• ఘంటసాల పాడుతుంటే చూశారా? ఆయన గతించి నాలుగు దశాబ్ధాలు అయినా... (జననం: డిసెంబర్ 4, 1922 - మరణం: ఫిబ్రవరి 11, 1974 ) తెలుగునాట ప్రతీరోజు ఏదో ఓ చోట ఆయన గానం వినిపిస్తూనే ఉంటుంది. ఆయన గాత్రం అంతగా ప్రభావితం చేసింది. 
 • అంతటి ప్రభావం కలిగించిన వ్యక్తి మీ ముందు పాడుతుంటే ఎలా ఉంటుంది? అప్పట్లో ఇంతటి సాంకేతిక విలువలు, టీ.వీ మీడియా లేదు కనుక సెలబ్రెటీల ప్రోగ్రాములూ ఏ కొద్దిమందో చూసేవారు. ఇప్పుడైతే ఇంట్లో ఉండే క్షణాలలో ప్రపంచ సంఘటనలను చూస్తున్నాము. 
 • ఘంటసాల పాడుతుంటే ఎలా ఉంటుందని ఊహిస్తూ తయారు చేసిన ఏనిమేషన్ ఇది. దీనిని తౌటి సంతోష్ కుమార్ తయారు చేశారు. యూట్యూబ్ లొ ఈ వీడియో ఉన్నది. 
 • పెరిగిన సాంకేతికతతో ఎన్నో పైత్యపు పనులు చేస్తూ సొల్లు, చెత్తను సోషల్ మీడియాలో వదులుతుండడం చూస్తుంటాము. 
 • అనేక అంశాలపై మనలను ఆలోచింపజేసే, ఆనందింపజేసే క్రియేటివిటీలు ఉంటున్నాయి. అలాంటివాటిలో ఈ వీడియో ఒకటి. 
 • ఘంటసాల మాష్టారు మనముందు భక్తతుకారాం సినిమాలో దేవులపల్లి వారి పాటని పాడితే ఎలా ఉంటుందో ఊహిస్తూ తయారయిన ఈ ఏనిమేషన్ ను మీరూ చూడండి. 
 • ఈ పోస్టుకు ప్రేరణ సాహిత్య అభిమాని బ్లాగరు శివరామప్రసాద్ గారి పోస్టు ' ఘంటసాల గానం చూసి ఆనందించండి ( ఏనిమేషన్ ) '.
 • సంతోష్ గారు మీరు ఇలాంటివి మరిన్ని చేయాలని , వీలయితే ఇప్పటి హీరోలు , గాన గంధర్వుడి పాటకు యాక్ట్ చేస్తున్నట్లు తయారు చేస్తే వెకిలి పాటలనుండి వెకిలి సాహిత్యం నుండి కొంతయినా విముక్తి కలుగుతుంది.
 • ఇప్పటి తరం వారికి మన సంస్కృతీ సాహిత్యం విలువలు వాటి గొప్పతనం గురించి ఇండైరెక్ట్ గా నైనా ఇంజెక్ట్ చేసినవారవుతారు .  

(ఘంటసాల గారు పాడుతున్న ఫోటో గూగుల్ సెర్చ్ ద్వారా సేకరించినది. ఏ పాట పాడుతుంటే తీసినది తెలీదు)

*Republished

Post a Comment

 1. ఆయన గాత్రం అంతగా ప్రభావితం చేసింది.
  వాక్యంలో ప్రభావితం చేసింది (సమాజాన్ని) అన్నది సరైన ప్రయోగం.

  అంతటి ప్రభావిత వ్యక్తి మీ ముందు పాడుతుంటే..
  ఘంటసాలగారు కాదు ప్రభావితులు. సమాజం ప్రభావితం. ప్రభావితం అంటే ఒక ప్రభావానికిలోనైనది అని అర్థం.
  సమాజం ప్రభావానికి లోనైనది కాని ఘంటసాలవారు ప్రభావానికి లోనుకాలేదు కదా. ఆయన ప్రభావాన్ని చూపారు సమాజంపైన. అందుచేత ఈ వాక్యం "అంతటి ప్రభావం కలిగించిన వ్యక్తి మీ ముందు పాడుతుంటే" అని ఉండాలి.

  ఇలా కొన్ని మాటలను సరైన అన్వయం తెలియకుండా ఈ రోజున వాడేస్తోంది సమాజం. చాలా విచారించదగ్గ విషయం. మరొక ఉదాహరణ చెప్పాలంటే "సమర్థంగా" అని అనవలసిన సందర్భాలలో సర్వత్రా "సమర్థవంతంగా" అని అసహజంగా ప్రయోగిస్తున్నారు.

  దయచేసి భాషపట్ల మరికొంచెం శ్రధ్ధ తీసుకొనవలసిందిగా అందరికీ మనవి,

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు. సరిచేశాను సర్. భాష పట్ల శ్రద్ధ చూపడమే కాదు, శ్రద్ధగా తప్పులు దిద్దే మీలాంటివారు మరికొందరు ముందుకు రావాలని అభిప్రాయపడుతున్నాను.

   Delete
  2. ఇక్కడ ప్రభావక వ్యక్తి/ ప్రభావవంత వ్యక్తి/ ప్రభావశీల వ్యక్తి అనాలనుకుంటా.

   Delete
 2. ఒక సినిమాలో (వెంకటేశ్వర మహాత్యం?) తిరుపతి గర్భగుడిలో ఘంటసాల పాట పాడిన సన్నివేశం యూట్యూబ్ ఎక్కడో చూసినట్టు గుర్తు.

  ReplyDelete
  Replies
  1. అది శ్రీవేంఅటేశ్వరమహాత్మ్యం సినిమాలోని 'శేషశైలవాసి శ్రీవేంకటేశా" అన్నది. అందులో శ్రీనివాసుడుగా చేసినది సీనియర్ NTR.

   Delete
  2. చాలా థాంక్సండీ!

   Delete
 3. ఘంటసాల: ఆంధ్రులు గర్వించదగ్గ ఆణిముత్యం

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top