వజ్రాల పరబ్రహ్మం గారు

మా గురువుగారు వజ్రాల పరబ్రహ్మం సర్ యీరోజు చనిపోయారు. మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఆయన ఖమ్మం లో చనిపోయారు. రేపు మద్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. 

ఎనిమిది నుండి పదవతరగతి వరకు జెడ్.పి.ఎస్.ఎస్ చిరునోములలో నేను ఆయన శిష్యుడిని. నాపై బాగా ప్రభావితం చూపిన వారిలో పరబ్రహ్మం సర్ ఒకరు. పిల్లలను ప్రేమతో చూడడంలో, క్రమశిక్షణ నేర్పడంలో, కేవలం చదువే గాక వివిధ సామాజిక అంశాలలోనూ ఆయన శైలి ప్రత్యేకం. నాపైనే కాదు ఆయన శిష్యులెవరూ ఆయనను మరచిపోలేరు. పదవతరగతి అనంతరం కూడా నాకాయన అనేక విషయాలలో సలహాలు ఇస్తుండేవారు. స్కూలులో చదివేటపుడే కాదు, తరువాత కూడా ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. తెలుగు పద్యాలను చక్కగా పాడి పాఠం చెప్పేవారు. అక్షరాలు ఎలా వ్రాయాలి? మాతృభాష గొప్పదనం గురించి, వ్యాకరణం, వ్యాసరచన వంటి అనేక విషయాలలో ఆయన బోధనా విధానం ప్రభావవంతంగా ఉండేది. తెలుగులో 56 అక్షరాలు ఇవే అనే టపాలో ఆయన పేరుని ఉదహరించాను. నేను బోనకల్ లొ ఉన్న ఏడాది కాలంలో దాదాపు ప్రతి రోజు ఆయన మా ఇంటికి వచ్చేవారు. పల్లెప్రపంచం తరపున నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలలో ఆయన పాల్గొనేవారు. దాదాపు ప్రతివారం సంస్థ ఆధ్వర్యంలో నడిచిన స్టడీ సర్కిల్ లో ఆయన పాత్ర ఉండేది. నేను ఖమ్మం వచ్చాక కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు. మధ్యలోనూ కలసి యోగ క్షేమాలు అడిగేవారు. పల్లెప్రపంచం కార్యక్రమాలలో సర్ పాల్గొన్న ఫోటోలు కొన్ని దిగువన చూడవచ్చు. పల్లెప్రపంచంలోనే కాదు పరబ్రహ్మం గారు సామాజిక సేవా కార్యక్రమాలలో యెపుడూ ముందుండేవారు.

సర్ మృతికి సంతాపం తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన నేర్పిన మంచిని పదిమందికి పంచేందుకు కృషి చేస్తాను.

యీ రోజు బోనకల్ లో సర్ పార్ధివ దేహానికి పూలమాల వేస్తూ నేను....అబ్ధుల్ కలాం సంతాపసభలో..... సభాధ్యక్షులుగా


యోగా దినోత్సవంలో సభాధ్యక్షులుగా...


కోటిమొక్కల పెంపకంలో మొక్కనాటుతూ.....

సమాచార హక్కు చట్టంపై క్లాసు చెపుతూ.....
స్టడీసర్కిల్ లో సభ్యునిగా హాజరై శిష్యులతో సమానంగా చర్చలలో పాల్గొంటూ...


Reactions:

Post a Comment

  1. పిల్లలు అభివృద్ధి లోకి రావాలని పాటుబడే ఉపాధ్యాయులకు చేతులెత్తి నమస్కారం చెయ్యాలి. భౌతికంగా వాళ్ళు ఉన్నా లేకపోయినా మన మనస్సులో వాళ్ళు ఎప్పుడూ మెదులుతూనే ఉంటారు.

    ReplyDelete
  2. ఔను రామకృష్ణారావు గారు

    ReplyDelete

 
Top