ఈ విగ్రహాలు శ్రీకృష్ణ దేవరాయులు & అతని భార్యలవి. శ్రీకృష్ణదేవరాయులు ఎన్నడూ శరీర ఉత్తర భాగాన్ని కప్పుకోలేదు కానీ సినిమాల్లో మాత్రం అతను ఉత్తర భాగంలో ఖరీదైన వస్త్రం వేసుకుంటున్నట్టే చూపిస్తారు. తెలుగు పౌరాణిక సినిమాలన్నిటిలోనూ స్త్రీలు రవికెలు & లంగాల మీద చీరలు కట్టుకుంటున్నట్టు చూపిస్తారు. ఒకప్పుడు ఇండియాలో రవికెలు, లంగాలు లేవు. అప్పట్లో భారతీయులకి కుట్టు పని తెలియదు. ఇండియాకి కుట్టు పని తీసుకొచ్చినది ముస్లింలు. ఒరిస్సాలో ఇప్పుడు కూడా గ్రామీణ స్త్రీలు లంగా వేసుకోకుండా చీర కట్టుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో కొంత మంది గ్రామీణ స్త్రీలు రవికెలు కూడా వేసుకోరు. కాకతీయుల కాలంలో అయితే రవికెలు ఉండే అవకాశం లేదు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో భారతీయ స్త్రీలు రవికెలు వేసుకునేవాళ్ళు. కానీ భర్త చనిపోయిన స్త్రీలనీ, శూద్ర స్త్రీలనీ రవికెలు వేసుకోనిచ్చేవాళ్ళు కాదు. మహాభారత కాలంలో రవికెలు ఉండే అవకాశం లేదు కానీ తెలుగు పౌరాణిక సినిమాల్లో ద్రౌపది రవికె, లంగా వేసుకుంటున్నట్టే చూపిస్తారు. సినిమావాళ్ళకి చరిత్ర గురించి అవగాహన అవసరం లేదా అనే సందేహం ఇక్కడ వస్తుంది

సినిమావాళ్ళకి చారిత్రక అవగాహన అవసరం లేదా?
- ప్రవీణ్ కుమార్
5-3-2019.


*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. సినిమాల్లో కొన్ని సార్లు కావాలని అబద్దాలు చూపిస్తారు. కబీర్ దాస్, రామదాసు పుట్టడానికి 102 సంవత్సరాల ముందే చనిపోయాడు కానీ చిత్తూరు నాగయ్య తన సినిమాలో కబీర్ దాస్ రామదాసుతో మాట్లాడుతున్నట్టు చూపించాడు.

  ReplyDelete
 2. వేమన బట్టల్లేకుండా తిరిగాడని.. సినిమాలో వెమనని కూడా బట్టల్లేకుండా తిప్పితే.. సెన్సార్ దాటోస్తుందా?? :-) :-) :-)

  ReplyDelete
  Replies
  1. In PK, Aamir Khan was shown naked. శ్రీకృష్ణ దేవరాయుల భార్యలు కంచుకం (వక్షోజాలపై సన్నటి బట్ట) వేసుకునేవాళ్ళు. వాళ్ళు పూర్తి నగ్నంగా అయితే లేరు.

   Delete
  2. సినిమాని సినిమాగా చూసే చైతన్యం ఏర్పడాలి. అల్లూరి సీతరామరాజు నిక్కర్ వేసుకునేవాడు. కానీ హేరో కృష్ణ అతని రూపాన్ని మార్చేశాడు. ఆ పాత్రపై అమితమైన ప్రేమ ఉన్న NTR కూడా సర్దార్ పాపారాయుడులో కృష్ణనే ఫాలో అయాడు. చారిత్రక పాత్రలను లేదా చరిత్రను సినిమాగా చూపేటపుడు పాటించాల్సిన నిబంధనలు ఉండాలి. అలాగే చూసే ప్రేక్షకులకూ మినహాయింపుల విషయమై చైతన్యం ఉండాలి. చిరంజీవి గారు చెప్పిన విధంగా చరిత్రను యథతధంగా తెర కెక్కించడం కొన్ని చోట్ల అసాధ్యం. సినిమాదాకా ఎండుకు పుస్తకాలలో కూడా అసలుకు రచయిత కల్పనలూ పాఠకుని ఊహలు కలసి ప్రచారంలో ఉండే అవకాశం ఉందని గమనంలో ఉంచుకోవాలి. సెన్సార్ నిబంధనలలో, కమిటీ ఆ నిబంధనలను అమలు చేసే విధానంలో మార్పు కోసం ఇలాంటి చర్చలు ఉపయోగపడతాయి.

   Delete
  3. ఎంతగా చరిత్రని వక్రీకరించకూడదనుకున్నా బాలయ్య బాబు ని శ్రీరామరాజ్యంలో నీలమేఘశ్యాముడిగా చూసి తట్టుకోలేకపోయాం. ఏదైనా కధ చెప్పేటపుడు కట్టె కొట్టె తెచ్చె అన్నట్లు చెపితే ఎవరు చదువుతారు ? సాధారణ విషయాలనే అసాధారణంగా చెపుతూ బోల్డన్ని కబుర్లు చెపితేనే చదువుతారు. సినిమా అనేది వ్యాపారం మరియు వినోదం కాబట్టి ఆసక్తికరంగా లేకపోతే ఎవరూ చూడరు. చరిత్రని వక్రీకరించడం అంటే మూలకధని చెడగొట్టడమే కానీ వస్త్రాలంకరణ కాదు. ఇప్పటికే 50 సం వయసున్న యాంకరమ్మల లంగా ఓణీలు చూడలేక చస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చేలా లేరు.

   Delete
  4. నిజజీవితంలో అల్లూరికి లవర్ లేదు కానీ సినిమాలో మాత్రం లవర్ ఉన్నట్టు చూపించారు. చదువురానివాడైతే అది నిజమని నమ్మేస్తాడు.

   Delete
  5. ప్రవీణ్ గారు, శ్రీరామరాజు సీతరామరాజుగా ఎలా మారాడు?

   Delete
 3. His real name was Sriramaraju but the Englishmen confused him for Seetaramaraju because of Bhadrachala Rama temple. He had no lover called Seeta.

  ReplyDelete
 4. కబీర్ దాస్ విషయానికి వద్దాం. అతను రామదాసు పుట్టడానికి రెండుమూడు సంవత్సరాల ముందు కాదు, 102 ఏళ్ళు ముందు చనిపోయాడు. ఇద్దరి పేర్లూ దాసే కదా అని ఆ ఇద్దరూ కలుసుకున్నారని చెపితే నందితా దాస్‌దీ, ఆదిభట్ల నారాయణ దాసుదీ ఒకే వీధని నేనూ చెప్పగలను.

  ReplyDelete
 5. సినిమా వారికి పుష్కలంగా "అవగాహన" ఉండేది డబ్బు గురించి, హ్హ హ్హ హ్హ 😀😀. తప్పు లేదు లెండి, వ్యాపారం కదా. అయినప్పటికీ చిత్రం నిర్మించడానికి చరిత్ర కథలను ఎంచుకున్నప్పుడు ఆ కథాకాలం గురించి అధ్యయనం అవసరం.

  అయితే కథను మరింత ఆసక్తికరంగా చెప్పేటందుకు చిన్న చిన్న మార్పులు చేసే స్వేచ్ఛ తీసుకోవడాన్ని artistic licence, poetic licence అంటారు. కానీ ఆ సాకుతో ... నీహారిక గారు, ప్రవీణ్ చెప్పినట్లు ... మరీ కబీరును రామదాసుకు సమకాలికుడు అని చూపించేటంతగా స్వేచ్ఛ తీసుకోవడం అంటే మూలకథను మార్చడమే / చెడగొట్టడమే. వస్త్రాలంకరణ లాంటివి పెద్ద విషయం కాదు.

  కొండలరావు గారు సెన్సార్ వారి గురించి అన్నారు. సినిమా నిర్మాతలతో బాటు సెన్సార్ వారికి కూడా చరిత్రపై అవగాహన ఉండాలి కదా, హ్హ హ్హ హ్హ 😀?

  ReplyDelete
 6. ఇంగ్లీషు వారు తికమకతో శ్రీరామరాజును సీతారామరాజు చేశారా? అలా అయితే అదే తికమకతో శ్రీరామమూర్తిని సీతారామమూర్తి చేసుంటారా?

  ReplyDelete
 7. వేమన దిగంబరంగా తిరిగేవాడనేది కల్పితమే గానీ నిజం కాదని కొందరంటారు. లోకంలో చాలా విషయాల మీద పద్యాలు చెప్పాడు గానీ తను స్వయంగా నగ్నంగా తిరుగాడేవాడనడం నమ్మశక్యంగా లేదని ఈ క్రింది లింక్ లోని మోనోగ్రాఫ్ లో ఉన్న ఒక అభిప్రాయం ((yabaluri.org)


  వేమన దిగంబరుడా?

  http://www.yabaluri.org/CD%20&%20WEB/vemanapoetofthecommonmanjul60.htm

  ReplyDelete
 8. నాటకాలు కూడా రామదాసు కథని చెడగొట్టాయి. నిజ జీవితంలో రామదాసుని చెరసాలలో పెట్టినది అబ్దుల్లాహ్ కుతుబ్‌షా. రామదాసుని వదిలేసినది అబ్దుల్లాహ్ అల్లుడు అబుల్ హసన్ కుతుబ్‌షా. నాటకాలు, సినిమాల్లో మాత్రం ఆ ఇద్దరు కుతుబ్‌షాలనీ ఒకరిగానే చూపిస్తారు. రామదాసు చనిపోయినది 1680. అతను చెరసాల నుంచి విడుదలైన కొన్ని రోజుల తరువాత చనిపోయాడు కనుక అతను 1668లో చెరసాలకి వెళ్ళి ఉండాలి. 1668లో అబ్దుల్లాహ్ కుతుబ్‌షా రాజుగా ఉండేవాడు. 1672 తరువాత అబుల్ హసన్ కుతుబ్‌షా రాజు అయ్యాడు కనుక రామదాసుని వదిలేసినది అబుల్ హసనే అయ్యుండాలి. అక్కన్న, మాదన్నలు అబుల్ హసన్ కింద మంత్రులుగా పని చేసారు. అబ్దుల్లాహ్ కాలంలో వాళ్ళిద్దరు సయ్యద్ ముజఫర్ అనే సేనాపతి దగ్గర గుమాస్తా పని చేసేవాళ్ళు.

  ReplyDelete
  Replies
  1. మీరు మరీ ఇంత భయంకరమైన నిజాలు చెబితే, మీ దేశభక్తిని శంకించాల్సొస్తుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top