సుప్తమంటే పడుకోవడం. వజ్రాసనంలో ఉండి వెనుకకు పడుకోవడమే సుప్త వజ్రాసనం.
ఎలా చెయ్యాలి :
వజ్రాసనం వేసిన తర్వాత మోకాళ్లపైన నిలుచోవాలి. ఆ తర్వాత నిధానంగా వెనక్కి వంగుతూ మడమల మీద కూర్చోవాలి. తర్వాత ముంజేతులను నేల మీద మోపాలి. తర్వాత నిధానంగా వీపును నేలకు పూర్తిగా ఆనించాలి. ఆసనంలో ఉండగలిగినంత సేపు ఉండి, నిధానంగా వజ్రాసనంలోకి వచ్చి తర్వాత శశాంకాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు :
తొడలు, పిరుదులు బాగా లావుగా ఉన్న వారికి ఇది చక్కని పరిష్కారం. రోజుకు రెండు సార్లు ఈ ఆసనం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అక్కడున్న కొవ్వును కరిగించేస్తుంది. నాజూగ్గా తయారవుతారు. సయాటికా నొప్పి, మలబద్దకం, రుతుస్రావ సమస్యలు, ఒబేసిటీ, అధిక బిపిలను ఈ ఆసనం ద్వారా తగ్గించవచ్చు. మూత్రపిండ వ్యాధులకు కూడా ఇది మంచి ఆసనం. కాళ్ల కండరాలు, కీళ్లను దృఢపరుస్తుంది.
జాగ్రత్తలు :
నడుం నొప్పి అధికంగా ఉండే వారు మొదట్లో కొన్ని రోజులు ఈ ఆసనం వెయ్యకూడదు. ఈ ఆసనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, నెమ్మెదిగా వెయ్యాలి. వజ్రాసనం బాగా వచ్చేవారు, కనీసం ఐదు నిమిషాలు వజ్రాసనంలో నొప్పి లేకుండా ఉండగలిగే వారు మాత్రమే సుప్తవజ్రాసనాన్ని వేయడానికి ప్రయత్నించాలి.

డాక్టర్‌ రాచుమల్ల రంగనాథ్‌రెడ్డి ,  మిత్ర యోగ సెంటర్‌,  కడప. సెల్‌ : 9440074773
From : prajasakti daily 
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top