----------------------------------------
అంశం : ఆర్ధికం, ఉచిత పథకాలు,పేదరికం
----------------------------------------
Name:Marxist-Leninist 
E-Mail:deleted  
Subject:ఉచిత పథకాల వల్ల పేదరికం పోతుందా? 
Message:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వితంతు ఫించన్‌లని 200 నుంచి 1,000 రూపాయలకి పెంచింది. భర్త ఉన్నా భర్త చనిపోయాడని చెప్పి వితంతు ఫించన్‌లు తీసుకునేవాళ్ళు ఉన్నారు. ఫించన్‌లని పెంచితే అలా తీసుకునేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ నిజమైన పేదవాళ్ళకి ఏమీ రాదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టి పేదవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే అది అభివృద్ధి అవుతుంది కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వడం అభివృద్ధి అవ్వదు. 

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com


Post a Comment


 1. మీతో విభేదిస్తున్నాను.రూ.1000 పెన్షన్(వృద్ధులకు,వితంతువులకు)ఇచ్చినంతలోనే పేదరికం పోకపోవచ్చును.కాని,వారికి కొంత ఉపశమనం,భద్రత లభిస్తుంది.నేను స్వయంగా ఇద్దరు తగిన వ్యక్తులకు పెన్షన్ ఇప్పించాను.అందువల్ల వారికి చాలా మేలు జరిగింది.అమెరికా లాంటి సంపన్నదేశాల్లోకూడా, social security,penshanlu ఆర్థికసహాయాలు అమలుచేస్తున్నారు.

  ReplyDelete
  Replies
  1. అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం. అక్కడ పేదవాళ్ళకి కూడా ఇంటిలో దిష్ ద్రయర్ లాంటి ఖరీదైన వస్తువులు ఉంటాయి. అక్కడివాళ్ళకి పెన్షన్ కోసం దొంగ సర్తిఫికేత్‌లు పుట్టించాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోనే వందకీ, నూట యాభైకీ అవినీతి జరుగుతుంది.

   Delete
 2. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం
  ముసలి వాళ్ళు పని చెయ్యగలరా?లేదు, మరి వాళ్లకు ఉద్యోగం ఇచ్చి ఎలా పనిచేయిస్తాం?
  వెంటనే ఇంకో ప్రశ్నమెదులుతుంది, వాళ్ళు పనిచేయ్యలేరు అంటే వాళ్లకు వంటలు చేసుకునే శక్తి కూడా ఉండదు కదా అని అడిగేస్తారు!
  మరి ఏమిటి సరైన విధానం?
  ఊరిలో కొంత మంది కమ్యూనిస్ట్ లను తీసుకు వచ్చి( మిగతా వాళ్ళను వద్దు, ఎందుకంటే కమ్యూనిస్ట్ లకు పేద ధనిక అని ఉండదు) వాళ్ళ చేత వంటలు వండించి ఆ ఊరిలో ముసలి ముతకకు ఆహారం అందించడం ఉత్తమం!

  పరిశ్రమలు పెడితే ఈ ముసలి ముతక బ్రతకడం కష్టం అవుతుంది కాబట్టి వాటిని పెట్టకూడదు!

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్ లాంటి మంచిబాలుళ్ళు ఆ పని చేస్తే బాగుంటుంది!

   Delete
 3. ఎలాగూ టాపిక్ డైవర్ట్ అయ్యిందికాబట్టి చెబుతున్నాను.

  ఇండియా ముందుగా తేల్చుకోవలసింది తాను క్యాపిటలిస్టురాజ్యంగా ఉండాలా, లేక సోషలిస్టురాజ్యంగా ఉండాలా అన్నవిషయం. పన్నులు కట్టేటప్పుడు సోషలిస్టుగానూ (30% పన్నులు వసూలుచేయడం క్యాపిటలిస్టు వ్యవస్థల్లో కూడని పని(న్ను)), సోషల్ సెక్యూరిటీ దగ్గరకు వచ్చేసరికి క్యాపిటలిస్టుగానూ (సోషలిస్టు రాజ్యాలైన యూరోపియన్ రాజ్యాల్లో విద్య, వైద్యం పూర్తిగా ఉచితం కాకుంటే పన్నులెక్కువ) ఉండడం ద్యంద్వ విలువలుకాక మరొకటికాదు.

  మనకు తగులుకొనే ప్రభుత్వాలన్నీ, సబ్సిడీలను ఉపసమ్హరించుకోవాలని చూస్తున్నాయేతప్ప, పన్నులను తగ్గించుకోవాలని పొరబాటునకూడా అనుకోవట్లేదు. పెట్రోలు ధరలపై నియంత్రణ వదిలేసి, గ్లోబల్ మార్కెట్లోని హెచ్చుతగ్గులకు వాటిని ముడివెయ్యాలనుకున్నప్పుడు, పెట్రోలుమీద అంతడేసి పన్నుఎందుకండీ? అటు టోలూ కట్టి, ఇటు రోడ్డు టాక్సూ కట్టడమేమిటండీ?

  ఇహ అసలు విషయానికొస్తే... ఉచిత పధకాలతో ప్రజలను ముస్టివాళ్ళస్థాయికి దిగజార్చి ఆలోచించడం సోషలిజంకూడా కాదు. చాలా యూరోపియన్ దేశాల్లో జరిగేదేంటంటే... వచ్చిన ఆదాయంలో గరిష్టంగా యాభైశాతం ప్రభుత్వానికి పన్నులద్వారా కట్టి, రేప్పొద్దున ఉద్యోగం ఊడినా, రిటైరైనా రోడ్లమీద పడి అడుక్కుతినాల్సిన అవసరంలేకుండా ప్రభుతమ్నుండి ఆసరాను ఆశించడం. ప్రభుత్వాలూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ద్రవ్యోలబణం రెండు లేదా మూడు శాతం మించకుండా చూసుకుంటాయి. ఇండియాలో ఏప్రభుత్వమైనా అలా చెయ్యగలదాండీ?

  ReplyDelete
  Replies
  1. కుబుసం సినిమాలో రేపాక ప్రదీప్ రెడ్డి శ్రీహరితో అంటాడు "ప్రభుత్వం పేదల కోసం రూపాయి బియ్యం పథకం ప్రవేశ పెట్టింది" అని. "మీరిచ్చే రూపాయి బియ్యం తినడానికి ప్రజలేమైనా భిక్షగాళ్ళా?" అని శ్రీహరి అడుగుతాడు. ఇప్పుడు మాత్రం చదువుకున్నవాళ్ళు కూడా భిక్షగాళ్ళలాగ బిహేవ్ చేస్తున్నారు. కె.సి.ఆర్. పెట్టిన బతుకమ్మ చీరల పథకంలో పంచే చీరల రేట్ మహా అయితే వంద రూపాయలు ఉంటుంది. ఆ స్కీం కోసం కె.సి.ఆర్.ని పొగిడినవాళ్ళని ఫేస్‌బుక్‌లో చూసాను. అలా పొగిడినవాళ్ళ భార్యలు నిజంగా ఆ చవక రకం చీరలు కట్టుకుంటారో లేదా వాళ్ళ పని మనుషులకి ఇచ్చుకుంటారో తెలియదు.

   Delete
  2. పనిమనుషులకి దానం చేసే చీరల కోసం మధ్య తరగతి జనం కె.సి.ఆర్.ని నమ్ముకునే స్థితిలో ఉన్నారంటే దాని అర్థం జనం ఫ్రీ స్కీమ్స్‌కి అలవాటు పడిపోయారనే కదా.

   Delete
 4. వర్షాధార భూమిలో, అది కూడా direct seeding ద్వారా వరి పండే ప్రాంతాల్లో, కూలీలకి పని నెల రోజులే ఉంటుంది. నిరుద్యోగులకి ఫించన్ ఇస్తే ఒక వైపు కూలీ పనులకి వెళ్తూనే మరో వైపు నిరుద్యోగ ఫించన్ తీసుకునేవాళ్ళు ఉంటారు. నేను ఇంటర్నెట్ సెంటర్ నడిపే రోజుల్లో వితంతు ఫించన్ రెండు వందల రూపాయలే ఉండేది కానీ అప్పట్లో కూడా భర్త ఉన్న స్త్రీలే వితంతు ఫించం తీసుకునేవాళ్ళు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top