఖ్యం లేని వేషాలకూ కూడా ఒప్పేసుకుంటారు ..ఫైనలుగా కాస్తా షేపవుట్ అవగానే కనుమరుగై పోతారు. ఇదీ జరుగుతోంది/జరిగింది అని నా ఫీలింగ్.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top