ఈరోజు 7-5-2018 న వీరమాచనేని రామకృష్ణ గారు వరంగల్ నుండి విజయవాడ వెళుతూ మార్గమధ్యమంలో ఖమ్మం లో మా ఇంటిదగ్గర కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు రంగనాయకమ్మ గారు రచించిన మార్క్స్ కేపిటల్ పరిచయం 2 పార్టులు బహుకరించాను. వీటితో పాటు ఖమ్మం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త  కే.ఆనందాచారి రచించిన మహోన్నతుడు మార్క్స్ ( ద్వి శత జయంతి సందర్భంగా రచించినది ), కామ్రేడ్ సుందరయ్య పై రచించిన స్పూర్తి శిఖరం (దీర్ఘ కావ్యం) పుస్తకాలను బహుకరించాను. ఈ సందర్భంగా తీసిన మొబైల్ ఫోటోలు ఇవి. వాస్తవానికి 22-4-2018న జనవిజయం ఆధ్వర్యంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలోనే ఈ పుస్తకాలను ఆయనకు ఇద్దామనుకుని కొనడం జరిగింది. ఆ రోజు వీలు కాలేదు. వీరమాచనేని రామకృష్ణ గారు మంచి అధ్యయనశీలి. ఆయన సన్మానాలకు వ్యతిరేకం. పూలదండలు, శాలువాలను అంగీకరించరు. వాటి స్థానంలో పుస్తకాలను బహుమతులుగా ఇవ్వమని ప్రోత్సహిస్తుంటారు. ఆయనకు అభినందనలు.


Reactions:

Post a Comment

  1. మంచి సంస్కృతి కి శ్రీకారం చుట్టారు.. శాలువాలు బీరువా మడతల్లో ఉంటాయి.. పుస్తకాలు గంభీరంగా మనసుల్లో ఉంటాయి..

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top