అంశం : భారతీయం
ప్రశ్నిస్తున్నవారు :  పల్లా కొండల రావు. 
------------------------------------------------
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

 1. భారతదేశానికీ, హిందూ మతానికి లింకేంటస్సలు? హిందూ మతం అంటే ఏంటి? అస్సలు దానికి సంభందించిన దేవుల్లెవరు?

  ReplyDelete
  Replies
  1. నాకు తెలిసి హిందూమతంలో నాస్తికులకు కూడా చోటుంది. తెలిసినవారు చెప్పాలి. ప్రక్రుతి ఆధారంగా హిందూమతం ఎప్పటికపుడు ఇతర మతాలలోని మంచిని కలుపుకుంటూ పురోగమిస్తోంది. అదే సమయంలో తిరోగమన అంశాలూ ఉంటున్నాయి.

   Delete
 2. ప్రపంచంలో అనేక మతా లున్నవి. మతా లన్నిటికీ ప్రత్యేకమైన పేర్లున్నవి. ఆయా మత సంస్థాపకుల పేర్లతో అవి వ్యవహరించబడుతున్నవి.
  బుద్ధభగవానుడు కనుగొన్న మతం బౌద్ధం. జినుడి నామంతో జైనం. మహమ్మద్‌ ప్రవక్త పేరుతో మహమ్మదీయ మతం. జీసస్‌ క్రీస్తు స్థాపించింది క్రైస్తవం. జోరాస్టర్‌ నెలకొల్పింది 'జోరాస్ట్రియనిజం' (పార్శీలమతం) చైనాలో కన్‌ప్యూషియస్‌ ద్వారా ఆవిర్భవించింది 'కన్‌ ప్యూషియనిజం'

  ఈవిధంగా కొత్త మతాలను సృష్టించి అసంఖ్యాక ప్రజలను తమవైపు ఆకర్షించిన వారంతా మహామహులు. ఒక్క మా మతానికి మాత్రమే ప్రత్యేకమైన పేరు లేదు. కాస్త ఇంగ్లీషు చదివిన కుర్రవాణ్ణి ''అబ్బాయీ, నీ మతం ఏది?'' అని అడిగితే, 'నాది హిందూమతం' అంటాడు. అలా కాకుండా, పల్లెటూళ్లల్లో పొలం పనులు చేసుకునే సామాన్య ప్రజలను అదే ప్రశ్న అడిగితే, వాళ్లు అందుకు తగిన సమాధానం చెప్పలేరు.

  దక్షిణదేశంలో దస్తావేజులు వగైరా వ్రాసేవారిని ప్రశ్నించామనుకోండి. వారు 'మేము శైవుల మనో, వైష్ణవుల మనో, జవాబిస్తారు. శైవం గానీ వైష్ణవం గానీ మా మతంలో శాఖలే తప్ప, అవి అసలు మా మతం పేర్లు కావు. అవి మనం ఆరాధించే దేవతల పేర్లు. మతాన్ని కనుగొన్న వారి పేర్లు కావు.

  మా మతం పేరు హిందూమత మనేదే నిజమైతే మా పూర్వీకులందరికీ ఆ పేరు తెలిసి ఉండవలసిందే. అది ప్రాచీనకాలంలో కూడా ఆ పేరు వాడుకలో ఉండి ఉండేదే. మరీ పూర్వకాలపు వారికే కాదు, కొన్ని తరాల క్రిందటి వారికైనా 'హిందూ మతం' అనే మాట ఏదో ఒక వింత పదంగా, అర్థం లేని మాటగా అనిపించేది. ఈ పరిస్థితికి కారణమేమిటి? వాస్తవంలో మన మతానికి ఒక పేరంటూ లేదు.
  మా మతంలోని శాఖలకు మాత్రం ప్రత్యేకమైన పేర్లున్నవి. ఆ పేర్లయినా, మానవులవి కావు. ఉపాసన కోసం ఆయా మతానుయాయులు ఏర్పాటుచేసుకున్న ఒకే పరమాత్మ యొక్క వేరువేరు రూపాలు. మా మతానికి ఒకే పేరు చెప్పడం కష్టసాధ్యం. ఇటీవలి కాలంలో 'సనాతన ధర్మం' అనే పేరు విశేషంగా వినిపిస్తోంది. అయినా, అది కూడా అనాదిగా వస్తున్న పేరని చెప్పలేము. అదే అయినట్లయితే, గ్రామాల్లో నివసించే సామాన్య రైతులకూ, అనాధులకూ కూడా ఆ పేరు సుపరిచితమై ఉండేది.

  'హిందూయిజం' మా పేరు కాదు. 'హిందూయిజం' అన్నది పరాయివారు మా మతానికి కట్టబెట్టిన పేరు. ఆ పేరు ప్రచారంలోకి ఎలా వచ్చిందో చరిత్రద్వారా మనకు తెలుస్తూనే ఉంది. మన పూర్వీకులు ఒకప్పుడు సింధునదీతీరంలో నివసిస్తూ ఉండేవారు. ఆ కాలంలో మన దేశానికి వచ్చిన విదేశీయులు ''సింధు'' నదిని ''ఇండస్‌'' అన్నారు. 'ఇండస్‌' ప్రవహించే దేశాన్ని 'ఇందు' దేశమనీ 'ఇండస్‌ భూభాగమ'నీ వ్యవహరిస్తూ వచ్చారు. క్రమేణా, ఇండస్‌ ప్రాంతాన్నేగాక, యావద్భారత దేశాన్ని అదే పేరుతో వ్యవహరించారు. ''హైడ్‌ పార్కుకు ఆవల అంతా ఎడారి'' అన్న సామెత మనం వినడం లేదా? అట్లా!

  ReplyDelete
  Replies
  1. మంచి వివరణ హరిబాబు గారు. హిందూ అనేది మతం కాదు. జీవన విధానం. దానిని కలగాపులగంగా, మతంగా మార్చేశారన్నది నా అభిప్రాయం.

   Delete
  2. అవును, వేదం ఒక్కటే మూఢనమ్మకాలకు ఆస్కారం లేని శాస్త్రీయమైన సత్యాలను చెప్తుంది.ధనుర్వేదం, ఆయుర్వేదం వంటివి ఆ వేదం నుంచి ఋషులు తమ బుద్ధితో సృష్టించిన శాస్త్రాలు.వాటిలోనూ దోషాలు లేవు.ఆధునిక విజ్ఞానులు చేస్తున్న ఏ ఒక్క సూత్రీకరణ గానీ ఏ ఒక్క ప్రయోగం గానీ వేదం అసత్యమని చెప్పడం లేదు.పైన వేదం చెప్పిన అసత్యాలను బలపరుస్తున్నాయి. అంతవరకు ఎవరికీ అభ్యంతరం ఉండటానికి వీల్లేదు.ఎందుకంటే, యూరోపియన్ మేధావులకి చాలామందికి సంస్కృత భాషలో మంచి పాండిత్యం ఉంది.వేదాలకు ఇంగ్లీషులోకి అనువాదం చేశారు,పరిశోధనలు చేశారు.వారిలో ఏ ఒక్కరూ వేదాలలో తప్పులు ఉన్నాయని చెప్పలేదు.

   ఇవ్వాళ మనకు వినిపిస్తున్న కనిపిస్తున్న వేదమంత్రాల పాఠభేదాలు ఇక్కడి వాళ్ళలో ఉన్న కొందరు పుట్టు బ్రాహ్మణుల వల్ల వచ్చి పడినవే.ఇక పురాణాలు అనేవి వేదాల యొక్క సంక్లిష్టతను బట్టి సర్వులకీ అర్ధమయ్యేలా చెప్పడం కోసం వ్రాసిన కధా సాహిత్యం.వాటిని పరమప్రమాణం అని అనుకోవడం అనే తప్పును హిందువులు కూడా చేస్తున్నారు.

   అది హిందువులను వేదం నుంచి దూరం చెయ్యడానికి కొందరు పనిగట్టుకుని పురాణాల్లోకి ఇరికించడం వల్ల జరిగింది.పురాణాలు అన్నీ ఒకే కాలంలో వ్రాసినవి కాదు.ప్రాచీన కాలంలో వ్రాసిన పురాణ కధలలో దోషాలు లేవు.ఇప్పుడు మనకు దోషాలలా కనపడుతున్నవి కొత్తవాళ్ళు ఆ పురాణ కధల శైలిని అనుకరించి వ్రాసి ఇరికించిన ప్రక్షిప్తాల వల్లనే ఉనికిలోకి వచ్చాయి.ఉదాహరణకి పరశ్రాముడు 21 సార్లు భూమిని కలయదిరిగి నిక్షత్రం చేశాడనే కధ 17వ శతాబ్దానికి ముందరి సాహిత్యంలో సాక్ష్యాలు లేవు.మన రెండు తెలుగు రాష్ట్రాలాలోని ప్రవచన కర్తలాలో గరికిపాటి నరసింహారవౌ గారు ఒక్కరికే మూఢనమ్మకలనూ అసత్యాలనూ ప్రచారం చెయ్యని నిజాయితీ ఉంది.ఆయాంకు కూడా పరశురాముడి కధలో ఉన్న తప్పులు ఏమిటో తెలియదు.ఇది నేను పరిశోధించి తెలుసుకున్నది.ముందు ముందు ఆయన్ని కలిస్తే చెప్పగలను,అప్పటికి గానీ అందరికీ తెలియదు.


   ఇదీ పరిస్థితి.పరిష్కారం వేదాలను గురించి తెలుసుకోవడం,వేదం చెప్పిన సత్యాలను అనుసరించడం, అంతే!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top