ఎ.పీ లో సి.బి.ఐ విచారణను నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనాడు వార్తా సమాచారం మేరకు అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రతిష్ఠ మసకబారిందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దిల్లీ మినహా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి (జనరల్‌ కన్సెంట్‌) తెలపాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్రం ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు. తాజా ఉత్తర్వుతో రాష్ట్రంలో దాడుల చేయడానికి సీబీఐకి పరిధి రద్దయింది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ రెండూ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతుంటాయి. అయితే సీబీఐ రాష్ట్ర భూభాగంలో తన అధికారాలను అమలు చేసేందుకు వీలు లేకుండా పోయిన నేపథ్యంలో ఏపీలో సీబీఐ పాత్రను మన రాష్ట్ర ఏసీబీయే పోషించే అవకాశముంది.

ఈ విషయంలో ఎ.పీ ప్రభుత్వ వైఖరి సరయినదేనా? రాజ్యాంగం ప్రకారం ఇది ఆచరణకు నిలుస్తుందా? ప్రస్తుతం ఎ.పీ లో ఆ అవసరం ఉందని మీరు భావిస్తున్నారా?
- పల్లా కొండల రావు.
-----------------------------------------
ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.
*Republished


Reactions:

Post a Comment

 1. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లుతుంది.

  రాజకీయంగా చూస్తే ఒక పోకడ స్పష్టంగానే అవగతం అవుతుంది. వెంకయ్య నాయుడి "ప్రమోషన్", పోలవరం కాంట్రాక్ట్ ముదరడం & శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నప్పుడే రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. అప్పటిదాకా టికెట్ ఖాయమని అందరూ అనుకున్న వర్ల రామయ్యను అనూహ్యంగా తప్పించి చంద్రబాబు అడ్వొకేట్ కనకమేడలను పెద్దల సభకు పంపడం, అటుపిమ్మటే టీడీపీ ఎన్డీయే నిష్క్రమణ వెంటవెంటనే జరిగాయి. ప్రస్తుత జీవో అదే డ్రామాలో కొనసాగింపులా ఉంది.

  ReplyDelete
  Replies
  1. కేంద్రం ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు సంస్థలను వాడుకోవడం కాంగ్రెస్ తోనే ప్రారంభమయింది. మోడీ వచ్చాక వెరైటీ నియంతృత్వం స్టార్ట్ అయింది. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వచ్చింది కనుకనే ఈ కొత్త డ్రామా అనడంలో సందేహం లేదు. కానీ రాజకీయంగా ఇలా ఒక రాష్ట్రానికి ఈ హక్కు ఉంటుందా? అది నిలబడుతుందా? ఈ విషయమై భిన్నవాదనలు వినిపిస్తుండడంతో ఈ ప్రశ్న ఉంచాను.

   Delete
  2. కేంద్రం ఇష్టం వచ్చినట్లుగా దర్యాప్తు సంస్థలను వాడుకోవడం తప్పే, మరి అదే పని రాష్ట్రాలు చేస్తున్నాయిగా ... !
   నిస్సిగ్గుగా ...!

   Delete
  3. ఔను. ఎవరు అధికారంలో ఉంటే వారు ఈ తప్పులు పదే పదే చేస్తున్నారు.

   Delete
 2. మమత కూడా ఈ బాటనే అనుసరిస్తానంటోంది. ఇదో ఒరవడి అవుతుందేమో!

  ReplyDelete
  Replies
  1. మరి?ట్రెండ్ సెట్ చేయడం పవన్ కే కాదు బాబుకి కూడా వచ్చన్నమాట!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top