----------------------------------------------
అంశం : దేవుడు
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------------------
ఆంధ్రజ్యోతి లో వచ్చిన క్రింది వార్తను చూడండి. దేవుడున్నాడనే భావన వలన ప్రజలకు కలిగే ఉపయోగంపై ఓ సర్వే రిపోర్ట్ ఇది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయాలని వినతి.

(from ఆంధ్రజ్యోతి digital edition)
----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

 1. అన్ని రోగాలకీ ఒకటే మందు పని చెయ్యదు. దేవుణ్ణి నమ్మకపోయినా పని జరుగుతుందనిపిస్తే దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం ఏముంటుంది?

  ReplyDelete
 2. ధైర్యమా! దాన్ని బలుపనాలి. అందుగ్గాదూ వీళ్ళు హత్యలూ, మానభంగాలూ, ఆత్మాహుతి దాడులూ చేస్తుండేది!

  సర్వేలు ఎంత వరకూ నమ్మదగినవి అన్నదొకవిషయమైతే, దేవుడి పేరున్నందుకు వీక్షించినందుకే దాన్ని ఇలా చెప్పడం కొంచెం అతికాదూ! మరి అందులో sex గురించిన ప్రస్తావన ఉంటే మరింతమంది చూసుండేవారేమో! అందుగ్గాదూ మన తెలుగు పేపర్లు "ఆమెకు అదంటే ఇష్టం" అంటూ నానా చెత్త హెడ్లైన్లు పెట్టి చంపేది.

  అయినా తెలుగులో పేపర్లేమున్నాయండీ? అన్నీ కరపత్రాలేకదా! వాటినికూడా పట్టించుకోవాలా?

  ReplyDelete
 3. దేవుడున్నాడనే భావన చాలా ధైర్యాన్ని ఇస్తుంది.

  ReplyDelete
 4. ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళలో పూజారులు లేరా ముఅజ్జీన్‌లు లేరా? మతం ఇచ్చే ధైర్యం పూజారి పైనో, ముఅజ్జీన్ పైనో పని చెయ్యదు కానీ విశ్వాసిపై మాత్రం పని చేస్తుందా?

  ReplyDelete
  Replies
  1. పనిచేస్తుంది. కనుకనే దానిని ‘భ్రమాత్మక ఆనందం’ అన్నారు. మతం వల్ల, మత నమ్మకాల వల్ల మనుషులకు మానసిక ప్రయోజనాలున్నాయి కనుకనే అవి వర్ధిల్లుతున్నాయి. సరైన,సక్రమమైన,నమ్మకమైన,అర్ధవంతమైన ప్రత్యామ్నయం లేనంత వరకూ మతం వల్ల మనిషికి ప్రయోజనం ఉంటుంది.

   Delete
 5. ప్రయోజనం వేరు, ఆశ వేరు. యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ ఉన్నా సైకియాట్రిస్టుల్లో కూడా ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఉన్నారు. ఆశ పుట్టించి మోసం చేసేది ఎల్లప్పుడూ ఇలాగే వర్ధిల్లుతుందని నిర్ణయించడం కర్మవాదం అవుతుంది.

  ReplyDelete
  Replies
  1. ఆశ పుట్టించి ప్రయోజనం పొందడానికి, మంచి జరుగుతుందేమోనని ఆశించడానికీ తేడా ఉంది.

   Delete
  2. దేవుణ్ణి ఎంత నమ్ముకుని పని చేసినా వర్షా కాలంలో మాగాణిలో పొద్దుతిరుగుడు వేస్తే అక్కడ నీరు ఊటెక్కి పొద్దుతిరుగుడు మొక్కలు చస్తాయి.

   Delete
  3. దేవుడ్ని నమ్ముకుని పని చేయకుండా ఉండడు. శ్రమంతా అతనే చేస్తాడు తన శ్రమకు దెయ్యాలు నష్టం చేయకుండా దేవుడు కాపాడాలని కోరుతూ మొక్కుకుని సంత్రుప్తి పడతాడు. అలా సంత్రుప్తి పడనవసరం లేని వాడు కూడా ఇతను చేసిన శ్రమనే చేస్తాడు. ఫలితం ఇద్దరికి శ్రమ ఆధారంగానే వస్తుంది. మానసిక సంత్రుప్తి, చైతన్యం నిర్ణయించడంలో నమ్మకాల పాత్ర వహిస్తాయి.

   Delete
  4. శ్రమ వల్లే లాభం జరిగితే ఇక దేవుడు ఎందుకు? నష్టం జరిగితే దేవుడు కరుణించలేదని బాధపడడానికా? సి.పి.ఐ. నాయకుల్లోనే ఒకడు సాయుధ పోరాటం ముగించిన తరువాత రోజుల్లో భక్తి చింతన వైపు వెళ్ళిపోయాడు. వీళ్ళే ఈ స్థాయిలో ఉంటే వీళ్ళని నమ్ముకునేవాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో?

   Delete
 6. దేవుడి పేరు చెప్పుకోని కొన్ని వర్గాలు ఇంట్లో బబ్బోని.. మిగితా వర్గాలకు యుధ్ధానికి పంపించే ధైర్యాన్నిస్తాయి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top