1980ల టైంలో కమ్యూనిజం, నక్సల్ బ్యాక్‌గ్రౌండ్‌తో తీసిన సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు అంత తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు దొరికినా అవి ఆడించడానికి థియేటర్ యజమానులు ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ 1990లలో ఆర్. నారాయణమూర్తి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు సులభంగానే వచ్చాయి. ఆ సినిమాలలో కొన్ని 300 రోజుల వరకు థియేటర్లలో ఆడాయి. 

నారాయణమూర్తికి మార్క్సిజం తెలియదు. అందుకు ఆయన నిర్మించిన ఎర్ర సైన్యం సినిమా ఒక నిలువెత్తు సాక్ష్యం. ఆ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ తిరుగుబాటుదారులకి లొంగిపోతున్నట్టు నారాయణమూర్తి చూపించాడు. ప్రభుత్వం అనేది సొంత ఆస్తి వ్యవస్థని పరిరక్షించడానికి ఏర్పడినది. ఒక ప్రభుత్వ అధికారి మంచివాడైనా, చెడ్డవాడైనా అతను సొంత ఆస్తి వ్యవస్థ పరధిలో పని చేస్తాడు తప్ప అతను ఆ పరధి దాటలేడు. నారాయణమూర్తికి మార్క్సిజం తెలియదని ఇక్కడే అర్థమైపోతుంది. 

నారాయణ మూర్తి సినిమాలలో నేను రెండు మాత్రమే చూసాను. అవి అర్ధరాత్రి స్వతంత్రం & ఎర్ర సైన్యం. ఆయన ఆ రెండు సినిమాలలోనూ విప్లవకారుల్ని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవాళ్ళగానూ, పారలెల్ గవర్నమెంట్ నడిపేవాళ్ళగానూ చూపించాడు. ఈ సినిమాల వల్ల ప్రభుత్వం కూలిపోవడం జరగదు. అందుకే ఈ సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు సులభంగా వచ్చాయి. చట్ట వ్యతిరేక పనులు చెయ్యడం వేరు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వేరు. శ్రామిక వర్గ విముక్తి అనేది రాజ్యాంగ పరధిలో లేని అంశం కాబట్టి శ్రామిక వర్గ విప్లవకారులు విముక్తి కోసం హింస చేస్తారు. దీన్ని చట్ట వ్యతిరేకం అంటారు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనరు. నారాయణమూర్తికి శ్రామిక వర్గ సిద్ధాంతం తెలియదు, ప్రభుత్వ సిద్ధాంతం కూడా తెలియదు. అంతమాత్రాన అతని సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఎలా ఇచ్చేస్తారు? 

సివిల్ సెటిల్మెంట్లు చేసే గ్యాంగ్‌స్టర్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే పని చేస్తాడు. "చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అడ్వొకేట్ చేసే సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇస్తున్నారు కనుక సివిల్ సెటిల్మెంట్లు చేసే గ్యాంగ్‌లకి లైసెన్సులు కూడా ఇవ్వాలి" అని గ్యాంగ్‌స్టర్‌లు డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? నారాయణమూర్తి తెలివితక్కువవాడే కావచ్చు. అంతమాత్రాన వ్యాపారం పేరుతో అతని సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఎలా ఇచ్చేస్తారు?
- Praveen

--------------------------------------------------------

ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top