చంద్రవదన్‌ పేరు మోసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. రియల్‌ ఎస్టేట్‌ మంచి ఊపుమీదండగా కోట్లు గడించాడు. ఆ డబ్బులతో మరిన్ని చోట్ల భూములు కొనుగోలు చేశాడు. అనూహ్యంగా రియల్‌ ఎస్టేట్‌ ఊపు తగ్గిపోయింది. ఇళ్ల స్థలాల అమ్మకం ఆగిపోయింది. ఒక్కసారిగా అప్పుల్లో కూరుకుపోయాడు. పిచ్చోడిలా అయిపోయాడు. సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోయాడు. ఒక రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.

 • ఏదైనా సమస్య వచ్చినపుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. సంక్షోభ సమయంలోనే సమర్ధతను నిరూపించుకోవాలి. 
 • వ్యాపారంలో నష్టమొచ్చి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టొచ్చు. అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు. వివాహ జీవితం విచ్ఛిన్నం కావచ్చు. 
 • సమస్య ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేతప్ప దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేయకూడదు. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన ఎవరి ఆత్మకథలైనా చదవండి. అందరూ ఇలాంటి సంక్షోభాలను అధిగమించినవారే. 
 • సంక్షోభంలో కూరుకుపోయినపుడు జీవితమంతా అంధకారంలా అనిపిస్తుంది. సాయం చేసేవారు ఎవరూ లేరనిపిస్తుంది. ఏకాకిగా మిగిలిపోయామనిపిస్తుంది. కానీ ఇవన్నీ వాస్తవాలు కావు. 
 • ఆస్తిపాస్తులన్నీ కోల్పోయినా సరే ధైర్యాన్ని కోల్పోకుంటే చాలు. సమస్యను పరిష్కరించుకోవచ్చు. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలేమిటో అన్వేషించాలి. మీలోని సమర్ధతను అలాంటి సమయంలోనే సంపూర్ణంగా వినియోగించాలి. 
 • ఉదాహరణకు మీరు పని చేస్తున్న కంపెనీ మూతపడింది. ఉన్నట్లుండి వీధినపడ్డారు. ఇలాంటప్పుడు చేయాల్సిన మొదటి పని రెండు మూడు నెలలు కుటుంబం గడవడానికి మార్గాలోమిటో ఆలోచించడం. ముందు దీనికి పరిష్కారం కనుగొంటే ఆ తరువాత కొత్త ఉద్యోగం, జీవితం గురించి ఆలోచించొచ్చు. 
 • అలాకాకుండా 'నా ఉద్యోగం పోయింది....ఇక బతకడం ఎలా' అని దిగులు పడి కూర్చుంటే ఫలితముండదు. మీరు పని చేస్తున్న రంగంలోనే మళ్లీ ఉద్యోగం దొరక్కపోవచ్చు. మీకున్న ఇతర సామర్థ్యాలేమిటో గుర్తించి ఆ వైపునా ఆలోచించగలిగితే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. 
 • ఒక్కోసారి సంక్షోభ నుంచి బయటపడ్డాక గతంకన్నా మెరుగైన జీవితం లభించొచ్చు.
 • సాఫీగా సాగిపోతున్న ఓడను ఎవరైనా నడిపిస్తారు. తీవ్రమైన ఆటుపోట్ల మధ్య కూడా ఓడను నడిపించేవాడే సమర్ధవంతుడైన నావికుడు. అప్పుడే అతనిలోని శక్తియుక్తులు బయటపడతాయి. ఓడ అనూహ్యంగా సముద్రంలో చిక్కుకుపోతే, ఒంటరిగా ఉన్నా నావికుడు అధైర్యపడడు. ఓడను వదిలి సముద్రంలో మునిగిపోడు. దాన్ని ఎలాగైనా ఒడ్డుకు చేర్చడానికి, తానూ సజీవంగా బయటపడడానికి ప్రయత్నిస్తాడు. సముద్రంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని అతను ఎప్పటికీ మరచిపోడు. 
 • అందుకే ఎలాంటి సంక్షోభ సమయంలోనైనా ఆత్మవిశ్వాసం కోల్పోడు. జీవితంలోనూ ఒడుదుడుకులు, సంక్షోభాలు ఉంటాయన్న విషయాన్ని ఎప్పుడూ గమనంలో ఉంచుకోవాలి. అలాంటి వ్యక్తులు కష్టాలను చూసి భయపడిపోరు. వాటిని ధైర్యంగా, సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. 
 • సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడేవారిని దృఢమైన వ్యక్తిత్వం కలిగినవారుగా మనోవికాస నిపుణులు చెబుతారు.
(From : Prajasakti Daily )
*Republished
Reactions:

Post a Comment

 1. ఆత్మ విశ్వాసం కోల్పోకుండా వుంటే సంక్షోభాలను అధిగమించవచ్చు.మంచి టపా

  ReplyDelete
 2. వినాయకచవితి శుభాకాంక్షలు, మీకు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top