మతిమరుపు ఎందుకు వస్తుంది?
(Image courtecy vaidyaratnakaram blog)
చాలా మంది విద్యార్థులు అంటుంటారు "తమకి చదివినది గుర్తుండడం లేదు" అని. చదివినది గుర్తుండకపోవడానికి మతిమరుపుతో సంబంధం లేదు. పిల్లల్ని చదువు పేరుతో ఒత్తిడి చేసినప్పుడు పిల్లలు tensionకి లోనవ్వడం వల్ల వాళ్ళు చదివినది గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. పిల్లలకి హోమ్ వర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల పిల్లలు అటు హోమ్ వర్క్, ఇటు చదువు ఈ రెండిటి మీదా దృష్టి పెట్టలేక, ఆ గజిబిజిలో చదవడం వల్ల కూడా చదివినది గుర్తుండదు. నిజంగా మతిమరుపు ఉన్నవాళ్ళైతే బంధువుల పేర్లూ, తెలిసినవాళ్ళ పేర్లూ కూడా మర్చిపోతారు కానీ కేవలం చదివినది గుర్తుండకపోవడం జరగదు. బంధువుల పేర్లూ, తెలిసినవాళ్ళ పేర్లూ కూడా గుర్తుండకపోతే psychiatrist దగ్గరకి వెళ్ళొచ్చు కానీ కేవలం మార్కులు తక్కువ వస్తే మాత్రం psychiatrist దగ్గరకి వెళ్ళక్కరలేదు. మార్కులు పెరగడానికి మందులు ఉండవు కూడా!

మతిమరుపు చాలా కారణాల వల్ల వస్తుంది. అవి చూద్దాం:

1) మందుల అధిక వాడకం: Psychiatristలు ఇచ్చే anti-depressioners, anti-anxiety drugs, tranquilisersకి side effectగా కూడా మతిమరుపు రావచ్చు. రోగిని నిద్రపుచ్చడానికి సాధారణ వైద్యుడు ఇచ్చే నిద్రమాత్రల వల్ల కూడా మతిమరుపు రావచ్చు. పెయిన్ కిల్లర్స్ & కండరాలని ఉత్సాహం చేసే మందుల వల్ల కూడా మతిమరుపు రావచ్చు. ఏదైనా psychiatric లేదా neurologyకి సంబంధించిన మందుకి side effectగా మతిమరుపు వస్తే, ఆ మందు వ్రాసిన psychiatrist లేదా neurologist దగ్గరకే వెళ్ళి ఆ విషయం చెప్పాలి. ఆ మందు వ్రాసిన వైద్యుడే అప్పుడు ఏదో ఒక ప్రత్యామ్నాయం సూచిస్తాడు.

2) మానసిక ఒత్తిడి లేదా ఆందోళన: నిత్యం మానసిక ఒత్తిడితోనో, ఆందోళనతోనో ఉండేవాళ్ళకి సహజంగా మతిమరుపు ఉంటుంది. దీనికి psychiatristలు ఏమీ చెయ్యలేరు.

3) మద్యపానం & ధూమపానం: మద్యం & సిగరెత్‌లు తాగేవాళ్ళకి కూడా మతిమరుపు వస్తుంది.

4) నిద్ర లేమి: సరిగా నిద్రపోనివాళ్ళకి కూడా మతిమరుపు వస్తుంది.

5) Alzheimers: పోషక ఆహారం తక్కువగా తినడం వల్ల alzheimers వస్తుంది. దీనికి mental hospitalలోనే చికిత్స చేస్తారు తప్ప సాధారణ ఆసుపత్రుల్లో చెయ్యరు. 

మతిమరుపు రాకూడదంటే vitamin b, proteins & కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. రాత్రిపది గంటల వరకు చదవడం లాంటివి చెయ్యకూడదు. పిల్లలు పరీక్షల్లో తమకి ఎంత గుర్తుంటే అంత వ్రాయొచ్చు కానీ నిద్ర చెడగొట్టుకుని చదివితే మతిమరుపు వచ్చే అవకాశమే ఎక్కువ. తల్లితండ్రులు కూడా పిల్లల్ని రాత్రి తొమ్మిది గంటలకే నిద్రపుచ్చి ఉదయం ఆరు గంటలకి లేపాలి. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేపి చదివించి చదువు ఒత్తిడి పెంచడం మంచిది కాదు. పెద్దవాళ్ళకి ఆఫీస్ పనుల ఒత్తిడి వల్ల మతిమరుపు వస్తే, వాళ్ళు ఉన్న ఉద్యోగం మానేసి పని ఒత్తిడి తక్కువగా ఉండే ఇంకో ఉద్యోగం చూసుకోవాలి. మనకి శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే.
- ప్రవీణ్ కుమార్
Reactions:

Post a Comment

 1. మనిషి అంటేనే మనసు ప్రధానమైనవాడు. నేటికీ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లడమంటే పిచ్చి పట్టడడం అనుకుంటారు. శరీరానికి జబ్బు రావడమెలాగో మనసుకూ అలాగేనని జనంలో చైతన్యం పెరగాలి. ముఖ్యంగా మన దేశంలో ఈ విషయంలో చాలా చాలా మార్పు రావలసి ఉన్నది.

  ReplyDelete
  Replies
  1. Bipolar disorder లాంటి వాటికి ఇచ్చే మందుల వల్ల side effects ఉన్నాయి. అందుకే కొంత మంది psychiatristలు కూడా వైద్యం చెయ్యడానికి భయపడుతుంటారు. మా ఊరు (శ్రీకాకుళం)లోని psychiatristలు ఎక్కువగా న్యూరాలజీ కేస్‌లు చూసే సంపాదిస్తుంటారు. చాలా రకాల మానసిక సమస్యలకి psychiatryతో సంబంధం ఉండదు. వాటికి మెదడులోని లోపమో, నరాలలోని లోపమో కారణమనడానికి ఆధారాలు లేవు. చిన్న పట్టణాల్లో psychiatristలు practice పెట్టకపోవడానికి ఇది కూడా కారణమే. Mental hospitalలో పిచ్చివాళ్ళు మాత్రమే ఉంటారనే అపోహ జనంలో ఉన్న మాట నిజమే. Alzheimersకి పిచ్చితో సంబంధం లేదు. అయినా alzheimers రోగులకి mental hospitalలోనే వైద్యం చేస్తారు.

   Delete
  2. వితండంగా పిడివాదం చేయడం. నేనె ఎప్పుడూ రైట్ అనుకోవడమూ ఒకవిధంగా మానసిక రోగాలే.
   Mental hospitalలో పిచ్చివాళ్ళు మాత్రమే ఉంటారనే అపోహ కాదు. పిచ్చివాళ్ళు మెంటల్ ఆసుపత్రిలో మాత్రమే ఉంటారు అనేది అపోహ.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top