ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి తిరుమల కొండపై హెలీ ప్యాడ్ నిర్మించాలనుకుంది. దానికి అక్కడి హిందు సన్యాసులు అభ్యంతరం చెప్పారు. "తిరుమల కొండ మీద దేవతలు పుష్పక విమానాల్లో తిరుగుతుంటారట! అక్కడ హెలీకాప్టర్లు తిరిగితే అవి పుష్పక విమానాలకి అడ్డు తగులుతాయట!" అది తిరుపతి సన్యాసుల అభిప్రాయం. 

తిరుమల ఘాట్ రోడ్ పై రద్దీ తగ్గించడానికి ప్రభుత్వం రోప్ వే (కేబుల్ కార్ వే) నిర్మించాలనుకుంది. దానికి కూడా తిరుపతి సన్యాసులు అభ్యంతరం చెప్పారు. తిరుమల కొండపై ఋషులు తపస్సు చేస్తారట! తపోస్థలం మీదుగా కేబుల్ కార్‌లో ప్రయాణిస్తే ఋషులని తన్నినట్టు అవుతుందట! 

రాష్ట్ర ప్రభుత్వం తిరుమల దేవస్థానంలో గుండ్లు గియ్యించుకోవడానికి వచ్చే స్త్రీల కోసం మహిళా క్షురకులని నియమించాలనుకుంది. ఆడవాళ్ళ చేత క్షవర వృత్తి చెయ్యిస్తే ఆడవాళ్ళకే అవమానం అంటూ తిరుపతి సన్యాసులు గొడవ చేసారు. మగ క్షురకుడు ఆడదానికి గుండు గీసే నెపంతో ఆమె భుజాల మీదో, వీపు మీదో చేతులు వేస్తే ఈ సన్యాసులకి అభ్యంతరం లేదు కానీ ఆడది మంగలి కత్తి పడితే ఆడదానికే అవమానం అని మాత్రం వీళ్ళు బాధపడిపోయారు. పాకీవృత్తిలో మాత్రం ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళు పాకీవృత్తి చెయ్యడంపై ఎవరికీ అభ్యంతరం లేదు కానీ వాళ్ళు మంగలి వృత్తి చెయ్యడం పైనే ఎందుకు అభ్యంతరం వచ్చింది? 

ఈ సాధుసంతులు తాము బాగుపడరు, జనాన్ని బాగుపడనివ్వరు. దేవాలయాల కోసం ప్రభుత్వం నిధులు ఖర్చుబెట్టడం అనవసరం అనే నేను భావిస్తాను. 
- Praveen

----------------------
ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధ్యానం నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సేకరణలు స్పూర్తి
 
Top