కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించారని, రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందన్న వార్తలతో కర్నూలులో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. విద్యాసంస్థలను మూసివేసి నిరసన తెలిపాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలునే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ విద్యార్ది సమాఖ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ఎఫ్, టిఎస్‌ఎఫ్, విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలులో బంద్ చేపట్టారు. విద్యాసంస్ధలను మూయిస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Read more at: http://telugu.oneindia.in/news/andhra-pradesh/rayalaseema-agitates-ap-capital-142848.html
(From one india website)
                                               
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

Post a Comment

 1. రేపు ప్రత్యేక రాయలసీమ కోసం అల్లర్లు జరుగుతాయి.

  ReplyDelete
  Replies
  1. అంత సంతోషంగా ముందే ఎలా చెప్తున్నారు ప్రవీణ్?

   Delete
 2. శుభం. జరగనివ్వండి. అభ్యంతరం చెప్పటానికి ఎవరెంతవారనీ?
  రేపో మాపో ప్రత్యేక కోససీమ రాష్ట్రం కోసమూ ఉద్యమం జరగవచ్చును.

  ఒకటి రెండు సార్లు చెప్పానేమో వేరే వేరే వ్యాఖ్యల్లో. ఈ తెలుగుగడ్డని ముక్కలు చెక్కలు చేసి ప్రక్కనున్న రాష్ట్రాలకు పంచిపెట్టేస్తే బాగుంటుందేమో. అప్పుడు తెలుగువాడికి ఉనికికోసం పోరాడుకోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మాకు ప్రత్యేకం అంటే మాకు ప్రత్యేకం అంటూ‌ఎవరికి వారు వేరు కుంపట్లకోసం తన్నుకునేందుకు కుదరదు. అనైక్యతయే తెలుగువాడి ప్రత్యేకత! రాజకీయరగడలమీద స్పందించే అసక్తి ఈషణ్మాతం లేకపోయినా ఈ ముక్క వ్రాయవలసి వస్తోంది. మళ్ళీ జన్మలో తెలుగువాడిగా పుట్టకూడదని దేవుణ్ణడగాలి. ఐనా అంతవసరం ఉందా? మరో పాతికేళ్ళదాకా ఐనా తెలుగుభాషని మన వాళ్ళు బ్రతికి బట్టకట్టనిస్తారా ఏమిటి. పదో పరకో ముక్కలు తలో రాష్ట్రంలోనూ కలిసిపోయి తెలుగన్నది మాట్లాడే వాడే ఉండడు. దేశానికి ఈ‌ తెలుగువాళ్ళ ప్రత్యేకరాష్ట్రాల ఆందోళనల నిత్యనరకం తప్పాలంటే అదొకటే దారేమో!

  ReplyDelete
  Replies

  1. "ముక్కలు చెక్కలు చేసి ప్రక్కనున్న రాష్ట్రాలకు పంచిపెట్టేస్తే బాగుంటుందేమో"

   ఎవరికి ఎన్ని ముక్కలు పంచినా తెలంగాణకు మాత్రం ఇటీవల మార్పిడి చేసిన మండలాలు తప్ప ఇంకేవీ వద్దండీ. ఈ పంచుడు కార్యక్రమం మిగిలిన పొరుగు రాష్ట్రాలకు మాత్రమె (అదీ వారు ఒప్పుకుంటేనే సుమా) పరిమితం చేయ మనవి:)

   Delete
  2. జైగారూ, అటులనే తప్పక మీకు కావలసిన భూఖండము(ల)ను మీరు (సం)గ్రహించవచ్చును లెండు.

   కం. ఇల్లు చెడి ముక్కలైనపు
   డెల్లరు తమ శక్తికొలది యెత్తుక పోవం
   జెల్లుట లోకవిధంబని
   తెల్లంబే కాన మీకు దిగులెందుకయా!

   స్వస్తిరస్తు.

   Delete
  3. మాకొద్దండీ బాబూ. ఆక్రమణ సామ్రాజ్య వాదాలకు (colonialism/expansionism) మేము దూరం.

   Delete
 3. కమ్మవాళ్ళ ప్రయోజనం కోసం చంద్రబాబు మంగళగిరినే రాజధాని చేస్తాడు. ఇక రాయలసీమ ప్రజలకి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించటం ఒక్కటే మిగిలిన ఆప్షన్.

  ReplyDelete
  Replies
  1. మీకీ కులగజ్జి పోదా ప్రవీణ్?

   Delete
  2. మాకు కూడా ప్రత్యేక ఖమ్మం మీకు ప్రత్యేక శ్రీకాకుళం ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందేమో తెలుగువారికి 20 రాష్ట్రాలున్నా బాగుంటుందేమో :)))

   Delete
 4. ఎందుకు ప్రవీణ్ గారు, మీకు కమ్మవారంటే అంత ద్వేషం? ఆంధ్రా వారంటే అంత ద్వేషం? 14 ఏళ్ళు ఊపిరాడకుండా ఉద్యమాలు చేసి ఆంధ్రా వాళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇవాళ రెండు రాష్ట్రాలు గా విడిపోయిన తరువాత కూడా ఆ ద్వేషాన్ని వదులుకోక రాయలసీమ ప్రజలకు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడం ఒక్కటే మిగిలిన ఆప్షన్ అని సెలవిస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడ తోరగా బాగుపడుతుందో అనే భయంతో ఇంకా ముక్కలు ముక్కలు అయిపోవాలి అని కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నది. మేము కూడా తెలంగాణా లో కొన్ని జిల్లాలు మాత్రమే డెవలప్ అయ్యాయి, వాల్లే మిగతా జిల్లాల మీద ఆధిపత్యం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ కూడా రెండు, మూడు ముక్కలు గా విడిపోవాలి అని రాస్తే మీకందరికి గుండెల్లో ఎంత బాధగా వుంటుందో మా విభేధాల విషయంలో మీరు దూరి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాకందరికీ అంత మంట గా వుంటున్నది. దయచేసి ఇకనుంచైనా మీ వ్యాఖ్యల్లో సంయమనం పాటించండి.
  కొండలరావు గారు దయచేసి ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రచురించకండి. అవి ఒక్క వారి మనసునే కాదు చదువరుల మనసులను కూడా విషపూరితం చేస్తాయి.

  ReplyDelete
  Replies
  1. @vkbabu
   ప్రచురించటంలో తప్పు లేదు బ్రదర్!వారి మనస్తత్వాలకి వారే సాక్ష్యాలు ఇచ్చుకుంటున్నారు, మనకేల రంధి?

   Delete
 5. ప్రవీణ్ గారు,

  నిజంగా తెలివైన వాళ్ళు మీరంతా. ఆలోచిస్తే కొద్ది కొద్దిగా అర్ధమవుతున్నది. విజయవాడ లాంటి పట్టణం రాజధాని అయితే 5 నుంచి 10 సంవత్సరాల్లో హైదారాబాద్ కు దీటు గా అవుతుంది. రాయితీలకోసం గాని, సొంత ప్రాంతం అనే ప్రేమతో గాని చాలా ఇండస్ట్రీస్ వెళ్ళి పోతాయి. అదే కర్నూల్ అయితే డెవలప్ అవ్వాలంటే 20 నుండి 30 ఏళ్ల దాకా పడుతుంది మరియు సరైన కనెక్టివిటీ లేని ప్రాంతం కాబట్టి ( విజయవాడ తో పోలిస్తే ) హైదరాబాద్ లో వున్న ఇండస్ట్రీస్ అంతా తొందరగా ఎక్కడికీ వెల్లవు, తెలంగాణ(హైదరాబాద్) ఆదాయం తగ్గదు అనే అభిప్రాయం తో కూడా ఇటువంటి భావాల్ని జనాల బుర్రల్లో ఇంజెక్ట్ చేస్తున్నట్లున్నారు. ఆంధ్రప్రదేశ్ ముక్కలు ముక్కలు అయితే తెలుగు రాష్ట్రాల్లో మేమే బలం గా వుంటాము అనే భావం కూడా మీ వ్యాఖ్యల్లో అంతర్లీనంగా కనిపిస్తున్నది. ఇంత తెలివైన వాళ్ళు కాబట్టే ఆంధ్రప్రదేశ్ దేశం లోనే అత్యంత పెద రాష్ట్రం గా తయారుచేసి కట్టుబట్టలతో బయటకు గెంటిన తరువాత కూడా మీ ద్వేషాన్ని చల్లార్చుకోకుండా ఇంకా చిన్న చిన్న ముక్కలు కావాలని ఆశిస్తున్నారు. హేట్సాఫ్ మీలాంటి మేధావులందరికి.

  ReplyDelete
 6. Do you think that only the state capital needs to be developed but not other regions?

  ReplyDelete
 7. ప్రవీణ్, సంయమనం తో మీరు ప్రశ్నించినందుకు థాంక్స్. నేను కోరుకొంటున్నది తెలంగాణా, ఆంధ్ర సోదరుల నుండి ఇలాంటి సంయమనమైన ప్రశ్నల్నే. ఇకపోతే మీ ప్రశ్న కి వద్దాం.

  ఇన్నాళ్ల చరిత్ర చూసిన తరువాత ఇతర ప్రాంతాల ప్రయోజనాల్ని గాలికి వదిలివేసి స్టేట్ కాపిటల్ మాత్రమే డెవలప్ అవ్వాలి అని విజ్ఞత వున్నవాడెవడూ కోరుకోడు. కానీ అదే సమయంలో కేపిటల్ అంటే ఒక్క పరిపాలనా కార్యాలయాలు వుండే నగరం మాత్రమే కాదు ఎక్కడ పడితే అక్కడ పెట్టటానికి. అది దేశంలోని ఇతర ప్రాంతాలకు, రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు సులభమైన కనెక్టివిటీ వుండే నగరం, మంచి వాటర్ రిసోర్సెస్ మరియు ఒక స్టాటస్ సింబల్ గా వుండాలి. పెట్టుబడులు పెట్టేవారు మొదట ఎట్రాక్ట్ అయ్యేది రాజధాని చూసే. రాజధానినే సరిగా నిర్మించుకోలేని వారున్న రాష్ట్రంలో మా పెట్టుబడులకు సరైన విలువ, గారంటీ వుంటాయా అని పెట్టుబడిదారులు భావిస్తే రాష్ట్రం అభివృద్ది ఎలా? మా రాష్ట్రం లోని ఇతర ప్రాంతాల ప్రయోజనాల్ని పణంగా పెట్టకుండా, మా రాష్ట్ర రాజధాని చూస్తే మాకు ముచ్చటగా, గర్వంగా వుండేలాగా నిర్మిచుకోవడం తప్పంటారా?

  ReplyDelete
 8. ముందు గమనించాల్సిన ముఖ్య విషయం: ఒక చోట రాజధాని పెడితే అక్కడ అభివృద్ధి అవుతుందనేది కేవలం భ్రాంతి మాత్రమె. ఒక నగరం అభివృద్ధి వెనుక ఎన్నో నైసర్గిక, ప్రాకృతిక, సాంస్కృతిక, ఆర్ధిక & చారిత్రిక కారణాలు ఉంటాయి. ఇందులో ఒకానొక రాష్ట్రానికి ఇది రాజధాని కావడం/కాకపోవడం అనేది అత్యల్ప ప్రాముఖ్యత చెందిన అంశం.

  ఇక శ్రీబాగ్ ఒడంబడిక నేపధ్యం ఒకసారి చూద్దాం. ఆంద్ర రాష్ట్ర (విశాలాంధ్ర కాదు) ఉద్యమంలో రాయలసీమ భాగం పంచుకోవడానికి దారి తీసే విధంగా 1937లొ ఈ ఒడంబడిక చేసుకున్నారు. ఇందులో సాగు నీరు సంబందించిన అంశాలు అమలు కాలేదు సరికదా శాశ్వతంగా సీమకు తలుపులు మూత పడ్డాయి. ఇంకా కొద్దో గొప్పో అవకాశం ఉన్న రాజధాని అంశాన్ని తమ వైపు తిప్పుకోవాలని సీమ వారు కోరడంలో తప్పు లేదేమో?

  అసలు శ్రీబాగ్ ఒడంబడిక ఉనికినే గుర్తించకుండా ఉండడం ప్రస్తుత రాజకీయ (వ్యాపార) అవసరాలకు సరిపోవోచ్చు కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు మంచిది కాదు. సున్నితమయిన సమస్యను ధైర్యంగా ఎదురుకోవడమే పెద్దరికం.

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడు ఆంధ్రా రాష్ట్రానికి కావలసింది, శ్రీభాగ్ ఒప్పందాలూ, ఒడంబడికలూ కాదు. ఒక రాజధాని. ఆ రాజధానిని Scratch నుండి అభివృద్ది చేయడం కన్నా, ఇదివరకే అభివృద్ది అయిన ప్రాంతాన్ని తీసుకుంటే.. బావుంటుంది అనేది ఇదివరకే నిరూపించబడ్డ నిజం. ఒకప్పుడు కర్నూలును కాదని హైదరాబాదుకు తరలివెల్లింది అందుకే.

   ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో హైదరాబాదుకు ధీటుగా ఒక రాజధాని అతిత్వరలో ఎదగాలి అంటే .. దానికి విజయవాడలాంటి నగరం పక్కనుండడం ఎంతో అవసరం. అందుకే సహజంగానే అక్కడికే రాజధాని తరలి వెల్లింది. ఇక రాయలసీమలో బందులూ, నిరసణలూ అన్నీ ... కొన్ని రోజులకు చల్లారేవే. రాజకీయ ప్రేరేపితాలు ఎంతో కాలం నిలవవు. ప్రభుత్వం కాస్త రాయలసీమ అభివృద్ది మీద దృష్టి పెడితే చాలు.

   రాజధాని ఉన్న చోట అభివృద్ది జరుగుతుంది అనడం మరీ అంత భ్రమేమీ కాదు. అభివృద్దికి కావలసిన వనరులు ఒకచోట ఉన్న ప్రాంతాన్నే రాజధానులుగా చేసుకోవడం ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ. అంటే రాజధాని - అభివృద్ది అనేవి పరస్పరం సంబంధం ఉన్న అంశాలే. రాజధాని కాని ప్రాంతాలు కూడా అభివృద్ది చెందడం అనేది మరో కోణం అంతే.

   Delete
  2. హైదరాబాదు రాజధాని మాత్రమె కాదు ఒక మహా నగరం కూడా. రాజధాని పరంగా హైదరాబాదుకు దీటుగా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే మహానగరాల జాబితాలో చేరడం అనే ఆమ్బిషన్ కేవలం రాజధాని పెట్టడం వాళ్ళ నెరవేరదు.

   ఇకపోతే విశాఖపట్నం దేశంలోనే 17వ స్థానంలో ఉంది. మీరు చెప్పే అర్హతలు 42వ స్థానం కల బెజవాడ కంటే విశాఖకె ఎక్కువేమో ఆలోచించండి.

   శ్రీబాగ్ ఒడంబడిక కావాలా వద్దా అన్నది ముఖ్యం కాదు. అసలంటూ ఉండిందా లేదా అని కనీసం acknowledge కూడా చెయ్యకపోవడం ప్రస్తుత అయోమయానికి కారణం కాదంటారా?

   రాయలసీమ అభివృద్దికి గత ప్రభుత్వాలు ఏంటో చేసామని చెప్పారు, కొంతవరకు చేసారు కూడా. అయితే సీమ-ఆంద్ర ప్రయోజనాల మధ్య వైరుద్ద్యం వస్తే రాజ్యం ఆటే నిలబడుతుందని సీమ వారి నమ్మకం గట్టి పడితే ఎవరికీ మంచిది కాదు.

   Delete
  3. తెలంగాణా ఉద్యమం కూడా చల్లారిపోతుందని చాలా మంది అనుకున్నారు కానీ అదే విజయవంతమైంది. ప్రత్యేక రాయలసీమ కూడా తప్పకుండా ఏర్పడుతుంది.

   Delete
  4. హైదరాబాద్ మహానగరాన్ని అందుకోవడం పెద్ద కష్టం కాదండి. పెట్టుబడులు పెట్టేవారు, కాస్త నిజాయితీగా పాలించే వారు కావాలి. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరములో హుస్సేన్ సాగర్, ఛార్మినార్, మ్యూజియం, గోల్కొండా లాంటివే ఉండేవి. ఇంత అభివృద్ది ఉండేది కాదు. తరువాతే వచ్చింది ఈ అభివృద్ది. ఇదంతా కేవలం గత 20యేల్లలో వచ్చిన అభివృద్దే. ఆ 20 యేల్లు ఒకసారి ఇటేసుకుంటే... ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగరమంత అభివృద్ది సాఢ్యమే. ఎలానూ కేంద్ర సాయం ఉండానే ఉంది..!!

   విజయవాడకంటే వైజాగే మంచి నగరం. దాన్ని రాజధానిగా పెడితే బాగానే ఉంటుంది. ఎలానూ పోర్టు కూడా ఉంది. కాకపోతే అది మిగిలిన ప్రాంతాలకి చాలా దూరం. అదొక్కటే సమస్య. అదే లేకపోతే.. వైజాగే నా ఫేవరిట్. వైజాగు మీద విజయవాడను ఎక్కువ సమర్ధించడానికి కారణం .. మా రాయలసీమ కోసమే తప్ప మరొకటి కాదు. ఆ మాత్రానికి రాయలసీమలోనే రాజధాని కోరొచ్చు కదా అంటారా? దానికి అనువైన నగరం ఏది? తిరుపతి ఓ మోస్తరులో పర్వాలేదు కానీ.. అది మరో బోర్డర్ ఏరియా. అందుకే విజయవాడకు కాంప్రమైజ్ అయ్యాను నేను. (ఇక్కడ కేవలం నా అభిప్రాయం చెబుతున్నాను, అంతే) .

   రాయల సీమకు సంబందించినత వరకూ నాయకులకు లోటు లేదు. ముఖ్యమంత్రులూ, ప్రతి పక్ష నేతలూ రాయలసీమ వారే ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం మారిన పరిస్థితులలో.. సీమకు అన్యాయం జరుగుతుంది అని నేను అనుకోను.

   Delete
  5. ప్రభుత్వాలు ఒక నగరాన్ని అభివృద్ధి చేయగలవనే భ్రమ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పను.

   "తరువాతే వచ్చింది ఈ అభివృద్ది"

   1956లొ హైదరాబాదు దేశంలో 5వ స్థానంలో ఉండేది

   "హైదరాబాద్ మహానగరాన్ని అందుకోవడం పెద్ద కష్టం కాదండి"
   కొద్దిగా వెనకబడి 6వ స్థానంలో ఉన్న బెంగుళూరుకు ఒవర్టేకు చేయడానికి 4-5 దశాబ్దాలు పట్టింది. Anyway all the best!

   Delete
  6. ప్రభుత్వాలు నగరాలను అభివృద్ది చేయగలవా? లేదా? అంటే చేయగలవనే చెబుతాను నేను. ప్రపంచములో చాలా చోట్ల అలానే జరిగింది. నిజానికి చైనాలో అయితే .. ఇంఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రభుత్వమే ఏర్పాటూ చేస్తుంది. మన భారత దేశములోనే .. కేవలం అక్కడ చేరిన ప్రజలు అభివృద్దికి కారకులు అవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆంధ్రా పరిస్థితి దీనికి భిన్నమైనది అని నా అభిప్రాయం. ప్రజల్లో కసి ఉంది, పాలకుల్లో భయం ఉంది. అందుకే విజయవాడ దేశములోని మిగిలిన మెట్రో నగరాల సరసన చేరుతుంది అని నా నమ్మకం.

   1956లొ హైదరాబాదు దేశంలో 5వ స్థానంలో ఉండేది
   నిజమే. కానీ, 1994లో ఉన్న హైదరాబాదు, 2014లో ఉన్న హైదరాబాదు ఈ రెండింటికీ ఉన్న వ్యత్యాసం, ఈ ఇరవై యేల్లలో జరిగిన అభివృద్ది .. కాదనలేని సత్యం. ఐ.టీ అనేది వచ్చిన తరువాత జరిగిన అభివృద్దికి, దానికి ముందున్న అభివృద్దికీ తేడా తెలీనట్టు మాట్లాడితే ..నేను చేయగలిగింది ఏమీలేదు కానీ, అదే కాన్సంట్రేషన్ హైదరాబాదుమీద కాక మరో నగరం మీద పెట్టి ఉంటే.. ఆ నగరం కూడా ప్రస్తుతం మంచి పొజిషనులో ఉండేదని మాత్రం చెప్పగలను.

   //కొద్దిగా వెనకబడి 6వ స్థానంలో ఉన్న బెంగుళూరుకు ఒవర్టేకు చేయడానికి 4-5 దశాబ్దాలు పట్టింది//
   నా ఉద్దేశ్యం, హైదరాబాదును అధిగమించి ముందుకు పోగలదు అని కాదు. అది ఇప్పట్లో కుదరక పోవచ్చు. కానీ, హైదరాబాదులో ఉన్న వసతులు, అభివృద్ది గల రాజధాని మాత్రం ఖచ్ఛితంగా అవగలదు అని.

   //Anyway all the best!
   Thank you !!

   Delete
  7. ప్రతి నగరంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వమే నిర్మిస్తుంది. ఎక్కడ అభివృద్ధి అవకాశాలు ఉన్నాయో అక్కడే కడుతుంది. ఎంత కట్టినా అనువు కాని చోటు అభివృద్ధి కాదు. Cause & effect can't be interchanged.

   మీరు 2014-1994 మధ్య హైదరాబాదు నగరం పరిస్తితిని పోల్చారు బాగుంది. అదే సమయంలో మదరాసు, బెంగుళూరు, పూనా లాంటి నగరాలను కూడా పోల్చి చూడండి తెలుస్తుంది. Cities grow in geometric progression leading to "myopic" interpretation.

   నిజానికి విశాఖ బెజవాడ నగరాలు గత 58 ఏళ్లలో హైదరాబాదు కంటే ఎక్కువ వేగంతో పెరిగాయి. కనీస జిల్లా స్థాయి ఊళ్లగా ఉన్న ఈ పట్నాలు దేశంలో 17/42 స్థానాలకు ఎదగడం విశేషమే.

   Delete
  8. నాకు తెలిసి పాతికేళ్ళ క్రితం విశాఖపట్నం కూడ హైదరాబాదుకి మరీ తక్కువగా ఏమీ ఉండేది కాదు. పోటిగానే ఉండేది. రెండు చోట్లా PSU లు సమానంగానే ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో private sector మొత్తం రాజధానిలోనే సంస్థలు నెలకొల్పడం వల్ల, హైదరాబాదు ముందుకు వెళ్ళిపోయింది. విశాఖ అక్కడే ఉండిపోయింది.

   Delete
  9. అదేమిటో ఇన్నేళ్ళుగా తరచూ వెళ్లి వస్తున్నా నాకు ఎందుకో అలా అనిపించలేదు. ఎ మైసూరుకో బీజాపూరుకో వెళ్లినట్టు అనిపించేది.

   శుభ్రత & ట్రాఫిక్ మాత్రం వైజాగులో అమోఘం.

   Delete
 9. @vkbabu
  I suppoerT you!

  మొత్తం 13 జిల్లాల లోని ప్రజ లందరికీ అభివృధ్ధి లో తప్పకుండా వాటా వుంటుంది.వుండక పోతే పోట్లాడి అయినా సాధించుకోవాలి. కానీ రాజధాని విషయంలో మాత్రం మా ప్రాంతంలో వుండాలంటే మా ప్రాంతంలో వుండాలనె మూర్ఖత్వాలకి పోకండి. అది చాలా తప్పు, రాజధాని అనేది యే వొక్క ప్రాంతం వారికో స్టాటస్ సింబల్ కాదు. మొత్తం రాష్ట్ర ప్రజ లందరికీ హక్కు వుంటుంది, వుండి తీరాలి - అలోచించండి! చెన్నయ్ నుంచి తన్నించుకుని వచ్చారు, మా హైదరాబాదుని లాక్కున్నారు అనే మాటలు పడ్డాం, దానికి జవాబు చెప్పాల్సిన సమయంలో మనం గందరగోళానికి గురి కావటం వల్ల నవ్వుల పాలవుతాం.
  src:http://harikaalam.blogspot.in/2014/09/blog-post.html

  ReplyDelete
  Replies
  1. హరిబాబు గారు,

   మీ హృదయపూర్వకమైన సపోర్ట్ కు ధన్యవాదాలు. మీరన్నట్లు ఇది ప్రాంతీయ స్వార్ధాలకు పోయే సమయం కాదు. అందరూ కలసి ఒక్కతాటి మీద నిలవాల్సిన సమయం.

   Delete
 10. ఎవడు బావున్నా మనం ఏడుస్తాం. మనదొక ఏడుపుగొట్టు బానిసజాతి. ఆ బావున్నది కోస్తావాళ్లైనా, కమ్మవాళ్ళయినా మరొకడైనా, మరొకడైనా ! బావున్నవాళ్ళందరి వినాశనాన్నీ మనం మనస్పూర్తిగా కోరుకుంటాం. మన పార్టీలూ, సిద్ధాంతాలూ, ఉద్యమాలూ అన్నీ ఆ ఏడుపుగొట్టుతనంలోంచే పుట్టుకొచ్చాయి. వాస్తవంగా ఈ గడ్డ మీద ఆప్రెసర్సూ లేరు. ఆప్రెస్డూ లేరు.

  ReplyDelete
 11. నాకేయితే రాజధాని లేని రాష్ట్రం కావాలి, ప్రస్తుతం ప్రపంచం Cloud Computing వైపు మొగ్గు చూపుతుంది, దాన్ని ఉపయోగిస్తే అసలు రాజధాని అవసరం లేదు, ఎందుకంటే రాజధానిలో ఉండాల్సినవి అన్నీ మనం Digital methods ద్వారా చెయ్యవచ్చు!
  దాని గురించి ఒక టపా వ్రాస్తాను

  ReplyDelete
 12. http://gpv-buddha.blogspot.com/2014/09/blog-post.html
  ఇక్కడ కొన్ని సలహాలు ప్రచురించాను

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top