నేను చదువుకున్నది ప్రైవేత్ స్కూల్‌లలో. మా చిన్నప్పుడు ప్రైవేత్ స్కూల్‌ల సంఖ్య తక్కువగా ఉండేది. స్కూల్‌ల మధ్య పెద్ద పోటీ ఉండేది కాదు. స్కూల్ యజమానులు డబ్బులు మిగిల్చుకోవడానికి పదో తరగతివాళ్ళని లేదా +2వాళ్ళని అతితక్కువ జీతానికి ఉపాధ్యాయులుగా పెట్టే పోకడ అప్పట్లో లేదు. అప్పట్లో కూడా కార్పొరల్ పనిష్మెంత్‌ల వల్ల పిల్లలకి స్కూల్‌కి వెళ్ళడానికి భయం కలిగేది. స్కూల్ యాజమాన్యాలు చేసే ఇలాంటి అక్రమాలు మరికొన్ని ఉండేవి కానీ పదో తరగతివాళ్ళనీ, +2వాళ్ళనీ ఉపాధ్యాయులుగా పెట్టే పోకడ ఈ మధ్యనే పెరిగింది.

గ్లోబలైజేషన్ వచ్చిన తరువాత మధ్యతరగతివాళ్ళకి IT ఉద్యోగాల మీద ఆశలు పెరిగాయి. వీళ్ళ ఆశల్ని సొమ్ము చేసుకోవడానికి వీధికొకటి చొప్పున కొత్త పాఠశాలలు పుట్టుకొచ్చాయి. పాఠశాలల సంఖ్య పుట్టగొడుగుల్లా పెరిగింది కానీ ప్రమాణాలు మాత్రం పాతాళానికి దిగాయి. ప్రమాణాలు పాటించని స్కూల్‌లు చాలా వరకు SSC & CBSEల అనుబంధ పాఠశాలలే. హైదరాబాద్‌లోని CBSE అనుబంధ పాఠశాలలలో ఉపాధ్యాయులుగా పని చేసేవాళ్ళకి జీతం మొదట్లో నెలకి ఐదు వేలు ఇస్తారు, పన్నెండేళ్ళు అనుభవం ఉన్నవాళ్ళకి ఇరవై వేలు జీతం ఇస్తారు. SSC అనుబంధ పాఠశాలల్లో అయితే మరీ దారుణంగా వెయ్యి రూపాయల జీతానికి కూడా ఉపాధ్యాయులని పెడతారు. వెయ్యి రూపాయల జీతానికైతే పదో తరగతివాళ్ళు మాత్రమే పని చెయ్యడానికి వస్తారు. పంతులు చెప్పిన పాఠం అర్థమవ్వకపోయినా బట్టీ పట్టి పాసవ్వడమే అక్కడి పిల్లలకి ఉన్న మార్గం.

ICSE విషయానికి వద్దాం. ICSEకి అనుబంధంగా స్కూల్ నడపడానికి అనుమతి అంత సులభంగా రాదు. అనుమతి వచ్చిన తరువాత కూడా ICSE వారి నిర్దేశాల ప్రకారమే స్కూల్‌ని నిర్వహించాలి. స్కూల్‌కి ICSE గుర్తింపు కావాలంటే దానికి సొంత భవనం ఉండాలి, అద్దె భవనంలో స్కూల్ నడపడానికి అవ్వదు. ఆ స్కూల్‌కి లైబ్రరీ, లాబొరేతరీ, ప్లేగ్రౌంద్ లాంటివి ఉండాలి. పరీక్షలతో సంబంధం లేకుండా పిల్లలకి చిత్రలేఖనం, సంగీతం లాంటివి కూడా నేర్పించాలి. ఆ స్కూల్‌కి governing body ఉండాలి. ఆ స్కూల్‌లోని ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలతో సమానమైన జీతాలు ఇవ్వాలి. ఈ నియమాలన్నీ పాటించడానికి ఎంత మంది స్కూల్ యజమానులు ఒప్పుకుంటారు? తమ ఉపాధ్యాయులకి ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలతో సమానమైన జీతాలు ఇవ్వడానికి ఎంత మంది స్కూల్‌ల యజమానులు ముందుకి వస్తారు? ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతం మొదట్లో నెలకి పద్దెనిమిది వేలు, తరువాత ముప్పైఐదు వేలకి పెరుగుతుంది. ప్రైవేత్ పాఠశాలల యజమానులు డబ్బులు మిగుల్చుకోవాలనే చూస్తారు కానీ ఉపాధ్యాయులకి జీతాలు పెంచడానికి ఎలా ఒప్పుకుంటారు? అందుకే ICSE పాఠశాలలు ఎక్కడో ఒకటో, రెండో మాత్రమే కనిపిస్తాయి. 

ప్రభుత్వ పాఠశాలలు లాభాపేక్షతో నడవవు కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతం ఎక్కువే ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలలో మంచినీళ్ళు, మరుగు దొడ్లు లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆర్థికంగా ముందున్నవాళ్ళు తమ పిల్లల్ని అక్కడికి పంపరు. పిల్లలకి చదువూ, సౌకర్యాలూ రెండూ ముఖ్యమనుకుంటే వాళ్ళని ICSE పాఠశాలలకి పంపడం మేలు. ICSE వాళ్ళు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పాఠశాల నడపడానికి చాలా ఖర్చవుతుంది కనుక ICSE స్కూల్‌లలో ఫీజ్ ఎక్కువే ఉంటుంది. SSC, CBSE స్కూల్‌ల కంటే ICSE స్కూల్‌లే నయం కనుక SSCకో, CBSEకో డబ్బులు తగలెయ్యడం కంటే ICSEని నమ్ముకోవడం మేలు.
- Praveen Kumar
--------------------------------------------------
*Republished

మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : kondalarao.palla@gmail.com

జనవిజయం రచనల కోసం ఇక్కడ నొక్కండి.

Post a Comment

  1. జనం ఆర్థికంగా బాగుపడి తమ డబ్బులతో స్కూల్ ఫీజ్‌లు కట్టి పిల్లల్ని చదివిస్తే మంచిదా? కేవలం ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో తమ డబ్బులని స్కూల్ ఫీజ్‌లకి తగలెయ్యడం మంచిదా? ఇష్టప్రకారం చేసే పనికీ, గుడ్డి నమ్మకంతో చేసే పనికీ మధ్య తేడా ఎప్పుడూ ఉంటుంది.

    ReplyDelete
  2. కార్పోరేట్ బలవంతపు చదువులతో విద్యార్ధుల్లో సృజనాత్మకశక్తి నశించిపోతుంది. సమస్యలను ఎదుర్కునే శక్తిని కోల్పోతున్నారు. విద్య కార్పోరేటీకరణను ఆపాలి. సామాజిక శాస్త్రాల అధ్యయనం పెంచేవిధంగానూ, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రజలు అందుకోసం పోరాడాలి.

    ReplyDelete
  3. http://m.newshunt.com/india/telugu-newspapers/eenadu/vizayanagaram/maarpudaarilo-maastaarlue_31854504/999/c-in-l-telugu-n-eena-ncat-vizayanagaram

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top