- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

 1. ఈ ఘటన విషయం లో ఎవరితోనూ ఏకీభవించే ప్రసక్తి లేదు. రాజకీయాలు ఎంత కుళ్ళిపోయాయో అర్థమవుతోంది. ఒక్కసారి ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ ని బొంద పెడితే గాని బుద్ది వచ్చేటట్లు లేదు.

  ReplyDelete
 2. పోయిన ఎన్నికలలో మోడీ & పవన్ కొంగు పట్టుకొని అత్తెసరు ఓట్లతో గద్దె ఎక్కిన బాబుకు
  మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుకొన్నకొద్దీ దడ పుడుతుంది. వెంకయ్య నాయుడు పైకి తన్నబడడం (kicked upstairs) మూలాన మోడీతో పైరవీలు చేసే నాథుడే లేడు.

  గతి లేని పరిస్థితులలో కొత్త వ్యూహంగా ఏడాది నుండి శివాజీ అనబడే కొత్త బక్రాను ముందుకు ఉంచి పచ్చ మీడియా సాయంతో గట్టెక్కుదామని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.

  ReplyDelete
  Replies
  1. మీకు చంద్రబాబు పట్ల బోలెడు వ్యతిరేకత ఉంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించదగ్గవే. గత ఎన్నికల్లో ఎవరు ఎవరి కొంగు పట్టుకున్నారో తెలియనిది కాదు. జమిలి ఎన్నికలకు భయపడి తమ రాష్ట్రం లో ముందస్తుకు ప్లాన్ చేసిన పిరికిపందలు గురించి కూడా అందరికీ తెలిసిందే.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. నిలదీసి అడగటం సబబూ కాదు,అడిగినా జవాబు రాదు గానీ జై గారు మిగిలిన అన్ని విషయాల లోనూ తెలివైన వాదనలు చేస్తారు, కానీ ఆంధ్ర-తెలంగాణ విషయాలకు వచ్చేసరికి కొంత మూర్ఖ ధోరణిలో మాట్లాడుతారు - ఎందుకనో?

   నేను హేతువాదిని అంటారు,తెలుగుని మాతృభాష అని సెంటిమెంటు చూపించటానికి ఒప్పుకోరు,బాష కేవలం పనిముట్టే కదా,భూమి కేవలం రాళ్ళూ రప్పలే కదా, అలాంటివాటిని మానవీకరించటం మూఢనమ్మకం అని తీసిపారేస్తారు.కానీ తెలంగాణ ప్రాంతం, భాష దగ్గిరకొచ్చేసరికి హేతువాదానికి తిలోదకాలు ఇచ్చేసి దైవభక్తుల కన్న ఎక్కువ పరవశానికి లోనవుతారు, ఆప్యాయతని ఒలకబోస్తారు.

   ఇలాంటివి మానసిక వైరుధ్యాల పరిధిలోకి వస్తాయి.అభిప్రాయాలలో ఇలాంటి వైరుధ్యాలని కలిగి ఉండటానికి కారణం, అయితే ముందుగానే కొందరిని మేధావులుగా ఒప్పేసుకుని వారు ఏం చెప్తే అది అక్షరసత్యం అని ఒప్పుకునే అమాకత్వమయినా కావాలి, లేదా వారిలోనే అబద్ధాలను ప్రచారం చేసి ఇతరులను ప్రభావితం చెయ్యాలన్న కుట్రపూరిత మనస్తత్వం ఉండాలి.

   జై గారే కాదు, తెలంగాణా వాదుల్లో చాలామంది స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ తెలంగాణ వెనకబడటానికి చంద్రబాబు ఒక్కడే కారణం అని నమ్ముతూ ఉంటారు!చెన్నారెడ్డి తెలంగాణ వాడే కదా!తనకి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణ బాగుపడదని ఉద్యమం మొదలు పెట్టి మధ్యలో ఎందుకు ఆపేశాడు?పోనీ,ఆపేసి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యమంలో ఉన్నప్పుడు అన్యాయం జరిగిందని రంకెలు వేసినవాడు ఆ అన్యాయాన్ని ఎందుకు సరిచెయ్యలేకపోయాడు?ఇవేమీ ఈయనకి తెలియవా!ఈ "బాబు ద్వేషం+తెలంగాణ భక్తి" కలిగీన్ ఉయ్యాల్వాడలు ఈ చిన్న్ అలాజిక్ ఎందుకు మిస్సవుతున్నారు?

   చదువుకున్న వాళ్ళూ తెలివైన వాళ్ళే కదా, తెలిసే ఉండొచ్చు!కాకపోతే "చంద్రబాబు ఒక్కడే తెలంగాణ వెనుకబాటుకి కారణం!" అని అనుకోవడం ఆనందం కలిగిస్తుందనుకుంటాను.ఆ ఆనందంతో కూడిన భ్రమ నుంచి పుట్టిన దురభిమానం వాస్తవాల్ని చూడనివ్వటం లేదు కాబోలు!   మేధావులు కూడా మూర్ఖంగా ఆలోచించడం పట్ల నాకు కలుగుతున్న విస్మయాన్ని వ్యక్తం చెయ్యడమే తప్ప ఎవరినో నొప్పించాలని ఇది రాయటం లేదు.

   P.S:తెలంగాణలో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలంగాణని అమరావతికి తాకట్టు పెట్టటం అవుతుందా?ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు!కానీ, అలా అంటున్నవాళ్ళు పిచ్చివాళ్ళు కాదు - నమ్మేవాళ్ళు ఉన్నారని తెలిసే అంటున్నారు. అలా అయితే భాజపాకి ఓటు వేస్తే ఢిల్లీకి తాకట్టు పెట్టటం అవదా?ఒవైసీలకి ఓటు వేస్తే పాకిస్తానుకి తాకట్టు పెట్టటం అవదా?

   Delete
  4. @Haribabu Suraneni:

   Welcome back!

   "స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ తెలంగాణ వెనకబడటానికి చంద్రబాబు ఒక్కడే కారణం అని నమ్ముతూ ఉంటారు"

   నీలం సంజీవ రెడ్డి సీఎం అయిన నాటికి బాబు ఇంకా పాకడం మొదలు పెట్టాడో లేడో కనుక అంత సీను లేదు.

   Delete
  5. ఇతర పార్టీలతో పోలిస్తే తెలంగాణకు తెలుగుదేశం వలన మేలు జరిగిందాఝ కీడు జరిగిందా? ఏయే విషయాలలో? ఎలా అన్నది లోతుగా అధ్యయనం చేస్తే తెలుగుదేశం ఆంధ్రాపార్టీయా? కాదా? అన్నది తేల్చొచ్చు. పార్టీలకు ఆంధ్రా, తెలంగాణ అని ఉంటుందా? ఓట్లు రాబట్టుకోవడం కోసం ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆనక అదే ఆంధ్రావాళ్ళకు దోచిపెట్టడం.... తమ వాటా రాబట్టుకోవడం... ఇదేగా జరుగుతోంది.

   Delete
  6. కొండలరావు గారూ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ కనుక దాన్ని తరిమేయాలని ఎన్టీఆర్ అన్నప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్లకు ఇప్పుడు తమను అదే తరహాలో విమర్శిస్తే అభ్యంతరం ఎందుకు? నీవు నేర్పిన విద్యే నీరజాక్షా.

   Delete
  7. అయ్యా. కాంగ్రెస్ ని ఎన్ఠీఆర్ అన్నప్పుడు చప్పట్లు కొట్టినవాళ్ళు ఇప్పుడు అభ్యంతరం చెప్తున్నవాళ్ళు వేరు. వారికి వీరికి కనీసం ఒక తరం అనంతరం ఉంది.
   పైగా అదే ఎంటీఆర్ తెలుగుజాతి మనది అని కూడా పాడారు. దానికీ మనోళ్లు చప్పట్లు కొట్టారు. ఎప్పుడూ ఆంధ్రప్రాంతపు వారిపై కుళ్ళుకునే మనస్తత్వం నుంచి బయటకి రండి.
   ఒక్కసారి దేశం దాటి బయటకి వెళ్తే తెలుస్తుంది తెలుగుజాతి ఎంత చిన్నదో.

   Delete
  8. సూర్య గారూ, తరాలు మారినా వారే వీరు. అంతెందుకు గత ఎన్నికలలో కూడా బాబు సోనియా గాంధీ తెలుగు "జాతికి" చేసిన దగా రాగం ఎత్తుకున్నాడు: ఇప్పుడు సోనియా బదులు మోడీ తప్ప మిగిలింది సేమ్ తో సేమ్.

   "ఒక్కసారి దేశం దాటి బయటకి వెళ్తే తెలుస్తుంది తెలుగుజాతి ఎంత చిన్నదో"

   అంత దూరం కూడా అక్కరలేదు, తెలుగు తప్ప వేరే ఏ భాష మీడియా చూసినా ఇదే మాట తెలుస్తుంది. కాకపొతే కొందరికి ఎల్లో మీడియా ఒక్కటే గీత, బైబిల్, కురాన్.

   Delete
  9. >>>ఎప్పుడూ ఆంధ్రప్రాంతపు వారిపై కుళ్ళుకునే మనస్తత్వం నుంచి బయటకి రండి.>>>

   మనసులో ఎంత కుళ్ళు లేకపోతే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాలో పరిశ్రమలు మూతబడిపోతాయి అని హరీష్ రావు అనగలిగారు ?
   సున్నా నుండి మొదలుపెట్టి తెలంగాణాతో పోటీపడి ఒకటో స్థానాన్ని చేజిక్కించుకున్నందుకు పుట్టిన అసూయ కాదూ ?
   తెలంగాణావాడుగా పుట్టినవారిలో ఆంధ్రాపై సానుభూతి చూపించినవాళ్ళను ఒక్కరిని చూపించండి.
   తెలంగాణా అంటేనే పోరాటాల పురిటిగడ్డ...ఇక్కడి వాతావరణం లాగానే మనుషులు కూడా....అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు, జగన్ ఇద్దరిలో ఎవరు అవినీతిపరులో చెప్పమనండి.
   పరిటాల రవి, రంగా హత్యలలో రాజకీయం ఉందా ? వ్యక్తిగత కక్షలా తేల్చమనండి.

   ఎంత చదువుకున్నాం అన్నది ముఖ్యం కాదు.ఎంత లోకజ్ఞానాన్ని సంపాదించాం అన్నదే ముఖ్యం !

   Delete
  10. అయ్యా జైగారు ఇక్కడ మా నిరసన "బీజేపీ సాయం తో టీడీపీ గట్టెక్కింది" అనే మీ వ్యాఖ్యపైన. దేశమంతా మోడీ గాలి వీయవచ్చు గాక. కానీ2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ బీజేపీ లు రెండింటికి ఆంధ్ర లో మొహం చెల్లని పరిస్థితి. అసలు తమకి కావలసిన సంఖ్యాబలం వస్తుందో రాదో అనే అనుమానం తోనే ఆంధ్రా లో టీడీపీ తో పొత్తుపెట్టుకుంది. అప్పట్లో ఇంకో పార్టీ గెలిచే అవకాశాలు తక్కువకనుక. లక్కీగా మితిమీరిన మెజార్టీ వచ్చి మిడిసిపడి ప్రతి రాష్ట్రం లోను తన కుయుక్తులు పారించింది కానీ అత్తెసరు సీట్లు వస్తే ఆ పార్టీ బతుకు బస్టాండ్ అయ్యేది. అయినా ఆంధ్రకంటే తెలంగాణలోనే ఆ పార్టీ స్వలాభం కోసం అశాంతి సృష్టించే అవకాశం ఎక్కువ. చూద్దాం ముందుముందు ఇంకేం జరుగుతుందో.

   Delete
 3. ఇలాంటి సంఘటనలు అసలు సహించకూడధు!! కఠినంగా వ్యవహరించాలి.
  అదేమిటో.. ఎవరు ఎవరిమీద దాడి చేసిన అది మొత్తం దేశానికి ముడి పెట్టేస్తున్నారు.. అది ప్రణయ్ కావొచ్చు, జగన్ కావొచ్చు..
  ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ప్రతి విషయముని రాజకీయం చేస్తున్నారు.. భావావేషాలు రెచ్చగొడుతూ.. social network లో ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఇంత చదువుకున్నా కూడా పచ్చి బూతులు తిట్టుకోవడం common అయిపోంది.
  let me use the default/standard statement
  చట్టం తన పని తను చేసుకుపోతుంది.

  ReplyDelete
 4. జై గారి ధోరణిపట్లా వాదనల పట్లా ఎందుకు కొందరు ఆశ్చర్యపోతున్నారో అర్థం కావటం లేదు. ఆయన కారణాలు ఆయనవి. ఆయన వాదనలు ఆయనవి. ఆయనకు తెలంగాణా పట్ల వీరాభిమానం ఉండటం ఒక కారణం కావచ్చును. ఆయన మనస్సులో ఒకవేళ ఆంధ్రా అభివృధ్ధి చెదితే తెలంగాణా అభివృధ్ధికి కాని ఔన్నత్యానికి కాని అది భంగకరం అన్న అభిప్రాయం ఉండవచ్చును (ఈమధ్య కేటీఆర్ గారు కూడా అంధ్రాకు ప్రత్యేకహోదాయిస్తే తెలంగాణాకు నష్టం అని అదివ్వద్ధూ అన్న అధోరణిలో మాట్లాడారని గుర్తుచేసుకోండి.) అందుచేత ఆంధ్రప్రాంతసుస్థిరతకు భంగకరంగా ఉండే అన్ని సంఘటనలూ పరిస్థితులూ తెలంగాణావాదిగా జైగారికి ప్రియంగా తోచవచ్చును. అందుచేత ఆంధ్రాలో అస్థిరతకు దోహదపడే అంశాలను సమర్థించటమో లేదా అటువంటి సంఘటనలకు కారకులను వెనుకవేశుకొని రావటమో ఆయనకు ఒక కర్తవ్యంలాగా తోస్తూ ఉండవచ్చును. ఆయన మనస్సులో ఆంధ్రాపట్ల ద్వేషం ఉందని చెప్పలేం కాని ఆయన ధోరణి క్రమంగా అంద్రద్వేషంగా మారితే ఆశ్చర్యం ఏమీ లేదు. మరొక రకంగా ఆలోచిస్తే ఇక్కడ తెలంగాణాలో టీడీపీ అనే పార్టీ (ఆయన దృష్టిలో) ఆంధ్రాపార్టీ కూడా పోటీలో ఉండటం జైగారికి హితవు కాకపోవచ్చును. టీడీపీ ఇరుకునపడో మరో కారణంగానో దెబ్బతింటే తన ప్రియతమ తెలంగాణా పార్టీ(ల)కు ఎంతో మంచిది అన్న అభిప్రాయంతో ఆయన అసహనపూర్వకంగా టీడీపీపై వ్యాఖ్యలను చేస్తూ ఉండవచ్చును. ఇలా ఎంతో అనుకోవచ్చును కాని. నిజమేమిటో మనకు తెలియదు. ఎవరి ధోరణి వారిది అని ఊరుకోవటమే కాని ఆయనతో తలపడవలసిన అగత్యమూ ఆశ్చర్యంతో తలమునకలు కావలసిన అగత్యమూ ఉందనుకోను.

  ReplyDelete
  Replies
  1. గురువు గారు మన్నించాలి: ఇక్కడ చర్చ ఆంధ్ర రాజకీయాల గురించి, తెలంగాణా కాదు. అదే విధంగా ఆంధ్రులందరూ చంద్రబాబు & పచ్చ పార్టీ అనునాయులే అనుకోవడం సబబు కాదని మనవి.

   అలిపిరి ఘటన తరువాత వైఎస్ ఎంత హుందాగా స్పందించారో గుర్తు తెచ్చుకుందాం. ఇప్పుడు బాబు అంత డిగ్నిటీ కాకున్నా ఫరవాలేదు. దిగజారి నేలబారు చిల్లర వేషాలు మానుకొని ఉంటే ఆయనకు కొంతయినా ప్రతిష్ట మిగిలేది.

   ప్రపంచమంతా తన మీద కుట్ర పన్నారంటూ ప్రతి నిమిషం వాపోయే persecution complex ఇందిరా గాంధీకి ఉండేది. మరోవైపు ఈ అనంత విశ్వంలో తనను మించిన మొనగాడు లేడన్న megalomania ఎన్టీఆర్ సొంతం. ఈ గుణాలు రెండూ చంద్రబాబు పుణికి పుచుకున్నాడు. This is an explosive combination.

   మోడీ, కెసిఆర్, జగన్, పవన్ వగైరాలు అందరికీ చంద్రబాబు నచ్చకపోవొచ్చు. వారందరూ పొద్దస్తమానం మిగిలిన పనులు మానేసి తనమీద కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారన్న అపోహకు మాత్రం మందు ఎర్రగడ్డలోనే.

   Delete
  2. ( ప్రపంచమంతా తన మీద కుట్ర పన్నారంటూ ప్రతి నిమిషం వాపోయే persecution complex ఇందిరా గాంధీకి ఉండేది. మరోవైపు ఈ అనంత విశ్వంలో తనను మించిన మొనగాడు లేడన్న megalomania ఎన్టీఆర్ సొంతం. ఈ గుణాలు రెండూ చంద్రబాబు పుణికి పుచుకున్నాడు. This is an explosive combination.)

   అరుదైన.... లోతైన.... మనోవిశ్లేషణ ఇది. అయితే మీరు కేవలం చంద్రబాబు, ఎన్.టి.ఆర్ ల వరకూ మాత్రమే శృతిమించిన కోపం ప్రదర్శిస్తారనిపిస్తోంది. ఇది అనుమానంతో కూడిన ఆరోపణ మాత్రమే. తప్పనిపిస్తే క్షమించండి.
   - పల్లా కొండలరావు.

   Delete
  3. కొండలరావు గారూ, ఇంకా ఎన్నో విషయాలలో (e.g. Donald Trump megalomania, France neo-fascism, Saudi religious fanatics) నా అభిప్రాయం ఇలానే తీవ్రంగా ఉంటుంది. మీరు ఆయా విషయాల గురించి రాయరు(రాయలేదు) కనుక మీరు నేను వాటిపై చర్చించే అవకాశం (ఇంకా) రాలేదు.

   Delete
  4. ఉ. ఇప్పుడిప్పుడే జరుగుతున్న ఇంకో కథాంశం (బ్రేకింగ్ స్టోరీ అనాలా లేదా తెలీదు) చూద్దాం. అమెరికాలో ఒబామా, క్లింటన్ లాంటి కొందరి మీద టపాబాంబుల వినియోగం వార్త గురించి ట్రంప్ స్పందన పలు విమర్శలకు దారి తీస్తుంది.

   President Donald Trump on Friday said he *does not plan to call* the two former presidents, Barack Obama and Bill Clinton, who were *targeted with pipe bombs* this week.

   https://www.cnbc.com/2018/10/26/trump-says-hell-pass-on-calling-clinton-obama-after-sayoc-arrest.html

   ఒక్క విషయంలో మాత్రం ట్రంపు కాస్త బెటర్. ఒబామా, హిల్లరీ, సాండర్స్, ఐసిస్, మోడీ వగైరాలు అందరూ కుమ్ముక్కై నన్ను నాశనం చేయడానికే డ్రామా చేశారని కానీ టపాబాంబుల నిందితుడు ఒబామా అభిమాని అని కానీ, నా తడాఖా ఢిల్లీలో చూపిస్తానని కానీ అనేంత సాహసం చేయలేదు.

   ఈ విషయంలో ట్రంపు తిక్క ప్రేలాపనలు ఫాక్స్, బ్రైట్బార్త్ లాంటి అస్మదీయ మీడియా సంస్థలు వంత పాడుతున్నా, కొన్నయినా మాధ్యమాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
   ఇది తటస్తులమని చెప్పుకునే వేమూరి లాంటి వాళ్ళు గమనించదగ్గ సంగతి.

   Delete
  5. >>>ప్రపంచమంతా తన మీద కుట్ర పన్నారంటూ ప్రతి నిమిషం వాపోయే persecution complex ఇందిరా గాంధీకి ఉండేది.>>>>

   ఈ వ్యాఖ్యకి ఋజువు ఉందా ?
   మీలాంటివాళ్ళను నోరెత్తకుండా ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ కుట్రలు చేసే అవకాశం ఎవరికైనా ఇచ్చారా అసలు ?
   తనమీద కుట్రలు పన్నకుండా అనుక్షణం అప్రమత్తతతో ఉన్న ఇందిరతో పోలికా ?
   ఇందిరా గాంధీ తో సమానంగా రాజకీయం చేసేవాళ్ళు పుట్టారా ? ఆమె దరిదాపులకు కూడా ఎవరూ రాలేకపోయారు.
   మీరన్న మొనగాడు కుర్చీపోయేసరికి విలవిలలాడాడే ?
   ఎమర్జెన్సీ తర్వాత కూడా ఇందిరకి సింహాసనాన్ని పువ్వుల్లో పెట్టి అప్పజెప్పారే !

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. I fully agree with neehaarika about IG,the emperer of indian politics!From nehru to modi,nobody can beat her in political strategies and winning over his enemies!

   Jai is boasting of he can criticize anybody with a balanced and impartial stand, but he already proved himself as a regional fanatic!

   LOOK YOUR BACK BEFORE CRITICIZE CBN.TIMES HAVE CHSNGED - IF YOU SPIT ONE OUNCE VENOM WE WILL SPIT DOUBLE - SO MANY WARRIARS ARE HERE TO DEFEND ANDHRA!

   Delete
  8. ఎక్కడో ఉన్న సౌదీ రెలిజియస్ ఫ్యానటిక్స్ గురించి ముందెప్పుడొ ఇరగదీస్తానని అంటున్న వీరుడికి సాక్ష్యం మ్యాగజైను కనపడలేదా? ఒకానొకప్పుడు మా హిందువులమే మా సొంత బాధ్యత గనక పోట్లాడామె తప్ప ఈ నిష్పక్షపాతపు వీరయోధుడు పీకిన ఘ్స్నకార్యం ఏమిటి?

   అసలు ఏ విషయం గురించైనా వాళ్ళూ వీళ్లూ వాదించుకుంటుంటే గోడ మీద పిల్లి వాటం కామెంట్లు వెయ్యటం తప్ప సొంత అభిప్రాయం చెప్పే పాటి పోరాట పటిమ కూడా చూపించలేదే?

   లేని గొప్పలు దేనికండి?ఎవరు నమ్ముతారు!

   Delete
  9. హరిబాబు గారూ, సాక్ష్యం పాత టపాలు తిరగేస్తే వారి జాకీర్ నాయక్ తరహా దావా గురించి నా విమర్శలు ఉంటాయి. మీకు కావాలంటే లింకులు మెయిల్ చేస్తాను.

   అన్నట్టు ఖాషోగీ హత్యకు జగన్ హత్యాప్రయత్నానికి దగ్గర పోలికలు చాలా ఉన్నాయండోయ్. మాకేమీ సంబంధం లేదని బుకాయించిన ఎంబీఎస్ ముఠా ఆఖరికి దిగిరాక తప్పలేదు.
   వారూ హంతకులను టర్కీకి అప్పచెప్పే బదులు మేమే విచారణ చేస్తామని అచ్ఛం ఇలాగే మంకు పట్టారు. అక్కడ ఇక్కడ కూడా కిరాయి పాత్రధారులను మాయం చేసి తెర వెనుకటి సూత్రధారులను కాపాడే అవకాశాలు మెండు. అక్కడ అమెరికా ఇరాన్ బూచి ఇక్కడ మోడీ కెసిఆర్ బూచి అన్నదే తేడా.

   Delete
  10. క్షమించాలి ఇదో దరిద్రగొట్టు పోలిక. అక్కడ ఎంతో పకడ్బందీగా చేస్తే ఇక్కడ జరిగింది చీప్ ట్రిక్.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top