'ప్రజ'కు సహకరిస్తున్న మీకు ధన్యవాదములు. తెలుగులో చర్చావేదికగా 'ప్రజ'ను తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో "ప్రశ్న మీదే - జవాబు మీదే" అనే కాన్సెప్ట్ తో 'ప్రజ' బ్లాగులో ప్రశ్నలకు జవాబులకు ఆహ్వానం పలకడం జరిగింది. వివిధ అంశాలపై చాలామంది మంచి చర్చలే చేశారు. ఇపుడు ‘పల్లెప్రపంచం’ బ్లాగు లో ప్రజ అనేది ఒక కేటగిరీగా ఉంటుంది.  పాలసీ తెలుసుకోవడానికి ఇక్కడ , ప్రశ్న పంపడానికి ఇక్కడ నొక్కండి. 

ఇంతక్రితం 'ప్రజ' బ్లాగులో ఉన్న ముఖ్యమైన టపాలు ‘పల్లెప్రపంచం’లోకి బదిలీ చేస్తాను. సమయం అనుకూలతని బట్టి ఈ బదిలీ ఉంటుంది. ‘ప్రజ’ బ్లాగులో పాత టపాలలో మీకు ఆసక్తి ఉన్నవి ఉంటే నాకు మెయిల్ చేయండి. ముందుగా రీపబ్లిష్ చేసేందుకు ప్రయత్నిస్తాను. మంచి చర్చలు జరపడానికి సహకరించాలని వినతి. చర్చలలో చెడ్డ లక్షణాలను వదిలేసేందుకు ప్రయత్నించండి.
నా దృష్టిలో
మంచి చర్చ అంటే : "ఇతరులను కించపరచకుండా తాము అనుకుంటున్నది వాదించడం. ఇతరుల వాదనలో మనకంటే మెరుగైన సమాచారం ఉంటే నేర్చుకోవడం. మనల్ని మనం మార్చుకోవడం". 

చర్చలో చెడ్డ లక్షణం ఏమిటంటే : "వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తమకు నచ్చని వాదన వస్తే తట్టుకోలేక అలగడం. నూతిలో కప్పలా తమకు తెలిసినదే జ్ఞానమనుకోవడం."

నాకు తెలిసీ ఈ ప్రపంచం లో ఎవరికీ ఎప్పటికీ అన్ని విషయాలు తెలిసే అవకాశమే లేదు. ఎప్పటికప్పుడు ఎవరైనా తెలుసుకోవల్సినదే. తెలుసుకొవాలీ.. అంటే ప్రశ్నించాలి. ప్రశ్నకు జవాబు సరయినదో కాదో తేల్చుకోవాలంటే చర్చ జరగాలి. నిర్ధారించుకోవాలి. ఈ నియమం మేరకు వాదన ఉంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాకుండా తమకు మాత్రమే అన్నీ తెలుసనుకోవడం.. నిజానికి అజ్ఞానం లేదా అహంకారం అవుతుంది. 

ప్రజలో మీకు తెలిసినమేరకు ఇంకా ఏమైనా మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అనిపించిన అంశాలను తెలియజేయండి. ‘ప్రజ’ను తెలుగువారి చర్చావేదికగా తయారు చేయాలని ప్రయత్నించడం జరిగింది. అన్ని రకాల ప్రశ్నలతో ఇక్కడ చర్చించడం జరుగుతున్నది. కొందరికి కొన్ని రంగాలపైన ఉన్న ఆసక్తి మరో రంగం పై ఉండకపోవచ్చు. ఒకరికి ప్రశ్నగా అనిపించింది మరొకరికి ఇదేమి ప్రశ్న? అనిపించవచ్చు. అసలు చర్చించడం వల్ల ఏమి ప్రయోజనమని భావించేవారూ ఉండొచ్చు.

నావరకైతే మీలో చాలామందినుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ వారి పేర్లు చెప్పడం లేదు. అందరూ సహకరించారనడం అబద్దం అవుతుంది. కొందరు ఆటంకాలు కల్పించినవారున్నారు. కొందరు అలిగి పోయినవారున్నారు. కొంతకాలం ఉత్సాహంగా ఉండి తరువాత మిన్నకున్నవారున్నారు. అప్పుడప్పుడు విలువైన వాదనలు చేసేవారూ ఉన్నారు. అన్నీ విలువైన ప్రశ్నలు - వాదనలే ఉంచడం సాధ్యం కాదు. వీలయినంతగా ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ పోవడమే చేయగలమనుకుంటున్నాను.

ఏమైనా..... అసలు ప్రశ్న-జవాబుల కాన్సెప్ట్ తో ఓ బ్లాగ్ నడపగలమా!? అనే సందేహంతో ప్రారంభించిన ‘ప్రజ’ బ్లాగు నేనాశించినదానికంటే ఎక్కువే విజయవంతమయింది. నా అనుభవంలో కొన్ని లోపాలను గుర్తించి సరిచేయదలచాను. అలాగే మీకు అ(క)నిపించిన లోపాలు, ఇలా చేస్తే బాగుంటుందనిపించినవి మీ కామెంట్ల ద్వారా తెలియజేయగలరు. ఇంకా ఏవైనా వివరంగా అభిప్రాయాలు-సూచనలు తెలియజేయాలనుకుంటే నాకు మెయిల్ చేయగలరు. 

ప్రజ బ్లాగులో కలుపు మొక్కలను ఏరివేయాలనే నిర్ణయించాను. పెంట కుప్ప మీద ఏపుగా పెరిగిన ‘కలుపు మొక్కలు’ ఎంత బలంగా ఉన్నా పంట మొక్కలు కాగలవా? పెంట కుప్పమీద కలుపు మొక్కలు బలంగా పెరుగుతాయి. సారవంతమైన పెంట బలంతో అవి ఏపుగా పెరిగినా పంట మొక్కలు కాలేవు కదా? కామెంట్ మోడరేషన్ ఉంచితే స్పందనకు సమయం వృధా అవుతుందని ఇలాంటి వారిని భరిస్తూ రావడం జరిగింది. కానీ ఒక్క విషపు చుక్క చాలు కదా మొత్తం పాలను విరగగొట్టడానికి. 

అందుకే ఇకపై ప్రజలో చిన్న మార్పులుంటాయి. గమనించగలరు. మొదటి వారం రోజులు కమెంట్ మోడరేషన్ ఉండదు. ఆ తరువాత కామెంట్ మోడరేషన్ ఉంటుంది. సబ్జెక్టుకు ఆటంకం లేని చర్చలకోసం అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. వ్యక్తిగతంగా కించపరచే, సబ్జెక్టుకు సంబంధంలేని కామెంట్లు ప్రచురించడం జరగదు. ప్రచురితమైనవాటిలో అలాంటివి ఉంటే డిలీట్ చేయడం జరుగుతుంది. డిలీట్ చేయాలని మీకు అనిపించినవి ఉంటే కారణం తెలుపుతూ మెయిల్ చేయడం మరువకండి.

‘ప్రజ’లో చర్చలలో ఉత్తమంగా పాల్గొంటున్నారని నేను భావించినవారి పేర్లు, మెయిల్ ఐ.డిలు సేకరించి వారితో ప్రత్యేకంగా చర్చావేదికను మెరుగైన పద్ధతిలో తయారుచేయాలని భావిస్తున్నాను. అది ఆచరణలో ఉంచేటపుడు వివరాలు తెలియజేస్తాను.

మీ సూచనలకు - సలహాలకు సదా ఆహ్వానం !
 kondalarao.palla@gmail.com 
 - పల్లా కొండలరావు

*Republished with editings on 24-12-2018
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top