నువ్వు ఒక కర్మాగారం పెట్టాలనుకున్నావు. దానికి అవసరమైన భూమి నీ దగ్గర ఉంది. నీ సొంత వ్యవసాయ భూమిలోనే నువ్వు కర్మాగారం నిర్మిస్తే ఆ భూమి యొక్క ధర అంతర్గత ఖర్చు లెక్కలోకి వెళ్ళిపోతుంది. కర్మాగార నిర్మాణానికి & యంత్రాలు కొనడానికి అయిన ఖర్చు మాత్రం బహిర్గత ఖర్చు అవుతుంది. నువ్వు వ్యవసాయం కోసం ఉపయోగించాల్సిన భూమిలో కర్మాగారం పెడితే ఆ భూమిలో నువ్వు వ్యవసాయం చేసుకునే అవకాశాన్ని వదులుకున్నట్టే కనుక అది ఒక రకమైన opportunity cost. నువ్వు ఏ రాజకీయాలలోకో వెళ్ళే అవకాశాన్ని వదులుకుని నీ కర్మాగారానికి నువ్వే మేనేజర్‌గా పని చేస్తే అది ఇంకో రకమైన opportunity cost. నీ కర్మాగారానికి ఒక మేనేజర్‌ని పెట్టకపోవడం వల్ల మిగిలిన ఖర్చు కూడా అంతర్గత ఖర్చు లెక్కలోకి వెళ్ళిపోతుంది. అయితే అవకాశ ఖర్చులన్నీ అంతర్గత ఖర్చులుగా ఉండాలని నియమం లేదు. వైద్య శాస్త్రం చదవడానికి లక్షలు ఖర్చవుతాయి. వైద్యులు తమ చదువుకి అయిన ఖర్చుని కూడా తాము రోగుల దగ్గర తీసుకునే ఫీజుతో రాబట్టుకుంటారు. న్యాయశాస్త్రం చదవడానికి పెద్ద ఖర్చవ్వదు. న్యాయవాదులు demandని బట్టి తమ clientsకి డబ్బులు ఎక్కువ అడుగుతారు కానీ చదువుకి అయిన ఖర్చుని రాబట్టుకోవడానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. న్యాయవాదుల అవకాశ ఖర్చు కేవలం ఒక అంతర్గత ఖర్చు కానీ వైద్యుల అవకాశ ఖర్చు మాత్రం రోగులు చెల్లించాల్సిన ఫీజుపై స్పష్టమైన ప్రభావాన్నే చూపిస్తుంది.

Opportunity cost ప్రధానంగా preference కి సంబంధించినది. ఒక న్యాయవాది సినిమాలలో నటించడానికి ఒప్పుకోకపోవచ్చు. తాను కేస్‌లు వాదిస్తే తనకి ఏడాదికి ఇంత డబ్బులు వస్తాయనే లెక్క ఉంటే అతను న్యాయవాద వృత్తిలోనే కొనసాగాలనుకుంటాడు. తనకి న్యాయవాద వృత్తి కంటే సినిమాలలో నటించడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయనిపిస్తే అతను న్యాయవాద వృత్తి వదిలేసి సినిమాలలో నటిస్తాడు. సినిమాలలో నటించడానికి అతను న్యాయవాద వృత్తిని వదులుకుంటే అతను ఒక పెద్ద అవకాశం కోసం ఒక చిన్న అవకాశాన్ని వదులుకున్నాడనుకోవాలి. ఆ న్యాయవాది సినిమా నటుడు కావడానికి న్యాయవాద వృత్తిని వదులుకుంటాడు కానీ పోలీస్ ఉద్యోగి కావడానికి ఆ వృత్తిని వదులుకోడు. ఒక న్యాయవాదికి వచ్చే ఆదాయం కంటే ఒక పోలీస్‌కి వచ్చే ఆదాయం తక్కువ కనుక అతను పోలీస్ ఉద్యోగానికి preference ఇవ్వడు.

అమెరికాలో 8th grade చదివినవాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి కానీ మన దేశంలో MBA చదివినవాళ్ళకి కూడా ఉద్యోగాలు దొరకడం కష్టమే. It's because, in the USA capital is abundant but labour is scare and in India labour is abundant but capital is scarce. మన దేశంలో సమానంగా చదువుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు District Collector అవుతాడు, ఇంకొకడు bill collector అవుతాడు. కేవలం bill collector అవ్వడానికి ఇంగ్లిష్ చదవడం, వ్రాయడం వస్తే సరిపోతుంది. దాని కోసం MBA చదవాల్సిన అవసరం లేదు కానీ మన దేశంలో MBA చదివినవాడు కూడా bill collector అవుతాడు. చదువు వల్ల కొంత వరకు అవకాశాలు పెరుగుతాయి కానీ అది అన్ని రోగాలకి మందు కాదు. ఈ విషయం చాలా మందికి తెలిస్తే చదువు పేరుతో పిల్లలకి corporal punishments ఇస్తున్న స్కూళ్లకి వ్యాపారాలు నడవవు.

నేను కరీంనగర్‌లో ఉన్నప్పుడు English Union School అనే పాఠశాలలో చదివేవాణ్ణి. ఆ స్కూల్ నిర్వాహకులు తక్కువ జీతాలు ఇచ్చి కేరళ ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పించేవాళ్ళు. ఆ ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పకుండా పిల్లల్ని కొట్టి చదివించేవాళ్ళు. కొట్టి చదివించడం వల్ల మార్కులైతే పెరుగుతాయి కానీ జ్ఞానం పెరగదు. ఉపాధ్యాయులకి ఎక్కువ జీతాలు ఇస్తే విద్యార్థుల దగ్గర తీసుకునే ఫీజు పెంచాలి. ఫీజు  పెంచితే కిరాణా వ్యాపారం లాంటివి చేసేవాళ్ళు తమ పిల్లలని ఆ స్కూల్‌కి పంపించరు. కిరాణా వ్యాపారాలు చేసేవాళ్ళకి కేవలం లెక్కలు వ్రాయడం వస్తే సరిపోతుంది, వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. చదువు కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళకి opportunity cost పెరుగుతుంది. ఆ ఖర్చు బదులు వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టుకుంటేనే వాళ్ళకి లాభం. ఈ విషయం తెలిసిన కొంత మంది ఉపాధ్యాయులు పిల్లల్ని కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం దొరికితే ఉపాధ్యాయ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయేవాళ్ళు. తమ భర్తలు ఉద్యోగాలు చేస్తోంటే ఇంటిలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఉద్యోగాలలో చేరిన మహిళా ఉపాధ్యాయులు అయితే తమ భర్తలకి వేరే ఊరికి బదిలీలు అయ్యేంత వరకు పని చేసేవాళ్ళు. వాళ్ళు ఈ స్కూల్‌లో పని చేసినట్టు యాజమాన్యం దగ్గర experience certificate తీసుకుని తమ భర్తలకి బదిలీ అయిన చోట ఉన్న స్కూల్‌లలో పనికి చేరేవాళ్ళు. ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ కాలం కొనసాగేది వీళ్ళే. వచ్చే కొద్ది పాటి జీతం కోసం పిల్లలని కొట్టడం ఇష్టం లేనివాళ్ళు మాత్రం ఆ వృత్తిలో ఎక్కువ కాలం ఉండరు. కిరాణా వ్యాపారం లాంటివి చేసేవాళ్ళకి చదువు అనేది కేవలం ఒక opportunity cost. ఉపాధ్యాయులు కొట్టే దెబ్బలకి భయపడి వాళ్ళ పిల్లలు చదువు మానేసినా ఆ పిల్లలు పెద్దైన తరువాత వ్యాపారం చేసుకుని బతకగలరు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళ పిల్లలు మాత్రం మార్కులు రాకపోతే తమని స్కూల్ నుంచి dismiss చేస్తారనో, పెద్దవాళ్ళు కొడతారనో భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు.

నాకు ఆర్థిక శాస్త్రం అంటే ఇష్టం కాబట్టి లైబ్రరీకి వెళ్ళి ఆర్థిక శాస్త్ర పుస్తకాలు చదువుతుంటాను. కానీ ఇంకొకడు అలా అనుకోకపోవచ్చు. పౌల్ శామ్యూల్సన్ వ్రాసిన ఆర్థిక శాస్త్ర పుస్తకం చదివితే ఐనాక్‌లో సినిమా చూడడానికి సమయం సరిపోదని అతను అనుకోవచ్చు. ఆర్థిక శాస్త్ర పుస్తకం లేదా ఐనాక్స్‌లో సినిమా, రెండిటిలో ఏదో ఒకటి వదులుకోవడం కూడా opportunity cost అవుతుంది. ఎందుకంటే రెండిటికీ ఒకేసారి అవకాశం ఇవ్వలేనప్పుడు ఏదో ఒకటి వదులుకోవాల్సిందే. "చదువుకోవాలా లేదా వ్యాపారం చెయ్యాలా" లాంటిసంశయాలు పిల్లలకి కలగకుండా జాగ్రత్తపడే తల్లితండ్రులు & స్కూల్‌ల యజమానులు ఉన్నారు. కొన్ని స్కూల్‌ల యజమానులు ఇరాణా వ్యాపారాలు చేసేవాళ్ళ పిల్లల్ని తమ స్కూల్‌లలో చేర్చుకోరు. తాము ఈఇంగ్లిష్ వచ్చినవాళ్ళ పిల్లల్నే తమ స్కూల్‌లలో చేర్చుకుంటామంటారు. కిరాణా వ్యాపారులలో చాలా మందికి ఇంగ్లిష్ రాదు కాబట్టి ఇంగ్లిష్ వచ్చిన తెల్ల చొక్కా ఉద్యోగస్తుల పిల్లలే ఆ స్కూల్‌లలో ఎక్కువగా చేరుతారు. ఆ పిల్లల చుట్టూ తెల్ల చొక్కా ఉద్యోగస్తుల పిల్లలే ఎక్కువగా ఉంటే బతకడానికి తెల్ల చొక్కా ఉద్యోగం చెయ్యడం ఒక్కటే మార్గం అనే అభిప్రాయాన్ని పిల్లల్లో కలిగించడం సాధ్యమవుతుందని ఆ స్కూల్‌ల యజమానుల భావన. స్కూల్ ఫీస్‌ని ఎక్కువ మొత్తంగా నిర్ణయించి తమ స్కూల్‌లో కిరాణా వ్యాపారుల పిల్లలు చేరే అవకాశం లేకుండా చెయ్యడం ఇంకో ఎత్తు. ఇలాంటి ఎత్తులు పాటించే స్కూల్‌లు హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాలలో ఉంటాయి. కొంత మంది తల్లితండ్రులు చదువు పేరుతో పైపైకి కనపడే లాభాలని దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలని కావాలని డబ్బున్నవాళ్ళ పిల్లలు చదివే స్కూల్‌లకే పంపిస్తారు. పెట్టిబడిదారీ సమాజంలో అన్ని సరుకులలాగ చదువు కూడా ఒక market ప్రయోజనానికి ఉపయోగపడే సరుకు. 

చదువు అనేది opportunity costsలో ఒకటి అనే నిజాన్ని బయటకి చెప్పినందుకు కొంత మంది తల్లితండ్రులు నన్ను తిట్టినా ఆశ్చర్యం లేదు, వాళ్ళు తమ పిల్లలు ఈ వ్యాసం చదవకుండా జాగ్రత్తపడినా నాకు ఆశ్చర్యం కలగదు. మా చిన్నప్పుడు ఇంటిలో cable TV ఉంటే పిల్లలు చదవరని కొంత మంది తల్లి తండ్రులు cable పెట్టించేవాళ్ళు కాదు, దూరదర్శన్ ఉన్నా అందులో వార్తలు లాంటివి చూడనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి ఇళ్ళలో Internet పెట్టుకుంటున్నారు కానీ ఒకప్పుడు cable TV కావాలంటేనే పెద్దవాళ్ళు తమ పిల్లల్ని గసిరేవాళ్ళనేది నిజం.
--------------------------------------------------
*Republished

మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : kondalarao.palla@gmail.com

జనవిజయం రచనల కోసం ఇక్కడ నొక్కండి.

Post a Comment

  1. వాళ్ళు లేని ఉద్యోగాల కోసం ఆశపడేవాళ్ళు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top