హీరో కృష్ణ 200వ సినిమా ఈనాడు. అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ఎం.ఎల్.ఏ లు పార్టీలు మారుతున్న తీరు అసహ్యకరంగా మారింది. ఈ సందర్భంగా వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియో క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో ఆరోపణలు చేసుకున్నవాళ్ళు పార్లమెంటు ఎన్నికలలో కలసి కబుర్లు  చెప్పడం, ఒకే వేదిక నుండి ప్రజలముందు ప్రగల్భాలు పలకడం జుగుప్సాకరంగా కనిపించింది. వీళ్ళను అప్పట్లో వ్యభిచారులతో పోల్చారు పరచూరి బ్రదర్స్. కానీ వ్యభిచారులే నయమనో, వ్యభిచారుల సిగ్గుపడతారనో అనాలేమో? మీరేమంటారు?
- Palla Kondala Rao,
24-5-2019.


*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. పొట్టకూటికోసం మనసు తనువు చంపుకుని బతికే వ్యభిచారులను అవమానించినట్లు అవుతుంది. ఒక పార్టీలో గెలిచి సిగ్గులేకుండా చెంగున గోడదూకే రాజకీయ నికృష్ట వెదవలను పది సంవత్సరాలు బహిష్కరించాలి.

  ReplyDelete
  Replies
  1. < పొట్టకూటికోసం మనసు తనువు చంపుకుని బతికే వ్యభిచారులను అవమానించినట్లు అవుతుంది. >

   yes sir. నాకు అలాగే అనిపించి ఈ పోస్టు పెట్టాను.

   Delete
 2. అలా పార్టీ మారినా ప్రజలు ఆమోదిస్తున్నారంటే దీనికి సామాజిక ఆమోదం ఉంది కదా.
  అసలు ప్రజల్లో మార్పు రానిదే ఏమీ జరగదు. ఒక్కసారి గనక ప్రజలు పార్టీలతో ఏ సంబంధం లేని వ్యక్తిని ఎన్నుకోవడమో,నోటా కి వెయ్యడమో చేస్తే దెబ్బకి దెయ్యం దిగి వస్తుంది.

  ReplyDelete
  Replies
  1. ప్రజామోదం ఉందా? ఎలా? ఓ పార్టీ తరపున గెలిచారు అంటే ...... ప్రజలు ఎవరిని ఆమోదించారని? తిరిగి ప్రజల ఆమోదం పొందాలంటే ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి తిరిగి ప్రజల తీర్పు కోరితే ..... మళ్ళీ నెగ్గితే అపుడు ప్రజల ఆమోదం ఉన్నట్లు.

   ప్రజల చైతన్యం సాపేక్షంగా ఉంటుంది. ప్రజలను తప్పు పట్టడం వలన ప్రయోజనం ఉండదు.

   ఇలాంటి జుగుప్సని ఎల్లకాలం ఆమోదించరు. మీరన్నట్లు నోటా దిశగానో మరో ప్రత్యామ్నయం దిశగానో ఆలోచనలు పెరుగుతూనే ఉన్నాయి.

   Delete
 3. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి, లేదా, పలువురు వ్యక్తులు పార్టీ మారక పోతే ఎప్పటికీ ఒకే ప్రభుత్వం అధికారంలో వుంటుంది కదా! ప్రతి ఐదేళ్లకోక సారి ప్రభుత్వాలు మారుతున్నాయంటే ఒక పార్టీ నుండి ప్రజలు (ఓటర్లు) మరో పార్టీకి మారుతున్నట్లే కదా!! అలాగే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కానీ, ఎన్నిక కావాలనుకున్న ఆశావహులు కానీ, అవకాశాల కొరకు పార్టీ మారితే తప్పేంటి అని కొందరి వాదన. భావ ప్రకటనా స్వేచ్చ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కు కనుక, గెలిచిన పార్టీ నుండి ఆ పార్టీపైన అసంతృప్తి వెల్లడించడానికి మరొక పార్టీలోకి మారితే ఆక్షేపణ ఎందుకని కూడా వారంటున్నారు. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో చక్కటి సంప్రదాయాలు నెలకొనాలికాని, చట్టాలు ఏమీ చేయలేవనేది వందశాతం నిజం.
  http://jwalasmusings.blogspot.com/2019/03/blog-post_25.html?m=0

  ReplyDelete
  Replies
  1. ఐదేండ్లలో అభిప్రాయం మారడానికీ, అవసరం కోసం అమ్ముడుపోవడంకూ తేఢా ఉంటుంది నీహారిక గారు. ఒక్కొక్కడికీ ఒక్కో రూపంలో కోట్లాది రూపాయలు ప్రయోజనం కలుగుతున్నపుడు అతి తక్కువ కాలంలోనే..... అవసరమైతే తెల్లవారేలోపు అభిప్రాయం, అభిమానమూ మారడం చూస్తున్నాము. నిజమైన, అవసరమై మార్పులు చాలా చాలా అరుదుగా ఉంటాయి. తెలంగాణలో జరుగుతున్నవన్నీ అమ్ముడుపోతున్న బాపతే. ప్రతిపక్షమే లేకుండా టి.ఆర్.ఎస్ లో ఇలా వరుసగా చేరడానికి అంత అద్భుత పాలనేమీ లేదు కదా? 15 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ప్రశ్నించకూడదనుకోవడం ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి వారిని ఏ ప్రయోజనమూ లేకుండా మద్దతిచ్చేందుకు ఇలా బారులు కట్టి మరీ ఫిరాయింపులుండవు. సమర్ధించేవారు, సమర్ధవంతమైన వ్రాతలు రాసేవారు ఎంత తెలివిగా సమర్ధించాలనుకున్నా అసహ్యం ఎప్పటికీ ఆనందం కలిగించదు. ఒక పార్టీ గుర్తుపై గెలిచినోడు పార్టీ మారాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందే. మరోసారి ప్రజాభిమానంతో గెలిస్తే అతను మార్పును సైతం ప్రజలు ఆమోదించారని చెప్పాలి. అలాంటి నియమనిబంధనలేమీ లేకుండా అమ్ముడుపోయే ఎదవలను అభిప్రాయం మార్పు అనో, ప్రజాభీష్టమనో, ఫలానా వాడి ఘనమైన పాలనకు మద్దతుగా పున:సమీకరణ అనో ముద్దుపేర్లు ఎందరు పెట్టుకున్నా, ఎంత అందంగా అక్షరాలు అల్లినా అది ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేవే.

   Delete
 4. 1994 ఎన్నికలలో టీడీపీకి 216 సీట్లు వచ్చాయి. స్వతంత్రంగా పోటీ చేసిన గెలిచిన 10 మంది కూడా
  "నియోజక వర్గం అభివృద్ధి కొరకు" సైకిల్ పార్టీలో చేరారు. కమ్యూనిస్టు ప్లస్ బీజేపీ (మొత్తం 37 శాసనసభ్యులు) టీడీపీకే మద్దతు తెలిపారు. కాంగ్రెస్ కేవలం 26 (<294*10% =29) సీట్లు గెలిచి కనీసం ప్రతిపక్ష నాయక హోదా కూడా సంపాదించ లేకపోయింది.

  వైసురాయి ఘటన (ఉరఫ్ వెన్నుపోటు ఉరఫ్ ఆగస్టు సంక్షోభం) దరిమిలా చంద్రబాబు రామారావును గద్దె దింపాడు. అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు చంద్రబాబును టీడీఎల్ఫీ నేతగా గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసాడు. సదరు ప్రకటన చెల్లదని రామారావు కోర్టుకు వెళ్తే న్యాయస్థానం పార్టీలోని ఇరు వర్గాలను గుర్తించాలని తీర్పు చెప్తూ యనమలకు మొట్టికాయలు వేసింది.

  అప్పటికి రామారావు బృందంలో 40 (>294*10% =29) శాసన సభ్యుల పై చిలుకే ఉన్నారు. తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని రామారావు (ఆ తరువాత కాలంలో ఉపఎన్నికలో గెలిచిన లక్ష్మీ పార్వతి కూడా) ఎంత మొత్తుకున్నా రామకృష్ణుడు వినలేదు. రామారావు వర్గాన్ని కనీసం సభాపక్షంగా గుర్తించకుండా, బీఏసీ మీటింగులకు కూడా పిలువకుండా మూడేళ్లు కోర్టు తీర్పును ధిక్కరించాడు. ఈలోగా రామారావు చనిపోవడం & 1996 ఎన్నికలలో లక్ష్మీ పార్వతి వర్గం ఓడిపోవడం వగైరాల నేపథ్యంలో ఈ వర్గం క్షీణించింది. రామకృష్ణుడి ప్రోద్బలంతో మూడేళ్లు సాగిన ఆపరేషన్ ఆకర్ష్ మూలాన
  కాంగ్రెస్ వైపు వెళ్లిన ఐదారుగురు మినహా మిగిలిన వారిని చంద్రబాబు వర్గం ఆకట్టుకోగలిగింది (వేమూరి రాధాకృష్ణ భాషలో "కొనుక్కుంది" అనాలేమో కానీ ఆ పదం అసమదీయులకు వాడడం సబబా?)

  ReplyDelete
  Replies
  1. రాజకీయాలలో మతిమరుపు (అందునా సెలక్టివ్ మతిమరుపు) ఎక్కువ కనుక తాజాగా పోయిన నెల జరిగిన విషయాలను ప్రస్తావిస్తాను. గోవాలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీకి (ఎంజీపీ) ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు. మనోహర్ పారీకర్ మరణం దరిమిలా స్పీకర్ ప్రమోద్ సావంత్ బీజీపీ తరఫున ముఖ్యమంత్రి ఖుర్చీ ఎక్కాడు. తమకున్న బలం సరిపోదో ఏమో ఎంజీపీని కలుపుకొని ఆ పార్టీకి డిప్యూటీ సీఎం పదవి (సుదీన్ దవాల్కర్) ఇచ్చాడు.

   కొత్త స్పీకర్ ఎన్నిక ఇంకా జారగానే లేదు, ఎంజీపీలో మిగిలిన ఇద్దరు శాసనసభ్యులు బీజీపీలో చేరిపోయారు. యాక్టింగ్ స్పీకర్ బీజీపీలో ఎంజీపీ విలీనం అయినట్టు గుర్తించాడు. రెండు రోజులు డిప్యూటీ సీఎం ఖుర్చీ ఎక్కి కాలరెగరేసిన దవాల్కర్ బర్తరఫ్ కాబడి ఇంటికి సక్కా పోయాడు.

   Delete
  2. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, తెరాస, సమాజ్వాదీ, తృణమూల్ వగైరా జాతీయ/ప్రాంతీయ పార్టీలు అంతా ఒక్కటే. జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే గుడ్డిలో మెల్ల: 2011లో 19 మందితో రాజీనామా చేయించాడు, శిల్పా చక్రపాణి & మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాసనమండలికి రాజీనామా చేశాకే అసెంబ్లీ టికెట్ ఇచ్చాడు.

   Delete
  3. < ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, తెరాస, సమాజ్వాదీ, తృణమూల్ వగైరా జాతీయ/ప్రాంతీయ పార్టీలు అంతా ఒక్కటే. జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే గుడ్డిలో మెల్ల: 2011లో 19 మందితో రాజీనామా చేయించాడు, శిల్పా చక్రపాణి & మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాసనమండలికి రాజీనామా చేశాకే అసెంబ్లీ టికెట్ ఇచ్చాడు. >
   GOOD POINT. అభినందనలు జై గారు. జగన్ ఈ విషయంలో నయమే.

   Delete
  4. ----- కాంగ్రెస్ వైపు వెళ్లిన ఐదారుగురు మినహా మిగిలిన వారిని చంద్రబాబు వర్గం ఆకట్టుకోగలిగింది (వేమూరి రాధాకృష్ణ భాషలో "కొనుక్కుంది" అనాలేమో కానీ ఆ పదం అసమదీయులకు వాడడం సబబా? ----

   ఎదవ పని ఇందిరాగాంధీ చేసినా, చంద్రశేఖరరావు గారి ఇష్టగురువు చంద్రబాబు గారు చేసిన ‘జై’ కొట్టలేము కదా?

   Delete
  5. "జగన్ ఈ విషయంలో నయమే"

   ఈ మాట అన్నందుకు పచ్చ దండు మీమీద ఎగబడి దాడులు చేస్తాయేమో జాగ్రత్త.

   Delete
  6. పచ్చదండు కు ఆ అర్హత లేదు కదా? ఉన్న ఒకేఒక్కడు ఎన్.టీ.యార్ ఇపుడు లేడు. ఆయన పార్టీ అధ్యక్షురాలూ వై.కా.పా లోకే చేరింది. నో ప్రాబ్లమ్.

   Delete
 5. Replies
  1. పార్టీలు మారడం, పూర్తిగా ఆక్షేపనీయం! నిశేదించాల్సిన సమయం.

   I used to say we are picking the bad apple out of a bunch or bushel of worse apples.
   more or less all are corrupted and compromised, Could see rarely genuine or loyal leaders.

   Singapore Ex.President Devan Nair resigned as Singapore's third head of state, admitting he had turned into an alcoholic and deceived the prime minister for a year about his drinking problem.
   what about our great CM KCR?

   నీహారిక గారు మీ అగ్రసివ్-నెస్ చూస్టుంటే
   మిమ్మల్ని పోసాని ఆవహించారేమో అన్నట్లుందండి?

   Delete
  2. పోసాని రూటు సపరేటు. నీహారిక గారు మహా ఘాటు.

   Delete
 6. ‘ గులాం గ్యాంగ్ ’ ఈ పదం బాగుంది. మా రవ్వంతరెడ్డికి చెప్పాలే.....
  వ్యభిచారులు ఇపుడైతే పరచూరి బ్రదర్స్ ఇంటిముందు ధర్నా చేస్తరు. తూ..... ఈ ..... నా..... ----లతో మమ్ములను పోల్చుతావా? అని....

  ReplyDelete
 7. @విసుకి వాడి మనస్సె ఒక విశ్వం:

  https://www.nytimes.com/2005/12/08/world/asia/obituarydevan-nair-82-expresident-of-singapore.html

  "When he resigned, Lee Kuan Yew, then the Singaporean prime minister, said in Parliament that Nair had quit to get treatment for alcoholism.

  Nair said *that was not the case*. He said *his questioning of Lee's government* had caused a conflict between the two, and that he only stepped down when Lee threatened to seek a motion in Parliament to oust him"

  Looks like Nair was forced out by Lee who went on to discredit him using his unquestioned powers

  ReplyDelete
 8. TRUE JAi garu!!

  If alcoholism is obstruct or not allowed , then 99% of Indian politicians should resign!! Bloody Womanizing, corruption and Trafficking are not an obstacle for our politicians.

  Here no one Questions or dares to ask the politician in power including media and people. Could any one dare to ask KCR to come to Office regularly and stop drinking alcohol?

  We all are trying to convince ourselves that all are bad apples in the bunch and irony is trying to protect the corrupted/distracting politicians..

  ReplyDelete
  Replies
  1. I only know one incident in India all these years (that too not for drinking but drunken nuisance). Ramrao Adik was fired from Maharashtra deputy CM post after he got drunk and misbehaved with an air hostess. Incidentally this was the incident that led to a liquor ban on domestic flights.

   Ronny Jackson is a recent foreign example. He is said to have harassed a lady colleague after drinking heavily.

   Many politicians & public figures have faced drinking allegations including Hilary Clinton. George W. Bush's old DUI conviction came up during his 2000 campaign.

   I guess human nature is the same everywhere & throughout the ages.

   Delete
 9. హిందీలో వ్యభిచార్ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి అక్రమ సంబంధం, ఇంకొకటి ఇన్సెస్ట్. ఒళ్ళు అమ్ముకోవడాన్ని అయితే హిందీవాళ్ళు వేశ్యా వృత్తి అంటారు. వేశ్య రోజుకి ఒక మగాడితో పడుకుంటుంది కానీ అది పొట్టకూటి కోసమే తప్ప లక్షలు లేదా కోట్ల కోసం కాదు.

  ReplyDelete
  Replies
  1. @"వేశ్య రోజుకి ఒక మగాడితో పడుకుంటుంది కానీ అది పొట్టకూటి కోసమే తప్ప లక్షలు లేదా కోట్ల కోసం కాదు."

   అది ఆవిడ రేంజ్ బట్టి ఉంటుంది నాయనా!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top