అవినీతిని జనం ఎందుకు పట్టించుకోరు? 

- పల్లా కొండల రావు. 
-----------------------------

మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

*Republished

Post a Comment

 1. Avi neethi mana janaaniki nara naraana jeerninchuku poyindi.......

  ReplyDelete
 2. అవినీతి నుండి తమ కూడా తాత్కాలికంగా కాగే లాబం మాత్రమే ఇప్పుడు కనపుడుతుంది, కానీ దీర్గ కాలం అది ఎంత నష్టం కలిస్తుంది అనేది అర్తం కావడం లేదు, కొంత సమయం పడుతుంది.

  ReplyDelete
 3. Can workers get high wages if the capitalist definitely pays taxes to the state? In these circumstances, who would mind whether his boss is corrupt or not?

  ReplyDelete
 4. Read this: http://content.janavijayam.in/2013/11/blog-post_27.html

  ReplyDelete
 5. జనం అవినీతిని ఎందుకు పట్టించుకోరు అనేది తెలియాలంటే సలు అవినీతి అంటే ఏమిటో తెలియాలి, కదా!అందరికీ ఆవసరమైనది డబ్బు కనక మనీ/రెవెన్యూ/ప్రాపర్టీ విషయాల్లో జరిగేదాన్నే అవినీతి కింద లెక్కేస్తారు.కానీ ఒక పెళ్ళైన మగాడు కానీ ఆడది కానీ వేరేవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది తప్పు అంటారే కానీ అవినీతి అనరు,ఎందుకని?నీతి కానిది యేదైనా అవినీతియే అవుతుంది,మరి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి?ఇన్ని పేర్లతో ఇన్ని చోట్ల జరుగుతున్న వ్యవహారాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటి?

  ఒక విషయానికి ప్రతిస్పందించటం గురించి, ఒక మనిషితో వ్యవహరించటం గురించి, ఒక వస్తువిశేషాన్ని సాధించటం గురించి సమాజంలో అందరూ ఒపుకుని పాటిస్తున్న నియమాలని తన స్వార్ధం కోసం ఉల్లంఘించటం అనేది అన్ని రకాల అవినీతుల్లోనూ కనిపిస్తుంది, అవునా?


  ఇక్కడ చాలామంది గమనించని విషయం ఏమిటంటే చరిత్రని మలుపు తిప్పిన విప్లవాలు చాలావాటిలో అరాచక వాదులు/తిరుగుబాటు దారులు/అవినీతి పరుల కార్యకలాపాల నుంచే మొదలయ్యాయి!అక్కద ఆఖరి మలుపులో విజయం సాధించిన విప్లవ నాయకులు చేసినది యేమిటంటే ఏ లాభాన్ని ఆశించి కొద్ది మంది అవినీతిపరులు/అరాచక వాదులు సమాజంలో అశాంతిని సృష్టించారో ఆ లాభాన్నీ ప్రయోజనాన్నీ ప్రజలందరికీ దక్కేలా చెయ్యటం - అది పాత నియమాలని బద్దలు కొట్టటం ద్వారా కావచ్చు,కొత్త నియమాల్ని ఏర్పాటు చెయ్యటం ద్వారా కావచ్చు!

  ఆధ్యాత్మిక పరమైన అవినీతి సాంస్కృతిక ప్రశాంతతని శిధిలం చేస్తుంది,అది సామాజికపరమైన ఐకమత్యాన్ని దెబ్బ తీస్తుంది,అది ఆర్ధికరంగంలో ద్రవ్యోలబ్ణాన్ని సృష్టిస్తుంది - అప్పటికి అవినీతి కంటికి కనిపించి ఆందోళన కలుగుతుంది!

  చారిత్రక సన్నివేశాల విశ్లేషణా ఆర్ధిక విషయాల పరిశీలనా బోరు కొడుతుంది కాబట్టి ఒక పిట్టకధ చెబుతాను.పిట్టకధే అయినా పాయింటుని అర్ధం అయ్యేటట్టు చెప్పడం వరకు గట్టికధే!ఒక చోట ఒక లంక ఉందనుకోండి.ఆ లంకలోనివాళ్ళు ఇటువైపుకి రావాలన్నా ఇటువైపువాళ్ళు ఆ లంకకి వెళ్ళాలన్నా ఈదుకుంటూ వెళ్ళాల్సి ఉందనుకోండి.పోనీ పడవలు ఉన్నాయనుకోండి.ఈత అందరికీ రాదు,పడవ మునిగిపోవచ్చు - అయినా వెళ్ళేవాళ్ళూ వచ్చేవాళ్ళూ అలాగే వస్తారు,పోతారు.ప్రభుత్వం ఒక వంతెన కడితే ఈ గొడవలు ఉండవు కదా!కట్టిందని అనుకుందాం.ఒక్కోసారి కాంట్రాక్టర్లకి ఆఖరి బిల్లులు తను ఇవ్వడానికి బదులు టోల్ గేట్ పెట్టుకుని వాళ్ళనే బకాయి వసూలు చేసుకోమంటుంది.అది గవర్నమెంటు నిర్ణయించినదే కదా!ఇప్పుడు ఆ వంతెన ఉపయోగించుకోవడానికి డబ్బులు లేనివాళ్ళలో ఈత వచ్చినవాడు ఈదుకుంటూ పోవచ్చును, అవునా?గవర్నమెంటు టోల్గేట్ పద్ధతిని ఎల్లకాలం ఉంచదు కదా - బిల్లు సెటిలయ్యాక ఎత్తేస్తుంది.అంతవరకు డబ్బులు కట్టకుండా ఈదుకుంటూ వెళ్తున్నవాళ్ళు ఇప్పుడు కూడా ఈదుకుంటూ వెళ్తే వాళ్ళని తెలివితక్కువ దద్దమ్మలు అంటారు - సుబ్బరంగా చేతులూపుకుంటూ పైసా ఖర్చులేకుండా నడిచిపోయే వీలుంటే అది మానేసి రొప్పుకుంటూ రోజుకుంటూ పోయేవాళ్లని ఇంకేమనాలి?అవినీతి ఎట్లా ఉంటుంది,అవినీతిని ఎందుకు సహిస్తారు,అవినీతి ఎట్లా పోతుంది అని అర్ధం కావడానికి ఇచ్చిన ఈ చిన్న ఉదాహరణలో సమస్తాన్నీ చెప్పటం కుదరదు గానీ మరింత ఆదాయం,మరిన్ని సౌకర్యాలు,మరింత భద్రత ప్రతి ఒక్కరికీ సహజమైన కోరికలే కాబట్టి అవినీతి ప్రమాదకరమైన స్థాయికి పెరిగేవరకు వ్యతిరేకత రాకపోవటం సహజమేనని తెలుసుకోవచ్చు!

  టోల్ గేట్ ఉన్నప్పుడు కూడా ఈతకు మళ్ళేవాళ్ళని ఆపి రోడ్డు మీద నడించాలంటే రెండే దారులు - ఒకటి జాలిపడి అప్పటికపుడు టోల్ గేట్ టికెట్ కొనడానికి డబ్బులివ్వటం,రెండు వాడు టోల్ గేట్ టికెట్ కట్టి వెళ్ళే స్థాయిలో ఆదాయాన్ని పెంచటం.మొదటిది ఉదారులైన వ్యక్తులు దానధర్మాల పట్ల ఆసక్తి ఉండి చేస్తారు,మత,ధార్మిక సంస్థలు ఈ పని చెయ్యాలి. రెండవది మాత్రం ప్రభుత్వమే చెయ్యాలి.

  ఆర్ధిక శాస్త్రవేత్తలు కూడా ద్రవ్యోల్బణం ఏదో ఒక స్థాయిలో ఉనికిలో ఉంటూనే ఉంటుందనీ అభివృద్ధి ఆగిపోయినప్పుడే అది ఒక సమస్య అవుతుందనీ అంటున్నారు.ఆర్ధిక చలనం ఆగిపోవడం వల్లనే అవినీతి పుడుతుందని తెలుసుకుంటే ఆర్ధిక వ్యవస్థని మళ్ళీ కదిలించి వేగం పుంజుకునేటట్టు చేస్తేనే అవినీతి అంతం అవుతుంది.అసలు అవినీతి కనపడకూడదంటే దేశపు ఆర్ధికాభివృద్ధి ఆగిపోకుండా ఎదుగుతూనే ఉండాలి.

  ReplyDelete
 6. పాపమ్ కొండల్ సార్ ఒక చిన్న ప్రశ్న అడిగితే ఈ రేంజిలో ప్రవచనం చెప్పడం ఏమిటి సూరినేని గారు.

  ReplyDelete
 7. రోశయ్య టైమ్‌లోనో, కిరణ్ కుమార్ రెడ్డి టైమ్‌లోనో ఒక ప్రతిపాదన వచ్చింది "ఆరోగ్యశ్రీ ఆపరేషన్‌లు 60% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చెయ్యాలి" అని. అప్పుడు జగన్ అభిమానులు గొడవ చేసారు "ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తివెయ్యాలనుకుంటోంది" అని. ఆరోగ్యశ్రీ డబ్బుల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు అవసరం లేని ఆపరేషన్‌లు చేస్తోంటే "వృథా అవుతున్నది ప్రభుత్వ సొమ్మే కానీ మన జేబులోని డబ్బు కాదు కదా" అని అందరూ నోరు మూసుకున్నారు. కొందరైతే బహిరంగంగానే ఆరోగ్యశ్రీని సమర్థించారు. "ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా చెయ్యరు, ప్రభుత్వ వైద్యం ఎవరికీ అవసరం లేదు" అని వాదించారు. వాళ్ళకి ప్రభుత్వం మీద నిజంగానే నమ్మకం లేదా? వాళ్ళ ఆస్తిని ఎవరైనా కబ్జా చేసారనుకుందాం. వాళ్ళు బుద్ధి ఉన్నవాళ్ళైతే ప్రభుత్వ సివిల్ కోర్ట్‌కే వెళ్తారు కానీ ప్రైవేట్ సెటిల్మెంట్‌లు చేసే గ్యాంగ్‌స్టర్ దగ్గరకి వెళ్ళరు. మన ఇంటిలో దొంగలు పడకుండా ఉండేందుకు మనకి ప్రభుత్వ పోలీస్ స్టేషన్‌లు కావాలి. మన ఆస్తిని ఎవడూ కబ్జా చెయ్యకుండా ఉండేందుకు మనకి ప్రభుత్వ సివిల్ కోర్ట్‌లు కావాలి. కానీ మన పిల్లలకి ప్రభుత్వ స్కూల్‌లో చదువు వద్దు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వద్దు. జనంలో ఇలాంటి మెంటాలిటీ ఉంటే ప్రజా ధనం ఎంతైనా వృథా అవుతుంది.

  ReplyDelete
  Replies
  1. కేసీఆర్/చంద్రన్న కిట్ తో ప్రభుత్వ ఆసుపత్రికీ, గురుకులాలతో ప్రభుత్వ పాఠశాలలకూ జనాన్ని ఎలా రప్పించేరో చూసారు కదా ?

   Delete
  2. ఈ మధ్యనే నేను జలుబు & దగ్గుకి ఒరిస్సాలోని ఒక ప్రభుత్వ PHCకి వెళ్ళాను. ఓవర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మూడు రోజుల్లో తగ్గిపోయింది.

   Delete
  3. గత మూడేళ్ళ నుంచి నాకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్తున్నాను. ప్రైవేట్ వైద్యానికి ఖర్చుబెట్టే శక్తి నాకు లేదు. ఒక ప్రైవేట్ డాక్టర్ మెడికల్ రిప్రెజెంటేటివ్స్‌తో సంబంధం పెట్టుకుని ఓవర్ ప్రిస్క్రిప్షన్ (అవసరం లేని మందులు) వ్రాస్తాడా, లేదా అనేది కూడా ఇక్కడ పాయింట్ కాదు. వైద్యం అందరికీ ఫ్రీగా అందాలనేదే నా అభిప్రాయం.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top